
సాక్షి, విజయవాడ : సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన పోరాటంలో ప్రాణాలు విడిచిన 20 మంది భారత వీర జవాన్లకు నివాళిగా గుణదాల వైస్సార్సీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. దేశ సంరక్షణ కోసం జవాన్లు ఎనలేని త్యాగం చేస్తున్నారని కొనియాడారు. మన కోసం, మన దేశం కోసం ఎంతో మంది దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారని, వారి వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామన్నారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి సేవలు శాశ్వతంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రశంసించారు. సైనికుల పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (లాక్‌డౌన్ వదంతులపై ప్రధాని స్పష్టత)