Roads
-
కూల్చి'వెతలు' లేని హైవే!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రోడ్డు విస్తరణ అంటేనే జనం గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్ల వెంట ఇళ్లు ఉన్నవారైతే తమ నివాసాలకు ఎక్కడ ఎ సరు వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు. కానీ, ఒక ఊళ్లో మాత్రం జాతీయ రహదారి విస్తరణ చేపట్టినా ఇళ్ల కూల్చివేసే అవసరం ఏర్పడలేదు. 40 ఏళ్ల క్రితం స్థానిక ప్రజాప్రతినిధులు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమే నేడు వారిని కాపాడింది. ఆ గ్రామమే కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్పేట. హైదరాబాద్ నుంచి మెదక్, ఎల్లారెడ్డి మీదుగా బాన్సువాడ, రుద్రూర్, బోధన్ వరకు రహదారిని ఎన్‌హెచ్–765 డీగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి గోపాల్పేట మీదుగా వెళ్తోంది. విస్తరణలో కొన్ని షెడ్లు, కోకాలు మాత్రమే తొలగించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లేవీ పోవడం లేదు. నాటి సర్పంచ్ ముందుచూపుతోనే..నాగిరెడ్డిపేట గ్రామ పంచాయతీలో నాగిరెడ్డిపేట, గోపాల్ పేట, బంజెర గ్రామాలు ఉండేవి. పంచాయతీ నాగిరెడ్డి పే టలో ఉండగా, మండల కార్యాలయాలన్నీ ప్రధాన రహ దారిపై ఉన్న గోపాల్‌పేటలో ఉంటాయి. అందుకే నాగి రెడ్డిపేట మండల కేంద్రంగా గోపాల్ పేటను వ్యవహరి స్తారు. ఈ మధ్యే గోపాల్పేట, బంజెర గ్రామాలు పంచా యతీలుగా ఏర్పడ్డాయి. 1981లో ఇక్కడ సర్పంచ్‌గా గెలు పొందిన వి.కిషన్‌రెడ్డి 1992 వరకూ పదవిలో కొనసాగా రు. ఆ సమయంలోనే ఈ రోడ్డు ఎప్పటికైనా కీలకంగా మా రుతుందని ఆలోచించిన కిషన్‌రెడ్డి.. గ్రామస్తులతో చర్చించి రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 50 ఫీట్లు వదలి తేనే అనుమతులు ఇచ్చే పద్ధతి మొదలుపెట్టారు. దీంతో గ్రామ స్తులు రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల అవతలే ఇళ్లు నిర్మించుకున్నారు. అంటే రోడ్డు వెడల్పు వంద ఫీట్లు ఉందన్న మాట. ఇప్పుడు రెండు వరుసల జాతీయ రహదారి, ఇరు వైపులా డ్రైనేజీ, సర్వీసు రోడ్లు నిర్మిస్తున్నారు. అయి నా ఇళ్లు కూల్చే అవసరం ఏర్పడలేదు. అక్కడక్కడా చిన్న చిన్న అరుగులు, మెట్లు కొంత భాగం మాత్రమే పోతున్నాయి. వేగంగా రోడ్డు నిర్మాణ పనులుమెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు 43 కిలోమీటర్ల రోడ్డుకు రూ.399.01 కోట్లు, దీనికి కొనసాగింపుగా ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు 51 కిలోమీటర్ల రోడ్డుకు రూ.499.88 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు మొ దలయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. -
‘రింగు’ యమ కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌లో పేర్కొంది. 162 కి.మీ నిడివితో ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతి కిలోమీటరుకు ఏకంగా రూ. 52.5 కోట్లు ఖర్చు కానుంది. 8 వరసలుగా ప్రతిపా దించినప్పటికీ, ప్రస్తుత ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటంతో 4 వరసలను మాత్రమే నిర్మించనున్నారు. భవిష్యత్తులో దాన్ని 8 వరసలకు విస్తరిస్తారు. మరి 4 వరసల నిర్మాణానికే ఇంత భారీ వ్యయం ఎందుకు అవుతోందో చూద్దాం..5 మీటర్ల ఎత్తుతో నిర్మాణంఇది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. ఢిల్లీ చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగురోడ్డు స్థాయిలో దీనికి ప్లాన్ చేశారు. కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఆటంకాలు తలెత్తని రీతిలో నిర్మించబోతున్నారు. నగరం, నగర శివారు ప్రాంతాల్లో అప్పుడప్పుడు రికార్డు స్థాయి వర్షపాతం నమోదై లోతట్టు ప్రాంతాలను మెరుపు వరదలు ముంచెత్తుతాయి. కొన్నిరోజుల పాటు ఆ ప్రాంతాలు నీటిలోనే ఉంటాయి. ఇలాంటి వరదలు ఈ రోడ్డును ఇబ్బంది పెట్టకుండా భూ ఉపరితలం నుంచి 5 మీటర్ల ఎత్తుతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 16.4 అడుగుల ఎత్తుతో ఇంచుమించు ఎలివేటెడ్ కారిడార్ తరహాలో ఉంటుంది. అంతెత్తు మట్టి కట్ట నిర్మించి దానిమీద రోడ్డును నిర్మిస్తారు. 162 కి.మీ రోడ్డును అంత ఎత్తుతో నిర్మించేందుకు భారీ వ్యయం కానుంది. 3 నదులు.. 3 భారీ వంతెనలుఈ మార్గంలో 3 నదుల మీదుగా ఈ రోడ్డు సాగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో 4 వరసల రోడ్డుకు సరిపోయే వెడల్పుతో 3 భారీ వంతెనలు నిర్మిస్తారు. వలిగొండ వద్ద మూసీ నదిని దాటాల్సి ఉంది. వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద కిలోమీటరు పొడవుతో భారీ వంతెనకు డిజైన్ చేశారు. దీనికి దాదాపు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. పుల్కల్ మండలం శివంపేట గ్రామం వద్ద మంజీరా నదిని దాటాల్సి ఉంది. ఇక్కడ 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.75 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇక తూప్రాన్ సమీపంలో హరిద్రా నదిని దాటుతుంది. అక్కడ అర కి.మీ పొడవైన వంతెన నిర్మిస్తారు. దీనికి రూ.70 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.190 చిన్న వంతెనలు, అండర్ పాస్లుఇతర రోడ్ల మీదుగా సాగే వాహనాలు దాటేందుకు, కాలువలు, వాగుల్లో పారే నీళ్లు దాటేందుకు వీలుగా రోడ్డు పొడవునా చిన్న వంతెనలు, అండర్ పాస్‌లను ప్లాన్ చేశారు. ఇవి మొత్తం 190 ఉంటాయి. వీటిల్లో 105 అండర్ పాస్‌లు ఉన్నాయి. దిగువన 10 అడుగుల ఎత్తుతో దారి ఉంటుంది. వాటి గుండా ఇతర రోడ్ల వాహనాలు సాగుతాయి. ఈ కల్వర్టులు, అండర్‌పాస్‌లు ఉండే చోట్ల రింగురోడ్డు 5.5 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. ఇక కాల్వలు, చెక్ డ్యామ్‌లు, చెరువు కాలువలు, గుట్టల నుంచి జాలువారే నీటి ప్రవాహానికి రింగురోడ్డు అడ్డుగా మారకుండా 85 చిన్న కల్వర్డులు నిర్మించనున్నారు. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా, వీటి గుండా ట్రాక్టర్లు లాంటి వాహనాలు వెళ్లేలా రోడ్డు కూడా ఉంటుంది.ఇలా పెద్ద, చిన్న వంతెనలు, కల్వర్టులు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇక తారు పొరలు కూడా చాలా మందంగా ఉండనున్నాయి. వాహనాలు 120 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా నిర్మిస్తున్నందున, అవి జారిపోయే ప్రమాదం లేకుండా రోడ్డుపైన ప్రత్యేక మెటీరియల్‌తో పొరలు నిర్మించనున్నారు. దిగువ తారు పొరలు కూడా చాలా మందంగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి మొత్తంగా రూ.8,500 కోట్ల వ్యయం అవనుంది. -
ఆ మలుపులో ఎన్నో ప్రమాదాలు!
