devineni avinash
-
మాజీ మంత్రి పేర్ని నానికి YSRCP నేతల పరామర్శ
-
పాపం ఇద్దరు పిల్లలున్నారు చిత్రహింసలు పెట్టి..
-
అన్నదాతకు అండగా.. దేవినేని అవినాష్ అరెస్ట్..
-
రైతుల కోసం 13న జరగబోయే కార్యక్రమంపై దేవినేని అవినాష్
-
‘రైతులను ముంచేసిన కూటమి సర్కార్’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం.. ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయి. రైతుల కోసం బడ్జెట్లో ప్రస్తావించకుండా కూటమి సర్కార్ మోసం చేసింది. సూపర్ సిక్స్‌లో చెప్పిన పెట్టుబడి సాయం గురించి కూటమి నేతలు మాట్లాడటం లేదు. కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కకుండా చేస్తున్నారు’’అని అవినాష్ నిలదీశారు.దయనీయ స్థితిలో రైతులుతన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు కనీసం గోనె సంచులు కూడా అందించడం లేదని మండిపడ్డారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ ఉన్న వాహనాలు ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్ పట్టాలిచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. రైతులు దయనీయమైన స్థితిలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది’’ అని మండిపడ్డారు.రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపువిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కళ్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం రంగుమారిపోతున్నా కొనడం లేదు. రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతులను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని ఆమె ధ్వజమెత్తారు. -
జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం ఇంటికే
-
టీడీపీకి దేవినేని అవినాష్ వార్నింగ్
-
ఫోటోల కోసం ఫోజులు ఇవ్వడం కాదు.. చంద్రబాబుకి దేవినేని అవినాష్ సవాల్
-
ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామా: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకుడు దేవినేని అవినాష్. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక పథకాలను అమలు చేయడంలేదన్నారు. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. వైఎస్సార్సీపీ హయాంలో కార్పొరేషన్లలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరు నెలల కాలంలో చేసిందేమీ లేదు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి. లేనిపక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏపీలో కూటమి నేతలు స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారు. గతంలో వైఎస్ జగన్‌పై కూటమి నేతలు నిందలు వేశారు. దానికి ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఎన్నికల ముందు ఉదయం అవ్వగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారు. పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్లు చేసి కనుక్కోండి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోండి. లయోలా కాలేజీ వాకర్స్ కు గద్దె రామ్మోహన్ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. వాళ్లని రెచ్చగొట్టి ఇప్పుడు కేసుల్లో ఇరికించారు. లయోలా కాలేజ్ యాజమాన్యానికి వాకర్స్‌ని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. వారికి న్యాయం చేయండి. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ అని చెప్పారు. -
సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులపై పోలీస్ కమిషనరేట్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు.. డీసీపీకి వినతిపత్రం అందించారు.కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది: దేవినేని అవినాష్ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు సరిగాలేదు. నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో 150 మందికి నోటీసులిచ్చారు. అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలకు మేం అండగా ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేం తోడుగా ఉంటాం.తక్షణమే అక్రమ కేసులు, దాడులు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నోటీసులిచ్చి.. అరెస్టులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుక ఉండకూడదని అక్రమంగా కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులను ప్రోత్సహించొద్దని పోలీసులను కోరుతున్నాం. కేసుల పేరుతో పూటకో స్టేషన్ మార్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను అణచివేస్తే తిరగబడే రోజు కచ్చితంగా వస్తుందిఅన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా: మల్లాది విష్ణుప్రతిపక్షం గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అనేక అబద్ధపు ప్రచారాలు చేసింది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి విజయవాడలో కేసులు పెడుతున్నారు. 90 మంది మహిళలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం తప్పా. కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే ఛలో అసెంబ్లీ చేపడతాం. హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: దొడ్డా అంజిరెడ్డికూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. తిరువూరులో ఇద్దరు విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు. దివ్యాంగులను కూడా వదలడం లేదు. సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తప్పిదాలను ఎండగడతాం -
మరింత బలోపేతం చేద్దాం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని.. ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తల ఆలోచనలకు దగ్గరగా మన పనితీరు ఉండాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సూచించారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుందామన్నారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు.అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలతో బిహార్‌లా మారుస్తున్నారని.. సూపర్‌సిక్స్‌కు బొందపెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకోవాలని.. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశముందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మన మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులు టీడీపీ పల్లకీ మోస్తున్నారు : పేర్ని నానిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను ఓడిస్తే తమకు మంచి జరుగుతుందని జనసేన కార్యకర్తలు భ్రమపడ్డారని.. కానీ, ఇప్పుడేమో వారు టీడీపీ పల్లకీలు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. మానసికంగా వారంతా చచ్చి బతుకుతున్నారని, వాళ్ల పరిస్థితి పగోడికి కూడా రాకూడదన్నారు. వైఎస్సార్సీపీకి ఆధారం, మూలం, బలం కార్యకర్తలేనన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజలను మోసంచేశారని ఆరోపించారు.వాళ్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని.. కేసులు పెట్టారని, రోడ్ల మీద కొట్టి దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. ఇలా ఓవరాక్షన్ చేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని, వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అధికార మదంతో వైఎస్సార్సీపీని అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ఇక మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు కలిసొచ్చినా వైఎస్సార్సీపీకి ఏమీకాదని, తాము తగ్గేదేలేదని పేర్ని నాని స్పష్టంచేశారు. ఎవరూ అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని పార్టీ శ్రేణులకు పేర్ని భరోసా ఇచ్చారు.ప్రజలకు కష్టమొస్తే జగన్‌ను తలుచుకుంటున్నారు : అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తలుచుకుంటున్నారని.. ఆయన ఉంటే ఇలా జరిగేది కాదని గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయడమే అందుకు కారణమన్నారు. టీడీపీ సోషల్ మీడియా, వారి అనుకూల మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని.. మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం
-
గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు..
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయం మీద గవర్నర్‌కు వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నారు. -
అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?.. దేవినేని అవినాష్ ఫైర్
-
‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. -
చంద్రబాబును నమ్మి మోసపోయామని వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు
-
లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవినేని అవినాష్ పూజలు
-
ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దేవినేని అవినాష్
-
బాబు,పవన్ పై దేవినేని అవినాష్ ఫైర్
-
వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు రక్షణ
సాక్షి,అమరావతి : టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన నమోదైన కేసులో తమకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్, న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌లపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.దర్యాప్తునకు సహకరించాలని అప్పిరెడ్డి తదితరులను ఆదేశించింది. 48 గంటల్లో పిటిషనర్లందరూ తమ పాస్‌పోర్ట్‌లను దర్యాప్తు అధికారి వద్ద జమ చేయాలంది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు దూలియా, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ తమ తమ వాదనలను వినిపించారు. జోగి రమేష్‌పైనా కఠిన చర్యలొద్దుఅలాగే చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవకు సంబంధించి నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు సైతం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రమేష్‌పై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
నాకు పారిపోవాల్సిన అవసరం లేదు.. చంద్రబాబుకి దేవినేని అవినాష్ వార్నింగ్
-
టీడీపీ నేతల్లా పారిపోయే రకం కాదు: దేవినేని అవినాష్
విజయవాడ, సాక్షి: తనపై తెలుగు దేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ఉత్త ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారాయన.‘‘నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నా. పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి...ఎందుకు పారిపోవాలి?.... నేను తప్పుచేశానని కోర్టు భావిస్తే.. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తాం. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. సమస్యలొస్తే టీడీపీ నేతల్లా నేను పారిపోయేరకం కాదు. నా తండ్రి నాకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మా పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాం. మరోసారి చెబుతున్నా.. టీడీపీ , ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు అంటూ ఆ వీడియో సందేశంలో కోరారాయన.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అందులో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. మొన్నీమధ్యే వల్లభనేని వంశీ విషయంలోనూ అతి ప్రదర్శించిన ఎల్లో మీడియా.. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయంలోనూ తప్పుడు రాతలతో అలాగే ప్రవర్తించింది. -
టీడీపీకి అవినాష్ వార్నింగ్
-
దేవినేని అవినాష్ గూస్ బంప్స్ స్పీచ్
-
ఓట్ హక్కు వినియోగించుకున్న విజయ్ సాయి రెడ్డి, దేవినేని అవినాష్