Chelluboina Venu
-
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: చెల్లుబోయిన వేణు ఫైర్
-
అప్పుల్లో ఏపీని అగ్రగామి చేయడం బాబు టార్గెట్: చెల్లుబోయిన
సాక్షి, రాజమహేంద్రవరం: దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించరు అని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారీ ప్రజలను నట్టేట ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన కేబినెట్ లో అయినా సూపర్ సిక్స్ అమలుపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించినా, మళ్లీ ప్రజలకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... మళ్ళీ, మళ్ళీ మోసం చేయడానికే..కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు చర్యలు తీసుకుంటాని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 12 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో సూపర్ సిక్స్ కు సంబంధించినవి లేవు. తాజాగా గురువారం కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అయినా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలపై ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఎదురుచూశారు. మళ్ళీ, మళ్ళీ మోసం చేయడమే అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రజలను నిరాశలోనే ముంచేశాడు.హామీలు అమలు చేయలేక భయం అంటున్నారుసూపర్ సిక్స్ తో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. మీ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, అధికారంలోకి వచ్చిన మీరు వారిని దారుణంగా మోసగించారు. చంద్రబాబు అనుభవం ప్రజలను మోసం చేయడానికే పనికి వస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలుపై అసెంబ్లీ సాక్షిగా వాటిని అమలు చేయాలంటే నాకు భయం వేస్తోందంటూ చంద్రబాబు చెప్పాడు. ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఇచ్చే హామీలు సాధ్యమవుతాయా లేదా అనే విషయం ఇంత అనుభవం ఉన్నా చంద్రబాబుకు తెలియదా?నవరత్నాలను ప్రకటించి చిత్తశుద్దితో అమలు చేశాంఆనాడు జగన్ గారు ప్రజల కోసం నవరత్నాలను ప్రకటించారు. దాని అమలుకు ఒక క్యాలెండర్ ను ప్రకటించి మరీ ప్రజలకు అందించారు. ప్రజలకు సాయం అందించడంలో ఆయన చిత్తశుద్దితో కృషి చేశారు. దానిపైన కూటమి పార్టీలు అసత్య ప్రచారాలు చేశాయి. జగన్ గారి సంక్షేమం వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిందంటూ విమర్శించారు. జగన్ ప్రజల కోసం అప్పులు చేస్తే తప్పు అని అన్న చంద్రబాబు ఈ ఆరు నెలల్లోనే 1.19 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ప్రజలకు ఒక్క రూపాయి కూడా తన హామీల మేరకు ఖర్చు చేయలేదు. ఇది ఒప్పు అని ఎలా సమర్థించుకుంటారో చంద్రబాబు చెప్పాలి. జగన్ గారి ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్ నెలలో విద్యార్ధులకు వసతిదీవెన, పొదుపుసంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకారభరోసా, జూన్ నెలలో అమ్మ ఒడి, జులై నెలలో విద్యా దీవెన, నేతన్న నేస్తం, సెప్టెంబర్ నెలలో చేయూత, అక్టోబర్ నెలలో రైతు భరోసా, నవంబర్ లో విద్యాదీవెన, రైతులకు సున్నావడ్డీ రుణాలు, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా అమలు చేశారు.హామీల ఎగవేతకే జగన్ పాలనపై విమర్శలుప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగవేయాలనే ధోరణితో జగన్ గారి పాలనపై విమర్శలు చేస్తూ, పాలనను గాలికి వదిలేశారు. నా అనుభవంతో సందపను సృష్టిస్తాను, సంక్షేమాన్ని సృష్టిస్తాను అని హామీలు గుప్పించాడు. నాడు జగన్ గారు అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించి, విజయవంతంగా అమలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దానిని కాపీ కొడుతూ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల కాలంలో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు ఎందుకు కలగలేదు? పైగా ఈ ఏడాది తల్లికి వందనంకు మంగళం పాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తాంటూ తాజా కేబినెట్ సమావేశంలో తీర్మానించడం ఖచ్చితంగా ప్రజలను మోసగించడమే.వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపైనా అబద్దాలుచంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 7.40 లక్షల కోట్లు అన్ని చెప్పారు. దీనిలో 2014-19 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులే రూ.4.50 లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కలన్నీ మీ మంత్రులే చెప్పారు. మోసమే మీ ఎజెండాగా పనిచేస్తున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఘనుడు చంద్రబాబుప్రశ్నించాల్సిన సామాజిక మాధ్యమాలను సైతం ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. వ్యవస్థలన మేనేజ్ చేయడం అలావాటుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఒక్కో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై వేర్వేరు పోలీస్ స్టేషన్ లలో పదుల సంఖ్యలో అబద్దపు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు.కేబినెట్ లో హామీల అమలుపై చర్చ ఏదీ?సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కార్ ఎగనామం పెడుతోంది. నిన్న కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇదే నిజం అని అర్థమవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ఏడాది అమలు చేయడం లేదనే అంశాన్ని మీ కేబినెట్ సమావేశం వల్ల తెట్టతెల్లమయ్యింది. సీఎం చంద్రబాబు ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదికే రూ. 13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. గత ఏడాది కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 సాయంను కూడా రైతులకు అందించలేదు. ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కోసం కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. వెయ్యి కోట్లు మాత్రమే. కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తామని అన్నారు. 1.80 కోట్ల మంది ఆడబిడ్డలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. ఇవ్వన్నీ మోసం కాదా?అమ్మ ఒడి ఆగిపోయింది... తల్లికి వందనం మాయమయ్యిందిపేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలు మార్చేశక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రతి తల్లి ఖాతాలో దాదాపుగా రూ. 26,000 కోట్లు జమ చేశారు. 73 వేల కోట్లతో నాడు-నేడు ద్వారా విద్యాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. తతల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తీరు గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది. ఎంతమంది స్కూలుకు వెళ్ళే పిల్లలు ఉంటే, ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమయ్యింది. రైతులు అప్పుల పాలు కాకూడదని పెట్టుబడి సాయంను అందించి జగన్ గారు దేశానికే ఆదర్శమయ్యారు. రైతుభరోసాను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రకటించింది. కానీ అమలు మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా జగన్ గారి ప్రభుత్వం అండగా నిలిచింది.మహిళలను నిలువునా దగా చేశారురాష్ట్రంలో 19-59 సంవత్సరాల లోపు మహిళలకు ఏడాదికి రూ.18వేలు ఇస్తామనని హామీ ఇచ్చి, దారుణంగా మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 కోట్ల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం ఈ కేబినెట్ లో అయినా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. ఉచిత గ్యాస్ కింద ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని చెప్పి కేవలం ఒక సిలెండర్ తోనే మాయ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు అవసరం. కానీ ఈఏడాది బడ్జెట్ లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటదాయించింది.మత్స్యకార భరోసా మాయంగత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థికసాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతున్నారు. అయితే పథకం అమలు పై ఖచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలను ఖరారు చేయలేదు.బాబుగారి మాటలకు భావాలు వేరుఅన్ని వర్గాలను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసగించింది. చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. బాబుగారి మాటలకు భావాలే వేరు. ఆయన ఏదైనా చెప్పారంటే, ఖచ్చితంగా అది చేయరు అని అర్థం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా మరిచిపోయి మాట తప్పుతోంది. దీనిని వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రజలపై దారుణంగా పెంచిన విద్యుత్ చార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమించాం. రేపు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరాడతాం. ప్రజల గొంతుకగా వైయస్ఆర్ సీపీ నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పాలకుల మీద ఉన్న నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి -
చంద్రబాబు భస్మాసురుడు.. నెత్తిపై చెయ్యి పెడితే అంతే
-
‘‘వాటిని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు’
విశాఖ : రాజకీయ కక్షలో భాగంగానే వైఎస్సార్సీపీ నేత విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. కోనసీమలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే విశ్వరూప్ కుమారుడిని అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ వచ్చిన ప్రతీ సందర్బంలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతోందని ధ్వజమెత్తారు చెల్లుబోయిన. తిరుపతి లడ్డూ వివాదం మొదలుకొని కృష్ణా నదిలో బోట్లు వరకు ఇలా ప్రతీది డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, ప్రతీ రోజూ ఏదో ఘటన జరుగుతూనే ఉందన్నారు. వాటిని డైవర్ట్ చేయడానికే ఈ తరహాడ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్మంచి వ్యక్తి అని, అతనికి కుట్రలు, కుతంత్రాలు తెలియవని చెల్లుబోయిన స్పష్టం చేశారు. -
సిండికేట్లను ప్రోత్సహించింది చంద్రబాబే
-
అబద్దపు మోసాలతో కూటమి పాలన
-
పవన్.. బాబు అపరాధాన్ని క్షమించమని దీక్ష చేపట్టు: మాజీ మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.మాజీ మంత్రి చెల్లుబోయిన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగులను భయభాంత్రులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను అన్యాయంగా సస్పెండ్ చేశారు. తాజాగా కాకినాడలో జనసేన ఎమ్మెల్యే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దాడి చేసి రాజీ చేసుకుంటే చట్టాల పట్ల ప్రజలకు నమ్మకం పోతుంది. చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్టు ప్రకటించి పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలి. టీటీడీ రిపోర్టు టీడీపీ ఆఫీసుకు ఎలా వచ్చింది. సూపర్ సిక్స్‌లో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ప్రతిపక్షాలపై బురదజల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం -
ఏపీకి పోలవరం జీవనాడి
-
అధికారం శాశ్వతం కాదు.. చేసిన మంచి పనులే శాశ్వతం.. గుర్తుపెట్టుకో చంద్రబాబు..
-
జోగి రాజీవ్ అరెస్ట్ పై.. చెల్లుబోయిన వార్నింగ్
-
కక్ష సాధింపే కూటమి సర్కార్ లక్ష్యం: మాజీ మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఎందుకు హామీలు నెరవేర్చలేకపోతున్నారని ప్రశ్నించారు. కాగా, మాజీ మంత్రి చెల్లుబోయిన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కక్ష సాధించే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కక్ష తీర్చుకోవడానికి ఆయన కుమారుడిని టార్గెట్ చేయడం దారుణం. 2019లో కేవలం రూ.100 కోట్లతో ఖజానాను అప్పగించారు. రాష్ట్రం విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేశారు.అయితే, రాష్ట్రం అప్పుల్లో ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఎలా ఇచ్చారు?. హామీలు ఎలా నెరువేస్తారని అనుకున్నారు?. ప్రజలు ఎదురు చూస్తుంటే హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మీకున్న మీడియా బలంతో బీసీలపై దాడులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జేబు సంస్థలైన ఏసీబీని ఉపయోగించి జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా తగ్గలేదు.రెండు లక్షల 40 వేల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. బలహీన వర్గాల్లో ఎదిగిన నాయకులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాలకు అనేక పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. వారిని లక్ష్యంగా చేసుకుని వేధించడం ద్వారా కార్యక్రమాలు అమలు చేయవలసిన అవసరం లేదనుకుంటున్నారా?. బలహీన వర్గాలను అణచివేయం ద్వారా ఎటువంటి లబ్ది పొందాలనుకుంటున్నారు. ఉచిత ఇసుక సరే సరి.. నిల్వ ఉంచిన ఇసుకను దారుణంగా దోచుకున్నారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు’ అని ప్రశ్నించారు. -
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్ యాక్ట్‌పై ఇంకా రూల్స్ తయారు కాలేదన్నారు.‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు. -
కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బాబు
-
ఆ మాటలు గుర్తున్నాయా చంద్రబాబూ.. మంత్రి వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ‘‘నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తన అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. ‘‘తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా?. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా.? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు.. ఇదో పెద్ద అబద్ధం.. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా.. సీఎం జగన్ పింఛన్లు పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా.. మీ పార్టీ ఏనాడైన బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా?. ఇవాళ సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు శెట్టిబలిజలకు కేటాయించలేకపోయాడు. రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావ్. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన. ఫీజు రీయింబర్స్మెంట్ సగానికి సగం తగ్గించి బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు’’ అంటూ మంత్రి వేణు దుయ్యబట్టారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి ఫైర్..!
-
చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా ?
-
‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? అంటూ దుయ్యబట్టారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో ఏం మాట్లాడారంటే: చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఒక కాపీ, పేస్ట్. ప్రతి ఐదేళ్లకు ఒకసారి బీసీలను మోసం చేయటం చాలా సులభం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలసి బీసీ డిక్లరేషన్ అని మరోసారి మోసపూరిత వాగ్దానాలు ప్రకటించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆశయాలు, లక్ష్యాలు అన్నీ ఆయనతోనే వెళ్లిపోయాయి. 1995 తరువాత ఎన్టీఆర్ ఆశయాలను ఒక అత్యాశపరుడు తుంగలోకి తొక్కాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలను విస్మరించి.. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ, పేస్ట్ ప్రోగ్రాంను చంద్రబాబు ప్రదర్శించాడు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదు. బీసీలను అతిఘోరంగా టీడీపీ మోసగించింది. 1995 నుంచి 2004లో వరకు బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులపై చంద్రబాబు ఏమైనా చేశారా అంటే ఏమీ లేదు. బీసీలు పేదరికం నుంచి ఎదగాలంటే.. విద్యమాత్రమే మార్గమని రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ బీసీలను దగా చేసిన వారిలో ప్రప్రథముడు చంద్రబాబే. 2014లో బీసీల కోసం 142 హామీలు చంద్రబాబు ఇచ్చారు. జనం మర్చిపోయారని అనుకుంటున్నారేమో. ఒకవేళ చంద్రబాబు మర్చిపోయారేమో ఆ మేనిఫెస్టో తెప్పించుకుని చూడండి. 2014లో 142 హామీలు ఇస్తే.. ఒక్కటీ అమలు చేయలేదు. ప్రతి ఐదేళ్లకో ఒక వేషం వేసి బీసీలను చంద్రబాబు మోసం చేస్తాడు ప్రతి ఐదేళ్లకు ప్రజలను మోసం చేయటానికి చంద్రబాబు ఒక వేషం వేస్తుంటాడు. రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. ఉచిత విద్యుత్ అంటే కాల్పులు జరిపించి.. మళ్లీ ఉచిత విద్యుత్ ఇస్తానని చంద్రబాబు నోట వైఎస్ఆర్ అనిపించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు చంద్రబాబు ఏమి విమర్శలు చేశారో గుర్తు చేసుకో. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. బీసీల వెనుకబాటుతనానికి కారకుడు, బీసీల ద్రోహి చంద్రబాబే. 1992లో ఆర్థిక సంస్కరణలు వస్తే.. 1997లో ఐటీ బూం వస్తే.. బీసీ విద్యార్థి, యువకుడు ఐటీలోకి రాలేకపోయారు. 2007లో వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిన తరువాతే బీసీ బిడ్డ ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత విద్యలు చదివారు. చంద్రబాబుది మనువాదం అయితే జగన్‌ది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దారి బీసీలను బానిసలుగా చూడటానికి కులవృత్తులను చంద్రబాబు ప్రోత్సహించాడు. రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ను జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం మను సిద్దాంతాన్ని అనుసరిస్తున్నారు. కల్లుగీత గీసుకునేవారు.. అదే వృత్తి చేయాలి. నేత నేసుకునేవారు దానికే పరిమితం కావాలి. అలా బీసీలు కులవృత్తులకే పరిమితం అవ్వాలి తప్ప సమాజంలో ఎదగకూడదనేది చంద్రబాబు నిజస్వరూపం. బీసీల తోకలు కత్తిరిస్తా... జడ్జిలుగా బీసీలు పనికిరారు అన్నావ్ బీసీ కులాల్లో ఉపకులాలు చంద్రబాబు నోట వచ్చింది. మరి, గతంలో నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలు తీస్తాను, జడ్జీలుగా బీసీలు పనికిరారని చంద్రబాబు అన్నారు. ఇవేమీ ప్రజలు మరిచిపోలేదు. సీఎం జగన్ హయాంలో బీసీలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు బీసీలు సమాజానికి వెన్నెముక అని వారి వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. బీసీ డిక్లరేషన్ ఇచ్చి ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు జగన్. బీసీల ఆత్మగౌరవం ఎక్కడా తాకట్టు పెట్టకుండా.. కుదవ పెట్టకుండా.. రక్షించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. సీఎం జగన్ హయాంలో లక్షా 73 వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో నేరుగా.. డీబీటీ ద్వారా రూ.4.38లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. బీసీల కోసమే రూ.1.73 లక్షల కోట్లు లబ్ది బీసీల ఖాతాల్లో నేరుగా చేర్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డి. అది బీసీలకు తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు సబ్ ప్లాన్ పేరిన ఒక డ్రామా ఆడాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల ముందు కూడా ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు ఇచ్చి అంటగట్టాలని అనుకున్నావు. రోజూ లోకేశ్, చంద్రబాబు 34% రిజర్వేషన్లు ఉన్నాయి అని చెబుతారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణను పి.వి.నరసింహారావు 33.3% అమలు చేశారు. దానికి మరో 0.7% కలిపి 34% అని చంద్రబాబు చెబుతారు. 2014-19 మధ్యన స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల నిర్వహించని కారణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూదని తీర్పు ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పాలకుడు అఫిడవిట్ ఇచ్చారు. అతనికి చంద్రబాబు మద్దతు ఇచ్చారు. 34% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రతాపరెడ్డి అనే అతన్ని సుప్రీంకోర్టుకు పంపి రిజర్వేషన్లు అడ్డుకుంది బాబు కాదా? స్థానిక సంస్థల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి.. 50% రిజర్వేషన్లు.. నామినేటెడ్ పోస్టులు, దేవాలయ ఛైర్మన్లలోనూ సీఎం జగన్ ప్రకటించి అమలు చేశారు. సీఎం జగన్ కులగణన చేయించారు.. త్వరలోనే ప్రకటన చేస్తారు ఒక అబద్ధం చెప్పేసి వెళ్లిపోతే ప్రజలు మర్చిపోతారు అని చంద్రబాబు అనుకుంటారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి అనుకుంటారు. ప్రజలు మర్చిపోరు. చంద్రబాబును మర్చిపోయేలా బీసీలే చేస్తారు. కులగణన ఎందుకు చేస్తున్నారని పవన్ కల్యాణ్ చేత చంద్రబాబు ప్రకటన చేయించిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. త్వరలో కులగణన మీద సీఎం జగన్ ప్రకటన చేస్తారు. బీసీ బిడ్డలు ఇంగ్లీష్ చదవకూడదా... ఎందుకు అడ్డుపడ్డావ్ బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు. చంద్రబాబు చేసిన ప్రతి పనిలో బలైంది బీసీలే. ఈ విషయంలో అచ్చెన్నాయుడు వాపోతున్నారు. తప్పులు చేయించింది చంద్రబాబు న్యాయస్థానం ముందు దోషిగా అచ్చెన్నాయుడును నిలబెట్టాడు. ఈరోజు తప్పులు చేసిన చంద్రబాబును కూడా సీఎం జగన్ దోషిగా నిలబెట్టారు. అడ్డదారిలో వచ్చిన లోకేశ్ కూడా వేల సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిందని హాస్యాస్పదం. అసలు బీసీల జీవితాలు మారింది.. ఆనాడు వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్ వచ్చిన తరువాతే. బీసీల జీవితాలు మారాలంటే విద్య అందాలి. ఇంగ్లీషు మీడియం అందాలి. ఇంగ్లీషు మీడియం పెడితే గగ్గోలు ఎందుకు పెట్టారు. నీ మనవడు ఇంగ్లీషులో చదవాలి. బీసీ బిడ్డ ఇంగ్లీషులో చదివితే ఎదిగిపోతాడని నీ భయమమా? ఒక్కసారి ఈ విషయం బీసీలు ఆలోచించాలి. సీఎం జగన్ కేబినెట్లో పదిమంది బిసీ మంత్రులున్నారు ఇవాళ కేబినెట్లో 10 మంది బీసీ మంత్రులు ఉన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలు ఉన్నారు. యాదవ, కురుబ సామాజిక వర్గాలు లోక్‌సభ, పార్లమెంట్లో ఉన్నారు. ఆ సీట్లను చంద్రబాబు తన సామాజిక వర్గానికి అమ్ముకున్నారు. బీసీ అయిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్ చేశారు. డిప్యూటీ సీఎంగా ముత్యాల నాయుడును చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? రాష్ట్రంలో 58 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఎమ్మెల్సీలుగా 69% బీసీలకు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 37% మాత్రమే ఇచ్చాడు. ఎమ్మెల్సీలకు బీసీలకు 69% శాతం ఇచ్చిన వైఎస్ఆర్సీపీని చంద్రబాబు విమర్శించటం ఏమిటి? అంతెందుకు 6 జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లుగా బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. మున్సిపాల్టీలలో 44 మంది బీసీలకు (53%) ఛైర్పర్సన్ పదవులు, 9 మంది బీసీలకు (64%) కార్పొరేషన్లు మేయర్లుగా బీసీలకు అవకాశం వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. ఆ బీసీ కులాల ఆత్మగౌరవాన్ని రక్షించటం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. అలాంటి జగన్ గారిపై చంద్రబాబుకు విమర్శలు చేయటం ఏమిటి? చంద్రబాబుకు సిగ్గులేదు. కుల కార్పొరేషన్లు గురించి చంద్రబాబు మాట్లాడటం ఏమిటి? ఎప్పుడూ ఒక్కటే అబద్ధాన్ని చంద్రబాబు వల్లె వేస్తున్నారు. 56 కార్పొరేషన్లకు కుర్చీలు లేవంట. సీట్లు లేవంట. మీడియా మిత్రులు లారా రండి. వారు ఎంతో హుందాగా ఉన్నారో.. బీసీ భవన్ ఎలా ఉందో చూపిస్తాం. చులకన చేసిన వాడు గొప్పవాడు.. గొప్పగా చూసేవాడు.. చులకన చేసినట్లు అని.. కొత్త భాష్యం.. కొత్త భాషతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ నభూతో నభవిష్యత్ అని దేశమంతా చెప్పుకుంటోంది. కులగణన, సోషల్ ఇంజనీరింగ్‌లో జగన్ గారికి ఎవ్వరూ సాటి లేరు. 4% సామాజిక వర్గానికి 21 సీట్లు 45% బీసీలకు 18 సీట్లా బాబూ! అంతెందుకు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే చూస్తే.. 4% ఉన్న చంద్రబాబు సామాజిక వర్గానికి 21 సీట్లు.. 45% ఉన్న బీసీలకు 18 సీట్లు కేటాయించారు. చంద్రబాబు దృష్టిలో కులం అంటే తన సామాజిక వర్గమే. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్‌ను కలిపేసుకుని బీసీలను అణగదొక్కేయవచ్చనేది చంద్రబాబు ఆలోచన. కానీ, కాపులు విజ్ఞులు. ఈ జిల్లాలో 2008, 2024లోనూ బీసీలు, శెట్టి బలిజలు, గౌడలు, యాదవులు, దేవాంగులు, కుమ్మరి, కమ్మరి, ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు చంద్రబాబుకు కళ్లు తెరిపించటానికి సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్, రామచంద్రపురం, పాలకొల్లు, నర్సాపురం పార్లమెంట్ బీసీలకు జగన్ కేటాయించారు. కాపులను బీసీల్లో చేరుస్తానని వికృత క్రీడతో చంద్రబాబు మోసగించారు. అంతేకాదు.. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు హింసించాడు. డబ్బుందని, ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని బాబు చేసిన ప్రయత్నాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఒక కాపీ, పేస్ట్. మళ్లీ బీసీలను దగా చేయటానికి వంచించటానికి బాబు ప్రకటించిన డిక్లరేషన్. అసలు ఏ హామీ అమలు చేయని పార్టీకి డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత టీడీపీకి లేదు. దానికి వత్తాసు పలికే జనసేనకు అసలు లేదు. టీడీపీ వల్ల బాధించబడింది బీసీలే. రాజకీయ నాయకుడు అంటే అబద్ధం అని ఏమీ నెరవేర్చరని నాడు అనుకున్నారు. కానీ, నేడు చెప్పినవన్నీ జగన్ నిజం చేస్తు్న్నారని ప్రజలు అనుకుంటున్నారు. బీసీలకు విద్యను అందకుండా చేసిన బీసీ ద్రోహి చంద్రబాబు విద్యా విధానం విషయంలో బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబే. నేడు నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చటం నుంచి గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, విదేశీ విద్య ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే.. ఆకాశాన ఉమ్మేసినట్లే. చంద్రబాబు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను బీసీలే తిప్పికొడతారు. గతంలో మేనిఫెస్టోను దాచేసిన చంద్రబాబు మళ్లీ బీసీలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమాన్ని రక్షించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఈ విషయాన్ని బీసీలు గుర్తించాలి. ఇచ్చినమాట నెరవేర్చని వ్యక్తి.. ఎన్నికకో అబద్ధం చెప్పేవాడి పట్ల తస్మాత్ జాగ్రత్త. బీసీ బిడ్డగా బీసీలు మరోసారి మోసపోవద్దని కోరుతున్నా. మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈరోజు రాష్ట్రంలో బీసీలు తలెత్తుకుని తిరుగుతున్నారు. బీసీలు మోసపోవటానికి సిద్ధంగా లేరు. అందువల్లే బీసీల వాణిని వినిపించటానికి నాలాంటి వారు ముందుకు వచ్చారు. చంద్రబాబు వేల మంది చనిపోయారని,బీసీలను అణగదొక్కారని అంటున్నారు. అచ్చెన్నాయుడు చేత తప్పులు చేయించింది చంద్రబాబు. ప్రజాధనం దుర్వినియోగం చేసి చంద్రబాబుకు అచ్చెన్నాయుడు అందజేస్తే ఆయనకు శిక్షపడింది. ఇదీ చదవండి: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్ -
బీసీల గురించి మాట్లాడే అర్హత అల్జీమర్స్ బాబుకు లేదు..
-
ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు
తూర్పుగోదావరి: సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి వేణు మాట్లాడుతూ జక్కంపూడి ఈ నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఒక ఓటుతో ఏడుగురు పని చేస్తామని తనతో పాటు తన ఇద్దరు కుమారులు, జక్కంపూడి కుటుంబంలోని నలుగురు కలిపి మొత్తం ఏడుగురు ఈ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత అబివృద్ధి కోసం జక్కంపూడి రామ్మోహనరావు ఏ విధంగా పనిచేశారో అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా పనిచేస్తారని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ గూ డూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి జక్కంపూడి రామ్మోహనరావు విశేష కృషి చేశారన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ విధేయత, విశ్వసనీయతకు మారుపేరు జక్కంపూడి కుటుంబం అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నక్కా రాజబాబు, కడియం మండల జేసీఎస్ అధ్యక్షుడు తడాల చక్రవర్తి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యా ల పోసికుమార్, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షట్టర్ బాషా, వైఎస్సార్ సీపీ నాయకులు దేశెట్టి హరిప్రసాద్, డాక్టర్ తోరాటి ప్రభాకరరావు, సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవి చదవండి: వలంటీర్లకు గుడ్ న్యూస్.. నేడు నగదు పురస్కారాలు -
బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే
-
కాంగ్రెస్ అత్యాశకు పోయి కుప్పకూలిపోయింది: మంత్రి చెల్లుబోయిన
-
‘అల్జీమర్స్ చంద్రబాబు..ఆల్ జీరో టీడీపీ’
సాక్షి,అమరావతి: ‘అల్జీమర్స్ చంద్రబాబు.. ఆల్ జీరో టీడీపీ’ అని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. మంచిని వినలేని విఫల ప్రతిపక్షమని రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి, మేలు జరగడానికి ఏమాత్రం ఇష్టపడని తెలుగుదేశం పార్టీ.. చివరికి విఫల ప్రతిపక్షంగా మిగిలిందన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన మాట్లాడారు. ‘ఇది చాలా దురదృష్టకరం. ఆ పార్టీ సభ్యులు శాసనసభకు వస్తూనే.. ఎప్పుడెప్పుడు సభ నుంచి బయటకు వెళ్దామా.. అనే లక్ష్యంతో వస్తున్నారేమో.. ప్రజలకు జరుగుతున్న మంచిని.. జరగబోయే మంచిని వారు వినలేకపోవడం కూడా చాలా బాధాకరం. ఈ పరిస్థితిని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని’ చెల్లుబోయిన తెలిపారు. అసెంబ్లీలో సీఎం జగన్.. చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పకనే చెప్పారని.. ఒక అబద్దాన్ని నిజం చేయాలనే చంద్రబాబు ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైందని స్పష్టం చేశారు. సీఎం జగన్‌దే ఆ ఘనత ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న సీఎం జగన్ దేశంలోనే ముందు వరుసలో నిలిచారని కొనియాడారు. చేయనిది చెప్పలేను.. చేయగలిగిందే చెబుతాను. చెప్పిన మాట చేసి చూపించేందుకు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించనంటూ.. ఎన్నికల మ్యానిఫెస్టోను తూ.చా తప్పకుండా నూటికి నూరుశాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షం చంద్రబాబు పరిపాలన కాలంలో లెక్కలేనన్ని చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల్ని కనీసం పట్టించుకోని పరిస్థితి, రైతులకెక్కడా ఇన్పుట్ సబ్సిడీ గానీ ఇన్య్సూరెన్స్ గానీ అందించిన దాఖలాలే కనిపించవు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు. పేదరికాన్ని రూపుమాపాలనే ఆలోచన కూడా చేయలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇష్టానుసారంగా అనుమతులిచ్చి.. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలన్నింటీనీ నిర్వీర్యం చేశారు. ఇన్ని తప్పుడు పనులు చేసిన టీడీపీ.. ఇవాళ మేం శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. ప్రజలకు జరిగన మేలు గురించి చెబుతుంటే వినలేని పరిస్థితిలో ఉండటం బాధాకరం. సభలోకి ఫ్ల కార్డులు పట్టుకురావడం.. నిండు సభలో స్పీకర్‌ను అగౌరపరిచేలా కాగితాలు చించి వారిపై విసరడం, విజిల్స్ వేయడం ఎంతవరకు సబబని మంత్రి చెల్లుబోయిన చంద్రబాబును ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉండగా ప్రజలకు ఏమీ చేయకున్నా.. మా ప్రభుత్వం వచ్చాక మేం చేసిన ప్రజామేలును వివరిస్తుంటే.. ప్రతిపక్ష సభ్యులు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాని ఈ సందర్భంగా కోరారు. పవన్‌కళ్యాణ్ మాటలు ప్రజాస్వామ్యంలోనే ఒక వింత పేదవాడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం. అలాంటి మహోన్నతుల ఆశయాలకనుగుణంగా సీఎం జగన్ తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. డీబీటీ ద్వారా అర్హులైన పేదల ఖాతాల్లో రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిని జమచేసి మేలు చేశారు. ఇది పవన్‌కళ్యాణ్‌కు నచ్చడం లేదంట. ఇతను రాజకీయాల్లోకొచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదా..? నిత్యం మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టే చంద్రబాబు పక్కన చేరి పవన్ సాధించేదేముంది..? ఒకపక్కన ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున మంచి చేస్తుంటే.. అన్నిరంగాల ప్రజలు ప్రభుత్వ మంచిని హర్షిస్తోంటే.. ఈ పవన్‌కళ్యాణ్ మాత్రం ఎందుకు విమర్శిస్తున్నట్టు..? మంచిని ప్రోత్సహించాల్సిన సంస్కారం ఆయనకు లేదా..? కేవలం ఒక కులానికే ప్రతినిధిగా ఆయన మాటలతీరును ప్రజాస్వామ్యవాదులంతా తప్పుబడుతున్నారు. మంచి చేస్తోన్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతానంటూ.. ప్రజల ముందుకొస్తున్న పవన్‌కళ్యాణ్ మాటలు ఈ ప్రజాస్వామ్యంలోనే వింతగా చెప్పుకోవాలి. -
ఎన్నికల తర్వాత బాబు కనుమరుగే: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తాడేపల్లి: మేనిఫెస్టోలో చెప్పిందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవాడికి మంచి చేసిన సీఎం జగన్‌ను ఓడిస్తానంటున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత కనుమరుగవుతాడని హెచ్చరించారు. చంద్రబాబును నమ్మితే మోసపోయినట్లేనన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందన్నారు. పేదవాడు భద్రతతో బతుకుతున్నాడని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు ఇదే కోరుకున్నారన్నారు. అయినా దుష్టచతుష్టయం ధనదాహంతో సీఎం జగన్ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు చెల్లుబోయిన. ఇదీచదవండి.. నారా లోకేష్‌ను దాచేసినట్లున్నారు -
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
-
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తాడెపల్లి: సీఎం జగన్ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా జరుగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనేక మంది సంఘ సంస్కర్తల ఆలోచనల సమ్మిళతమే జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా చెప్పింది చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన నాల్గవ విడత చేయూత పంపిణీ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడించారు. 26,98,931 మందికి 5వేల 60 కోట్ల 4 లక్షలు చేయూత పంపిణీకి ఆమోదం లభించినట్లు చెప్పారు. చేయూత పథకంపై ప్రతిపక్షాలు చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని తెలిపారు. రూ.19,188 కోట్లను నాలుగు విడతల్లో చేయూత కింద అందించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. డీఎస్సీ నిర్వహణకు 6,100 పోస్టులతో కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. 2019 నుంచి విద్యారంగంలో 14,219 పోస్టుల భర్తీ చేశామని చెప్పారు. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2019 నుంచి 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని వెల్లడించారు. ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదివే ఐబీని ఏపీ విద్యావ్యవస్థలోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ ఐబీ విద్యతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటారని తెలిపారు. ఈ విధానంతో విద్యార్థుల కమ్యునికేషన్ స్కిల్స్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతాయని అన్నారు. ఉపాధ్యాయ, విద్యాశాఖ అధికారులకు కూడా ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఐబీ విద్యతో విప్లవాత్మక మార్పులు ఉంటాయని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇదీ చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి గ్రీన్‌సిగ్నల్