‘వాటిని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు’
విశాఖ : రాజకీయ కక్షలో భాగంగానే వైఎస్సార్‌సీపీ నేత విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. కోనసీమలో వైఎస్సార్‌సీపీని దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే విశ్వరూప్ కుమారుడిని అరెస్ట్ చేశారన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ వచ్చిన ప్రతీ సందర్బంలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతోందని ధ్వజమెత్తారు చెల్లుబోయిన. తిరుపతి లడ్డూ వివాదం మొదలుకొని కృష్ణా నదిలో బోట్లు వరకు ఇలా ప్రతీది డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, ప్రతీ రోజూ ఏదో ఘటన జరుగుతూనే ఉందన్నారు. వాటిని డైవర్ట్ చేయడానికే ఈ తరహాడ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌మంచి వ్యక్తి అని, అతనికి కుట్రలు, కుతంత్రాలు తెలియవని చెల్లుబోయిన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment