
విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదన్నారు. విశాఖకు రైలే జోన్ వచ్చి తీరుతుందన్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.
చదవండి: అడ్డదారి రాజకీయాలు బాబుకు అలవాటే
రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని.. విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు రాతలపై రామోజీ, రాధాకృష్ణ సమాధానం చెప్తారా?. అవాస్తవాలను ప్రచురించి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని విజయసాయిరెడ్డి హితవు పలికారు.