
సాక్షి, తాడేపల్లి: ఈనాడులో డ్రామోజీరావు విషపూరిత వార్తలు రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని ఏరియాలో ఎస్సీలు, ఎస్టీలు ఉండటానికి వీల్లేదని కూడా అడ్డగోలుగా రాశారు. తన పెత్తందారీ వ్యవహారాన్ని చూపించారు. అమరావతి మురికి కూపంగా మారుతుందని నిస్సిగ్గుగా రాశారు’’ అంటూ ధ్వజమెత్తారు.
‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేయాల్సిన నష్టం చంద్రబాబు రాశారు. దారుణంగా అవమానపరిచారు. అసలు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. విదేశీ విద్యా పథకం కింద అర్హులైన వారందరికీ న్యాయం చేస్తున్నాం. ఈనాడు రాసే బురద వార్తలను పట్టించుకోవాల్సిన పనిలేదు. చంద్రబాబు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే జనం నవ్వుతారు. ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేశారు?. ప్రాజెక్టులపై చర్చకు మేము సిద్ధం’’ అని ఎంపీ సవాల్ విసిరారు.
చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా?
‘‘పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి పోలవరాన్ని కూడా నాశనం చేశారు. రాజకీయాల్లో ఎదుర్కోలేక సినిమాల్లో పవన్ కల్యాణ్ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు’’ అని ఎంపీ సురేష్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment