చెరువులో గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కూకట్‌పల్లి (హైదరాబాద్) : చెరువులో గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ చెరువు దగ్గర శుక్రవారం జరిగింది.
సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా హత్య చేసి తెచ్చి చెరువులో పడేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.