భూదాన్ పోచంపల్లి: అసలే ఇరుకు రోడ్డు.. దానిపై ప్రమాదకరంగా మూల మలుపు.. దాని పక్కనే చెరువు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురంలో శనివారం కారు చెరువులో బోల్తా కొట్టిన ప్రాంతం దుస్థితి ఇది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, పక్క నే చెరువు ఉన్నట్టు ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక, ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాహనాలు చెరువులోకి దూసుకెళ్లాయి. పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలతో నిత్యం రద్దీ ఉన్నా..పోచంపల్లి పర్యాటక కేంద్రం, చేనేతకు ప్రసిద్ధికావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేవారు వస్తుంటారు. వాహనాల రద్దీ ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై జలాల్పురం చెరువు కట్ట వద్దకు రాగానే ఇరువైపులా పెద్ద మూల మలుపులు ఉన్నాయి. ఇరువైపులా చెట్లు, పొదలు పెరిగి, ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేంత వరకు సరిగా కనిపించవు. చెరువుకు రక్షణ గోడ కూడా లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి మూల మలుపుల సమీపంలో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని... చెట్లు, పొదలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం ధర్నా కూడా చేశారు. చెరువు సమీపంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఎన్నో ప్రమాదాలు జరిగినా ఎవరికీ పట్టింపులేదని జలాల్పురం గ్రామానికి చెందిన పాలకూర్ల జంగయ్య మండిపడ్డారు.చెరువులోకి దూసుకెళ్తున్న వాహనాలు⇒ ఈ ఏడాది జూలై 17న ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.⇒2023 జూలై 24న చెరువు కట్టపై పండ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ అనే యువకుడు మృతిచెందాడు.⇒ 2020 జూలై 24న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన జింక వంశీ, తన స్నేహితులతో కలిసి పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని బంధువులకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తుండగా... ఇదే మలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. వంశీ మృతిచెందగా, మిగతావారు బయటపడ్డారు.⇒ 2020 జూన్ 26న చెరువు కట్ట మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొన్నాయి. కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇక పదుల సంఖ్యలో ద్విచక్రవాహనలు అదుపుతప్పి చెరువులో పడి చాలా మంది గాయాలపాలయ్యారు. -
డబ్బులు లేవు ప్రజలు ఇస్తేనే రోడ్లు వేస్తాం
-
ఏపీ ప్రజలపై మరో భారం (ఫోటోలు)
-
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్‌లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్‌తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
రోడ్ల ‘రూల్’ మారిపోయింది
సాక్షి, అమరావతి: రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఇకపై కూటమి నేతల అనుంగులకే దక్కనున్నాయి. ఇందుకు ప్రభుత్వ పెద్దలు పెద్ద ప్లానే వేశారు. తమ అస్మదీయ, బినామీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు అర్హత నిబంధనలను సడలించారు. తమ వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా, ఇతర కాంట్రాక్టర్లు పోటీ పడకుండా అడ్డుకుని మరీ కాంట్రాక్టులు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా బిడ్లు దాఖలు చేసేందుకు అర్హతగా పరిగణించే కాల పరిమితి (బ్లాక్పీరియడ్)ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ ఆర్ అండ్ బి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు కోవిడ్‌ను కారణంగా చూపించడం గమనార్హం. ఇప్పటివరకు గత ఐదేళ్లలో కాంట్రాక్టు సంస్థలు చేసిన పనుల విలువను అర్హతగా పరిగణించేవారు. ఇక నుంచి గత పదేళ్లలో చేసిన నిర్మాణ పనులను పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా ప్రస్తుతం అర్హత లేని కాంట్రాక్టు సంస్థలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు ప్రభుత్వ పెద్దలు మార్గం సుగమం చేశారు. ఈ పదేళ్ల బ్లాక్ పీరియడ్ సడలింపు 2026–27 వరకు వర్తిస్తుందని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే రానున్న మూడేళ్లలో చేపట్టే రోడ్ల నిర్మాణ టెండర్లలోనూ వారి ఇష్టానుసారం కాంట్రాక్టులు కట్టబెడతారన్న విషయం స్పష్టమైంది. పీపీపీ రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే..! రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై టోల్ భారం వేస్తూ పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో త్వరలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. మొత్తం రూ.4 వేల కోట్లతో రాష్ట్ర ప్రధాన, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి ఇప్పటికే నిర్ణయించింది. అందులో మొదటి దశగా రూ.698 కోట్లతో 3,931 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కన్సల్టెన్సీలను ఆహ్వానించింది కూడా. ఈ కాంట్రాక్టులను ప్రభుత్వ పెద్దలు సన్నిహితులకు కట్టబెట్టేందుకే అర్హత నిబంధనలను సడలించినట్టు స్పష్టమవుతోంది. అందుకే కన్సల్టెన్సీల ఎంపిక కోసం ఉత్తర్వులు జారీ చేసిన మంగళవారమే కాంట్రాక్టు సంస్థల అర్హత నిబంధనలను కూడా సడలించింది. రోడ్ల నిర్మాణాన్ని అస్మదీయ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టి, ఆ సంస్థలు వాహనదారుల నుంచి ఐదేళ్ల పాటు టోల్ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం పక్కాగా కథ నడుపుతోందని ఆర్ అండ్ బి వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
మేడిపండు రీతిన బాబు రోడ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వ విధానం మేడిపండును గుర్తుకు తెస్తోంది. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.9,554 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కానీ కేటాయింపులను పరిశీలిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ కనికట్టు బట్టబయలైంది. వాహనదారులపై ‘టోల్ ఫీజుల’ భారీ బాదుడే తమ విధానమని చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా తేల్చిచెప్పింది. పోనీ రోడ్ల నిర్మాణం కోసం నిధుల కేటాయింపు అయినా సక్రమంగా చేశారంటే అదీ లేదు. పీపీపీ విధానంలోనే..అత్యంత ముఖ్యమైన రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులన్నీ కూడా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోనే నిర్మిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం. అంటే ఇక రోడ్డు ఎక్కితే వాహనదారులపై టోల్ ఫీజుల బాదుడు తప్పదన్నది సుస్పష్టం. ఇప్పటి వరకు జాతీయ రహదారులను మాత్రమే పీపీపీ విధానంలో నిర్మిస్తున్నారు. టోల్‌వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర రహదారులను పీపీపీ విధానంలో నిర్మించ లేదు. ఇక మీదట జిల్లా ప్రధాన కేంద్రాలు, మండల ప్రధాన కేంద్రాలను అనుసంధానించే రాష్ట్ర రహదారులపై ప్రయాణించినా టోల్ ఫీజు బాదుడు భరించాల్సిందేనని ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే తక్కువ కేటాయింపులే గుంతలు లేని రోడ్లు అంటూ ప్రచారార్భాటం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి మాత్రం అరకొర కేటాయింపులతోనే సరిపుచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023–24లో కేటాయింపుల కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం 2024–25లో తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖకు అన్ని పద్దుల కింద 2023–24లో రూ.8,766.89 కోట్లు కేటాయించింది. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం రూ.8,322 కోట్లు మాత్రమే కేటాయించింది. ⇒ రైల్వే పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, వంతెనల నిర్మాణం, జిల్లా ప్రధాన, ఇతర రహదారులు, రహదారి భద్రత పనులు, తుంగభద్ర పుష్కర పనులు, రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల ఉన్నతీకరణ పనులకు కలిపి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023–24లో రూ.725.92 కోట్లు కేటాయించింది. 2024–25కుగాను టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.468.88కోట్లే కేటాయించడం గమనార్హం. ⇒ ఆర్‌ఐఏడీ కింద మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి నిధులు, ఎన్డీబీ బ్యాంకు రుణ సహాయం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామీణ రోడ్లు, ఎన్‌ఆర్‌ఈజీపీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023–24లో రూ.1,481.59 కోట్లు కేటాయించింది. కాగా చంద్రబాబు ప్రభుత్వం అవే పనులకు 2024–25లో రూ.721.78కోట్లే కేటాయించి చేతులు దులిపేసుకుంది. ⇒ ఏలూరు–గుండిగొలను–కొవ్వూరు రహదారి నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై వంతెన నిర్మాణం, కడప యాన్యూటీ పనులు, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణం పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023–24లో రూ.1,472.51కోట్లు కేటాయించింది. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో రూ.1,115.68 కోట్లే కేటాయించడం గమనార్హం. -
‘గుంతలు లేని రోడ్లు కోసం వ్యూహాత్మక ప్రణాళిక’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర రహదారులను నిర్మించలేదని, జాతీయ రహదారుల మంజూరుకు ప్రయత్నించలేదన్నారు.గాలికి దీపంపెట్టి దేవుడా అని మొక్కినట్లు కేసీఆర్ రూలింగ్ చేశారని, తాము ఇప్పుడు రహదారుల మరమ్మత్తుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో 9 వేల కిలో మీటర్ల మేర రహదారులపై గుంతలు పూడుస్తామన్నారు. -
రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా తీర్చిదిద్దుతా: ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా(చెంపలు )అందంగా, మృదువుగా చేస్తానని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందిస్తూ.. ఆయన్ను మహిళా ద్వేషిగా అభివర్ణించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీని కోరారు. ఇలాంటి వారిని సమాజం నుంచి తరిమికొట్టాలని అన్నారు.‘దేశంలోని వివిధ ప్రాంతాలలో నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన నాయకులు స్త్రీలపై ద్వేషం కనబరుస్తున్నారు. మహిళలపై లింగవివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దాదాపు 40 సంవత్సరాల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తులు తమను తామునేతలుగా భావిస్తారు. కానీ ప్రజలు ఎన్నికల సమయంలో అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలి. వీరిని సమాజంలో అంగీకరించకూడదు.’ అని పేర్కొన్నారు.అటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై ధ్వజమెత్తారు. పదేళ్ల నుంచి ఆయన నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ’నరేష్ బల్యాన్ చేసిన మహిళా వ్యతిరేక ప్రకటనను ఖండిస్తే సరిపోదు. గత పదేళ్లుగా ఉత్తమ్ నగర్ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ఇన్నేళ్లు ఆయన నిద్రపోతున్నారా; రోడ్లను హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దుతాం" అంటున్నారు. మహిళలను వస్తువులుగా భావించే ఇలాంటి చౌకబారు ఆలోచనకు సమాజంలో స్థానం లేదు. మహిళా వ్యతిరేక ఆలోచనలు కలిగిన ఈ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాల అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు,.दिल्ली के उत्तम नगर से विधायक नरेश बाल्यान का कहना है कि “सड़कें हेमा मालिनी के गालों जैसी बना देंगे”! इस महिला विरोधी बात की जितनी निंदा करें वो कम है। ये आदमी पूरे दस साल सोता रहा है जिसके चलते उत्तम नगर की सड़कें टूटी फूटी पड़ी हैं! आज भी काम न करके, सिर्फ़ अपनी घटिया सोच का… pic.twitter.com/ObXRdrbj3e— Swati Maliwal (@SwatiJaiHind) November 4, 2024 -
తొలుత బాపూఘాట్ వరకే!
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలిదశలో బాపూఘాట్ ప్రాంతం వరకే పనులను పరిమితం చేయాలని భావిస్తోంది. నదీ తలంతోపాటు బఫర్ జోన్‌లోని నిర్మాణాల తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నగర శివార్లలోని బాపూఘాట్ వరకు పునరుజ్జీవం, సుందరీకరణ పనులు పూర్తిచేశాక.. దానిని నమూనాగా చూపి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మిగతా పనులు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. భూసేకరణ సమస్య లేకపోవడంతో.. వికారాబాద్ అడవుల్లో జన్మంచే మూసీ నది.. ఈసీ, మూసా అనే రెండు పాయలుగా ప్రవహిస్తూ వచి్చ, లంగర్‌హౌజ్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద సంగమిస్తుంది. ఇందులో ఈసీపై హిమాయత్‌సాగర్, మూసాపై ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల దిగువ నుంచి ఈసీ, మూసా నదుల సంగమం బాపూఘాట్ వరకు భూసేకరణ సమస్యలు పెద్దగా ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నది పాయల తీరప్రాంతం, బాపూఘాట్‌ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందుకు అనుగుణంగా విభిన్న ప్రణాళికలు, నమూనాలతో సీఎం అధ్యక్షతన మూసీ పునరుజ్జీవంపై త్వరలో జరిగే భేటీకి రావాల్సిందిగా ప్రాజెక్టు కన్సల్టెంట్లను ఆదేశించింది. నిజానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు స్థితిగతులపై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు, కన్సల్టెంట్ సంస్థ మెయిన్‌హార్ట్ కన్సార్షియం ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ‘బఫర్’ మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బఫర్ జోన్‌ను డిజైన్ చేయాలని సర్కారు భావిస్తోంది. భవిష్యత్తులో మూసీకి ఇరువైపులా రోడ్లు, వంతెనలు, భారీ కూడళ్లు, మెట్రో రైలు మార్గం వంటివి నిర్మించేందుకు వీలుగా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. బఫర్ జోన్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, రాళ్లు, వ్యర్థాలను తొలగించి సమతలం చేస్తారు.ప్రభుత్వ భూముల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ విభిన్న డిజైన్లలో పర్యాటకులను ఆకర్షించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అయితే.. బాపూఘాట్ సమీపంలో ఈసీ, మూసా నదుల సంగమం తీర ప్రాంతంలో రక్షణశాఖ భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలను రెవెన్యూ విభాగం ద్వారా సేకరించి.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బాపూఘాట్ ⇒ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూ ఘాట్ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా బాపూఘాట్ వద్ద స్కైవే, బ్రిడ్జితో కూడిన బరాజ్, పాదచారుల వంతెనను నిర్మించేలా నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యతను కన్సల్టెంట్‌కు అప్పగించారు. బాపూఘాట్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రతి బింబించేలా ఈ డిజైన్లు, ప్రణాళికలు ఉంటాయి.గుజరాత్‌లోని నర్మదానది వద్ద నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం తరహాలో బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. ఇక ఈసీ, మూసా సంగమ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని కన్సల్టెంట్‌ను ఆదేశించారు. సంగమ స్థలం వద్ద మహాప్రస్థానం, స్నాన ఘట్టాలతో ఘాట్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్‌కు గోదావరి జలాలు ⇒ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వర కు భారీ అభివృద్ధి ప్రణాళికల నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, సేకరించాల్సిన భూమిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేయాల్సి ఉంది. గోదావరి జలాలను హి మాయత్‌సాగర్ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు తరలించేందుకు కాలువ తవ్వాలా లేక టన్నె ల్ నిర్మించాలా? అన్న అంశాలను తేల్చే బా ధ్యతను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కు అప్పగించారు. ఈ నెల 24న జరిగిన సమావేశంలో వీటిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ మరో సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
-
తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
అమెరికా, పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యత పై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్-అట్లాంటిక్ తానా బృందం రహదారి పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా పచ్చదనాన్ని పరిరక్షించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. హ్యారిస్ బర్గ్ తానా టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు, పలువురు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా సమాజంతో మమేకమై సమాజ సేవ చేయాలనే సంకల్పం కలిగించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ కార్యక్రమం చేపట్టిందని మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు తెలిపారు. ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన హ్యారిస్ బర్గ్ తానా బృందానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.ఈ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు సమాజానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమం ప్రకృతి పట్ల చక్కటి అవగాహన కలిగించి, ప్రకృతిని, పచ్చదనాన్ని ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకున్నామని తెలిపారు. తానా ఆధ్వర్యంలో విద్యార్థులలో సేవా భావం పెంపొందించేలా సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఆకాంక్షించారు. -
అలాంటి వాళ్లకు అదే సరైన శిక్ష: గడ్కరీ
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు అని చురకలంటించారాయన. అలాగే.. గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్ మసాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలి అని సూచించారాయన. ఇది సోషల్ మీడియాకు ఎక్కడంతో సూపర్ ఐడియా కేంద్ర మంత్రిగారూ అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నేను మారిపోయాను అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని గడ్కరీ చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే గనుక ఆ రేపర్‌ను ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
రెండు గ్రామాల మధ్య రోడ్డు తవ్వేశారు
చిల్లకూరు : రెండు గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్డును టీడీపీ నేతలు తవ్వేయడంతో తీర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టు సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టు పనులు చేసే వారి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణం. తీర ప్రాంతంలోని వరగలి ప్రాంతంలో వెంకటాచలం మండలం నారికేళ్లపల్లి నుంచి వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జాతీయ రహదారి నుంచి పల్లెవానిదిబ్బ వరకు మరో కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు.అయితే ప్రభుత్వం మారాక స్థానిక టీడీపీ నాయకులు వరగలి ప్రాంతంలో పనులు చేసే కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సబ్ కాంట్రాక్టు కింద మట్టి, గ్రావెల్ తవ్వి తరలించే పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వరగలి – మన్నెగుంట గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంది. అయితే ఇదే మార్గంలో మరో కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలు పల్లెవానిదిబ్బ వరకూ వెళ్లాల్సి ఉంది. ఆ పనులు కూడా తమకే అప్పగించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో వారు అందుకు ఒప్పుకోలేదు.దీంతో టీడీపీ నాయకులు ఆ సంస్థకు చెందిన వాహనాలు చుట్టూ తిరిగి వచ్చేలా మన్నేగుంట – వరగలి మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేశారు. ప్రభుత్వ భూమిలోని ఈ రోడ్డుపై ఎన్నో ఏళ్లుగా రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దానిని తవ్వేయడంతో చుట్టూ తిరిగి మూడు కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానిక వీఆర్వో మునిబాబును వివరణ కోరగా సాగరమాల రహదారి పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారని అన్నారు. -
గమ్యం చేరే ‘దారి’ ఏది?
రోడ్డుమార్గం లేక.. సకాలంలో వైద్యం అందక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడకు చెందిన ఏర్పుల రామకృష్ణ (40) సకాలంలో వైద్యం అందక చనిపోయాడు. రెండు రోజులు కురిసిన వర్షాలకు డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆకేరు వరదతో ముల్కలపల్లి–ఖమ్మం, ముల్కలపల్లి–తిరుమలాయపాలెం మధ్య రోడ్లు కొట్టుకుపోయాయి. ఖమ్మం మార్గంలో ఆకేరువాగుపై బ్రిడ్జి డిస్క్ స్లాబ్‌లు ధ్వంసమయ్యాయి. ముల్కలపల్లి వైపు బ్రిడ్జి నుంచి కొంతమేర రోడ్డు, కొంతవరకు కోతకు గురైంది. తిరుమలాయపాలెం మార్గంలోనూ ఆకేరుపై నిర్మించిన మరో బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఉయ్యాలవాడ, ముల్కలపల్లిల నుంచి ఖమ్మంకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. ఆదివారం 11 గంటల ప్రాంతంలో ఉయ్యాలవాడలో రామకృష్ణ అపస్మారకస్థితికి చేరగా..ఆయన్ను చికిత్స నిమిత్తం ఖమ్మం తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలు మూసుకుపోయాయి. 108 అందుబాటులో ఉన్నా సకాలంలో చికిత్స అందక రామకృష్ణ సాయింత్రం 5.30 ప్రాంతంలో మృతిచెందాడు. వరదలతో దారులు మూసుకుపోవడంతో రామకృష్ణకు సకాలంలో వైద్యం అందక మృతి చెందాడని భార్య సంధ్య, కుమారులు సిద్ధు, రాంచరణ్‌లు కన్నీరు మున్నీరయ్యారు.అత్యవసరాలకు మూసుకుపోయిన ‘దారులు’ రోడ్లు, కల్వర్టులు తెగిపోయి నిలిచిన రాకపోకలుసాక్షిప్రతినిధి, వరంగల్ : వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రోడ్లకు గండ్లు పడడం, వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 30 మండలాల్లో అధిక వర్షం కురవగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనివే 15 మండలాలున్నాయి.మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు తెగిపోయి సుమారు 94 గ్రామాలకు మూడు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా 32 గ్రామాలకు రాకపోకల పునరుద్ధరణ జరుగుతోందని అధికారులు ప్రకటించారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం పరిస్థితి యథాస్థితికి చేరుతుందని నివేదికలో పేర్కొన్నారు. నాలుగు రోజులు ఇబ్బందులు పడ్డాం ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు బ్రిడ్జి వరదలకు మునిగిపోయింది. వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యన రహదారిపైకి గోదావరి వరద చేరడంతో నాలుగు రోజులు రాకపోకలు లేక ఇబ్బంది పడ్డం. చుట్టూ ఐదారూళ్లు తిరిగి మండల కేంద్రానికి పోవాల్సి వస్తోంది. – పాయం రామదాసు, గుమ్మడిదొడ్డి 82 ప్రాంతాల్లో తెగిపోయిన రోడ్లు మరమ్మతులకు రూ.256 కోట్లు అవసరం పూర్తిస్థాయిలో రోడ్ల పునరుద్ధరణకు రూ.1,200 కోట్లు కావాలని అంచనా సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. 587 ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 82 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా తెగిపోయాయి. మరో 559 ప్రాంతాల్లో రోడ్ల మీదుగా వరద ప్రవహిస్తోంది. 336 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభం కాగా, ఇంకా 111 ప్రాంతాల్లో ఇప్పటికీ వాహనాలు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. రాకపోకలు పునరుద్ధరించాలంటే వెంటనే రోడ్లకు మరమ్మతు చేపట్టాలి. ఇందుకు రూ.256 కోట్లు అవసరమవుతాయని రోడ్లు, భవనాల శాఖ తాజాగా అంచనా వేసింది. ఆ రోడ్లను పూర్వపు స్థితిలోకి తెచ్చేందుకు మాత్రం రూ.1,200 కోట్లు అవసరమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. వేగంగా రైలు మార్గం పునరుద్ధరణ పనులు కేసముద్రం సమీపంలో రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం ట్రాక్‌ను సిద్ధం చేసి రైళ్ల రాకపోకలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. మంగళవారం 108 రైళ్లతోపాటు మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసి.. 31 రైళ్లను మళ్లింపు దారుల్లో నడిపారు. బుధవారం 88 రైళ్లు, గురువారం 61 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రాక్‌ను పునరుద్ధరిస్తేనే వాటిని నడుపుతామని స్పష్టం చేశారు. 350 ఆర్టీసీ బస్సులను మంగళవారం కూడా రద్దు చేశారు. విజయవాడ దారిలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నందున, బస్సుల సంఖ్య తగ్గించి నడుపుతున్నారు. -
రోడ్డుపై లాంగ్ జంప్ చేసిన యముడు, చిత్రగుప్తుడు..!
-
Himachal: విరిగిపడిన కొండచరియలు.. 128 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 128 రహదారులు మూతపడ్డాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మండీ, బిలాస్పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లో వరద ముప్పు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. బలమైన గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి తాకిడి కారణంగా పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయని, బలహీనమైన నిర్మాణాలు, కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మండీలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్‌లో నాలుగు, హమీర్పూర్ జిల్లాలో ఒక రోడ్డును మూసివేశారు. అలాగే 44 విద్యుత్, 67 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది.మండీ జిల్లాలోని జోగిందర్‌నగర్‌లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మశాలలో 125.4, కటౌలాలో 112.3, భరారీలో 98.4, కందఘాట్లో 80, పాలంపూర్‌లో 78.2, పండోహ్లో 76, బైజ్నాథ్లో 75, కుఫ్రీలో 70.8, కుఫ్రిలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 445.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది. ఇప్పుడు 321.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
పల్లెకు 3.0 ధమాకా
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ 3.0 సర్కారు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నడుం బిగించింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల (ఫ్లాగ్షిప్)కు ఈసారి బడ్జెట్లో దండిగానే నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో గ్రామీణాభివృద్ధికి (మౌలిక సదుపాయాలతో సహా) రూ. 2,38,204 కోట్లు కేటాయించగా (సవరించిన అంచనా రూ. 2,38,984 కోట్లు).. ఈ సారి బడ్జెట్లో (2024–25) దీన్ని రూ. 2,65,808 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యంగా ఉపాధి హామీకి మళ్లీ భారీగా నిధులతో పాటు గ్రామీణ రోడ్ల కోసం నాలుగో దశ, అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం (పట్టణ, గ్రామీణ)పై ఫోకస్ చేయడం విశేషం!జోరుగా ‘ఉపాధి’..2024–25 కేటాయింపు: రూ.86,000 కోట్లు2023–24 కేటాయింపు: రూ.60,000 కోట్లు గతేడాది బడ్జెట్లో నిధుల కోతకు గురైన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ ఈజీఏ) మళ్లీ కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని నీరుగారుస్తుందన్న విమర్శల నేపథ్యంలో 2024–25 బడ్జెట్లో కేటాయింపులు 40 శాతం మేర పెరగడం విశేషం. అయితే, 2023–24 సవరించిన అంచనాల (రూ. 86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి.గ్రామీణ రోడ్లు.. నాలుగో దశ షురూ2024–25 కేటాయింపు:రూ.19,000 కోట్లు2023–24 కేటాయింపు: రూ.17,000 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను సీతారామన్ ప్రకటించారు. ‘పీఎంజీఎస్‌వై ఫేజ్–4లో భాగంగా 25,000 పల్లె ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానం చేయనున్నాం. ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. 2023–24 సవరించిన అంచనాలు రూ. 17,000 కోట్లతో పోలిస్తే, 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు దాదాపు 12 శాతం పెరగడం గమనార్హం. స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 8,15,072 కిలోమీటర్ల పొడవైన రోడ్లకు అనుమతులు మంజూరు కాగా, 7,51,163 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.సొంతింటికి దన్ను (పీఎంఏవై)2024–25 కేటాయింపులు: రూ.80,671 కోట్లు2023–24 కేటాయింపులు: రూ.54,103 కోట్లు (సవరించిన అంచనా)ఠిపేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి నిధులు భారీగా పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీన వర్గాలకు 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, 2023 మార్చి నాటికి 2.94 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ఈ స్కీమ్ కింద చేపట్టనున్నట్లు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో రెండు కోట్ల ఇళ్లను గ్రామాల్లో, కోటి ఇళ్లను పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పీఎంఏవై (అర్బన్) 2.0 స్కీమ్ కోసం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగా వడ్డీ రాయితీ, చౌక రుణాల రూపంలో రూ. 2.2 లక్షల కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. రుణ ఆధారిత సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కోసం ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేంద్రం కేటాయించింది. మొత్తం మీద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.30,170 కోట్లు దక్కాయి. 2023–24తో పోలిస్తే ఇది 20.19 శాతం ఎక్కువ.స్వచ్ఛ భారత్ మిషన్..2024–25 కేటాయింపు: రూ. 12,192 కోట్లు2023–24 కేటాయింపు: రూ.9,550 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వ్యర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) పథకానికి ఈ బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్ అంచనా (రూ.5,000 కోట్లు)తో పోలిస్తే అదే స్థాయిలో ఉన్నప్పటికీ, సవరించిన అంచనా (రూ.2,550 కోట్లు)తో పోలిస్తే నిధులు రెట్టింపయ్యాయి. ఇక స్వచ్ఛభారత్ (గ్రామీణ) స్కీమ్‌కు రూ.7,192 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనా (రూ.7,000 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.తాగునీటికి కాస్త పెంపు.. 2024–25 కేటాయింపు: రూ.69,927 కోట్లు2023–24 కేటాయింపు: రూ.69,846 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. 2024 నాటికి దీన్ని సాధించాలనేది కేంద్రం లక్ష్యం. కాగా, దేశంలోని మొత్తం 19.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటివరకు 14.22 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా.పట్టణ పేదల ఇళ్లకు.. 2.2 లక్షల కోట్లు» సరసమైన రేట్లకు రుణాలు.. వడ్డీ రాయితీ» మొత్తం రూ.10 లక్షల కోట్లతో పీఎంఏవై అర్బన్ 2.0» రెంటల్ హౌసింగ్ మార్కెట్లకు ప్రోత్సాహం» పారిశ్రామిక కార్మికుల కోసం అద్దె ఇళ్లుమహిళలు కొనే ఆస్తులపై సుంకం తగ్గింపు!