
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికే పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసింది. దాదాపు లక్ష కోట్లతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో వేల కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం జరిగింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు చేసింది.
దేశంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రూ.లక్షల కోట్లతో.. వేల కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో సింహభాగం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోనే జరిగాయి. మహారాష్ట్రలో రూ.లక్ష కోట్లకుపైనే ఖర్చు చేశారు. ఇదే సమయంలో యూపీలో రూ.95 వేలకోట్లకుపైనే చేశారు. దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలోనూ రూ.50వేల కోట్లకుపైగా ఖర్చే చేయలేదు. రోడ్ల పొడవు పరంగా.. మహారాష్ట్ర నెంబర్‌వన్ కాగా, రెండో స్థానం రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఏపీలో గడిచిన ఐదేళ్లలో నిర్మించిన జాతీయ రహదారుల పొడవు 2,686 కి.మీ. తెలంగాణలో నిర్మించిన రహదారులు 1,488 కి.మీలుగా ఉంది. 2019–20 నుంచి 2023–24 వరకు ఏపీలో జాతీయ రహదారుల కోసం భూసేకరణ సహా జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు చేసిన వ్యయం రూ.35,186 కోట్లు. తెలంగాణలో ఇది రూ.19,152 కోట్లుగా ఉంది.

Comments
Please login to add a commentAdd a comment