ప్రగతి నగర్ : జిల్లాలో మూడు విడతల్లో 1,39,609 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కాగా వీటిలో ఇప్పటి వరకు 88,652 ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. మరో 25,543 ఇళ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటి వరకు నిర్మించిన ఇళ్లలో రూ. 5 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించా రు. నోటీసులు జారీ చేసి రూ. 55 లక్షల నిధులు మాత్రమే అధికారులు రాబట్టగలిగారు.
ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన 34 మంది అధికారులు, నలుగురు సమాఖ్య సంఘాల లీడర్లు, ఐదుగురు ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలోమాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం బోగస్ ఇళ్లు, రేషన్ కార్డులపై దృషిసారించింది.
దీంట్లో భాగంగానే ప్రతి జిల్లాకు ఓ ఐపీఎస్ అధికారిచే విచారణ జరిపిస్తున్నారు. ఈ మేరకు ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలలో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరుపడానికి సోమవారం జిల్లాకు ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా నేతృత్వంలో సీఐడీ అధికారులు రానున్నారు. వారు క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించనున్నారు.
ఇంటి దొంగలు దొరికేనా..?
Published Mon, Aug 11 2014 2:02 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement