‘ఎల్లో మీడియా వంకర రాతలు.. జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది’ | Ysrcp Mp Vijaya Sai Reddy Tweet On Yellow Media | Sakshi
Sakshi News home page

‘ఎల్లో మీడియా వంకర రాతలు.. జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది’

Published Sun, Mar 31 2024 7:35 PM | Last Updated on Sun, Mar 31 2024 7:53 PM

Ysrcp Mp Vijaya Sai Reddy Tweet On Yellow Media - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియాపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు’గా ఉంటున్నాయంటూ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చురకలు అంటించారు. 

‘‘అసలు దున్నా లేదు. దూడా లేదు.. నిత్యం వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది. ఎక్కడ ఏది జరిగినా అది జగన్ చేయించినట్టు, వైఎస్సార్ కాంగ్రెస్ హస్తమున్నట్టు అబద్ధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది పచ్చమీడియా. అదృష్టవశాత్తు జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది కాబట్టి వంకర రాతలను ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: AP: పింఛన్ల పంపిణీపై కీలక ఉత్తర్వులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement