viswarup
-
‘‘వాటిని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు’
విశాఖ : రాజకీయ కక్షలో భాగంగానే వైఎస్సార్సీపీ నేత విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. కోనసీమలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే విశ్వరూప్ కుమారుడిని అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ వచ్చిన ప్రతీ సందర్బంలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతోందని ధ్వజమెత్తారు చెల్లుబోయిన. తిరుపతి లడ్డూ వివాదం మొదలుకొని కృష్ణా నదిలో బోట్లు వరకు ఇలా ప్రతీది డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, ప్రతీ రోజూ ఏదో ఘటన జరుగుతూనే ఉందన్నారు. వాటిని డైవర్ట్ చేయడానికే ఈ తరహాడ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్మంచి వ్యక్తి అని, అతనికి కుట్రలు, కుతంత్రాలు తెలియవని చెల్లుబోయిన స్పష్టం చేశారు. -
చంద్రబాబు రహస్య ఎజెండాను హర్షకుమార్ అమలు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రహస్య ఎజెండాను మాజీ ఎంపీ హర్షకుమార్ అమలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ధ్వజమెత్తారు. హర్షకుమార్ దళిత మాస్క్ వేసుకుని రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి విశ్వరూప్ ఏమన్నారంటే.. ► సీఎం వైఎస్ జగన్ దళిత పక్షపాతి. దళితులపై ఏ ఘటన జరిగినా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ► నేను జోకర్‌నని హర్షకుమార్ అంటున్నారు. విద్యార్థిగా దళిత ఉద్యమాల్లో పోరాటాలు చేసి వచ్చిన వ్యక్తిని నేను. చంద్రబాబు చేతిలో పావులాగా ఉపయోగపడుతున్న హర్షకుమారే జోకర్. ► దళితులకు గత ప్రభుత్వాలు ఏం చేశాయో.. జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు రా.. మాట్లాడదాం. ► దళితుల సమస్యలకు, అమరావతికి సంబంధం ఏంటి? దమ్ముంటే అమలాపురం వచ్చి సభ పెట్టు. అమరావతిలో దళితుల అసైన్డ్ భూములను చంద్రబాబు, ఆయన బినామీలు ఎలా లాక్కున్నారో తెలియదా? ► చంద్రబాబు ప్రయోగిస్తున్న కొత్త యాక్టర్‌వి నువ్వు. ప్రసాద్ అనే వ్యక్తి నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఇవ్వండని రాష్ట్రపతికి లేఖ రాయడం వెనుక నీ హస్తం ఉంది. -
మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం
-
పోటీ పరీక్షలకు మంచి శిక్షణ ఇస్తాం : మంత్రి
సాక్షి, అమరావతి : అమరావతిలోని సచివాలయం 4వ బ్లాక్‌లో పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి స్టడీ సెంటర్స్ ఫైల్‌పై మంత్రి సంతకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రీతి పాత్రమైన శాఖను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 'మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పని చేస్తాను. గత ప్రభుత్వం కేటాయించిన నిధులలో 10శాతం కూడా ఖర్చు చేయలేదు. దళితుల సంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ కోసం కేటాయించిన వెయ్యి కోట్లలో 185కోట్లే ఖర్చు చేశారు. సోషల్ వెల్ఫేర్‌కి బడ్జెట్లో 4500కోట్లు కేటాయిస్తే 2600కోట్లు వెనక్కు వచ్చాయి. 8జిల్లాలలో స్టడీ సెంటర్స్ అందించే ఫైల్ మీద తొలి సంతకం చేశాను. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా మంచి శిక్షణ ఇస్తాం' అని తెలిపారు. మరోవైపు బుధవారం పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి ఛాంబర్లో అడుగు పెట్టారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. నవ రత్నాలలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణంకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 175 నియోజక వర్గాలలో 100శాతం ఇళ్ళ నిర్మాణము పూర్తి చేస్తామన్నారు. ఉగాది నుంచి ప్రారంభించి దశల వారీగా 25లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. శంకర నారాయణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 80వేల మంది నాయి బ్రాహ్మణులు, రజకులు 2.10 లక్షల మందికి 10వేల చొప్పున సాయం అందించేందుకు ప్రతిపాదనలపై తొలి సంతకం చేశారు. 'ఏపీలో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నవరత్నాలలో కూడా బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు' అని శంకర నారాయణ పేర్కొన్నారు. -
'దీక్ష ఆరంభం మాత్రమే'
అమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడం అక్రమమని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. జగన్ దీక్షను భగ్నం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అమలాపురం పట్టణంలోని హైస్కూల్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవ హారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వరూప్ మాట్లాడుతూ... తమ అధినేత జగన్ ప్రత్యేక హోదా కోసం ఏడు రోజులు దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో ఇది ఆరంభం మాత్రమేనని, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు భవిష్యత్‌లో మరింతగా ఉద్యమిస్తామన్నారు.