అవ్వ అడిగిందని ఒక్క రోజులోనే రోడ్డు.. స్వయంగా పని మొదలుపెట్టిన మంత్రి వేణు | Chelluboina Venu Buld A Road for People In One day | Sakshi
Sakshi News home page

అవ్వ అడిగిందని ఒక్క రోజులోనే రోడ్డు.. స్వయంగా పని మొదలుపెట్టిన మంత్రి వేణు

Published Sun, Jul 24 2022 4:29 AM | Last Updated on Sun, Jul 24 2022 3:35 PM

Chelluboina Venu Buld A Road for People In One day - Sakshi

రోడ్డు నిర్మాణ పనుల్లో పాల్గొన్న మంత్రి వేణు

రామచంద్రపురం రూరల్‌: ఓ అవ్వ కోరిందని ఒక్క రోజులోనే రోడ్డును నిర్మించి ఆమె కోరిక తీర్చారు.. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం భీమక్రోసుపాలెం గ్రామంలో మూడు రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. శుక్రవారం గుండుపల్లి మంగాయమ్మ అనే వృద్ధురాలు ఏళ్ల తరబడి తన ఇంటికి దారి లేదని, వర్షం వస్తే బురదలో తిరగడానికి ఇబ్బంది కలుగుతోందని మంత్రి వేణు దృష్టికి తెచ్చింది.

దీంతో ఆయన శనివారం గడపకు గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి తాను హాజరయ్యే సమయానికి గ్రావెల్‌ రోడ్డు వేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రామానికి వచ్చిన వెంటనే మంత్రి వేణు స్వయంగా పారతో బొచ్చెలో గ్రావెల్‌ నింపుకుని పని మొదలుపెట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో రోడ్డు పూర్తి చేశారు. ఒక్క రోజులోనే తన ఇంటికి రోడ్డు నిర్మించడంతో ఆ అవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement