Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం | Mallikarjun Kharge: China encroached on our land but PM Modi is silent | Sakshi
Sakshi News home page

Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం

Published Sun, May 26 2024 5:22 AM | Last Updated on Sun, May 26 2024 5:22 AM

Mallikarjun Kharge: China encroached on our land but PM Modi is silent

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఎద్దేవా 

సిమ్లా: చైనా భారత భూబాగాన్ని ఆక్రమించి ఇళ్లు, రోడ్డు నిర్మిస్తోందని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నా రు. 

హిమాచల్‌ప్రదేశ్‌లోని రొహ్రులో శనివారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘56 అంగుళాల ఛాతి ఎటుపోయింద’ని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోందన్నా రు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే దాని ద్వారా అందిన ప్రజాస్వామ్యం, హక్కులను లాగేసుకుంటారని అన్నారు. మోదీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ముకాస్తుందని, కాంగ్రెస్‌ పేదల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement