
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు పురపాలక, పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బుధవారం సచివాలయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులపై ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సర్కారు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎన్నికల సమయంలో హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం పది శాతం పనులు కూడా చేయలేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల పేరుతో రూ.3,082 కోట్ల అప్పులు మిగిల్చిందన్నా రు. ఆ అప్పులను తీరుస్తూనే రూ.4, 287 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ పూర్తి సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వివరించారు.
భారం పడినా మాట ప్రకారం..
సబ్సిడీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల దాదాపు రూ.10 వేల కోట్లకుపైగా భారం పడుతున్నా మాట ప్రకా రం అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 1.34 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, డిసెంబర్ ఆఖరుకు 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 30 వేల ఇళ్ల చొ ప్పున పూర్తి చేసి అందిస్తామన్నారు. వచ్చే నె లలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్లు్ల కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment