Houses construction
-
పేదింటికి కేంద్రం చేయూత రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచటంతో చాలా గ్రామాలు ‘పట్టణ పరిధి’లోకి చేరటంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపు కానుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలుగా ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.1.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మూడొంతులకు పైగా గ్రామ పంచాయతీలు పట్టణాభివృద్ధి సంస్థల జాబితాలోకి వెళ్లాయి. గతంలో 9 పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలు ఉండగా, వాటి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 28కు పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరనున్నాయి. దీంతో వీటికి పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందుతాయి. రెండో దశలోనూ పాత యూనిట్ కాస్ట్లే..చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ఇది రాష్ట్ర ఖజానాపై అతిపెద్ద భారం మోపనుంది. పీఎంఏవై పథకం మొదటి దశ కాలపరిమితి తీరిపోవటంతో, కేంద్రం రెండో దశకు శ్రీకారం చుడుతోంది.ఇందులో పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను రూ.2.25 లక్షలకు పెంచుతారనే ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కేంద్రం ఆ యూనిట్ కాస్ట్‌ను పెంచకుండా, గతంలో ఉన్న రూ.1.5 లక్షలే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ కూడా రూ.72 వేలుగానే ఉంది. గ్రామీణ యూనిట్లకు పట్టణ కాస్ట్ దక్కేలా..కేంద్రం నుంచి గ్రామీణ యూనిట్ కాస్ట్ రూ.72 వేలు మాత్రమే అందితే, ఆ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కొంతైనా ఊరట దక్కేలా వ్యూహరచన చేసిన ప్రభుత్వం.. సింహ భాగం గ్రామాలకు పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ (రూ.1.5 లక్షలు) దక్కేలా పట్ణణాభివృద్ధి సంస్థల సంఖ్యను పెంచేసింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు ‘పట్టణ’ పరిధిలోకి రానున్నాయి. తద్వారా వాటికి ‘పట్టణ’ యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం గృహనిర్మాణ పథకానికే పరిమితం కాకుండా, కొన్ని ఇతర పథకాలకు కూడా లబ్ధి చేకూర్చనుండటం గమనార్హం.సాయంపై స్పష్టతకు మరింత సమయంరాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికే రాష్ట్రంలో పథకాల ప్రకటన జరిగిపోయింది. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం పథకాలను సమీక్షించుకుంటూ మార్పు చేర్పులు చేసేసరికి మరింత ఆలస్యం అయింది. ఫలితంగా కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందో రాష్ట్రానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా పట్టణాభివృద్ధి సంస్థల పెంపు నేపథ్యంలో, ఎన్ని పట్టణ ప్రాంత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుందో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.అంటే తాజా నిర్ణయం మేరకు పట్టణ ప్రాంత ఇళ్ల సంఖ్యను తేల్చాల్సి ఉంది. ఆ మేరకు త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి వివరాలు క్రోడీకరించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఎన్ని యూనిట్లను మంజూరు చేస్తుందో ఆ తర్వాతే తేలుతుంది. అప్పుడే కేంద్రం నుంచి వచ్చే సాయంపై స్పష్టత వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఆ సాయం భారీగా పెరుగుతుందని మాత్రం తేలిపోయింది. -
Modi 3.0: 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద (పీఎంఏవై) దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయమందించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ మంత్రివర్గం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైంది. మోదీ అధికారిక నివాసం ‘7, లోక్ కల్యాణ్ మార్గ్’లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సహా అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. అర్హులైన కుటుంబాల గృహ నిర్మాణ అవసరాలను తీర్చాలని భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేద కుటుంబాలకు కనీస సదుపాయాలతో కూడిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం చేసే నిమిత్తం 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎంఏవై పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని కింద గత పదేళ్లలో 4.21 కోట్ల మంది అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. -
Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
సిమ్లా: చైనా భారత భూబాగాన్ని ఆక్రమించి ఇళ్లు, రోడ్డు నిర్మిస్తోందని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నా రు. హిమాచల్‌ప్రదేశ్‌లోని రొహ్రులో శనివారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘56 అంగుళాల ఛాతి ఎటుపోయింద’ని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్నా రు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే దాని ద్వారా అందిన ప్రజాస్వామ్యం, హక్కులను లాగేసుకుంటారని అన్నారు. మోదీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ముకాస్తుందని, కాంగ్రెస్ పేదల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. -
Fact Check: పేదల ఇళ్లపై కుళ్లు రాతలేలా?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఒకేసారి 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలను అప్పగించడం... వాటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేస్తుండడం పెత్తందారు రామోజీరావుకు మింగుడు పడటంలేదు. నిరుపేదలు సొంతింట్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తన వంకర రాతలతో బురదజల్లి అలిసిపోయాడు. ఇక మిగిలిందల్లా ఆ ఇళ్ల స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుండడాన్ని కూడా మాయాజాలమంటూ తప్పుడు రోత రాతలు రాస్తోంది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తుండడాన్ని, ఆ ఇళ్లను ఒక విలువైన ఆస్తిగా పేదలకు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పు పడుతూ ప్రజలను, నిరుపేదలు ఆందోళన చెందేలా ప్రయత్నాలు చేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం కింద వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 ఊళ్లను కొత్తగా నిర్మించడం వారి కళ్లకు కనిపించడంలేదు. ఒక్కో కాలనీ ఒక్కో ఊరుగా మారుతున్నా ఆ పత్రికకు కనిపించదు. ఒక్కో పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ఇంటి రూపంలో రూ.20 లక్షల వరకూ విలువైన స్థిరాస్తి సమకూరుస్తుంటే ఈనాడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. పేదలకు ఇంత పెద్దమేలు జరుగుతుండడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుండడం.. అదే సమయంలో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రామోజీరావు గంగవెర్రిలెత్తిపోతున్నారు. దీంతో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సేవలపైనా నిత్యం వక్రీకరించడమే విధిగా పెట్టుకున్నారు. జియో ట్యాగ్ ఉంటే ప్లాట్లు గుర్తించడం కష్టమెలా అవుతుంది? ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారనడం పచ్చి అబద్ధం. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి సరిహద్దు రాళ్లు వేశారు. లబ్ధిదారులను వారి ప్లాట్లలో ఫోటోలు తీసుకుని జియోట్యాగ్ కూడా చేశారు. ప్లాటులో నిలబడి ఫోటో దిగడం ద్వారా లబ్ధిదారులకు వారి ప్లాటు ఎక్కడ ఉందో తెలుసు. ’పచ్చ‘పాతంతో చూసే ఈనాడుకు ఇవేమీ కనిపించవు. కేటాయించిన ప్లాట్‌లో ఫోటో దిగి జియోట్యాగ్ చేయడమంటే వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసనే కదా? ఇది పేదలను బురిడీ కొట్టించే పన్నాగం ఎలా అవుతుంది..? గుంటూరు జిల్లాలో పేరేచర్ల లేఅవుట్లో 9,219 ఇళ్లను మంజూరు చేశారు. ఇంకా 6,152 ఇళ్ళకు సంబంధించి రెండవ విడత గృహ నిర్మాణ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో 1,230 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 486 రూఫ్ స్థాయిలోనూ, మిగతావి బేస్మెంట్ స్థాయిలోనూ ఉన్నాయి. మూడవ ఆప్షన్ కింద ఇళ్ల నిర్మాణానికి పదిమంది కాంట్రాక్టర్లను నియమించి, మూడు ఇటుక తయారీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో ప్రతిరోజు సుమారు వెయ్యి మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ వాస్తవాలను చూడని ఈనాడు ప్రభుత్వంపై ఆక్రోశంతో విషం చిమ్ముతూ తన దిగజారుడుతనానికి ప్రదర్శించుకుంటోంది. రిజిస్ట్రేషన్ చేయడం మాయాజాలమా? పేదలందరికీ స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే ఆయా రిజిస్ట్రేషన్లను చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డేటా బేస్‌లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టీఫైడ్ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫోర్జరీ చేస్తారని గానీ, ట్యాంపర్ చేస్తారని గాని భయం ఉండదు. అమ్మే సమయంలో ఆ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేదలకు లబ్ధి చేకూరే రిజిస్ట్రేషన్ మాయాజాలం అవుతుందా? ఇప్పటికే 8 లక్షల మంది లబ్ధిదారులు తమ పేరున పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి దశలో కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో మొదటి దశ ఒకటవ లేఅవుట్లో 53 ఎకరాల 33 సెంట్లు 345 మంది లబ్ధిదారులకు, రెండో లేఅవుట్లో 29 ఎకరాల 66 సెంట్లు భూమిలో 777 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేట్ అధీనంలో ఉన్న భూమిని రూ.43.93 కోట్లతో కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని విజయవాడ మున్సిపల్ అధికారులకు లేఅవుట్ అభివృద్ధి కోసం అప్పగించారు. -
తెలంగాణ: సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేనివారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇప్పు డు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ.. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి, అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇళ్ల డిజైన్లపై కసరత్తు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్‌లో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్‌లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి, అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి.. 2004– 2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది. అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. -
జగనన్న ప్రభుత్వం.. పేద అక్కచెల్లెమ్మల కలకు శ్రీకారం (ఫొటోలు)
-
కృష్ణాయపాలెంకు పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
ఇకపై అమరావతి మనందరి అమరావతి: సీఎం జగన్
Updates.. వెంకటపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ వెంకటపాలెం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ►నిజంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా ఎప్పటికీ నిలిచిపోయే రోజు అవుతుంది. ►పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నోఅవరోధాలు అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో జరుగుతోంది. ►ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిలిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక దత్తపుత్రుడు. ఇతరత్రా చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు. ►వీరంతా చివరి వరకు ఒక పేద వాడికి ఒక ఇళ్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ►ఈరోజుటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు. ►వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలివ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ►ఆ తర్వాత పేదలకు ఇళ్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ►ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఇళ్లు రాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లిన పరిస్థితులు.. ►ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో చూస్తున్నాం. ►చంద్రబాబు, గజదొంగ ముఠా, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. ►మూడేళ్లపాటు వీళ్లు వేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరఫున మీ బిడ్డ వీళ్లందరితో పోరాటం చేస్తూ వచ్చాడు. ►చివరికి దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులు మంచికే ఉంటాయి కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని ఇళ్ల పట్టాలివ్వడం జరిగింది. ►ఆ తర్వాత కూడా వీరి బుద్ధి మారలేదు. ►ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి ఇళ్లు నిర్మాణం కూడా అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. ►కేంద్ర ప్రభుత్వంలో వీరు ఎక్కని గడప లేదు. దిగని గడప లేదు. కలవని కేంద్ర సెక్రటరీ కూడా లేడు. ►ఇంత మంది కలిసి చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ►దేవుడి దయతో అన్నింటినీ అధిగమించి అడుగులు ముందుకు వేశాం. ►మీ ఇంటి కలల సాకారానికి ఈరోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తున్నాం. ►ప్రతి విషయంలోనూ కూడా మన పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోంది. ►పేదవాడికి ఏ మంచి జరిగినా అడ్డుకొనే రాక్షస బుద్ధితో మనం ఈరోజు యుద్ధం చేస్తున్నాం. ►పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నప్పుడు పెత్తందార్లంతా అడ్డు తగిలే ప్రయత్నంచేశారు. ►పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లిష్ మీడియం బడులకు పంపిస్తారు. ►మన పిల్లలు మాత్రం తెలుగు బడులకు పోవాలి అంటారు. ►తెలుగు భాష ఏమవుతుందని చెప్పి ముసలి కన్నీరు కారుస్తారు. ►ప్రతి అడుగులోనూ వారిది ఇదే ఆలోచన. ►మీ బిడ్డ పేదల కోసం బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా మనందరి ప్రభుత్వం నేరుగా 2.25 లక్షల కోట్లు ఖాతాల్లోకి పంపిస్తుంటే దాన్ని కూడా అడ్డుకొనే కార్యక్రమం.. ►ఇలా మీ బిడ్డ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పెత్తందార్లంతా గగ్గోలు పెడతారు. ►ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పట్లో చంద్రబాబు హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువ. ►మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతున్నాడు. ఆ రోజు ఆ గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? ►ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు. ►ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు, నా అక్కాచెల్లెళ్లకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకొనేందుకు కోర్టులకు వెళ్లారు. ►పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాల్స్ వస్తుందట.. కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించిన చరిత్ర వీళ్లది. ►ఇలాంటి పెత్తందారులు, ఈరోజు ఇలాంటి వ్యవస్థతో మనం యుద్దం చేస్తున్నాం. ►ఇలాంటి దుర్మార్గమైన మనషుల్ని, మనస్తత్వాల్ని, వాదనల్ని, రాతల్ని, టీవీ డిబేట్లను, రాజకీయ పార్టీల్ని మానసిక, నైతిక దివాళాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా? ►ఏ సమాజమైనా, ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుంది? నిన్నటికంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటారు. ►ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. ►ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం అంటారు. అమానుషత్వం అంటారు. రాక్షసత్వం అంటారు. ►ఇంత రాక్షసత్వం ఒకవైపు చూపిస్తున్నారు. అన్యాయం చేస్తున్నారు. ►పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు. ►పొద్దున్నే ఈనాడు పేపర్లో చూశా. వాళ్లు రాతలు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. ►చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా నుంచి మనుషులు రావొచ్చట. సింగపూర్ నుంచి రావొచ్చట. ►కానీ ఇదే అమరావతిలో మాత్రం ఇళ్ల స్థలాలు చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇవ్వకూడదట అని ఈనాడు రాస్తాడు. ►ఇంతకన్నా దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావాలు నిజంగా ఎక్కడైనా ఉంటాయా? ►పేద వర్గాల మీద పేద కులాలమీద పెత్తందార్ల దోపిడీలను సహించి, భరించే కాలం పోయింది. ►ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. ►అటువంటి మార్పుకు సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఇక్కడి నుంచి పునాదిరాయి వేస్తున్నా. ►ఇక నుంచి ఈ అమరావతి మనందరి అమరావతి కాబోతోందని తెలియజేస్తున్నా. ►ఇదే ప్రాంతంలో అక్షరాలా 50793 మంది నా అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ►ఇక్కడి పేదలంతా కూడా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని అడిగారు. ►మంగళగిరి, తాడికొండ పరిధిలో 1400 ఎకరాల్లో 25 లేఅవుట్లలో అభివృద్ది చేసి నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. ►అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవలింగ్, ప్లాట్ల సరిహద్దురాళ్లు పాతాం. 56 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ►ప్రతి లేఅవుట్ వద్దకు వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి, ఆ ఇంటి స్థలంలో ఫొటోలు దిగించి బయో ట్యాగింగ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ►సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.70 లక్షలుఖర్చు చేస్తున్నాం. ►50793 ఇళ్లకు సంబంధించి 1370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ►అవసరమైన నీటి సరఫరా కోసం 32 కోట్లుతో టెండర్లు ఖరారయ్యాయి. ►విద్యుత్ కనెక్షన్ కోసం 326 కోట్లు, అప్రోచ్ రోడ్లు కోసం 8 కోట్లుతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. ►సీఆర్డీఏ పరిధిలో నిర్మించే లేఅవుట్లలో అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్‌మాల్స్, పార్కులు వస్తాయి. ►రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.70 లక్షలతో కట్టడం మొదలుపెట్టాం. ►22 లక్షల ఇళ్లకు సంబంధించిన కట్టడాలు వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ►ఇవి పూర్తయితే ఆ ఇంటి స్థలం విలువ, ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి విలువ 5 లక్షల నుంచి 15 లక్షలు పలుకుతుంది. ►సీఆర్డీఏ ప్రాంతంలో ఇక్కడి విలువ గజం కనీసం 15 వేలు. ►నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలం విలువే రూ.7.50 లక్షలు. ►మరో 2.70 లక్షలు పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నాం. ►మౌలిక వసతుల కోసం అదనంగా ప్రతి ఇంటి మీద మరో లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. ►పూర్తయ్యే సరికి ఇక్కడ ఇంటి విలువ అక్కచెల్లెమ్మల చేతిలో 12 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతుంది. ►ఇక్కడే 24 కౌంటర్లు ఏర్పాటు చేశాం. మిమ్మల్నందరినీ మీమీ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు మ్యాప్ చేశాం. ►ఇదే కౌంటర్లలో ఇక్కడి నుంచి మీ ఇంటి కట్టడానికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ►మీ అందరి చేతుల్లోఇళ్ల మంజూరు పత్రాలు పెట్టి చిక్కటి చిరునవ్వులతో ఇంటికి పంపిస్తాం. ►మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికిదేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ►ఇలాంటి మంచి చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరిగించే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ► లబ్ధిదారులు మాట్లాడుతూ.. రాజధానిలో మాకు ఇళ్లు ఇస్తే అభివృద్ధి జరదన్నారు. ఇప్పుడు రాజధాని నడిబొడ్డున మాకు ఇల్లు వచ్చింది. జగనన్న సంక్షేమ పథకాలతో మేం సంతోషంగా బ్రతుకుతున్నాం. మేం ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే.. మీరు ప్రతీరోజూ మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఇవాళ మా జీవితంలో ఓ పండుగ రోజు. మా సొంతింటి కల ► మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పెత్తందారుల కోటలు బద్దలు కొట్టాం. రాజధానిలో పేదలు నివసించకూడదా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్. మా సొంతింటి కల నెరవేర్చిన జగనన్నకు రుణపడి ఉంటాం. ► మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పెత్తందారుల కోటలు బద్దలు కొట్టాం. రాజధానిలో పేదలు నివసించకూడదా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్. ► పవన్ కల్యాణ్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు. పెళ్లాలను మార్చినట్టు పవన్ పార్టీలను మార్చారు. ► సీఎం జగన్ అందరికీ అన్నం పెడుతున్నారు. కుల, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారు. చంద్రబాబు గాలికొదిలేస్తే లోకేశ్ ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నాడు. సీఎం జగన్‌తో పోటీపడే స్థాయి లోకేశ్‌కు లేదు. ఢిల్లీ కోటను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్. 50వేల మందికి ఇళ్లు ఇస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. ► ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి సీఎం జగన్. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేదలందరికీ ధైర్యం, భరోసా సీఎం జగన్. పేదలను కోటీశ్వరులుగా చేయగలిగే దమ్మున్న వ్యక్తీ సీఎం జగన్. పేదల పక్షాన నిలబడిన వ్యక్తీ ముఖ్యమంత్రి జగన్. పెత్తందారుల కుట్రలను భగ్నం చేశారు. గతంలో 600 హామీలిచ్చి ఏదీ నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. ►లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం జగన్ ► మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులు.. జ్యోతి ప్రజ్వలన ►వెంకటపాలెం చేరుకున్న సీఎం జగన్.. ►వెంకటపాలెం బహిరంగ సభలో లబ్దిదారులకు మంజూరు పట్టాలు అందజేయనున్న సీఎం జగన్ ►వెంకటపాలెం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ ►కృష్ణాయపాలెం నుంచి వెంకటపాలెం బయల్దేరిన సీఎం జగన్ ► మోడల్ హౌజ్‌ను పరిశీలించిన సీఎం జగన్. ► లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన సీఎం జగన్. ► కృష్ణాయపాలెం: పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం జగన్.. శంకుస్థాపన ► వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన సీఎం జగన్. ► కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్ ►కృష్ణాయపాలెం చేరుకున్న సీఎం జగన్ ►గుంటూరు జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్ ► శంకుస్థాపన పండుగకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలివచ్చారు. ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఇవాళ ఏపీలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదన్నదే చంద్రబాబు కుట్ర.రైతుల ముసుగులో చంద్రబాబు కోర్టుకెళ్లాడు. సీఎం జగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.పేదలకు మేలు చేయాలన్న సీఎం సంకల్పం గొప్పది. ప్రజల మేలు కోసం సీఎం జగన్ ఎంతదూరమైనా వెళ్తారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పేదల సొంతిటి కల నెరవేరింది. ఇది పేదవాడి విజయం. పెత్తందార్ల ఓటమికి నిదర్శనం.రాజధానిలో పేదలు ఉండకూడదన్నదే చంద్రబాబు కుట్ర. ► ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం ఓ చారిత్రక నిర్ణయం. చంద్రబాబు హయాంలో అమరావతి పేరిట డిజైన్లు మాత్రమే చూశాం. 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సీఎం జగన్‌కే సాధ్యమైంది. ► ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. రాజధానిలో పేదల కల నెరవేరే రోజు వచ్చింది. సీఆర్డీఏ పరిధిలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణం ఒక చరిత్ర. సాక్షి, అమరావతి: అమరావతిలో నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ► సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ► ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ► విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. ► లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ► ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. ► ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది. -
అద్దె ఇళ్లలో ఉంటున్న వారికీ అండగా సీఎం జగన్
-
మా ఇంటికి వెళ్లేదెప్పుడు?
గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని జనం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వేల ఇళ్లు నిర్మాణం పూర్తయినా పేదల చేతికి రావడం లేదు. మరెన్నో ఇళ్లు వివిధ దశల్లో పనులు ఆగిపోయి బోసిపోయి కనిపిస్తున్నాయి. గ్రేటర్లో కలిసి ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో 62 వేలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని వెంటనే పంపిణీ చేయాలని, తమ సొంతింటి కలను తీర్చాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు 2015లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ.. త్వరలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఉంటుందని ప్రకటించింది. కానీ ఇది అమల్లోకి రాలేదు. ఇప్పటివరకు 62 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంతో పంపిణీ కాలేదు. దరఖాస్తుల అప్లోడింగ్ సగమే.. మొత్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. 50 వేల ఇళ్లను పంపిణీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ దాదాపు రెండేళ్ల క్రితం పేర్కొన్నారు. పంపిణీకి అర్హులైన పేదలను గుర్తించేందుకు ఆరు నెలల కింద క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. 7 లక్షల మందికిపైగా ‘డబుల్’ ఇళ్ల కోసం దర ఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు మూడున్నర లక్షల మంది వివరాలనే సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేశారు. కరోనా సమయంలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఫోన్ నంబర్లు మారడం తదితర కారణాలతో వారికి సమాచారం అందలేదు. అర్హుల ఎంపిక ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారనే ప్రచారంతో చాలా మంది ఆశపడినా నిరాశే మిగిలింది. నిలిచిన పనులు.. సామగ్రి దొంగల పాలు పలుచోట్ల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయని, పాత ధరలతో ఇప్పుడు పనులు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో ఇళ్లకు కాపలా సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు, శానిటేషన్ సామగ్రితోపాటు వివిధ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి చోరీకి గురయ్యాయి. చివరికి ఇళ్ల గోడలు తొలిచి ఇటుకలనూ దొంగిలించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పటికే దాదాపు రూ.3కోట్ల విలువైన సామగ్రి దొంగలపాలు అయిందని.. లబ్ధిదారులకు కేటాయింపులు, గృహ ప్రవేశాలు జరిగితేగానీ మొత్తం ఏయే సామగ్రి పోయిందో, ఎంత విలువో తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లను భారీ అపార్ట్మెంట్ల తరహాలో నిర్మిస్తున్నారు. వీటిలో మూడు రకాలున్నాయి. ►సెల్లార్+ స్టిల్ట్+ 9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలతో భవన సముదాయం. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు ►స్టిల్ట్+ 5అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు. ►లిఫ్టులు లేకుండా గ్రౌండ్+3 అంతస్తులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు. ►అన్ని రకాల్లోనూ 569 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. ఒక హాల్, 2 బెడ్రూంలు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లు ఉండేలా నిర్మిస్తున్నారు. లక్ష ఇళ్లు ఇలా.. ►మొత్తం లక్ష ఇళ్లకుగాను కోర్టు కేసులు, వివాదాలతో 2,659 ఇళ్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►మిగతా వాటిలో 88,443 ఇళ్లను 27 ఖాళీ ప్రదేశాల్లో చేపట్టారు. వీటిలో 62,516 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతావాటి పనులు 70–80 శాతం వరకు పూర్తయ్యాయి. ►నగరంలోని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో పేదల పాత ఇళ్లను కూల్చివేసి వాటిస్థానంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇలా 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటిని డిగ్నిటీ హౌసింగ్ కాలనీలుగా పిలుస్తున్నారు. ఇప్పటివరకు 26 డిగ్నిటీ హౌసింగ్ కాలనీల్లో 5,266 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని మాత్రం పంపిణీ చేశారు. మరో రూ. 2847 కోట్లు అవసరం ►గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలతో కలిపి మొత్తం అంచనా వ్యయం: రూ.9,715 కోట్లు ►ఇందులో హౌసింగ్ విభాగం నుంచి అందిన నిధులు: రూ.6,868 కోట్లు ►పెండింగ్‌లో ఉన్న బిల్లులు: రూ. 150 కోట్లు ►ఇళ్లు పూర్తయ్యేందుకు ఇంకా కావాల్సిన నిధులు: రూ. 2,847 కోట్లు ►కేంద్రం నుంచి పీఎంఏవై ద్వారా రూ. 1,500 కోట్లు మంజూరైనా.. లబ్ధిదారుల ఎంపిక జరగనందున మొత్తం నిధులు రాలేదు. ఇప్పటివరకు దాదాపు రూ. 750 కోట్లు అందాయి. పంపిణీ యోచనలో ప్రభుత్వం ఉంది ‘‘కోవిడ్ కారణంగా అన్నిరంగాలు దెబ్బతినడం, ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలం పనులు నెమ్మదించాయి. 62 వేల ఇళ్లు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. స్థానికత గుర్తింపు కోసం నియోజకవర్గ ఓటరు, ఆధార్ జిరాక్సులను జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయిలో అధికారులు సేకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. ఇళ్ల కోసం ఏడు లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. 3.50 లక్షల మంది డేటా అప్లోడ్ అయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సమాచారం నిమిత్తం పత్రికా ప్రకటనలు జారీ చేయడంతోపాటు జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మూడు నెలలకోమారు 30 వేల కుటుంబాలకు చొప్పున ఇళ్లను పంపిణీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఉత్తర్వులు రాగానే ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. – కె.సురేశ్‌కుమార్, ఓఎస్డీ (హౌసింగ్), జీహెచ్ఎంసీ ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం డబుల్ బెడ్రూం ఇంటి కోసం ఐదేండ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆరు నెలల కింద ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తే ఓటరు ఐడీకార్డు, ఆధార్‌కార్డు వివరాలిచ్చాం. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తారని ఆశిస్తున్నాం. – పద్మ, బాపునగర్, చిక్కడపల్లి కళ్లు కాయలు కాస్తున్నాయ్.. అదిగో ఇదిగో డబుల్ బెడ్రూం ఇళ్లొస్తున్నాయ్ అంటూ ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. నాలుగేళ్ల కింద దరఖాస్తులిచ్చినం. ఇప్పటివరకు ఏమీలేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. మా ఆయన కూలి పనికి వెళతాడు. కరోనా వచ్చినప్పటి నుంచి మరిన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికోసం ఎదురు చూసీ చూసీ కళ్లు కాయలు కాస్తున్నాయ్. – ప్రశాంతి, ఉప్పల్ -
డబుల్ అను‘గృహమే’దీ?
ఇదీ.. సంక్షేమ రంగంలోనే మేలిమలుపుగా దేశవ్యాప్త చర్చకు దారితీసిన ‘డబుల్ బెడ్రూం ఇళ్ల’పథకం ప్రస్తుత పరిస్థితి. ‘సింగిల్ కాదు.. డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం.. అదీ పూర్తి ప్రభుత్వ ఖర్చుతోనే!’.. అని ప్రభుత్వం చెప్పడంతో నిరుపేదలు తమ ఊహలకు రెక్కలు తొడిగారు. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ (ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్) కాలనీ తరహాలోనే తమకూ కొత్త జీవితం వస్తుందని ఆశపడ్డారు. ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల నిర్మాణానికి వ్యూహరచన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. కానీ, ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు మాత్రం 2.76 లక్షలే. వీటిలో నిర్మాణం పూర్తయింది సగం కంటే తక్కువే. అదీగాక ఇళ్లు పూర్తయినా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది ఇంకా తక్కువే. వీటికితోడు అన్ని సదుపాయాలు కల్పించిన ప్రాంతాల్లోనూ ఇళ్లు పంపిణీ చేయకపోవడం శోచనీయం. ఇన్ని అడ్డంకులు దాటుకుని తీరా కేటాయింపులు చేసే సమయంలో రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేస్తుండటంతో నిరుపేదల ఆశలు అడియాసలవుతున్నాయి. ఫలితంగా సమున్నత పథక లక్ష్యం పక్కదారి పట్టే పరిస్థితి కనిపిస్తోంది. – శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి దొంగలతో.. మళ్లీ మొదటికి.. మెదక్ జిల్లా రామాయంపేటలో చాలాకాలం క్రితమే 300 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ ఉన్న ఇళ్ల కంటే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే నిధుల కొరత ఉండటంతో మౌలిక సదుపాయాల కల్పనలోనూ జాప్యం చేశారు. ఈలోగా ఆ ఇళ్లలో దొంగలు పడి విద్యుత్ వైర్లను పూర్తిగా ఎత్తుకుపోయారు. దీంతో అన్ని ఇళ్లకు మళ్లీ వైరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఈ మొత్తాన్ని ఎవరు భరించాలో స్పష్టత లేక అధికారులు తల పట్టుకుంటున్నారు. మరుగుదొడ్డిలో.. ఏడాదిగా.. మెదక్ జిల్లా రామాయంపేటలో డబుల్ బెడ్రూం ఇల్లు కోసం రామలక్ష్మి ఎదురుచూస్తోంది. మూడేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకుంది కూడా. అయితే ఆమెకు ఎక్కడా నిలువ నీడ లేక ఇప్పుడు కొడుకుతో కలిసి ఆర్ అండ్ బీ శాఖ వదిలేసిన అతిథి గృహంలోని మరుగుదొడ్డిలో నివాసం ఉంటోంది. భర్త చనిపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో ఏడాది కాలంగా ఈ మరుగుదొడ్డిలో కాలం వెల్లదీస్తోంది. ఉన్న ఇల్లు ఖాళీ చేసి.. మేం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. మేం ఇతరుల స్థలంలో రేకులతో షెడ్డు వేసుకుని చలికి వణుకుతూ, వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్నాం. ఉన్న ఇళ్లు పోయి, డబుల్ బెడ్రూం రాక అవస్థలు పడుతున్నాం. –లాల్కోట రాజు, చౌదరిపల్లి, మహబూబ్‌నగర్ ప్రతి చోటా రాజకీయ స్వార్థం వద్దు ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా అర్హులకు చేరేలా పకడ్బందీ మెకానిజం ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్రంలో అలా కనిపించడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలోనూ నిజమైన నిరుపేదలను గుర్తించే బాధ్యతను అధికారులకు అప్పగించాలి. కానీ రాజకీయ సిఫారసు ఉంటేనే డబుల్ బెడ్రూం అయినా, మరోటి అయినా వచ్చే పరిస్థితి ఉంది. చాలాచోట్ల ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయడం లేదు. ప్రతి పనిలో రాజకీయ స్వార్థం చూసుకోవడం వ్యవస్థకు మంచిదికాదు. –జస్టిస్ కె. చంద్రకుమార్ కొత్త ఇళ్లు.. పాత పడిపోయినా.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 720 ఇళ్ల నిర్మాణం ఎప్పుడో పూర్తయింది. మౌలిక సదుపాయాలకు నిధులు లేక పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. ఈలోగా ఇంటి అద్దాలు, ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. ఆశావహుల సంఖ్య వేలల్లో, ఇళ్లు మాత్రం వందల్లో ఉండటంతో ఆలస్యమవుతోందని చెబుతున్నారు. నిలువ నీడ కోసం.. నిలువెల్లా కనులై.. కామారెడ్డిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఈ నిరుపేద దంపతులు నిలువెల్లా కనులతో ఎదురుచూస్తున్నారు. ఊరూరా తిరుగుతూ చిరు వ్యాపారం చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు అండ్రాసి సాయవ్వ, రంగయ్యలు. ఇప్పుడు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు వీళ్లు వెళ్లని ఆఫీసు, కలవని అధికారి లేడంటే అతిశయోక్తి కాదు. తొలి అడుగు పడిందిలా.. 2015 తొలినాళ్లలో సికింద్రాబాద్ బోయిగూడలో ఐడీహెచ్ కాలనీతోపాటు మరో నాలుగు మురికివాడల్లో ఇరుకుగదులు, కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇళ్లలో ఉంటున్న వారిని ఒప్పించి రూ.37 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టు పద్ధతిన 33 బ్లాకుల్లో ప్రతి ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వంటగది రెండు బెడ్రూంలను కేవలం 11 నెలల్లో నిర్మించి 396 మందికి అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7.90 లక్షలు, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు ఇతర సదుపాయాల కోసం రూ.1.33 లక్షల చొప్పున ఖర్చు చేసి యాభై ఏళ్ల మురికివాడను క్లాస్ కాలనీగా తీర్చిదిద్దారు. జీహెచ్ఎంసీ చొరవతో చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రాష్ట్రమంతటా డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం 2015 నవంబర్‌లో ప్రకటించింది. పేదలను వదిలి.. నాయకులకు.. మహబూబ్‌నగర్‌లో ఏటా నీటమునిగే బస్తీల్లో శిథిలావస్థకు చేరిన పేదల కోసం దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. అయితే ఇందులో ఇప్పటికే 100 ఇళ్లను ముఖ్యనాయకుల సిఫారసుల మేరకు కేటాయించారు. మిగిలిన ఇళ్లను వార్డు, ఇతర ముఖ్యుల సూచన మేరకు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కేటాయింపుల కోసం భారీగా డబ్బులు వసూలు చేయడం, కొందరిని అరెస్ట్ చేయడం, మంత్రి పీఏ కుమారుడి ఆత్మహత్య లాంటి ఘటనలతో ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఫలితంగా అవన్నీ ఇప్పుడు పిచ్చిమెక్కలతో నిండిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో మౌలిక సదుపాయాల పనులు నిలిపేశారు. -
పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే తొలినుంచి మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో 73,496 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు 63,517 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇందులో 52,386 ఇళ్లు (82 శాతం) పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. శంకుస్థాపన చేసిన 67,437 ఇళ్లలో 42,964 (64 శాతం) ఇళ్లు, 70,221 ఇళ్లలో 42,554 (61 శాతం) ఇళ్లు పునాది, ఆపై దశల నిర్మాణంతో అన్నమయ్య, విజయనగరం జిల్లాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1.35 లక్షల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. వీటిలో 63,389 ఇళ్లకు శంకుస్థాపన చేయగా 9,043 ఇళ్లు పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలో చివరిస్థానంలో ఉంది. న్యాయపరమైన చిక్కులు వీడటంతో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న 1.24 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అనుమతులు లభించాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు ఇటీవల ప్రారంభం కావడం విశాఖ చివరిస్థానంలో ఉండటానికి ప్రధాన కారణం. పుంజుకున్న నిర్మాణాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం రెండుదశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు. మిగిలిన 18.63 లక్షల ఇళ్లకుగాను 15.15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో 8.70 లక్షల ఇళ్లు పునాది ముందుదశలో, 2.85 లక్షల ఇళ్లు పునాది, 73,622 ఇళ్లు రూఫ్ లెవల్, 1.05 లక్షల ఇళ్లు ఆర్సీ దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,79,263 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇందులో 95 వేలకుపైగా ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు. హౌసింగ్ డే రోజు సచివాలయ సిబ్బంది నుంచి కలెక్టర్ వరకు లేఅవుట్ల సందర్శన పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తొలినుంచి ప్రత్యేకదృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి శనివారాన్ని హౌసింగ్ డేగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో శనివారం కలెక్టర్లు, జేసీలు, డివిజన్, మండలస్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది లేఅవుట్లను సందర్శిస్తున్నారు. అధికారులు తాము లేఅవుట్లను సందర్శించిన ఫొటోలను గృహనిర్మాణ సంస్థ రూపొందించిన హౌసింగ్ డే యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేఅవుట్లలో తమదృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను యాప్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో వచ్చిన సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 19న 961 లేఅవుట్లను 5,548 మంది మండల స్థాయి అధికారులు, 3,051 మంది సచివాలయాల స్థాయి అధికారులు సందర్శించారు. రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా ఆయా జిల్లాలకు రాష్ట్రస్థాయి అధికారులం వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్లు సందర్శించాల్సి ఉంటుంది. లేఅవుట్లో సందర్శించినట్టుగా ఫొటోలను హౌసింగ్ డే యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించాం. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ -
నిర్దేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గూడు లేని లక్షలాది మంది నిరుపేదలకు గృహ యోగం కల్పించాలనే గొప్ప సంకల్పంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ఈ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఇప్పటి వరకు 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, 17.77 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేసినట్టు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు. వైఎస్సార్– జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వసతుల కల్పనకు ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం చేశామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నారంటే.. నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ పథకం కోసం రూ.5,655 కోట్లు ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సమీక్షించాలి. లేఅవుట్లలో పర్యటించాలి. ఇలా చేయడం ద్వారా మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకోవచ్చు. ► లేఅవుట్లను సందర్శించినట్టుగా అధికారులు ఫొటోలను హౌసింగ్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ప్రతి శనివారం హౌసింగ్ డే గా నిర్వహిస్తున్నారు. ఈ ఒరవడిని అలాగే కొనసాగించాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. హౌసింగ్ డే రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లేఅవుట్లకు వెళ్లాలి. వీటితో పాటు పేదలకు ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్న ఆప్షన్–3 ఇళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. నాణ్యతలో రాజీపడొద్దు ► ఇళ్ల నిర్మాణ నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు. ప్రతి దశలోనూ నాణ్యత నిర్ధారణ పరీక్షలు చేపట్టండి. నాణ్యత ప్రమాణాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటిస్తూ ముందుకు వెళ్లండి. వార్డు, గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను గృహ నిర్మాణ పథకం కోసం విస్తృతంగా వాడుకోవాలి. నాణ్యత ప్రమాణాలు పాటించే అంశంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం ఉండాలి. ► లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. అనంతరం మిగిలిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ముందుకు వెళ్లాలి. ఈ క్రమంలో లేఅవుట్ల వారీగా ప్రాధాన్యత పనులు గుర్తించండి. వాటిని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయండి. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల సాకారం
బాపట్ల ప్యాడిసన్‌పేటలో 50 ఎకరాల కుపైగా విస్తీర్ణంలో 1,865 ప్లాట్లతో ఏర్పాటైన వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ అది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అందమైన ఇంటిని కట్టుకున్న పి.సుకన్య కుటుంబం ఇటీవలే గృహ ప్రవేశం కూడా చేసింది. కత్తిపూడి – ఒంగోలు హైవే పక్కనే ఉండటంతో ఇక్కడ భూముల ధరలు చుక్కల్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న ఆమె భర్త జీతం పిల్లల చదువులకే చాలక ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వం ఆమెకు ఉచితంగా ఇంటిని అందచేయడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తమ ఇంటికి ఆడుకునేందుకు స్నేహితులు వస్తున్నారని ఆమె కుమారుడు ఆనందంగా చెప్పాడు. సాక్షి, అమరావతి: అద్దె ఇళ్లలో ఏళ్ల తరబడి అవస్థలు పడ్డ అక్కచెల్లెమ్మలకు రూ.లక్షల విలువైన స్థిరాస్తి ఉచితంగా సమకూరుతోంది. పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలిచ్చి గృహాలను కూడా నిర్మిస్తుండటంతో అద్దె ఇళ్ల కష్టాలకు శాశ్వతంగా తెరపడుతోంది. విలువైన ప్రాంతాల్లో కలల సౌధాలను ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శరవేగంగా సాకారం చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. దేశంలోనే తొలిసారిగా 31 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలను అందచేసి గృహ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. మొదటి దశలో రూ.28,084 కోట్లతో 15,60,227 ఇళ్ల నిర్మాణం చేపట్టగా వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోపక్క సొంతిల్లు లేని పట్టణ పేదలు సగర్వంగా జీవించేలా అన్ని వసతులతో దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్లను ప్రభుత్వం సమకూరుస్తోంది. మూడేళ్లలో రూ.5,646.18 కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా ఇటీవల మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఉచితంగా రిజిస్ట్రేషన్లను సైతం చేస్తోంది. గత మూడేళ్లలో 1,13,324 టిడ్కో ఇళ్లు పూర్తికాగా మరో 63 వేలకు పైగా యూనిట్ల పనులు 75శాతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో కలల సౌధాలు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన బాపట్లలో ప్యాడిసన్‌పేట లే అవుట్‌కు అర కి.మీ దూరంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏర్పాటు కానుంది. ఎన్‌హెచ్ 216 విస్తరణ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్లలో సెంటు స్థలం రూ.7 లక్షల వరకూ పలుకుతోంది. బాపట్ల పరిధిలోనే మూలపాలెం వద్ద 1,054 ప్లాట్లు, వెస్ట్ బాపట్లలో 658 ప్లాట్లతో మరో రెండు వైఎస్సార్ జగనన్న లేఅవుట్లు ఉన్నాయి. ఇవి జమ్ములపాలెం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బాపట్ల మెడికల్ కళాశాలకు 2 కి.మీ.లోపే ఉంటాయి. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షల పైమాటే. విలువైన ప్రాంతాల్లో స్థలాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పొదుపు సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇప్పిస్తోంది. డిసెంబర్ నాటికి అన్నీ అందించేలా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1.43 లక్షలకుపైగా టిడ్కో ఇళ్లను నిరుపేదలకు ఒక్క రూపాయికే అందించి రిజిస్ట్రేషన్ సైతం ఉచితంగానే చేసిచ్చారు. 365, 430 చ.అడుగుల ఇళ్లను 50 శాతం సబ్సిడీకే అందిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై మరో రూ.4,250 కోట్లు అదనపు భారం పడుతున్నా వెనుకాడలేదు. డిసెంబర్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. 30 ఏళ్లు గుడిసెలోనే.. పూరిగుడిసెలో 30 ఏళ్లు గడిపాం. ఎండాకాలం అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయాం. మా దుస్థితి చూసి బంధువులు కూడా వచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ కష్టాల నుంచి విముక్తి కల్పించింది. నేడు మాకంటూ ఓ సొంత ఇల్లు ఉంది. – క్రిష్ణమ్మ, శెట్టిపల్లె, చిత్తూరు జిల్లా రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిచ్చారు మాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. గతంలో రూ.2.55 లక్షలు కట్టమన్నారు. జగన్ బాబు వచ్చాక ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. ఇక్కడ అన్ని వసతులున్నాయి. – అట్ల విజయలక్ష్మి, నెల్లూరు అదే ఇల్లు ఉచితంగా.. గత ప్రభుత్వ హయాంలో 300 చ.అ టిడ్కో ఇంటికి రూ.2.65 లక్షలు కట్టమన్నారు. జగనన్న వచ్చాక అదే ఇంటిని రూపాయికే ఇవ్వడంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు. అన్ని వసతులు కల్పించారు. – కాకుమాను వరలక్ష్మి, శ్రీకాకుళం అర్హులందరికీ ఇళ్లు స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నిలువ నీడ లేని పేదలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని సమకూర్చటాన్ని సీఎం జగన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. – జోగి రమేశ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి -
జూన్‌లో 1.34 లక్షల టిడ్కో ఇళ్లు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు పురపాలక, పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బుధవారం సచివాలయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులపై ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సర్కారు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎన్నికల సమయంలో హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం పది శాతం పనులు కూడా చేయలేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల పేరుతో రూ.3,082 కోట్ల అప్పులు మిగిల్చిందన్నా రు. ఆ అప్పులను తీరుస్తూనే రూ.4, 287 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ పూర్తి సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వివరించారు. భారం పడినా మాట ప్రకారం.. సబ్సిడీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల దాదాపు రూ.10 వేల కోట్లకుపైగా భారం పడుతున్నా మాట ప్రకా రం అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 1.34 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, డిసెంబర్ ఆఖరుకు 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 30 వేల ఇళ్ల చొ ప్పున పూర్తి చేసి అందిస్తామన్నారు. వచ్చే నె లలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్లు్ల కేటాయిస్తామని మంత్రి తెలిపారు. -
ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం
చరిత్ర ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం వల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు అవసరం. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల ఉపాధి లభిస్తుంది. వృత్తి నైపుణ్య కార్మికులకు అదనంగా మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతగానో దోహద పడతాయి. రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు సొంతం చేసి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి, నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశాం. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో దశల వారీగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. తొలి దశలో 10,067 కా>లనీల్లో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశాం. ఇందుకోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాల్లో సేకరించాం. ఈ భూమి విలువే కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న 17,005 కాలనీల్లో మౌలిక వసతుల కోసమే రూ.32,909 కోట్లు వెచ్చించనున్నాం. నిర్మాణాలు పూర్తయితే రూ.4 లక్షల కోట్ల సంపద పేదల చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి సమకూరుతుంది’ అని తెలిపారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే ఈ మిషన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల ఫొటోతో సహా పట్టాను ఇస్తున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు శక్తినిస్తుందని, తమను ముందుకు నడిపిస్తుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సొంతింటితో సామాజిక హోదా ► త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక సొంత ఇల్లుతో అక్కచెల్లెమ్మలకు సామాజిక హోదా వస్తుంది. భద్రతతో పాటు భరోసా వస్తుంది. ► ఇటువంటి భద్రత ప్రతి అక్క, చెల్లెమ్మకు ఇవ్వాలని, ఆత్మ విశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని వారి చేతిలో పెట్టాలని మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరుగుతుంది. ఎమ్మెల్యేలు గర్వపడే పరిస్థితి ► ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగితే పెన్షన్ రాలేదనో.. ఇల్లు లేదనో.. ఫలానా పథకం అందలేదనో.. అర్హత ఉన్నా ఇవ్వలేదనో ఇలా.. గతంలో రకరకాల ఫిర్యాదులు వినిపించేవి. ► ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఎమ్మెల్యే సగర్వంగా, కాలర్ ఎగరేసుకునే పరిస్థితులు తీసుకువచ్చాం. ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తూ లంచాలు, వివక్షకు తావు లేకుండా అందిస్తున్నాం. ► అర్హత ఉంటే చాలు మన పార్టీయా, మరో పార్టీయా అని ఎక్కడా చూడటం లేదు. కులం, ప్రాంతం, మతం, పార్టీ చూడకుండా అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నాం ► 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించినవి 2.62 లక్షల ఇళ్లు ఉన్నాయి. అందులోనూ అన్ డివైడెడ్ షేర్ అప్ ల్యాండ్ లబ్ధిదారులకు వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. మా ప్రభుత్వం కొత్తగా 17,005 కాలనీలు నిర్మిస్తోంది. ► కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్ పంచాయితీల సైజులో కనిపిస్తున్నాయి. ఇవాళ మేం కడుతోంది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం అని చెబుతున్నా. ► ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు సేకరించగలిగాం కాబట్టే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్.. తదితర మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ► ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తాం. సకల వసతులు, నాణ్యతతో నిర్మాణం ► గతంలో చంద్రబాబు హయాంలో ఇంటి విస్తీర్ణం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు. ప్రతి ఇంట్లో బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ కమ్ టాయ్‌లెట్, వరండా.. ఇవన్నీ ఉంటాయి. ► ప్రభుత్వమే దగ్గరుండి తొలుత 20 ఇళ్లు కట్టించింది. ఎంత ఖర్చవుతుందో లెక్క వేసేందుకు ఆ పని చేశాం. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని ఏ విధంగా అయినా తగ్గించగలిగితే పేదలకు మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం. ► సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఇంటి తలుపులు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి 14 రకాల నాణ్యమైన సామగ్రిని తీసుకువచ్చాం. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే రివర్స్ టెండరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. నాణ్యత కూడా ఉంటుంది. సామగ్రిని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో ధరలు కూడా తగ్గుతాయి. ► ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ పడుతుంది. మార్కెట్లో సిమెంట్ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉంది. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి పేదల ఇళ్లకు మాత్రం పీపీసీ సిమెంట్ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేట్లు ఒప్పించాం. ప్రతి లబ్ధిదారుడికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నాం. దాదాపు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ రేటు కన్నా తక్కువకే కొనుగోలు చేశాం. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితం ► టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. ► ఇవే ఇళ్లకు చంద్రబాబు హయాంలో.. ఒక చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ఒక్కో ఇంటి వ్యయం రూ.6 లక్షలుగా లెక్కేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ.3 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించే వారు. ఆ రుణం తీర్చేందుకు పేద కుటంబం నెలకు రూ.3 వేల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాల్సి వచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం అవే ఇళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇస్తోంది. ► 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ.50 వేల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఆ విధంగా వారికి కూడా మేలు చేస్తున్నాం. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల పంపిణీని గత జనవరిలో మొదలు పెట్టాం. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు బిల్లులు ► ప్రభుత్వ పని అంటే నాసిరకం అని గతంలో పేరు ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందనే పేరు తెచ్చుకున్నాం. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించాం. ► అధికారులు, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని నిర్దేశించాం. గతంలో ఇళ్లు కట్టిన తర్వాత బిల్లులు రావడం కాదు కదా.. చివరకు ఆ బిల్లులు తయారు చేయడం కూడా గగనమై పోయేది. ఇవాళ సచివాలయాల్లో ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఆ వెంటనే సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. పుట్టగతులు ఉండవనే టీడీపీ కుట్ర ఈ యజ్ఞం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఆందోళనతోనే టీడీపీ ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ► ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులా ప్రయత్నించింది. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగన్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది.. దీంతో తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ కోర్టులను ఆశ్రయించారు. ► నా నియోజకవర్గం పులివెందులతో పాటు విశాఖపట్నం, ఇతర చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ► విశాఖపట్నంలో భూముల సేకరణకు హైకోర్టు ఇటీవలే క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేయండని అధికారులను ఆదేశించాం. ఏప్రిల్‌లో విశాఖపట్నం వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాం. -
ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందుల్లేకుండా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇళ్లు నిర్మించే సమయంలో నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా బోర్లు వేస్తోంది. అంతటితో సరిపెట్టకుండా వాటికి మోటార్లు సైతం బిగించడం.. అందుకు విద్యుత్ సరఫరా సమకూర్చడం.. ప్లాట్ల వద్ద కుళాయిల ఏర్పాటుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 76 శాతం లేఅవుట్లలో బోర్లు తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 9,112 లేఅవుట్లలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీటిలో 8,830 లేఅవుట్లలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రూ.920 కోట్లు కేటాయించింది. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లను కేటాయించి పనులను అప్పజెప్పింది. మొత్తం 8,830 లేఅవుట్లకు గాను ఇప్పటివరకు 8,096 లేఅవుట్లలో నీటి సరఫరా పనులు ప్రారంభించారు. వీటిలో 6,687 (76 శాతం) లేఅవుట్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా బోర్లు వేయడం, పక్కనున్న చెరువులు, కాలువల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. 10–20 ఇళ్లకు చేతి బోరింగ్లు, 50–60 ఇళ్లకు రోటరీ బోర్లు, 100–200 ఇళ్లకు డీటీహెచ్ బోర్లు వేస్తున్నారు. ప్లాట్లు ఎక్కువగా ఉండి నీటి వినియోగం ఎక్కువ ఉన్నచోట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందుల్లేకుండా నీటి నిల్వ కోసం స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా బోర్ల నుంచి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నీటిని వినియోగించుకునేందుకు అనుగుణంగా కుళాయి పాయింట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇబ్బందులకు తావివ్వం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలకు ఎలాంటి ఇబ్బందులకు తావివ్వం. లబ్ధిదారులకు అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తుంది. నీటి సౌకర్యం లేకపోతే నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తుతాయని సీఎం వైఎస్ జగన్ ముందే భావించారు. లబ్ధిదారులు ఆ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే బోర్లువేసి, మోటార్లు బిగించి, విద్యుత్ సరఫరా అందిస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం లేఅవుట్లలో నీటి సరఫరా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 76 శాతం లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్లలో ఈ నెలాఖరులోపు నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ పనులు పూర్తిచేస్తాం. ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం. – నారాయణ భరత్‌గుప్తా, ఎండీ హౌసింగ్ కార్పొరేషన్ -
Andhra Pradesh: ఊరూరా ఇళ్ల నిర్మాణాల సందడి
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పేదల కోసం 15.60 లక్షల ఇళ్లను ఒకేసారి నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మహా యజ్ఞానికి జూన్ 1న శ్రీకారం చుడుతోంది. ఇళ్ల నిర్మాణాలను నిరాటంకంగా కొనసాగించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రితో పాటు నీటి సరఫరా, ఇతర వసతులను ఈ నెలాఖరు కల్లా కల్పించేందుకు సంబంధిత శాఖలు వేగంగా చర్యలను చేపడుతున్నాయి. నీటి సౌకర్యం కల్పించిన కాలనీల్లో జూన్ 1 నుంచి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ సంక్షోభంలో ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతుండటంతో కూలీలకు చేతినిండా పని దొరకడంతోపాటు ఆర్థిక ప్రగతికి బాటలు వేయనుంది. తొలి దశలో రూ.46,084 కోట్ల వ్యయం తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు రూ.28,084 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే తొలి దశలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.18 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. మొత్తంగా రూ.46,084 కోట్లు ఖర్చయ్యే ఈ మహా యజ్ఞానికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రూపొందిస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. తొలి దశలో చేపట్టే 8,798 కాలనీల్లో నీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఇప్పటికే 2,284 కాలనీల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మిగతా కాలనీల్లో కూడా బోర్లు వేయడం, వాటికి మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోపక్క గృహ నిర్మాణ శాఖ ఇళ్లు నిర్మించే కాలనీలకే అవసరమైన సిమెంట్, స్టీల్ సరఫరా చేసేలా జిల్లాల్లో 489 గోదాములను అద్దెకు తీసుకుంది. 71,400 టన్నుల సిమెంట్‌కు కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో 41,157 మెట్రిక్ టన్నుల సిమెంట్ గోదాములకు చేరింది. 24,022 టన్నుల స్టీల్ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా.. 2,577 టన్నుల స్టీల్ గోదాములకు చేరింది. ఇసుక కూడా సిద్ధంగా ఉంది. 15.10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికే పరిపాలనా అనుమతి తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించనుండగా.. 15.10 ఇళ్ల నిర్మాణాలకు పరిపాలన అనుమతిని మంజూరైంది. అలాగే 14.89 లబ్ధిదారుల మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు. ఈ గృహాల్లో ఇప్పటికే 97 శాతం మ్యాపింగ్ పూర్తి కాగా.. 79 శాతం గృహాలకు జియో ట్యాగింగ్ సైతం పూర్తయింది. గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్లో 90 శాతం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల ద్వారా 21.7 కోట్ల పని దినాలు కల్పించనున్నారు. అలాగే 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.44 లక్షల టన్నులు స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అవసరం అవుతుందని అంచనా. కాలనీలకు మంచినీటి సరఫరా కోసం రూ.920 కోట్ల వ్యయం అవుతందని అంచనా వేశారు. పల్లెలు, పట్టణాల్లో వ్యక్తిగత గృహ నిర్మాణాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే కాలనీల్లో మంచినీటితో పాటు విద్యుత్, రహదారులు, ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి ఇంట్లో బెడ్ రూమ్, లివింగ్ రూమ్ (హాల్), కిచెన్, బాత్ రూమ్ కమ్ టాయిలెట్, వరండా ఉండేలా నిర్మాణాలు చేపడతారు. జూన్ 1 నుంచి పనులు ప్రారంభం : అజయ్ జైన్ వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నీటి సరఫరా సౌకర్యాన్ని ఈ నెలాఖరులోగా కల్పించి.. జూన్ 1వ తేదీ నుంచి పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో లబ్ధిదారులు నియోజకవర్గాల కేంద్రాలకు వెళ్లి మెటీరియల్ తీసుకోవాల్సి వచ్చేదని, దీంతో వారికి రవాణా చార్జీలు అయ్యేవని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాలు లేదా ఆయా గ్రామాల్లోనే అవసరమైన మెటీరియల్ నిల్వ చేసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాల వద్దకే మెటీరియల్ సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. -
రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే
సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. పేదలపై రుణభారం మోపిన టీడీపీ సర్కారు.. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది. ఒక్క రూపాయికే ఇచ్చేద్దాం.. 300 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని సీఎం జగన్ గుర్తించారు. నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్ఎఫ్టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. -
వచ్చే ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లు
-
గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): జిల్లాలో మంజూరైన గృహ నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఏఏవై ద్వారా కేటాయించిన గృహనిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన ఇటుకలు సరఫరా చేయాలన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. వచ్చే నెల 15వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. గృహ నిర్మాణాలకు సంబంధించి తహసీల్దార్ల సమన్వయంతో భూములు గుర్తించాలన్నారు. వైఎస్ఆర్నగరలో కేటాయించిన 6000ల గృహాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాకు ఆధార్ అనుసంధానం చేసి వివరాలు అందజేయాలని తెలిపారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలాలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, ఈఈ సాయిబాబా పాల్గొన్నారు. -
'33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తాం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 33 పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షా 93 వేల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడారు. లక్షా 20 వేల ఇళ్లను అపార్ట్మెంట్ల మోడల్లో నిర్మిస్తామన్నారు. 73 వేల ఇళ్లను లబ్ధిదారులు రుణాలను వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలని చెప్పారు. 18 నెలల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. -
పేదల ‘గూడు’ చెదిరింది
* ‘ఆర్‌ఏవై’ రద్దుతో రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం మంగళం * కార్యరూపం దాల్చని ఆరు ప్రాజెక్టుల రద్దు * విడుదలైన తమ వాటా నిధులు తిరిగివ్వాలంటూ లేఖ * త్వరలో ప్రారంభించే పథకం కింద రాష్ట్రానికి అవకాశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మురికివాడల్లో నివసిస్తున్న పేదలు కలలుగన్న ‘గూడు’ చెదిరింది! కేంద్రం నిర్ణయం, రాష్ట్రం జాప్యం కారణంగా వివిధ పట్టణాల్లో ప్రారంభం కావాల్సిన పక్కా ఇళ్ల నిర్మాణం ఆదిలోనే అటకెక్కింది. పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలన లక్ష్యంతో గత యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రారంభించిన రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై/రే)ను రద్దు చేసిన ప్రస్తుత మోదీ ప్రభుత్వం... ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి మంజూరైన ఏడు ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇంకా పనులు ప్రారంభంకాని ఆరు ప్రాజెక్టులను రద్దు చేసింది. పనులు ప్రారంభమైన ఏకైక ప్రాజెక్టు ‘కేశవనగర్’ను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ పంపింది. పైగా ఈ ప్రాజెక్టులకు మంజూరు చేసిన తమ వాటా నిధులను తిరిగి ఇవ్వాలని కోరింది. దేశవ్యాప్తంగా కేవలం 188 ప్రాజెక్టులనే కొనసాగించిన కేంద్రం ఇంకా కార్యరూపం దాల్చని మిగిలిన ప్రాజెక్టులను రద్దు చేసేసింది. అయితే 2022 నాటికి ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణం లక్ష్యంలో భాగంగా త్వరలో ప్రకటించనున్న ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద రాష్ట్రానికి మళ్లీ అవకాశం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కొంప ముంచిన పనుల జాప్యం ‘మిషన్ సిటీస్’లోని మురికివాడల ప్రజల కోసం రెండు, మూడంతస్తుల (జీ+2, జీ+3) గృహ సమూదాయాలను నిర్మించడం, మౌలిక సౌకర్యాలను కల్పించడమే రాజీవ్ ఆవాస్ యోజన ఉద్దేశం. గడిచిన మూడేళ్లలో రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణకు ఏడు ఆర్‌ఏవై ప్రాజెక్టులు మంజూరయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేశవ్‌నగర్‌లో రూ. 58.74 కోట్లతో 334 ఇళ్ల నిర్మాణానికి మంజూరైన ప్రాజెక్టు మాత్రమే ఇటీవల కార్యరూపం దాల్చింది. వరంగల్, ఖమ్మం, రామగుండం పట్టణాలకు మంజూరైన మరో ఆరు ప్రాజెక్టుల కింద ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం వాటిని రద్దు చేసేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదలైన రూ.161.56 కోట్ల నిధుల్లో గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన రూ.70 కోట్లను తిరిగివ్వాలని రాష్ట్రాన్ని కోరింది. ప్రతిపాదనలు పంపినా లభించని సీఎంవో ఆమోదం ఆర్‌ఏవై కింద మంజూరైన ప్రాజెక్టులను తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా డబుల్ బెడ్ రూమ్ గృహాలతో నిర్మించాలని దాదాపు ఏడాది కింద సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఏవై మార్గదర్శకాల ప్రకారం సింగిల్ బెడ్రూమ్ ఇంటికి రూ.5 లక్షల వ్యయం చేయాల్సి ఉండగా అదనపు బెడ్రూమ్ నిర్మాణం వల్ల ఈ ఖర్చు రూ.7 లక్షలకు పెరగనుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు ఆర్నెల్ల కిందే సీఎం కార్యాలయానికి ఈ మేరకు సవరించిన ప్రతిపాదనలు వెళ్లినా ఆమోదముద్ర పడలేదు. కేశవ్‌నగర్ ప్రాజెక్టుకే ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో రెండేళ్ల కిందే మంజూరైన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కాకుండానే రద్దయ్యాయి. -
ఇంటి దొంగలు దొరికేనా..?
ప్రగతి నగర్ : జిల్లాలో మూడు విడతల్లో 1,39,609 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కాగా వీటిలో ఇప్పటి వరకు 88,652 ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. మరో 25,543 ఇళ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటి వరకు నిర్మించిన ఇళ్లలో రూ. 5 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించా రు. నోటీసులు జారీ చేసి రూ. 55 లక్షల నిధులు మాత్రమే అధికారులు రాబట్టగలిగారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన 34 మంది అధికారులు, నలుగురు సమాఖ్య సంఘాల లీడర్లు, ఐదుగురు ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలోమాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం బోగస్ ఇళ్లు, రేషన్ కార్డులపై దృషిసారించింది. దీంట్లో భాగంగానే ప్రతి జిల్లాకు ఓ ఐపీఎస్ అధికారిచే విచారణ జరిపిస్తున్నారు. ఈ మేరకు ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలలో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరుపడానికి సోమవారం జిల్లాకు ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా నేతృత్వంలో సీఐడీ అధికారులు రానున్నారు. వారు క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించనున్నారు.