
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులో చిరుత సంచారం స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. సురారం విశ్వకర్మ కాలనీలో చిరుత సంచారంతో ప్రగతినగర్ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రగతి నగర్ మిథిలానగర్ కొండలపై మంగళవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిరుత సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. సాయంత్రం వాకింగ్ కోసం వచ్చిన వారు చిరుతను చూసినట్లు చెబుతున్నారు. కొండపై నిల్చున్న చిరుతను జయశ్రీ అపార్ట్‌మెంట్ వాసులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. కుత్బుల్లాపూర్‌ను ఆనుకుని ఉన్న నర్సాపూర్ అడవిలోంచి చిరుతపులి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. అయితే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.