Pragati Nagar
-
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని..
నిజాంపేట్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి ఘటన మరువక ముందే నగరంలో ఒక యువతిపై జరిగిన అత్యాచారం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీ అనంతరం ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని అర్ధరాత్రి సమయంలో యువతి ఇంటికి వచ్చిన స్నేహితుల్లో ఒకరు ఆమెపై లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి ప్రగతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటోంది. క్రాంతి అలియాస్ మ్యాక్స్‌వెల్ ఈ నెల 13న తన పుట్టినరోజు ఉందంటూ కంటెంట్ రైటర్ అయిన 28 ఏళ్ల యువతిని పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్‌లోని రిపీట్ పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లింది. పబ్‌లో పార్టీ అనంతరం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ క్రాంతితో పాటు స్నేహితులు రోషన్, మనుప్రీత్, కిషోర్ ఆమె ఇంటికి వచ్చారు. అందరూ కలిసి మళ్లీ మద్యం సేవించారు. తెల్లవారుజాము సుమారు 4.30 గంటల వరకు పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు. 5 గంటల సమయంలో యువతి నిద్రలోకి జారుకుంది. మిగతావారు కూడా ఆమె ఇంట్లోనే పడుకున్నారు. యువతితో పాటు ఇద్దరు స్నేహితులు ఒక గదిలో, మరో ఇద్దరు ఇంకో గదిలో పడుకున్నారు. సుమారు 6.15 గంటల సమయంలో రోషన్ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతన్ని పక్కకు నెట్టివేసేందుకు ప్రయత్నించింది. అయితే అతడు తనను కొట్టి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు ఆ యువతి 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం లైంగిక దాడికి పాల్పడిన చిత్రపురి కాలనీకి చెందిన రోషన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీరంతా సెంట్రల్ యూని వర్సిటీ విద్యార్థులని పోలీసులు పేర్కొంటున్నారు. యువతిపై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లైంగిక దాడి జరిగిందా? స్నేహితులు అందరూ దీనికి సహకరించారా? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
కెరీర్ కాంతిమంతం
దీపం జీవితానికి ప్రతీక. ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. ఆ వెలుగును ఒడిసిపట్టుకోవడం తెలిస్తే జీవితం ప్రకాశవంతమవుతుంది. సరదాగా నేర్చుకున్న క్యాండిల్ మేకింగ్‌తో జీవితాన్ని కాంతిమంతం చేసుకున్న సుజాత మేడబాల అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లక్కీ క్యాండిల్స్... ఇది హైదరాబాద్, ప్రగతినగర్‌లో ఓ చిన్న పరిశ్రమ. పరిశ్రమ చిన్నదే కానీ, అందులో తయారయ్యే క్యాండిల్స్ మాత్రం చిన్నవి కావు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని భుజాన మోసినట్లు మోయాల్సినంత పెద్ద క్యాండిల్స్ తయారవుతాయక్కడ. రెండు అడుగుల చుట్టుకొలత, రెండున్నర అడుగుల ఎత్తున్న క్యాండిల్ అది. అందుకే ఆ క్యాండిల్ పేరు సరదాగా బాహుబలి క్యాండిల్‌గా వ్యవహారంలోకి వచ్చేసింది. ఇంతకీ బాహుబలి క్యాండిల్ బరువు ఎంతో తెలుసా? 30 కేజీలు. ధర తెలిస్తే క్యాండిల్ వెలుగులో చుక్కలు కూడా కనిపిస్తాయి మరి. ఆ క్యాండిల్ ధర 30 వేల రూపాయలు. ఇది కస్టమైజ్డ్ క్యాండిల్ అని, ఒకరు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారని, ఈ క్యాండిల్ కోసం ప్రత్యేకంగా మౌల్డ్ తయారు చేయించాల్సి రావడంతో ఆ ధర తప్పలేదని చెప్పారు సుజాత. ఆమె పరిశ్రమలో తయారయ్యే క్యాండిల్స్‌లో ఎక్కువ భాగం డిజైనర్ క్యాండిల్సే. పిల్లర్ క్యాండిల్, కంటెయినర్ క్యాండిల్, సెంటెడ్ క్యాండిల్, పెయింటెడ్ క్యాండిల్, ప్రింటెడ్ క్యాండిల్, ఫ్లోటింగ్, పర్సనల్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. పండుగలు, ఇతర ధార్మిక వేడుకల కోసం రిచువల్స్ క్యాండిల్స్ ప్రత్యేకం. ‘‘దీపం వెలుగు మనసును ఉత్తేజితం చేస్తుంది. అందుకే సెంటెడ్, అరోమాటిక్ క్యాండిల్స్‌లో సందర్భాన్ని బట్టి ఫ్రాగ్నెన్స్ను ఎంచుకోవాలి. మా ప్రయోగంలో నాలుగురకాల నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ ఉన్నాయి. వాటిలో సోయా వ్యాక్స్, కోకోనట్ వ్యాక్స్, పామ్ వ్యాక్స్ క్యాండిల్స్... ఈ మూడు వేగన్ క్యాండిల్స్. అంటే ఈ మైనం జంతువులు, పక్షుల వంటి ఏ ప్రాణి నుంచి సేకరించినది కాదు. ఇక నాచురల్ వ్యాక్స్‌లో నాలుగవది బీ వ్యాక్స్. తేనెపట్టు నుంచి సేకరించే మైనం అన్నమాట. సాధారణంగా క్యాండిల్ తయారీలో ఉపయోగించేది పారాఫిన్ వ్యాక్స్. ఇప్పుడు నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు, ధర గురించి పట్టింపు కూడా ఉండడం లేదు. దాంతో ప్రయోగాలు చేయడానికి అవకాశం కూడా బాగా ఉంది. నేను పదేళ్లుగా ముగ్గురు ఉద్యోగులతో ఈ పరిశ్రమ నడిపిస్తున్నాను. ముగ్గురూ మహిళలే. మహిళలనే ఎందుకు చేర్చుకున్నానంటే... ఇది భుజబలంతో చేసే పని కాదు, సృజనాత్మకంగా చేయాల్సిన పని. పైగా మొత్తం చేతుల మీద జరిగే పని. భారీ మొత్తంలో మైనాన్ని కరిగించి ఒకే మూసలో పోయడం కాదు, ప్రతిదీ ప్రత్యేకమే. మనసు పెట్టి చేయాల్సిన పని. సహనం కూడా చాలా ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలైతే బావుంటుందనుకున్నాను. అలాగే ఒక మహిళగా సాటి మహిళలకు అవకాశం ఇస్తే బావుంటుందని కూడా అనిపించింది. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, భారీ ఆర్డర్ ఉన్నప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా మహిళలకే’’ అన్నారు సుజాత. వైజాగ్‌లో చిరుదీపంగా మొదలైన పరిశ్రమ, హైదరాబాద్‌లో కాంతులు విరజిమ్ముతున్న వైనాన్ని కూడా వివరించారామె. ‘‘వైజాగ్‌లో ఒక టైనింగ్ ప్రోగ్రామ్‌లో ఒకరోజు శిక్షణ తీసుకున్నాను. అది కూడా సరదాగానే. పిల్లలు పెద్దయిన తర్వాత ఖాళీ దొరికింది. దాంతో నేర్చుకున్న పనిని రకరకాలుగా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచిస్తూ పేపర్ కప్పు క్యాండిల్ చేశాను. అలా మొదలైన ప్రయోగాలను కొనసాగిస్తూ వచ్చాను. మా వారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయానికి క్యాండిల్ తయారీలో నాకు పూర్తి స్థాయిలో పట్టు వచ్చేసింది. ఇక కంపెనీ రిజిస్టర్ చేసి వ్యాపారాన్ని ప్రారంభించాను. నా టైమ్‌పాస్ కోసం మొదలు పెట్టిన ఈ ఆలోచన... ఇప్పుడు మా వారికి రిటైర్మెంట్ తర్వాత వ్యాపకంగా మారింది. నా ఆలోచనతో రూపుదిద్దుకున్న పరిశ్రమ ఇప్పుడు ఒక ఈవెంట్‌కి రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే క్యాండిల్స్‌ని సరఫరా చేసే స్థాయికి చేరింది. మాకు మంచి వ్యాపకం, మరికొందరికి ఉపాధి. నా పరిశ్రమ కాంతిమంతం చేస్తున్నది నా జీవితాన్ని మాత్రమే కాదు, వేలాది ఇళ్లను, లక్షలాది మనసులను’’ అన్నారామె వాలెంటైన్స్ డే క్యాండిల్స్ చూపిస్తూ. – వాకా మంజులారెడ్డి -
కూకట్‌పల్లిలో చిరుత సంచారం
-
ప్రగతి నగర్ సమీపంలో చిరుత సంచారం
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులో చిరుత సంచారం స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. సురారం విశ్వకర్మ కాలనీలో చిరుత సంచారంతో ప్రగతినగర్ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రగతి నగర్ మిథిలానగర్ కొండలపై మంగళవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిరుత సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. సాయంత్రం వాకింగ్ కోసం వచ్చిన వారు చిరుతను చూసినట్లు చెబుతున్నారు. కొండపై నిల్చున్న చిరుతను జయశ్రీ అపార్ట్మెంట్ వాసులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. కుత్బుల్లాపూర్‌ను ఆనుకుని ఉన్న నర్సాపూర్ అడవిలోంచి చిరుతపులి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. అయితే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. -
ప్రగతి నగర్ లో దొంగల బీభత్సం
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక కెనరాబ్యాంక్ ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో గుర్తుతెలియని మృతదేహం
కూకట్పల్లి (హైదరాబాద్) : చెరువులో గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ చెరువు దగ్గర శుక్రవారం జరిగింది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా హత్య చేసి తెచ్చి చెరువులో పడేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టరే నిర్ణేత
ప్రగతినగర్ : కలెక్టరెట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం నీటి సలహాబోర్డు సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్యెల్యేలు షకీల్, హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడి, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 5.09 టీఎంసీల నీరు నిలువకు పోగా, తాగు నీటికి రెండు టీఎంసీలు కేటాయిస్తారు. మిగితా నీటిని వృథాపోకుండా, పంటల కనుగుణంగా సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్‌కు సర్వాధికారాలు ఇస్తున్నట్లు మొదటి తీర్మానం చేశారు. అదేవిధంగా అలీసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి 0.8 టీఎంసీల నీటి ని వ్యవసాయానికి విని యోగించుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ 2వ తీర్మానం, గుత్ప ఎత్తిపోతల నుంచి అవకాశం ఉన్నం త వరకు నీటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి 3వ తీర్మానం, కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుంచి అవసరానికనుగుణంగా నీటిని విడుదల చేయడానికి కలెక్టర్‌కు అధికారం ఇస్తూ 4వ తీర్మానాన్ని బోర్డు ఆమోదిం చింది. క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించాలి - మంత్రి పోచారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా వివరాలు సేకరించాలని, ఆదర్శరైతుల రిపోర్టులపైనే ఆధారపడడం మానుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ, సహాయ వ్యవసాయాధికారులు, ఉపసంచాలకులు పంటల విస్తీర్ణాన్ని పరిశీలించాలన్నారు. వ్యవసాయ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు సమాచార సేకరణకు స్వయంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. సాగు చేస్తున్న పంటలకు విద్యుత్ ఏమేరకు అందించాలో నిర్ణయించాలని, పంటలను కాపాడడానికి రైతులకు చేయూతనందించాలన్నారు. పంటనష్టం, పంటరుణాల నిధులు ఎట్టిపరిస్థితుల్లోను దుర్వినియోగం కాకూడదన్నారు. రాష్ట్రానికి 2400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 1400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని, పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయ పంటలు కాపాడడానికి అవసరమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. 2009 నుంచి 2014 వరకు పంటనష్టం పరిహారం కింద 482.52 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తద్వారా 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో 51 వేల మంది రైతులకు 20.06 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్‌షిండే మాట్లాడుతూ 300 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ మండలానికి విడుదలచేయాలని కోరారు. నియోజక వర్గంలో తీవ్ర వర్షభా వ పరిస్థితులు తట్టుకొని రైతులు వేసిన పంటలను కాపాడుకోవడానికి ఈనీరైన ఉపయోగపడుతుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఆద ర్శ రైతుల నుంచి వీఆర్ఓలు వారి ద్వారా వ్యవసా య అధికారులు వివరాలను సేకరించడం ద్వారా సరైన పద్ధతిలో న్యాయం జరుగడం లేదన్నారు. దీని ద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందని షకీల్ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నం దున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సహకార బ్యాంకు చైర్మన్ గంగాధర్పట్వారి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ షకీల్ ఉర్ రహమాన్, జేడీఏ నర్సింహ, ఆర్డీఓలు యాది రెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. -
సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటలు
ప్రగతినగర్: సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. మంగళవారం జరిగే ఈ సర్వేలో జిల్లాలోని 6.25 లక్షల కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయనున్నారు. ఇందుకోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పది విభాగాలలో 80 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ప్రతి గ్రామానికి ఒక రూట్ ఆఫీసర్‌ను నియమించారు. వీరు మంగళవారం ఉదయం మెటీరియల్‌తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యూమరేటర్లకు అందించనున్నారు. సర్వే కోసం 27,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2,300 మంది ప్రయివేటు ఉపాధ్యాయులు, 800 మంది బ్యాంకు సిబ్బందిని వినియోగించనున్నారు. వీరందరికి జిల్లాలోని 56 కేంద్రాలలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. ఇంటింటికి కరపత్రా లు పంపిణీ చేశారు. స్టిక్కర్లను అతికించారు. గ్రామాలలో పోస్టర్లు వేశారు. మండల ప్రత్యేకాధికారులు సర్వే కు బాధ్యులుగా వ్యవహరించనున్నారు. సర్వే అనంత రం సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి మండలానికి 25 నుంచి 50 వరకు కంప్యూటర్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 నుంచి 30 ఇళ్ల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. -
చెదరగొట్టి...చితకబాది
ప్రగతినగర్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం ఉదయం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా కోర్టు వద్దే ఇనుప కంచెలు వేయడంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. అనంత రం కలెక్టరేట్‌లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టరేట్లో ముఖ్యమైన అధికారులు ఎవరూ లేరని సముదాయించారు. విద్యార్థులు సమస్యలతో సతమతమవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం ఉదాసీనత చూపడం సరి కాదంటూ పీడీఎస్‌యూ నాయకులు మండిపడ్డారు. కలెక్టరేట్ గేటు వరకైనా అనుమతి ఇవ్వాలని కోరారు. పోలీసులు ఇందుకు అంగీకరించకపోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. విద్యార్థులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా విద్యార్థులు ఆగకపోవడంతో లాఠీ చార్జి చేసి అక్కడి నుంచి చెదరగొట్టా రు. దీంతో పలువురు విద్యార్థులు ఇనుప కంచెలో ఇరుక్కుపోయారు. మిగిలినవారు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెబుతూ విద్యార్థులను దొరికినవారిని దొరికినట్టు అరెస్టు చేశారు. విద్యార్థులు పోలీసు వాహనాలు కదలకుండా అడ్డు తగలడంతో పోలీసులు రెచ్చిపోయి వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ప్రైవేట్ అటోలో తోసి ఠాణాలకు తరలించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. పొలీసుల చర్య అమానుషం సమస్యలపై ఉద్యమించిన విద్యార్థులను అరెస్టు చేయడం అమానుషమని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సరిత అన్నారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోసం తాము పోరాడుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, గవ ర్నర్గిరీ కొనసాగుతోందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయినవారిలో పీడీఎస్‌యూ నాయకులు అన్వేష్, సౌందర్య, సుధాకర్, సుమన్, గౌతంకుమార్, సాయినాథ్, ఆజాద్, రా జు, స్వప్న, రాజేశ్వర్, అరుణ్‌కుమార్, కల్పన, ప్రగతి, స్వరూప, దేవరాజు, గణేష్, కళ్యాణ్, కిరణ్, రాకేష్, క్రాంతి, కార్తిక్, సుజిత్‌కుమార్, నరేష్, స్వప్న తదితరులు ఉన్నారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన సమయం లో జరిగిన తోపులాటలో ఓ విద్యార్థికి సంబందించిన వెండి గొలుసు పడిపోయింది. అరెస్టు అనంతరం కొంత మంది విద్యార్థులు గొలుసు కోసం వెతికారు. దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. -
ఇంటి దొంగలు దొరికేనా..?
ప్రగతి నగర్ : జిల్లాలో మూడు విడతల్లో 1,39,609 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కాగా వీటిలో ఇప్పటి వరకు 88,652 ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. మరో 25,543 ఇళ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటి వరకు నిర్మించిన ఇళ్లలో రూ. 5 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించా రు. నోటీసులు జారీ చేసి రూ. 55 లక్షల నిధులు మాత్రమే అధికారులు రాబట్టగలిగారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన 34 మంది అధికారులు, నలుగురు సమాఖ్య సంఘాల లీడర్లు, ఐదుగురు ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలోమాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం బోగస్ ఇళ్లు, రేషన్ కార్డులపై దృషిసారించింది. దీంట్లో భాగంగానే ప్రతి జిల్లాకు ఓ ఐపీఎస్ అధికారిచే విచారణ జరిపిస్తున్నారు. ఈ మేరకు ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలలో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరుపడానికి సోమవారం జిల్లాకు ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా నేతృత్వంలో సీఐడీ అధికారులు రానున్నారు. వారు క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించనున్నారు.