మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో వచ్చిన జనాన్ని తెలుగు తమ్ముళ్లు అష్టకష్టాలు పాలు చేశారు. దాహం వేస్తే కనీసం మంచినీళ్లు ఇవ్వకపోగా మజ్జిగ ప్యాకెట్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సిందిపోయి జనం మీదికి విసిరేశారు. దాహంతో తల్లడిల్లిన వారు మజ్జిక ప్యాకెట్ల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.