న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ పథకం కింద వచ్చే ఐదేళ్లలో కోటి మంది పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణాల నిమిత్తం రూ.2.2 లక్షల కోట్ల సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. సరసమైన రేట్లతో రుణాలు అందించేందుకు వీలుగా వడ్డీ రాయితీని కూడా ప్రతిపాదించింది. మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) కింద 3 కోట్ల అదనపు గృహాలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ మేరకు నిధుల కేటాయింపు జరుపుతున్నామని చెప్పారు. కేంద్రసాయం రూ.2.2 లక్షల కోట్లతో కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో పీఎంఏవై అర్బన్ 2.0 పథకాన్ని చేపడతామని తెలిపారు. రెంటల్ హౌసింగ్ మార్కెట్లను ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్రం విధానాలను రూపొందిస్తుందని చెప్పారు. అద్దె ఇళ్ల లభ్యతను పెంచడంతో పాటు నాణ్యత, పారదర్శకతకు అవసరమైన విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతులతో అద్దె గృహాలు నిర్మిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని చేపడతామన్నారు. రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ తగ్గించాలిమహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకాన్ని మరింత తగ్గించే అంశంపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పట్టణాభివృద్ధి పథకాల్లో దీనినొక తప్పనిసరి అంశంగా చేయనున్నట్లు చెప్పారు. అధిక స్టాంప్ డ్యూటీ వసూలు చేసే రాష్ట్రాలు వాటిని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆస్తుల కొనుగోలు లావాదేవీలపై రాష్ట్రాలు విధించే పన్నును స్టాంప్ డ్యూటీగా పేర్కొంటారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో దీనిని చెల్లించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు. ఇలావుండగా పన్ను ప్రయోజనాల విషయంలో ఆధార్ నంబర్‌కు బదులుగా ఆధార్ నమోదు ఐడీ వినియోగాన్ని నిలిపివేయాలని సీతారామన్ ప్రతిపాదించారు. పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికదేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల సృజనాత్మకతో కూడిన పునర్ అభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు (గ్రోత్ హబ్‌లు)గా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ పథకాల వినియోగంతో నగర చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధిస్తామని చెప్పారు. -
యూపీలో వరదలు.. జలదిగ్బంధంలో వందల గ్రామాలు
భారీ వర్షాలకు తోడు నేపాల్ నుంచి వస్తున్న వరదనీరు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోని బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, బారాబంకి, సీతాపూర్ పరిధిలోని దాదాపు 250 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అలాగే లఖింపూర్ ఖేరీలోని 150 గ్రామాలు, షాజహాన్‌పూర్‌లోని 30, బదౌన్‌లోని 70, బరేలీలోని 70, పిలిభిత్‌లోని 222 గ్రామాలకు చెందిన ప్రజలు వరద నీటిలోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదల కారణంగా పూర్వాంచల్‌లోని బల్లియాలో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. వరుసగా రెండవ రోజు ఢిల్లీ-లక్నో హైవేపై గర్రా నది వరద నీరు నిలిచిపోవడంతో ఈ మార్గంలో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మొరాదాబాద్- లక్నో మధ్య 22 రైళ్లను నెమ్మదిగా నడుపుతున్నారు. షాజహాన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి వరద నీరు చేరడంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.షాజహాన్‌పూర్ నగర శివార్లలోని హౌసింగ్ డెవలప్మెంట్ కాలనీతో సహా ఇతర లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 10 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం 225 మందిని రక్షించింది. ఎస్ఎస్ కళాశాల లైబ్రరీలోని వందల పుస్తకాలు నీట మునిగాయి. ఖేరీ, షాజహాన్‌పూర్, బరేలీకి చెందిన ఆరుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం 11 గంటలకు షాజహాన్‌పూర్ హైవేపైకి వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
మోదీ గారూ రోడ్లు కిధర్ హై
సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక సామాన్యులు ప్రశ్నించే పద్ధతులు మారాయి. ఏకంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక గ్రామీణ మహిళవిడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ‘మధ్యప్రదేశ్ నుంచి 29 సీట్లు ఇచ్చాం. మరి మా రోడ్ల సంగతేంటి?’ అని అడుగుతూ డొక్కు రోడ్ల మీద ఆమె ప్రయాణం చేస్తూ తీసిన వీడియో మోడి వరకు చేరేలా ఉంది.పూర్వం ప్రధానికి కార్డు ముక్క రాసి పడేసేవారు జనం. ఇవాళ ఒక వీడియో చేసి వదులుతున్నారు. కార్డు రాస్తే ఎవరికీ తెలిసేది కాదు. కాని వీడియో లక్షలాది మంది కంట పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లా అటవీ ప్రాంతంతో, బొగ్గు గనుల నిక్షేపాలతో ఉంటుంది. కాని వెనుకబాటుతనం కూడా ఉంది. ‘మేం అడవుల్లో ఉంటాం. అయితే మాకు రోడ్లు అక్కర్లేదా మోదీ గారూ’ అని శివాని సాహు అనే మహిళ మోదీని ప్రశ్నించింది. ‘మధ్యప్రదేశ్ మీకు 29 సీట్లు ఇచ్చింది. ఇప్పుడైనా రోడ్లు వేయండి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. మేము ఎం.ఎల్.ఏ, ఎం.పి, కలెక్టర్ అందరినీ కలిశాం. కాని ఏం ప్రయోజనం లేదు. వానొస్తే మా పరిస్థితి అధ్వానం. బస్సు మలుపు తిరగలేదు. పిల్లలు నడవడం కూడా వీలు కావడం లేదు. రోడ్లు వేయండి మోదీ గారూ’ అని ఆమె వేడుకుంది. అంతే కాదు ‘ ఈ వీడియో మోదీ గారికి చేరేవరకు షేర్ చేయండి’ అని కోరింది. దాంతో అందరూ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వచ్చాక సిధి జిల్లాలో పురోభివృద్ధి గురించి చర్చ నడుస్తోంది. అన్నట్టు ఇది నాటి మహా విదూషకుడు బీర్బల్ జన్మస్థలం. ఆయన మళ్లీ పుడితే ఇలాంటి ప్రభుత్వ పనితీరు చూసి ఎన్ని పరిహాసాలు ఆడేవాడో. మరెన్ని వ్యంగ్యాలు పోయేవాడో. వాతలు వేసేవాడో. -
Right to Walk.. ఇంకెప్పుడు..?
గ్రేటర్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న పాలకులు నగరం మధ్యలో ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి పనులపై దృష్టి పెడుతున్నా, కాలినడకన వెళ్లే వారికి అవసరమైన మేరకు ఫుట్‌పాత్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ)ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రధాన రహదారుల్లో సాఫీగా కొద్ది దూరం కూడా నడవలేక.. ఒకవైపు నుంచి మరో వైపు రోడ్డు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. చాలాచోట్ల ఫుట్‌పాత్‌లు లేక, ఉన్న ఫుట్‌పాత్‌లు చాలా ప్రాంతాల్లో ఆక్రమణకు గురికావడంతో పాదచారులు విధిలేని పరిస్థితు ల్లో రోడ్లపైనే నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కిక్కిరిసిన జంక్షన్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించేవారు కూడా రయ్ మంటూ దూసుకుపోయే వాహనాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఎఫ్‌ఓబీలు ఉన్నా చాలాచోట్ల లిఫ్ట్‌ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి.ఈ కారణంగా పాదచారులు ఎఫ్‌ఓబీలు ఉపయోగించకుండా ట్రాఫిక్ మధ్యలోనే రోడ్లు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 123 మంది మృత్యువాత పడగా అనేకమంది గాయాల పాలవడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కి.మీ పొడవైన రోడ్లు ఉండగా ఫుట్‌పాత్‌లు కేవలం 817 కిలోమీటర్లకే పరిమితం కావడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.10% కూడా లేని ఫుట్పాత్లుజీహెచ్ఎంసీ పరిధిలో బీటీ, సీసీ, ఇతరత్రా రోడ్లన్నీ కలిపి మొత్తం 9,013 కిలోమీటర్ల రహదారులుండగా, వాటిల్లో ఫుట్‌పాత్‌లు లేదా వాక్‌వేలు కలిపి కనీసం 10 శాతం కూడా లేవు. ఉన్న ఫుట్‌పాత్‌లు దుకాణదారులు తమ అమ్మకపు సామగ్రిని ఉంచడానికి, వాహనాల పార్కింగ్‌కు, టీకొట్లు, తోçపుడు బండ్లు, ఇతరత్రా చిన్న వ్యాపారాల నిర్వహణకు పనికి వస్తున్నాయే తప్ప ప్రజలు నడవడానికి అనువుగా ఉండటం లేదు. ప్రభుత్వ సంస్థలు సైతం పబ్లిక్ టాయ్లెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, రూ.5 భోజన కేంద్రాలు వంటివి ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా కొందరు ఇసుక, ఇటుక, కంకర వంటి వాటిని సైతం ఫుట్‌పాత్‌లపైనే ఉంచి వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని రోడ్లకు ఫుట్పాత్లుండాలిఅన్ని రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి, అవి ప్రజలు నడిచేందుకు మాత్రమే ఉపయోగపడేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జీహెచ్ఎంసీలో ఈవీడీఎం విభాగం ప్రారంభమైన తొలినాళ్లలో ఆరేళ్ల క్రితం ‘రైట్ టూ వాక్’ పేరిట 20 వేలకు పైగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించింది. చిన్నాచితకా వ్యాపారులను వాటిపై నుంచి తరలించారు. తొలగింపు సమయంలో ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తామని పేర్కొన్నారు. కానీ కొత్తగా నిర్మించలేదు సరికదా.. కొన్నాళ్లకే ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ వ్యాపారాలు వెలిశాయి.జీహెచ్ఎంసీలో రోడ్లు.. పుట్‌పాత్‌లు ఇలా (కి.మీ.లలో)⇒ మొత్తం రోడ్లు 9,013⇒ సీసీ రోడ్లు 6,167⇒ బీటీరోడ్లు 2,846⇒ ఫుట్‌పాత్‌లు 817ఫుట్‌పాత్‌ల పరిస్థితి అలా ఉంచితే.. ఒక వైపు నుంచి మరో వైపు రోడ్డు దాటి వెళ్లాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బిజీ రోడ్లలో ఆగకుండా దూసుకొచ్చే వాహనాలతో ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ వచ్చే వాహనాల వైపు చేతిని అడ్డంగా పెడుతూ బతుకుజీవుడా అనుకుంటూ రోడ్లు దాటుతున్నవారు నిత్యం కనిపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.ఎవరో ఒకరు తోడులేందే వారు రోడ్డు దాటలేని పరిస్థితి ఉంటోంది. పాదచారులు రోడ్లు దాటేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, పెలికాన్ సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కోట్ల రూపాయలు ఖర్చవడం తప్ప అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. నగరంలో ఉన్న అనేక ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. పాదచారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కొంత తోడవుతోంది. చాలాచోట్ల లిఫ్ట్‌లు పని చేయడం లేదు. కొన్నిచోట్ల పనిచేస్తున్నా పాదచారులు వాటిని ఉపయోగించడం లేదు. అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకు ఉపయోగపడుతున్నదీ, లేనిదీ పరిశీలించకుండానే కొత్తవి నిర్మించేందుకు పూనుకుంటోంది. ఉన్నవి ఉపయోగపడేలా చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు.ఎన్ని ఉన్నా ఏం లాభం?జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నేషనల్ హైవే, టీజీఐఐసీ సంస్థలు ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు పాతవి 23 ఉండగా, కొత్తగా పనులు చేపట్టిన వాటిల్లో 12 పూర్తయ్యాయి. మరో ఐదు పురోగతిలో ఉన్నాయి. ఎఫ్‌ఓబీలు ఎక్కువ ఎత్తులో ఉండటంతో చాలామంది వాటిని వినియోగించుకోవడం లేదు. వయోవృద్ధులు శారీరక సమస్యలున్న వారు అసలు ఎక్కలేక పోతున్నారు. ఎక్కగలిగే శక్తి ఉన్నవారు సైతం వాటిని ఎక్కి నడిచి దిగే కంటే ఎలాగోలా రోడ్డు దాటేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటివి ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఏర్పాటు చేయడంతో ఊరుకోకుండా ప్రజలు వాటిని వినియోగించేలా చూడాలని, ఎలా వినియోగించాలో తెలియని వారి కోసం నిర్వహణ సిబ్బందిని నియమించాలని అంటున్నారు.ఫుట్‌పాత్‌లు ఉండాల్సింది ఇలా (మీటర్లలో..)⇒ దుకాణాల ముందు 3.5 4.5⇒ బస్టాప్‌లు 3.00⇒ వాణిజ్య ప్రాంతాల్లో.. 4.00⇒ ఇతర ప్రాంతాల్లో.. 2.5(నగరంలో 0.60 మీటర్ల నుంచి 3 మీటర్ల లోపే ఉన్నాయి. ఎక్కువగా మీటరు నుంచి మీటరున్నర వరకే ఉన్నాయి) రోడ్డుపైకి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలికోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎఫ్‌ఓబీలను ప్రజలు వినియోగించుకోవాలి. కొందరు రోడ్డు పైనుంచే వెళ్తూ ప్రమా దకరమైనప్పటికీ సెంట్రల్ మీడియన్లను సైతం ఎక్కి దిగుతున్నారు. ఈ పరిస్థితి నివారణకు బ్రిడ్జికి అటూ ఇటూ కనీసం వంద మీటర్ల వరకు ప్రజలు రోడ్డు మీదకు వెళ్లేందుకు వీల్లేకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. – ఆర్. శ్రీధర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, రిటైర్డ్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీఆ వ్యవస్థతో బ్రిడ్జీలు ఏర్పాటు చేయొచ్చుఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఫుట్‌పాత్‌లు లేని ప్రాంతాల్లో రోడ్డు చివరి లైన్లో టూ టయర్ సిస్టమ్‌తో బ్రిడ్జిలాంటి ఏర్పాటు చేయవచ్చు. 2 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే ఈ బ్రిడ్జి పైనుంచి పాదచారులు వెళ్లేలా, టూ, త్రీవీలర్లు కిందనుంచి వెళ్లేలా నిర్మాణాలు చేయొచ్చు. అలాగే రోడ్డు దాటేందుకు జాకింగ్ కాన్సెప్ట్‌తో మీటర్ రేడియస్‌తో టన్నెల్ లాంటి నిర్మాణం చేయొచ్చు. గతంలో ఓ పోలీసు ఉన్నతాధికారి హయాంలో ఇలాంటి ఆలోచనలు జరిగాయి. ఆయన మారడంతో అది అటకెక్కింది. – ప్రొఫెసర్ లక్ష్మణరావు, జేఎన్టీయూఎక్కువ ఎత్తు అవసరం లేదునగరంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు చాలా ఎత్తులో ఉన్నందువల్ల ఎవరూ ఎక్కడం లేదు. కాబట్టి ఎత్తు కాస్త తగ్గించాలి. మెట్రో స్టేషన్లలో మాదిరిగా లిఫ్టులు, ఎక్సలేటర్లు ఉంటే అవసరమైన వారు వినియోగిస్తారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఎఫ్ఓబీ ఉన్నప్పటికీ లిఫ్టు పనిచేయక ఎక్కడం లేదు. పాదచారులు ఎక్కువగా రోడ్లు దాటే ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్క్రాసింగ్కు వీలుగా సిగ్నల్ లైట్లు పెట్టడం మాత్రమే కాకుండా వాహనాలు కచ్చితంగా ఆగేలా చూడాలి. పాదచారుల క్రాసింగ్ ఏరియా అని తెలిసేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలి. పాదచారులకు సహాయకులుగా పోలీసులు లేదా ఇతర సిబ్బందిని నియమించాలి. దీనివల్ల కొందరికి ఉపాధి కూడా లభిస్తుంది. – డా. దొంతి నరసింహారెడ్డి, సామాజికవేత్తపేరుకే పెలికాన్ సిగ్నల్స్బిజీ రోడ్డును దాటాలనుకునే పాదచారుల కోసం నగరంలోని 70కి పైగా ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాదచారి ఎవరైనా రోడ్డు దాటాలనుకున్నప్పుడు పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో ఉండే స్విచ్‌ను నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు రెడ్ సిగ్నల్ పడి కొన్ని సెకన్ల తర్వాత రోడ్డుకిరువైపులా రాకపోకలు సాగించే వాహనాలు నిర్ణీత సమయం ఆగిపోతాయి. అప్పుడు పాదచారులు రోడ్డు దాటాల్సి ఉంటుంది.ఒక్కసారి బటన్ నొక్కిన తర్వాత.. పదే పదే నొక్కినా పని చేయకుండా కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఎవరైనా కూడా వెంట వెంటనే నొక్కడానికి అవకాశం ఉండదన్న మాట. అయితే బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వద్ద, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ పెలికాన్ సిగ్నల్స్ కేవలం అలంకారంగానే ఉన్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్స్ కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదు. అసలు వీటిని ఎలా వినియోగించాలో కూడా ప్రజలకు తెలియదని, అధికారులు ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.లిఫ్ట్ ఉన్నా వేస్ట్ ఎర్రగడ్డ ప్రధాన రహదారిలోని మోడల్ కాలనీ కమాన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సరిగా నిర్వహించడం లేదు. లిఫ్ట్ సౌకర్యం ఉన్నా అది ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలియదు. నాలాంటి సీనియర్ సిటిజన్లు మెట్లు ఎక్కి వెళ్లలేకపోతున్నాం. ఎఫ్ఓబీ సమీపంలో చెత్తాచెదారం నిండి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. –జేఎస్టీ శాయి, మోడల్ కాలనీ, సనత్‌నగర్.నిబంధనల పాటింపు తప్పనిసరి చేయాలిపాదచారులకు సైతం కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం పెడస్ట్రియన్ క్రాసింగ్స్‌లో, నిర్దేశించిన విధంగానే రోడ్డు దాటాలి. అలా చేయకపోవడం ఉల్లంఘన కిందికే వస్తుంది. నేను గతంలో చెన్నై వెళ్లిన ప్పుడు ఓ విషయం గమనించా. అప్పట్లో అక్కడి సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో పాదచారులు రోడ్డు దాటడానికి వీలుగా అండర్ పాస్ ఏర్పాటు చేశారు.అయితే తొలినాళ్లలో దీన్ని వినియోగించకుండా రోడ్డు పైనుంచే దాటుతుండ టంతో ప్రమాదాలు కొన సాగాయి. దీంతో ఆ అండర్ పాస్ వద్ద ఓ కాని స్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా అండర్ పాస్ కాకుండా రోడ్డు పైనుంచి క్రాస్ చేస్తే కానిస్టేబుల్ పట్టుకునేవారు. అక్కడి కక్కడే రూ.5 జరిమానా విధించి వసూలు చేసే వారు. దీంతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అండర్ పాస్ వినియోగం పెరిగింది. ఇలాంటి విధానాలు హైదారాబాద్‌లోనూ అమల్లోకి తీసుకురావాలి. – కేవీకే రెడ్డి, ట్రాఫిక్ నిపుణుడునగరంలో ఎఫ్ఓబీలున్న ప్రాంతాలుపాతవి: అనుటెక్స్ (సైనిక్‌పురి), హెచ్‌పీ పెట్రోల్‌బంక్ (రామంతాపూర్), నేషనల్ పోలీస్ అకాడమీ (రాజేంద్రనగర్), గగన్‌పహాడ్, మహవీర్ హాస్పిటల్, ఎన్ఎండీసీ (మాసాబ్‌ట్యాంక్), ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్‌బండ్), గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ముఫకంజా కాలేజ్ (బంజారాహిల్స్), భారతీయ విద్యాభవన్ స్కూల్ (ఫిల్మ్‌నగర్), వెల్స్ ఫార్గో (ఖాజాగూడ), ఐఎస్బీ, ఐటీసీ కోహినూర్, మియాపూర్ క్రాస్‌రోడ్స్, ఆల్విన్ క్రాస్‌రోడ్స్ (మదీనగూడ), మలేసియన్ టౌన్షిప్, కేపీహెచ్‌బీ–4 ఫేజ్, కళామందిర్ (కేపీహెచ్‌బీ కాలనీ), ఐడీపీఎల్, మెట్టుగూడ, రైల్‌నిలయం, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ (బేగంపేట).కొత్తవి: బాలానగర్, చెన్నెయ్ షాపింగ్ మాల్ (మదీనగూడ), మియాపూర్, ఈఎస్ఐ హాస్పిటల్(ఎర్రగడ్డ), హైదరాబాద్ సెంట్రల్ మాల్, నేరేడ్మెట్ బస్టాప్, సెయింట్ ఆన్స్ స్కూల్(సికింద్రాబాద్), తార్నాక, స్వప్న థియేటర్ (రాజేంద్రనగర్), ఒమర్ హోటల్, రంగభుజంగ థియేటర్, మూసాపేట క్రాస్‌రోడ్స్. -
మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ హైవే విస్తరణ పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు మీద ఉన్న 930 మర్రి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీలొకేట్ చేసే 330 చెట్లకు సంబంధించి నిర్మాణ సంస్థతో వెంటనే తాను మాట్లాడతానని మిగతావాటిì తరలింపు పనులను ఎన్హెచ్ఏఐ వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.శుక్రవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘న్యాక్’లో ఎన్హెచ్ఏఐ అధికారులతో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై సాకులు వెతక్కుండా ఇకనైనా పనులు మొదలుపెట్టాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆ రహదారి విస్తరణ పనులకు కొత్త టెండర్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశం మేరకు విజయవాడ హైవే విస్తరణ పనుల టెండర్లు రద్దు చేసి వచ్చేనెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబరులో పనులు మొదలుపెట్టాలని కోమటిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఉప్పల్–ఘట్కేసర్ వంతెన పనులకు సంబంధించి పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని కూడా సూచించారు. ఆర్మూరు–మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా, ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రీజినల్ రింగురోడ్డు పూర్తయితే డిస్నీల్యాండ్ సంస్థలు ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడికి ముందుకొస్తాయని, పారిశ్రామిక క్లస్టర్లు, ట్రాన్స్‌పోర్టు హబ్‌లు ఏర్పడతాయని మంత్రి వారికి వివరించారు. జూలైలో రాష్ట్రానికి ఉన్నతాధికారుల బృందం జూలైలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి జాతీయ రహదారు ల విభాగం ఉన్నతాధికారుల బృందం వస్తున్నందున, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఎల్బీనగర్–మల్కాపూర్ మధ్య మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న జాతీయ రహదారి మలుపుపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాక ప్రత్యేక కార్యదర్శి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, ఎన్హెచ్ఏఐ ఆర్ఓ రజాక్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్ఓ కుషా్వతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.