
సాక్షి, తూర్పుగోదావరి : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికపై రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనపై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బడుగు బలహీనవర్గాలకు ఉద్యోగాలు రావడం ఓర్వలేక అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పాలనలో ఏ ఒక్కరికి ఒక ఉద్యోగం కూడా రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే లక్షా 25 వేల ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు.