vemuri radha krishna
-
అలాగైతే రాధాకృష్ణ, లోకేష్‌లను జైల్లో పెట్టాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: టీడీపీ అధికారిక వెబ్సైట్లో చేసేవన్నీ ఫేక్ పోస్టులేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. దానికి కారు టైర్ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్ న్యూస్ అని లేఖ ఇచ్చారు. కానీ, ఆ లేఖ కూడా ఫేక్ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్సైట్లోనే జరిగింది. మరి నారా లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?. ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా భార్య(వైఎస్ భారతి) కడప పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్ మీడియా అలానే ఉంది అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నమ్మడం లేదట. వైఎస్సార్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్ముతున్నారట. అదే సమయంలో జగన్ కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా టచ్‌లో ఉండి, లోక్ సభ ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తానని అన్నారట. ఇది నిత్యం తెలుగుదేశం కోసం బట్టలూడదీసుకుని తిరిగే ఆంధ్రజ్యోతి తాజా పలుకు. ఎలాగోలా ఆంధ్ర వరకైనా జనసేనతో పాటు బీజేపీని, టీడీపీని కలపడానికి ఎంతకైనా దిగజారి కొత్తపలుకో, చెత్తపలుకో రాసి అపోహలు సృష్టించాలన్న ఆ పత్రిక యజమాని రాధాకృష్ణ ఆంతర్యం అర్దం అవుతూనే ఉంది. అంతేకాక జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం లేదని తెగ బాధపడ్డారు. నిజానికి ఈ వారం అతి ముఖ్యమైన అంశం ఏమిటి? చంద్రబాబునాయుడుకు ఆదాయపన్ను శాఖ రూ. 118 కోట్ల రూపాయల బ్లాక్ మనీకి సంబంధించి నోటీసు ఇవ్వడం. ఎవరెవరి ద్వారా ఆ డబ్బు జమ అయింది తదితర వివరాలు వెలుగులోకి రావడం. అంటే అదంతా ముడుపుల రూపేణా తీసుకున్న డబ్బేనన్న భావన సహజంగానే ఏర్పడుతుంది కదా?. చంద్రబాబు దీనిపై స్పందించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నా.. ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. పైగా తప్పించుకునే రీతిలో మాట్లాడారు. ఆయన అంతేవాసిగా ఉన్న రాధాకృష్ణ అయినా అందులోని మర్మం ఏమైనా రాస్తారేమోనని చూసినవారికి ఆశ్చర్యం కలిగించేలా కాంగ్రెస్ పార్టీకి, జగన్ కు లింక్ పెట్టడానికి ఆయన చేసిన విన్యాసాలు కనిపించాయి. పైగా ఈయన రాజకీయ విలువలు గురించి మాట్లాడడం. ఇంతకన్నా సిగ్గు చేటు అయిన విషయం ఏమైనా ఉంటుందా? ✍️ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయపార్టీ పెట్టుకుని నడుపుతున్నారు. ఆమెతో ప్రస్తుతం కాంగ్రెస్ అదిష్టానం టచ్‌లోకి వెళ్లింది. పార్టీ విలీనం, తదితర అంశాలపై ఆమె సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరుల్ని కలిసి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన కొన్ని విషయాలకు వక్రభాష్యం చెబుతూ ఈయన కాంగ్రెస్ ను కమ్మిన జగన్మాయ అని కథ అల్లేశారు. అందులో తనకు జగన్ పైన ఉన్న విద్వేషాగ్ని అంతటిని మరోసారి కక్కారు. ఇంత ద్వేషంలో కూడా ఆయనకు తెలియకుండానే ఒక విషయం అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వచ్చే ఎన్నికల తర్వాత కూడా పవర్ పుల్ గానే ఉంటారని, ఒకవేళ కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాని పక్షంలో జగన్ సాధించే లోక్ సభ సీట్లు కీలకం అవుతాయని చెప్పకనే చెప్పినట్లయింది. జగన్ తన కేసుల కోసమో, వివేకా హత్య కేసు విషయం గురించో ప్రధాని మోదీ తదితరులతో సన్నిహితంగా ఉంటున్నారని ఏబీఎన్ రాధాకృష్ణ చెబుతున్నారు. అది పచ్చి అబద్దమని పలుమార్లు రుజువైనా రాధాకృష్ణ వంటి వారు ఈ దుష్ప్రచారం ఆపరు. అదే నిజమైతే వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి ఎందుకు జైలులో ఉండవలసి వస్తుంది?. జగన్ తనపై ఉన్న కేసుల్ని ఎందుకు కొట్టివేయించుకోలేకపోయారు?. మరో వైపు చంద్రబాబు నాయుడు తన పై వచ్చిన అభియోగాలపై ఎన్నడైనా విచారణకు సిద్దపడ్డారా?. ఎన్ని స్టేలు ఎలా తెచ్చుకోగలిగారు?. ఆ చిదంబర రహస్యం ఏమిటో రాధాకృష్ణ కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది!. ✍️ చంద్రబాబుకు నిత్యం సలహాలు ఇస్తూ రామోజీరావు కన్నా తానే ముఖ్యమన్నట్లు బిల్డప్ ఇచ్చుకునే ఈయన.. ఆ విషయాలు కూడా రాస్తే బాగుంటుంది కదా!. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో సాగించిన వ్యవహారాలలో అవినీతి జరిగిందా?.. లేదా?, సబ్ కాంట్రాక్టర్ ల నుంచి డబ్బులు వసూలు చేశారా?..లేదా?, ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసు వాస్తవమా?..కాదా?, అందులో ఉన్న విషయాలతో ఆయన ఏకీభవిస్తారా?.. లేదా? వీటి గురించి ఒక్క ముక్క రాయని రాధాకృష్ణ, వైఎస్సార్సీపీ వాళ్ల ఒత్తిడి వల్ల ఆదాయపన్ను శాఖ మళ్లీ నోటీసు ఇచ్చిందని నిస్సిగ్గుగా కథనాన్ని ఇవ్వడం సమర్దనీయమేనా? ✍️ ఎన్టీఆర్ నాణెం పేరుతో చేసిన రాజకీయం ఈ ఆదాయపన్ను కేసు గురించా? కాదా?.. బిజెపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఎందుకు అంత ప్రాధేయపడుతన్నట్లుగా చంద్రబాబు ఫొటోలలో కనిపించారు. ఫోటో ఎప్పటిదో కాని.. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద చేతులు కట్టుకుని ఉన్న చంద్రబాబు ఫోటో గురించి ఈయన ఎందుకు కామెంట్ చేయలేకపోయారు?. జగన్ పట్ల కాంగ్రెస్ మెతక వైఖరికి రావడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని మరో దిక్కుమాలిన వ్యాఖ్య చేశారు. దీనివల్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటివారు కాంగ్రెస్‌లో చేరే విషయంపై పునరాలోచించుకునే అవకాశం ఉందని రాధాకృష్ణ బెదిరిస్తున్నారు. జగన్ వల్ల సెటిలర్లు కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోవచ్చని ఈయన ప్రచారం. సెటిలర్లు అంటే కేవలం తన కులం వారో, టీడీపీ మద్దతుదారులే అని ఆయన భ్రమ పడుతున్నట్లుగా ఉంది. ఎవరైనా తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కాకుండా.. ఏపీ వ్యవహారాలపై ఆధారపడి ఎందుకు ఓట్లు వేస్తారు?. జగన్ విధ్వంసపాలన చేస్తున్నారని ఆంధ్రులు అనుకుంటున్నారని.. చెత్త రాతలు రాసేస్తే జనం నమ్ముతారా?. మోకాలికి, బోడిగుండుకు లింక్ పెడుతూ జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానన్నారని, మరి ఇప్పుడు మోదీ ఏమి చేస్తారో చూడాలని రాసేస్తున్నారు. ఈయన రాసే అబద్దాలన్నీ బిజెపి పెద్దలు నమ్మాలన్నది ఆయన కోరిక. ✍️ రాహుల్ గాంధీని షర్మిల కలిసినప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య తగాదాపెట్టామన్న పేరు రావడం తనకు ఇష్టం లేదని అన్నారట. అది ఈయనకు నచ్చలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో ప్రచారానికి షర్మిల సేవలను వినియోగించుకుంటామని అధిష్టానం పెద్దలు చెబుతున్నారట. విషయం ఏమిటంటే ఆంధ్రలో తాను రాజకీయాలు చేయనని, తను పుట్టింది,పెరిగింది. తన అత్తగారి ప్రాంతం అంతా తెలంగాణే అని షర్మిల పలుమార్లు చెప్పారు.. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటివారికి షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఉండడం ఇష్టం లేదు. షర్మిలను చేర్చుకుంటే పోటీ పవర్ సెంటర్ అవుతారనో, లేక బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఆంధ్ర సెంటిమెంట్ తెస్తారోనన్న భయం ఉండి ఉండవచ్చు. రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడైన రాధాకృష్ణ ఆయనకు ఎక్కడ నష్టం వస్తుందోనని తలచి ఇలాంటి కథలు అల్లుతున్నారు. ✍️ ఇక్కడ మరో సంగతి చెప్పాలి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును జగన్ కేసులలో చార్జీషీట్లో పెట్టడంపై సోనియాగాంధీ వివరణ ఇచ్చారని షర్మిల మాటలను బట్టి అర్ధం అవుతుంది. వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తనకు తెలియదని, రాజీవ్ గాంధీ పేరు కూడా సీబీఐ చార్జీషీట్ లో చేర్చిందని, ఆ బాధ తనకు తెలుసునని అన్నారట. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతోంది. వైఎస్సార్ పేరును తనకు తెలియకుండా చార్జీషీట్లో పెట్టారని అన్నారంటే జగన్ పై కేసులు తాను పెట్టించినట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది కదా!. అప్పట్లో సంబందంలేని వ్యక్తులతో సోనియాగాంధీ,చంద్రబాబు నాయుడు కేసులు వేయించి జగన్ ను రాజకీయాలలో లేకుండా చేయాలని ప్రయత్నించిన విషయం బహిరంగ రహస్యమే. వైఎస్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ ను నానా ఇబ్బందులకు గురి చేశారని ,అలాంటి వ్యక్తితో ఎలా రాజీ పడుతుందని కూడా రాధాకృష్ణ చిత్రమైన లాజిక్ తెచ్చారు. జగన్ కాంగ్రెస్ లో నుంచి వెళ్లేటట్లు చేసి, ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టి వేధించిన సంగతిని పక్కనబెట్టి.. కాంగ్రెస్‌నే జగన్ వేధించారని రాయడం అంటే పిచ్చిరాతలకు పరాకాష్టే అని చెప్పాలి. ✍️ రాధాకృష్ణ వంటి ఆషాఢభూతుల చెప్పుడు మాటలు విని సోనియాగాంధీ ఆనాడు అధికారం ఉందనే అహంకారంతో అలా చేశారన్న సంగతి బహిరంగ రహస్యమే. అయినా మసిపూసి మారేడు కాయ చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఆదాయపన్ను కేసు లో చంద్రబాబు ఇబ్బంది పడి రాజకీయంగా నష్టపోతారేమోనన్న భయంతో రాధాకృష్ణ ఇలాంటి నీచమైన వంటకాలు వండుతున్నారు. చంద్రబాబును మోదీ నమ్మడం లేదు కనుక జగన్ ను కూడా నమ్మకుండా చేయాలంటే ఇలా కాంగ్రెస్ తో అంటకట్టాలన్న తాపత్రయం ఆయన అక్షరాలలో అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్‌ను కమ్మేసిన జగన్మాయ అని రాశారు. జగన్ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటేనేమో అక్రమమట. మరి బీజేపీతో బంధంలో ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం సక్రమమట. ఏపీలో చంద్రబాబుకు , తెలంగాణలో రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ద్వారా తన వ్యాపార ,రాజకీయ ప్రయోజనాలు రక్షించుకోవాలన్నదే రాధాకృష్ణ అసలు లక్ష్యం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయం గమనించకపోతే వారికే నష్టం. రేవంత్ రెడ్డి వంటివారు గుడ్డిగా నమ్మి ఆయన చెప్పినట్లు వింటే నూతిలో పడ్డట్లే అవుతుంది. చంద్రబాబు తరపున కేంద్రంలో బీజేపీ పెద్దలను మాయచేయాలని రాధాకృష్ణ ఇలాంటి దుష్టపలుకులు రాస్తున్నర సంగతి ఎవరు అర్దం చేసుకోలేరు?. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘వారిపై కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రజ్యోతి పత్రికలో అవాస్తవాలు రాస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రాధాకృష్ణ పిచ్చి రాతలు రాస్తున్నారన్నారు. శనివారం ‘సాక్షి’తో మాట్లాడిన దేవినేని అవినాష్..‘ రిపీటెడ్ అఫెన్స్ చేసేవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.తూర్పు నియోజకవర్గ టీడీపీ నేతల దొంగతనాలకు పాల్పడ్డారు. చట్టప్రకారమే నేరస్తులను శిక్షిస్తున్నారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరిపైనా కేసులు పెట్టలేదు. టీడీపీ, జనసేనలపై కేసులు పెట్టి వారిని తొక్కాల్సిన అవసరం మాకు లేదు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది’ అని తెలిపారు. -
విశాఖ రైల్వే జోన్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదన్నారు. విశాఖకు రైలే జోన్ వచ్చి తీరుతుందన్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు. చదవండి: అడ్డదారి రాజకీయాలు బాబుకు అలవాటే రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని.. విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు రాతలపై రామోజీ, రాధాకృష్ణ సమాధానం చెప్తారా?. అవాస్తవాలను ప్రచురించి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని విజయసాయిరెడ్డి హితవు పలికారు. -
చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలకు డీజీపీ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతోపాటు తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు. నిరాధార ఆరోపణలతో కథనాలు.. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా– గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలో సంస్థలదే’, ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’, ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’ అనే శీర్షికలతో ఈనాడు పలు కథనాలను ప్రచురించింది. ‘జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి’, డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు?, చంద్రబాబు ధ్వజం’ అనే శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాటిని ప్రచురించడంపై చంద్రబాబు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బొండా ఉమా, బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌తోపాటు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆమోద పబ్లికేషన్స్, ప్రింటర్–పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌లకు డీజీపీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. దురుద్దేశపూర్వకంగానే.. డీఆర్ఐ గుజరాత్లో స్వాధీనం చేసుకున్న రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసు శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని డీఆర్ఐ ప్రకటించినా, డీజీపీ కూడా స్పష్టత ఇచ్చినా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ నిరాధార ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించి పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. దురుద్దేశపూరిత చర్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆ వార్తను ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డీజీపీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం -
ఇలాంటివి రాసే బాబుకు 23 ఇచ్చారు: సోము
సాక్షి, విజయవాడ : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు భాషకు అనుగుణంగా రాతలు రాయాలనే తప్ప, పోలవరం ప్రాజెక్టుపై రాధాకృష్ణకు ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘భద్రాచలం సహా 10 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తాయని అన్నారు. ముంపు మండలాల్ని కేసీఆర్ అడగరా? రాధాకృష్ణ పిచ్చిరాతలు రాస్తున్నారు. అలాగే పోలవరం ఎత్తులపై కూడా రాధాకృష్ణ తప్పుడు రాతలు రాస్తున్నారు. పోలవరాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేస్తుంది. అవగాహన లేని రాధాకృష్ణ.. అర్థరహిత రాతలు రాస్తున్నారు. ఈ ప్రభుత్వం లేనప్పుడు పోలవరంపై ఒక్క ముక్కైనా రాశారా? ఇప్పుడెందుకు ఈ రాతలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలు రాసే.. చంద్రబాబుకు 23 ఇచ్చారు. ఇంకా ఎన్ని తగ్గించాలనో వారి ప్రయత్నం. రాసుకోమనండి. పోలవరంలో అవినీతి చేసినవారిని కడిగిన ముత్యం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలవరంపై చర్చకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలి. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వామపక్షాలు తెలుగుదేశనికి ఏజంట్లు. వాళ్లంతా చైనావోళ్లు. చైనావోళ్లు డబ్బులిస్తే వామపక్షాలు భారత్‌లో పనిచేస్తున్నాయి. చంద్రన్న డబ్బు ఇస్తే ఇక్కడ పని చేస్తున్నాయి. డబ్బులు తీసుకుని చిలక పలుకులు పలుకుతున్నారు’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు. -
నంద్యాల ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు: సోము వీర్రాజు
-
ఆంధ్రజ్యోతి రాధాకృష్టకు ఎమ్మెల్యే సవాల్..
సాక్షి, ప్రొద్దుటూరు: సీఎంఆర్‌ఎఫ్‌ల చెక్కుల స్కాం కేసులో తన పాత్ర ఉందని పోలీసులు, సీఐడీ అధికారులు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ స్కాంలో తన పాత్ర లేదని తేలితే ఆంధ్రజ్యోతి పత్రికను మూసివేస్తావా అంటూ ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణకు ఆయన సవాల్ విసిరారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి పత్రిక సీబీఐ దర్యాప్తు కోరితే తాను మొదటి సంతకం చేస్తానని కోర్టులో పిటిషన్ కూడా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (చదవండి: ‘అందుకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారు’) -
రాధాకృష్ణ తెగ ఫీలవుతున్నారు: సోము వీర్రాజు
-
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని బహిరంగ ప్రకటన ద్వారా హితవు పలికారు. రాధాకృష్ణ ఏం చేసినా, ఎన్ని చేసినా టీడీపీ మంచికే అన్న విషయం అందరికీ తెలుసునని అన్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ఆంద్రజ్యోతిలో ప్రచురించిన "మీ జీవీఎల్, మీ ఇష్టం" విశ్లేషణపై సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన చంద్రబాబు) బీజేపీ అధ్యక్షుడి పత్రికా ప్రకటన యథాతథంగా.. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి "మీ జీవీఎల్, మీ ఇష్టం" అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను. (చదవండి: తప్పుడు కథనం ఆధారంగా ‘పిల్’ ఏమిటి?) -
ఇంగ్లిష్ మీడియం మీ పిల్లలకేనా?
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్/నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శల దాడి చేస్తూ వచ్చారు. ఆయనకు వంతపాడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వ్యతిరేక కథనాలు ప్రచురించాయి. ఒక రకంగా యుద్ధం ప్రకటించాయి. అయితే ఈ పత్రికల యజమానుల పిల్లలు, మనుమళ్లు మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకోవడం గమనార్హం. ఈనాడు అధినేత రామోజీరావు కుమారులు సుమన్, కిరణ్‌లు ఇద్దరూ ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, లిటిల్ ప్లవర్లో వారి ప్రాథమిక విద్య కొనసాగింది. ఇక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కుమారుడు ఆదిత్య, కూతురు అనూషలు హైదరాబాద్ ఓబుల్‌రెడ్డి స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఇంగ్లిష్‌లోనే తమ విద్యాభ్యాసం చేశారు. ఇప్పుడు మనుమడు దేవాన్‡్ష కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నాడు. వెంకయ్య అక్షర ఇంటర్నేషనల్‌లో ఇంగ్లిష్ మీడియమే.. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి కుమార్తెకు చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్ నేతృత్వంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అక్షర విద్యాలయ పేరుతో ఇంటర్నేషనల్ స్కూలు నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ఈ స్కూలులో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం 2019–20 విద్యా సంవత్సరంలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్‌కు వెంకయ్యనాయుడి కుమార్తె దీపా వెంకట్ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఇంగ్లిష్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్ పిల్లలు మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. హర్షవర్ధన్ కుమార్తెలు వైష్ణవి, నిహారికల ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోనే సాగింది. వీరిలో ఒకరు ప్రస్తుతం సింగపూర్‌లో చదువుతుండగా, మరొకరు ఢిల్లీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. దీపా వెంకట్ కుమారుడు విష్ణు ఆస్ట్రేలియాలో చదువుతుండగా.. కుమార్తె సుష్మ ఢిల్లీలో చదువుతున్నారు. -
పవన్, రాధాకృష్ణ ఇద్దరూ చంద్రబాబు పాలేరులే!
పీలేరు/రొంపిచెర్ల : రాష్ట్రంలో వేమూరి రాధాకృష్ణ, పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాలేరుల్లా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించా రు. శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్ర సోమ వారం పీలేరుకు చేరుకుంది. స్థానిక శ్రీకృష్ణ దేవరాయ నూనెవిత్తుల కర్మాగారంలో ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉన్నారన్నారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. చంద్రబాబు వందల హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చకపోయినా పవన్ కల్యాణ్ నోరెత్తకపోవడం ఆయన పాలేరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరు నెలల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుండడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన తొత్తులైన పవన్ కల్యాణ్, వేమూరి రాధాకృష్ణ ప్రభుత్వంపై బురద చల్లే పనిలో పడ్డారని ఆరోపించారు. నాయకుడంటే ప్రజల పక్షాన మాట్లాడాలని, పవన్, రాధాకృష్ణ ఇద్దరూ చంద్రబాబునాయుడుని కాపాడేందుకు కష్టపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ను ప్రజలు ఛీ కొట్టినా సిగ్గురాకపోవడం దురదృష్టకరమన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాధాకృష్ణకు చంద్రబాబు ఎంత దోచి పెట్టాడో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్‌కు మినహాయింపు లేదన్నారు. ఇప్పుడు దోచుకోడానికి అవకాశం లేకపోవడంతో బురదజల్లుతున్నారని తెలిపారు. టీటీడీని కూడా స్వార్థ రాజకీయాలకు వినియోగించుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. రాయలసీమ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పట్టిన ఈ శనిత్రయాన్ని (చంద్రబాబు, పవన్, రాధాకృష్ణ)కి దేవుడే తగిన శాస్తి చేస్తాడని అన్నారు. పాదయాత్రకు మంత్రి సంఘీభావం పీలేరు : ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్రకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం తెలియజేశారు. సోమవారం ఆయన స్థానిక శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారం వద్ద శ్రీకాంత్‌రెడ్డి, ఇతర నాయకులకు శాలువాలు కప్పి అభినందించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు జగన్మోహన్రెడ్డి, వెంకట్రమణారెడ్డి, నాయకులు హరీష్ రెడ్డి, గజ్జల శీన్‌రెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు లేఖ రాసే అర్హత ఉందా...?
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాసే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన వార్తలను పట్టుకుని చంద్రబాబు...సీఎంకు లేఖ రాయడం సమంజసంగా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోగి రమేష్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలు నిర్వహించాం. ఫలితాలు విడుదలైన తర్వాత ఎవరైనా పేపర్ లీకైందని రాస్తారా? చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ ఆధారాలను ప్రజల ముందు ఉండాలి. లేదంటే బాబు, రాధాకృష్ణలపై క్రిమినల్ కేసులు పెట్టాలి. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేశారా? బలహీన వర్గాలకు ఉద్యోగాలు వస్తే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారు?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. సీఎం జగన్...బడుగు, బలహీన వర్గాల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారు. ఎల్లో మీడియా కుట్రలు ఆయనను ఏమీ చేయలేవు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల జేజేలు పలుకుతున్నారు. పచ్చ పత్రికలు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు. ఇప్పటికైనా రాధాకృష్ణ తప్పుడు కథనాలపై సమాధానం చెప్పాలి, లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతాం. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన హయాంలో ఉద్యోగాల భర్తీపై చర్చకు రావాలి.’ అని సవాల్ విసిరారు. -
‘టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు’
సాక్షి, తూర్పుగోదావరి : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికపై రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనపై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బడుగు బలహీనవర్గాలకు ఉద్యోగాలు రావడం ఓర్వలేక అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పాలనలో ఏ ఒక్కరికి ఒక ఉద్యోగం కూడా రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే లక్షా 25 వేల ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్రలు చేస్తున్నారు’
సాక్షి, అమరావతి : సచివాలయ ఉద్యోగాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు కల్పించాలని ప్రశంసించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సీఎం జగన్ రికార్డ్‌ను బాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ కలిసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగాలు ఇస్తే బాబు సహించలేకపోతున్నారని, ఇంటికి ఒక ఉద్యోగమని చెప్పి చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. కులాలు, మతాలు, మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించడం దారుణమని, చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా?
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు దౌర్భాగ్య పాలన నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు నవ శకానికి నాంది పలికారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 27 వేలు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చినందుకు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, ఇచ్చిన హామీ ప్రకారం సీఎం నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి పనికి లంచాలు వసూళ్లు చేసేవారని, జన్మభూమి కమిటీలకు ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొమ్ముకాసేవారని దుయ్యబట్టారు. రాధాకృష్ణ, చంద్రబాబుది వంకర బుద్ది అని, సచివాలయ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని తప్పుడు రాతలు రాస్తున్నాదని విమర్శించారు. బురద జల్లడమే ఆంధ్రజ్యోతి రాధకృష్ణ పని ఉద్యోగాలు రాని వారిలో అనుమానాలు సృష్టించాలని రాధాకృష్ణ ఈ ప్రయత్నం చేస్తున్నారని, పేపర్ లీక్ అయితే అదేరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తప్ప మిగతా వాళ్లు అందరి మీద బురద జల్లడమే ఆంధ్రజ్యోతి రాధకృష్ణ పని అని, ఆయనకు ఉన్న కుల పిచ్చి మరెవరికి లేదని ధ్వజమెత్తారు. చివరకి ఎన్టీఆర్‌ను సైతం వాడు.. వీడు అని రాధాకృష్ణ సంభోదించారని విమర్శించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తే.. కాపీ కొట్టి ఉద్యోగాలు సంపాదించారని తప్పుడు రాతలు రాస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఇస్తున్న ఉద్యోగాలు.. టీడీపీ వాళ్లకు కూడా వస్తూన్నాయనే దానిపై రాధాకృష్ణతో తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. అవి తోక పత్రికలకు కనిపించడం లేదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 19 చారిత్రాక బిల్లులను సీఎం తెచ్చారన్న ఆయన, అది పచ్చకళ్ల రాధాకృష్ణకు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. తప్పుడు రాతలు రాస్తున్న ఆంధ్రజ్యోతి పేపర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏబీఎన్ ఛానెల్, పేపర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కుటుంబం అంటే రాధాకృష్ణకు, చంద్రబాబుకు భయమని, పోలవరం రివర్స్ టెండర్లను అపహాస్యం చేస్తూ తప్పుడు రాతలు రాశారని గుర్తు చేశారు. రివర్స్ టెండర్ లో రూ.58 కోట్లు మిగిలిన సంగతి రాధాకృష్ణకు, చంద్రబాబు తోక పత్రికలకు కనిపించడం లేదా అని ఘాటు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలనలో రాధాకృష్ణ, చంద్రబాబు ఆటలు సాగవని, బడుగు బలహీన వర్గాలకు అంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ వ్యతిరేకి అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు దుయ్యబట్టారు. -
‘చంద్ర గ్రహమే ..దశగ్రహం’
సాక్షి, అమరావతి : మహానటుడు ఎన్టీ రామారావు పేరును కాలగర్భంలో కలిపేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు తరం కాదని.. వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పినట్లుగా ‘జామాత.. దశమగ్రహమే’ అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా ఆయన ఫొటోకు దండేసి.. ఆయన పేరును వాడుకున్న నీచమైన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తుతున్నారు. ఈ దశమగ్రహాన్ని సాగనంపే రోజులు వచ్చాయని.. కాలగర్భంలోనూ కలిసిపోతాడని శాపనార్థాలు పెడుతున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కనిపించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. బాబు మాటలు విని బాధపడుతున్నాం ఎన్టీఆర్ అభిమానిగా చంద్రబాబు మాటలు విని చాలా బాధపడుతున్నాం. అన్న ఎన్టీఆర్ ఫొటోను పార్టీ సభ్యత్వ పుస్తకాలపై తొలగించడానికి చేసిన ప్రయత్నాలను పార్టీలోని వారంతా వ్యతిరేకించడంతో చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ ఫొటోను ముద్రించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలకు చంద్రన్న కానుక, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా అంటూ ఆయన పేరు పెట్టుకున్నాడే కానీ ఎన్టీఆర్ పేరు ఎక్కడా పెట్టలేదు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన అభిమానుల ప్రతి ఇంటిలోనూ ఎన్టీఆర్ ఫొటో ఉంది. అలాంటి ఎన్టీఆర్ పేరును తొలగిస్తానంటూ చంద్రబాబు అనడం చాలా దారుణం. ఏ మాత్రం గౌరవం లేకుండా వాడు, వీడు అంటూ మాట్లాడం శోచనీయం. ఎన్టీఆర్ అభిమానులు ఒక సారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించింది. ఇప్పుడు చంద్రబాబు మాటలకు ఆ ఆత్మ మరింతగా క్షోభిస్తుంది. ఇప్పటికైనా ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి. – నల్లమోతు రమేష్ చౌదరి మరోసారి వెన్నుపోటు రాజ్యాధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆయన పేరును ఆరోగ్యశ్రీ పథకం నుంచి తొలగించడానికి ప్రయత్నించి మరోసారి వెన్నుపోటుదారుడిగా ముద్రపడ్డారు. భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబును మించిన మోసగాడు ఉండడు. – చావా వెంకటేశ్వరరావు, గంపలగూడెం ప్రజాసేవకు అనర్హుడు ఆరోగ్యశ్రీ పథకం పేరును మార్పు చేయాలనే ఆలోచన రావడమే చంద్రబాబు పతనానికి తొలిమెట్టు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ పేరును తొలగించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వంటి కుట్రదారులు ప్రజాసేవకు అనర్హులు. – శీలం నాగనర్సిరెడ్డి, మునుకుళ్ల -
అన్నగారి ఆత్మను చంపేశాడు
సాక్షి , గుంటూరు : చంద్రబాబు మాయ ముసుగు ఒక్కొక్కటిగా తొలగిపోతోంది. దివంగత నేత నందమూరి తారక రామారావు పట్ల చంద్రబాబు వైఖరి తేటతెల్లమైంది. అన్నగారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నారన్నది జగమెరిగిన సత్యమైనా.. తెలుగుదేశం పార్టీ నేతల బుకాయిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ చావుకు కారకుడైన బాబును వెనకేసుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో చంద్రబాబు సంభాషణ విన్న అన్నగారి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్టీఆర్‌ను ఏక వచనంతో సంబోధించిన బాబు తీరును అసహ్యించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు తొలగిస్తామని, ఇప్పటికే ప్రజలు మరిచిపోయారని చంద్రబాబు అంటుంటే.. ఆవేదనతో చెమ్మగిల్లుతున్నారు. ఇలాంటి నేతకా తాము ఇప్పటి వరకు మద్దతిచ్చిందని మధన పడుతున్నారు. అన్నగారి ఆత్మను సైతం చంపేసిన చంద్రబాబుకు బుద్ధి చెబుతామని నిప్పులు కక్కుతున్నారు. మహానటుడు ఎన్టీ రామారావు పేరును కాలగర్భంలో కలిపేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు తరం కాదని.. వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పినట్లుగా ‘జామాత.. దశమగ్రహమే’ అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశమగ్రహాన్ని సాగనంపే రోజులు వచ్చాయని.. కాలగర్భంలోనూ కలిసిపోతాడని శాపనార్థాలు పెడుతున్నారు. అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కనిపించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఎన్టీఆర్‌పై బాబుది కపట ప్రేమ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న ఎన్టీఆర్. ఆయన స్థాపించిన పార్టీనే లాక్కుని, ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్టీఆర్‌పై కపట ప్రేమ నటిస్తూ వచ్చారు. ఇందుకు నిదర్శనమే సామాజికి మాధ్యమాల్లో తిరుగుతున్న చంద్రబాబు, రాధాకృష్ణల సంభాషణ వీడియో. అసలు ఎన్టీఆర్ పేరు లేకుండా, వినిపించకుండా చేయాలను కోవడం వారి అవివేకం. ఏనాడో ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నిజ స్వరూపాన్ని గుర్తించాలి. –మెగలిపువ్వు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ అభిమాని, చెరుకుపల్లి -
కెమెరా ముందు సంసారం.. వెనకాల..
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, తోకపత్రిక యజమాని రాధాకృష్ణ మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా ఎన్టీఆర్‌ను వాడు.. వీడు అని చంద్రబాబు దుర్భాషలాడటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బాగోతాలపై ఏపీ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్ధాయితో ధ్వజమెత్తారు. కెమెరా ముందు సంసారులుగా నటిస్తూ.. కెమెరా వెనకాల వ్యభిచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ కెమెరా ముందు సంసారం...కెమెరా వెనుక వ్యభిచారం. ఇదీ మీ పచ్చ పత్రికల బాగోతం. ఎన్టీఆర్‌ను చంపారు. కాంగ్రెస్‌తో పొత్తుట్టుకుని ఆయన విలువలకు అంత్యక్రియలు చేశారు. ఇప్పుడు ఆయన్ని చరిత్ర నుంచి తుడిపేయడానికి తెగించారు. ఏపీ రాజకీయ చరిత్రకు చంద్రబాబు ఒక అవినీతి మచ్చ’ అని వ్యాఖ్యానించారు. (చదవండి : ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేస్తా) అదంతా నాటకమే..! సాక్షి, విజయవాడ: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పట్ల చంద్రబాబు చేసిన కించపరిచే వ్యాఖ్యలపై ఏపీ మాజీ హోం మంత్రి, వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. ‘బాబు వ్యాఖ్యలతో అన్నగారి ఆత్మ క్షోభిస్తుంది. తాజా ఘటనతో ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు నిజమైన వైఖరి బయటపడింది. ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేసి బాబు నివాళులు అర్పించడం నాటకమని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కళ్ళు తెరవాలి. అన్నగారి ఆత్మగౌరవం కాపాడాల్సిన కనీస బాధ్యత ఆయన వారసులపై ఉంది’ అన్నారు. బాబుకు నరనరాల్లోనూ విద్వేషం.. విజయవాడ: ఎన్టీఆర్ పట్ల మొదటి నుంచి చంద్రబాబుది కపట ప్రేమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేష్ఠ రమేష్‌బాబు అన్నారు. ఎన్టీఆర్ అంటే బాబుకు నరనరాల్లోనూ విద్వేషం ఉందని, గత్యంతరం లేక ఎన్టీఆర్ పేరును ఇప్పటి వరకు వాడుకున్నాడని విమర్శించారు. తెలుగు ప్రజలు దైవంగా భావించే ఎన్టీఆర్‌ను నీచంగా సంబోధిస్తూ వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు అహంకారానికి ఎన్టీఆర్ అభిమానులు సరైన బుద్ది చెబుతారని ఆకాక్షించారు. -
జీర్ణం.. జీర్ణం.. భూములూ జీర్ణం
సాక్షి, అమరావతి : చట్టాలు, నిబంధనలను చట్టుబండలుగా మార్చేసిన సీఎం చంద్రబాబు అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ప్రభుత్వ భూములను దర్జాగా కేటాయించడం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం భూమిని రూ.నాలుగు కోట్లకు కేటాయించిన టీడీపీ సర్కారు ఫక్తు ప్రైవేట్ వ్యాపార సంస్థలకు మాత్రం రూ.10 లక్షలకే అప్పగించడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. తమ నేత భూ దందాలను చూసి మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు అదే దారిలో నడిచారు. ఫుడ్ పార్కులు, పరిశ్రమల ముసుగులో విలువైన భూములు కాజేసి కోట్లకు పడగలెత్తారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని దళారీగా మార్చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని భూములు అప్పగించేసి ప్రతిఫలంగా వాటాలు పొందారు. అయిన వారికి అప్పనంగా భూములిచ్చి వాటాలు పొందడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి ఉచితంగా ఇవ్వాలంటూ చంద్రబాబు సర్కారు ఏకంగా జీవోనే జారీ చేసింది. రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు రూ. 13 కోట్లకే ధారాదత్తం చేయడం వెనుక లోగుట్టు ఇదేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను అస్మదీయ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా సీఎం చంద్రబాబు సింహభాగం వాటాలు పొందారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకుని రూ.వేల కోట్లు మింగేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాల్లో రూ.వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమలు, ఐటీ సంస్థల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగినన్ని క్విడ్ ప్రోకోలు (నీకది... నాకిది) రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సర్కారు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన ఐవైఆర్, అజేయకల్లం ఈ కుంభకోణాలను నిర్థారిస్తూ పుస్తకాలను కూడా ప్రచురించడం వీటిని బలపరుస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను అస్మదీయ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా సీఎం చంద్రబాబు సింహభాగం వాటాలు పొందారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకుని రూ.వేల కోట్లు మింగేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాల్లో రూ.వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమలు, ఐటీ సంస్థల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగినన్ని క్విడ్ ప్రోకోలు (నీకది... నాకిది) రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సర్కారు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన ఐవైఆర్, అజేయకల్లం ఈ కుంభకోణాలను నిర్థారిస్తూ పుస్తకాలను కూడా ప్రచురించడం వీటిని బలపరుస్తోంది. ఇష్టారాజ్యంగా ధరల నిర్ణయం భూముల కేటాయింపులకు సంబంధించి ధరల నిర్ణయంలో సర్కారు ఓ విధానం, పద్ధతిని పాటించలేదు. అమరావతి పేరుతో రైతుల నుంచి సమీకరించిన భూమిని కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన ధరలో పదో వంతు కంటే తక్కువ మొత్తానికే ప్రైవేట్ కంపెనీల పరం చేయడం గమనార్హ్హం. ఎల్ఐసీకి ఎకరం రూ.4 కోట్లకు ఇచ్చిన ప్రభుత్వం గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ఎకరం రూ. 12 లక్షల చొప్పున 12 ఎకరాలు ఇచ్చేసింది. జేవియర్ స్కూల్‌కు ఎకరం రూ.లక్షకే కట్టబెట్టింది. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వార్షిక ఫీజులు వసూలు చేసే ఎస్ఆర్ఎం, విట్, అమృత తదితర ప్రైవేట్ విద్యాసంస్థలకు నామమాత్రపు ధరకే భూములు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న చిప్ డిజైనింగ్ కంపెనీ సాక్‌ట్రానిక్స్‌కు అమరావతిలో రూ.160 కోట్ల విలువైన 40 ఎకరాలు రూ.20 కోట్లకే ఇచ్చేశారు. అది కూడా ఎన్నికలు రెండు నెలలు ఉండగా ఇచ్చేయడం గమనార్హం. ఇలా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న భూమిలో ఇప్పటికే 46 ప్రైవేట్ సంస్థలకు 1,260 ఎకరాలకుపైగా సర్కారు కట్టబెట్టింది. నందమూరి సంస్థకు అప్పనంగా అప్పగింత ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నందమూరి బసవ తారకం ఆస్పత్రికి రాజధాని ప్రాంతంలో ఎకరా రూ.10 కోట్లు పలికే భూమిని ఎకరా రూ.25 లక్షలకే కట్టబెట్టారు. బాలకృష్ణ కుటుంబానికి చెందిన సంస్థకు రూ.150 కోట్ల విలువైన భూమిని రూ.3.75 కోట్లకే అప్పనంగా ఇచ్చేశారు. పేదల భూములకూ టెండర్ పరిశ్రమల కోసం 10 లక్షల ఎకరాలను సేకరించాలని ఏపీఐఐసీకి నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేదలకు పంచిన అసైన్డ్, పట్టా భూములను లాక్కునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాలను విండ్‌పవర్ సంస్థలకు అడ్డగోలుగా ఇచ్చేశారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ‘ముడా’ను కూడా భూ దళారీగా మార్చేశారు. ముడా నిధులతో మౌలిక వసతులు కల్పించి పారిశ్రామిక సంస్థల ముసుగులో 33 వేల ఎకరాలను కొట్టేయాలని సర్కారు పెద్దలు వ్యూహ రచన చేశారు. అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే పేరుతో 26,890 ఎకరాలను కొత్త భూసేకరణ చట్టం/సమీకరణ ద్వారా లాక్కోవాలని ప్రణాళిక రచించారు. గల్లాకు సంతర్పణ గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్‌కు తిరుపతిలోని కరకంబాడిలో రూ.108.45 కోట్ల విలువైన 21.69 ఎకరాల భూమిని రూ.4.88 కోట్లకే రాసిచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూమి కేటాయించాలంటూ పెట్టుకున్న దరఖాస్తు గల్లా అరుణకుమారి (జయదేవ్ తల్లి) మంత్రిగా ఉండగానే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. ఆమె కుటుంబానికి చెందిన అమర్‌రాజా బ్యాటరీస్‌కు సమీపంలోనే భారీగా భూములున్నందున ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె మంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ సర్కారు పేర్కొంది. అయితే చంద్రబాబు సర్కారు రాగానే ఆగమేఘాలపై ఈ ఫైలును తెప్పించుకుని మంగళ్ ఇండస్ట్రీస్‌కు కారు చౌకగా భూమిని కట్టబెట్టడం గమనార్హం. కేటాయించిన భూమికీ ధర తగ్గించారు వైఎస్సార్ జిల్లాలో ట్రైమాగ్ అల్లాయిస్‌కు భూకేటాయింపు వ్యవహారంలో సర్కారు అనుసరించిన వైఖరిపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఎకరా రూ.15.01 లక్షల చొప్పున ఈ సంస్థకు వంద ఎకరాలు కేటాయించారు. డబ్బు కట్టలేనని ఈ సంస్థ చేతులెత్తేస్తే భూమిని వెనక్కు తీసుకోవాల్సిందిపోయి తాజాగా ఈ సంస్థకు ఎకరా భూమి ధరను రూ.3.50 లక్షలకు తగ్గించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా చేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. ఇది కర్నూలు జిల్లాలో శాంతిరాముడు అనే టీడీపీ నాయకునికి చెందినది కావడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.30 లక్షలు పలుకుతోంది. ఇదే వ్యక్తికి చెందిన శాంతిరాం కెమికల్స్‌కు ఎకరా రూ.1.05 లక్షల నామమాత్రపు ధరతో 150 ఎకరాలు కేటాయించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు శాంతిరాముడు సహకరించినందుకు ఇవి బాబు ఇచ్చిన బహుమానాలని అధికారులు అంటున్నారు. విక్రయ హక్కులు కల్పిస్తూ జీవో కారు చౌకగా కట్టబెట్టిన భూములను తాకట్టు పెట్టుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు విక్రయ (సకల) హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఏకంగా జీవో జారీ చేసింది. బ్యాంకు రుణాల మెలిక పెట్టి విక్రయ హక్కులనూ కల్పించింది. రూ. 300 కోట్ల భూమి రూ. 40 కోట్లకే... తిరుపతి చెంతన ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లో మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు కోసం మేజెస్ ఎలక్ట్రానిక్ పార్కుకు 200 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. తిరుపతి–కాళహస్తి మార్గంలో ప్రస్తుతం ఎకరం కోటిన్నర రూపాయలు పలుకుతుండగా ఎకరం కేవలం రూ.20 లక్షలతో ఇచ్చేశారు. రూ. 300 కోట్ల విలువైన భూమిని రూ. 40 కోట్లకే ధారాదత్తం చేశారు. 2014–20 పారిశ్రామిక విధానం రాయితీల పేరుతో మరో రూ.50 కోట్ల మేర కూడా లబ్ధి చేకూర్చారు. అయిన వారికి ఫుడ్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం ముసుగులో చంద్రబాబు తన అస్మదీయులకు సుమారు రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.126 కోట్లకే కట్టబెట్టారు. తద్వారా అధికార పార్టీ లోని ముఖ్యనేతలు భారీ ఎత్తున ప్రయోజనం పొందారు. రూ.520 కోట్ల భూమి రూ.4.99 కోట్లకే ధారాదత్తం ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.వేల కోట్ల ఆస్తులను దోచిపెట్టారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భరత్ (మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనువడు) మంత్రి నారా లోకేష్‌కు తోడల్లుడు కావడం గమనార్హం. భరత్ కుటుంబానికి చెందిన విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీ (వీబీసీ)కి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498.93 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.900 కోట్ల పెట్టుబడితో యూరియా కర్మాగారం పెడతామంటూ బహిరంగ మార్కెట్లో రూ.520 కోట్ల విలువైన భూమిని రూ.4.99 కోట్లకే కొట్టేశారు. ఈ భూముల విలువ పెంచడం కోసమే జగ్గయ్యపేటను సీఆర్డీఏ పరిధిలోకి చేర్చారు. ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని మూడేళ్లు దాటినా ఇప్పటివరకు అక్కడ కనీసం పునాది రాయి కూడా వేయకపోవడం గమనార్హం. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం స్థలం తీసుకున్న మూడేళ్లలోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలి. కానీ అక్కడ ఎటువంటి పనులు ప్రారంభం కాకపోయినా భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇది చాలదన్నట్లు విశాఖ జిల్లా యారాడ సమీపంలో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్, ఆదాయపన్ను కమిషనరేట్, కస్టమ్స్ కమిషనరేట్, సామాజిక సంక్షేమ శాఖ హాస్టల్ తదితరాలకు కేటాయించిన అత్యంత విలువైన 34 ఎకరాల భూమిని ఇదే కుటుంబానికి చెందిన గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూమిని కేబినెట్ ద్వారా ఏకంగా రద్దు చేశారు. ఆంధ్రజ్యోతికి ధారాదత్తం తనకు భజన చేస్తున్నందుకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రజ్యోతికి విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో రూ.37.50 కోట్ల విలువైన భూమిని రూ.1.70 కోట్లకే ధారాదత్తం చేశారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని పరదేశి పాలంలో బహిరంగ మార్కెట్లో భూమి విలువ ఎకరా రూ.15 కోట్లుపైగా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ ఎకరా రూ.7.26 కోట్లు ఉందని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రతిపాదన పంపించారు. ఇదే ధరతో కేటాయించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ (ఏపీ ఎల్ఎంఏ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వం 1.5 ఎకరాల భూమిని కేవలం రూ.50 లక్షల ఐదు వేలకే కేటాయించింది. చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలోని తూకివాకంలో బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.10 కోట్లు పలుకుతున్న భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయించారు. ఈ భూమి బెంగళూరు–విజయవాడ హైవేలో ఉంది. ఇది చెన్నై–తిరుపతి హైవేకు కూడా పక్కనే ఉండటం వల్ల ఈ భూమి విలువ చాలా ఎక్కువ. 1.5 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.15 కోట్లు కాగా, ప్రభుత్వం రూ.1.20 కోట్లకే ధారాదత్తం చేసింది. ‘లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా భజంత్రీలు వాయిస్తున్న ఆ సంస్థకు చంద్రబాబు సొంత ఆస్తి ఇస్తే తప్పు లేదు. ప్రభుత్వ భూములు, అడ్డగోలుగా ఖజానా సొమ్మునుంచి ప్రకటనలు ఇవ్వడం అన్యాయం’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రూ.లక్ష కంపెనీకి రూ.300 కోట్ల భూమి రూ.లక్ష మూలధనంతో 2018 అక్టోబర్‌లో ప్రారంభమైన మేజెస్ ఎలక్ట్రానిక్స్ పార్కుకు చిత్తూరు జిల్లాలో రూ.300 కోట్ల విలువైన భూమిని రూ.40 కోట్లకే కేటాయించారు. అత్యంత వేగంగా భూమి కేటాయించడమే కాకుండా 2014–20 పారిశ్రామిక పాలసీలో లభించే రాయితీలకు అదనంగా రూ.50 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. ఇది బాబు బినామీ సంస్థ అని పారిశ్రామిక వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మొగిలి ఇందుమౌళిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, బాబు బినామీ సీఎం రమేష్ దుబాయ్‌లో కలిసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇది సీఎం రమేష్, ముఖ్యమంత్రి బినామీది అనడానికి ఆధారమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సొంత సంస్థ హెరిటేజ్‌కు.. హెరిటేజ్ సంస్థకు గుట్టు చప్పుడుకాకుండా ప్రభుత్వం మూడు జిల్లాల్లో 26.46 ఎకరాల భూములు కేటాయించింది. పశువుల దాణా తయారీ కేంద్రం పేరుతో రాజధానికి సమీపంలో కృష్ణా జిల్లాలో 10 ఎకరాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట 10 ఎకరాలు, అనంతపురంలో 6.46 ఎకరాలు కట్టబెట్టారు. ఇందుకు సంబంధించి ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. ఏపీఐఐసీ మాత్రం భూములు ఇచ్చేసింది. హెరిటేజ్‌కు కేటాయించిన 26.46 ఎకరాల భూమి ధర రూ.50 కోట్లకుపైనే ఉంటుందని అనధికారిక అంచనా. హెరిటేజ్ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి అధిపతులుగా కొనసాగుతుండటం గమనార్హం. – ఎల్.రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి -
లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం
సాక్షి, అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో కలిసి సోమవారం రాత్రి రాజగోపాల్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. రాత్రి 10.30 నుంచి 12 వరకూ చంద్రబాబు వారిద్దరితో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు చంద్రబాబును కలిసేందుకు వేచి చూస్తున్నారు. చంద్రబాబు వారిని అలాగే కూర్చోబెట్టి రాజగోపాల్, రాధాకృష్ణతో సుదీర్ఘంగా మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి తాను చేసిన సర్వేలో చంద్రబాబుకు అనుకూలంగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనల ప్రకారం మహాకూటమికి అనుకూలంగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు లగడపాటి శతవిధాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, ఫలితాలు లగడపాటి సర్వేకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు ఏపీలోనూ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లగడపాటిని చంద్రబాబు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే అర్ధరాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుని.. వాటితో ప్రజల అభిప్రాయాన్ని మార్చడం, లేకపోతే గందరగోళపరచడం కోసం లగడపాటిని ఉపయోగించుకునేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తరచూ లగడపాటిని చంద్రబాబు కలుస్తున్నారు. -
వేమూరి రాధాకృష్ణ వ్యంగ్యంపై ఉరకవే మండిపాటు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఉద్యమాలకు నిలయమైన శ్రీకాకుళం భాష, యాసపై ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ వ్యగ్యంగా మాట్లాడం సరికాదని ఉత్తరాంధ్ర రచయితలు, కవుల వేదిక (ఉరకవే) ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో ఉరకవే నాయకుడు అట్టాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ‘పొట్టచింపితే హిందీ అక్షరం రాని ఉత్తరాంధ్ర’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. సిక్కోలు నేలను హేళన చేసిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. రాధాకృష్ణకు ఉరకవే బహిరంగ లేఖ రాసేందుకు నిర్ణయించిందన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉత్తరాంధ్రను పాలకులు, పత్రికాధిపతులు.. కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో కూరుకుపోయి హేళన చేయడం తగదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజా ఉద్యమం ద్వారా ఇటువంటివాటిని ఎండగడతామన్నారు. తొలుత శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలిలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయుకులు, కమ్యూనిస్టులు, పాత్రికేయులు, పలువురు మేధావులతో కలిసి నిరసన తెలియజేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన దువ్వాడ బాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రజాసంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, జయదేవ్, సనపల నర్శింహులు, వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, దివాకర్, టంక చలపతి, గురుగుబెల్లి బావాజీరావు, గొంటి గిరిధర్‌రావు, మిస్క కృష్ణయ్య పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతి ఎండీని అడ్డుకున్న న్యాయవాదులు
-
ఆంధ్రజ్యోతి ఎండీని అడ్డుకున్న న్యాయవాదులు
ఖమ్మం: పరువునష్టం దావా కేసులో ఖమ్మం కోర్టులో హాజరైన ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణను అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి సిబ్బంది, న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010 సంవత్సరంలో కోర్టులో కేసు దాఖలు చేశాడు. దీంతో, వేమూరి రాధాకృష్ణపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.