సాక్షి, విజయవాడ: ఆంధ్రజ్యోతి పత్రికలో అవాస్తవాలు రాస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రాధాకృష్ణ పిచ్చి రాతలు రాస్తున్నారన్నారు.
శనివారం ‘సాక్షి’తో మాట్లాడిన దేవినేని అవినాష్..‘ రిపీటెడ్ అఫెన్స్ చేసేవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.తూర్పు నియోజకవర్గ టీడీపీ నేతల దొంగతనాలకు పాల్పడ్డారు. చట్టప్రకారమే నేరస్తులను శిక్షిస్తున్నారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిపైనా కేసులు పెట్టలేదు. టీడీపీ, జనసేనలపై కేసులు పెట్టి వారిని తొక్కాల్సిన అవసరం మాకు లేదు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment