CM YS Jagan Laid Stone For Construction Of Houses In Amaravati Live Updates And Latest News - Sakshi
Sakshi News home page

వెంకటపాలెంలో సీఎం జగన్‌.. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Mon, Jul 24 2023 9:26 AM | Last Updated on Mon, Jul 24 2023 1:16 PM

CM YS Jagan Laid Stone For Construction Of Houses In Amaravati Live Updates - Sakshi

Updates..

వెంకటపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్‌

వెంకటపాలెం బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

నిజంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా ఎప్పటికీ నిలిచిపోయే రోజు అవుతుంది.
పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నోఅవరోధాలు అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో జరుగుతోంది. 
ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిలిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక దత్తపుత్రుడు. ఇతరత్రా చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు. 
వీరంతా చివరి వరకు ఒక పేద వాడికి ఒక ఇళ్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
ఈరోజుటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు.
వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలివ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు. 
ఆ తర్వాత పేదలకు ఇళ్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు. 

ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఇళ్లు రాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లిన పరిస్థితులు.. 
ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో చూస్తున్నాం. 
చంద్రబాబు, గజదొంగ ముఠా, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. 
మూడేళ్లపాటు వీళ్లు వేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరఫున మీ బిడ్డ వీళ్లందరితో పోరాటం చేస్తూ వచ్చాడు. 
చివరికి దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులు మంచికే ఉంటాయి కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని ఇళ్ల పట్టాలివ్వడం జరిగింది. 
ఆ తర్వాత కూడా వీరి బుద్ధి మారలేదు. 
ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి ఇళ్లు నిర్మాణం కూడా అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వంలో వీరు ఎక్కని గడప లేదు. దిగని గడప లేదు. కలవని కేంద్ర సెక్రటరీ కూడా లేడు. 
ఇంత మంది కలిసి చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. 
దేవుడి దయతో అన్నింటినీ అధిగమించి అడుగులు ముందుకు వేశాం. 
మీ ఇంటి కలల సాకారానికి ఈరోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తున్నాం. 
ప్రతి విషయంలోనూ కూడా మన పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోంది.

పేదవాడికి ఏ మంచి జరిగినా అడ్డుకొనే రాక్షస బుద్ధితో మనం ఈరోజు యుద్ధం చేస్తున్నాం.
పేద పిల్లలకు గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం పెడుతున్నప్పుడు పెత్తందార్లంతా అడ్డు తగిలే ప్రయత్నంచేశారు. 
పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లిష్‌ మీడియం బడులకు పంపిస్తారు. 
మన పిల్లలు మాత్రం తెలుగు బడులకు పోవాలి అంటారు. 
తెలుగు భాష ఏమవుతుందని చెప్పి ముసలి కన్నీరు కారుస్తారు. 
ప్రతి అడుగులోనూ వారిది ఇదే ఆలోచన. 

మీ బిడ్డ పేదల కోసం బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా మనందరి ప్రభుత్వం నేరుగా 2.25 లక్షల కోట్లు ఖాతాల్లోకి పంపిస్తుంటే దాన్ని కూడా అడ్డుకొనే కార్యక్రమం..
ఇలా మీ బిడ్డ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పెత్తందార్లంతా గగ్గోలు పెడతారు.
ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్‌ అప్పట్లో చంద్రబాబు హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్‌ రేటు కూడా తక్కువ. 
మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతున్నాడు. ఆ రోజు ఆ గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది?

ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు. 
ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు, నా అక్కాచెల్లెళ్లకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకొనేందుకు కోర్టులకు వెళ్లారు.
పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్‌ ఇంబ్యాల్స్‌ వస్తుందట.. కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించిన చరిత్ర వీళ్లది. 
ఇలాంటి పెత్తందారులు, ఈరోజు ఇలాంటి వ్యవస్థతో మనం యుద్దం చేస్తున్నాం. 
ఇలాంటి దుర్మార్గమైన మనషుల్ని, మనస్తత్వాల్ని, వాదనల్ని, రాతల్ని, టీవీ డిబేట్లను, రాజకీయ పార్టీల్ని మానసిక, నైతిక దివాళాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా? 

ఏ సమాజమైనా, ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుంది? నిన్నటికంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటారు. 
ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. 
ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం అంటారు. అమానుషత్వం అంటారు. రాక్షసత్వం అంటారు. 
ఇంత రాక్షసత్వం ఒకవైపు చూపిస్తున్నారు. అన్యాయం చేస్తున్నారు. 
పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు.

పొద్దున్నే ఈనాడు పేపర్‌లో చూశా.  వాళ్లు రాతలు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. 
చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా నుంచి మనుషులు రావొచ్చట. సింగపూర్‌ నుంచి రావొచ్చట.
కానీ ఇదే అమరావతిలో మాత్రం ఇళ్ల స్థలాలు చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇవ్వకూడదట అని ఈనాడు రాస్తాడు. 
ఇంతకన్నా దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావాలు నిజంగా ఎక్కడైనా ఉంటాయా? 
పేద వర్గాల మీద పేద కులాలమీద పెత్తందార్ల దోపిడీలను సహించి, భరించే కాలం పోయింది. 
ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. 

అటువంటి మార్పుకు సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఇక్కడి నుంచి పునాదిరాయి వేస్తున్నా.
ఇక నుంచి ఈ అమరావతి మనందరి అమరావతి కాబోతోందని తెలియజేస్తున్నా. 
ఇదే ప్రాంతంలో అక్షరాలా 50793 మంది నా అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 
ఇక్కడి పేదలంతా కూడా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని అడిగారు. 
మంగళగిరి, తాడికొండ పరిధిలో 1400 ఎకరాల్లో 25 లేఅవుట్లలో అభివృద్ది చేసి నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. 
అభివృద్ధిలో భాగంగా ల్యాండ్‌ లెవలింగ్‌, ప్లాట్ల సరిహద్దురాళ్లు పాతాం. 56 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 

ప్రతి లేఅవుట్‌ వద్దకు వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి, ఆ ఇంటి స్థలంలో ఫొటోలు దిగించి బయో ట్యాగింగ్‌ చేసే కార్యక్రమం జరుగుతోంది.
సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.70 లక్షలుఖర్చు చేస్తున్నాం. 
50793 ఇళ్లకు సంబంధించి 1370 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
అవసరమైన నీటి సరఫరా కోసం 32 కోట్లుతో టెండర్లు ఖరారయ్యాయి. 
విద్యుత్‌ కనెక్షన్‌ కోసం 326 కోట్లు, అప్రోచ్‌ రోడ్లు కోసం 8 కోట్లుతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. 
సీఆర్డీఏ పరిధిలో నిర్మించే లేఅవుట్లలో అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్‌మాల్స్‌, పార్కులు వస్తాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేశాం. 
ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.70 లక్షలతో కట్టడం మొదలుపెట్టాం.
22 లక్షల ఇళ్లకు సంబంధించిన కట్టడాలు వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. 
ఇవి పూర్తయితే ఆ ఇంటి స్థలం విలువ, ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి విలువ 5 లక్షల నుంచి 15 లక్షలు పలుకుతుంది. 
సీఆర్డీఏ ప్రాంతంలో ఇక్కడి విలువ గజం కనీసం 15 వేలు. 
నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలం విలువే రూ.7.50 లక్షలు. 
మరో 2.70 లక్షలు పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నాం. 
మౌలిక వసతుల కోసం అదనంగా ప్రతి ఇంటి మీద మరో లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. 
పూర్తయ్యే సరికి ఇక్కడ ఇంటి విలువ అక్కచెల్లెమ్మల చేతిలో 12 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతుంది. 

ఇక్కడే 24 కౌంటర్లు ఏర్పాటు చేశాం. మిమ్మల్నందరినీ మీమీ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు మ్యాప్ చేశాం. 
ఇదే కౌంటర్లలో ఇక్కడి నుంచి మీ ఇంటి కట్టడానికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. 
మీ అందరి చేతుల్లోఇళ్ల మంజూరు పత్రాలు పెట్టి చిక్కటి చిరునవ్వులతో ఇంటికి పంపిస్తాం.
మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికిదేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలి. 
ఇలాంటి మంచి చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరిగించే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.


► లబ్ధిదారులు మాట్లాడుతూ.. రాజధానిలో మాకు ఇళ్లు ఇస్తే అభివృద్ధి జరదన్నారు. ఇప్పుడు రాజధాని నడిబొడ్డున మాకు ఇల్లు వచ్చింది. జగనన్న సంక్షేమ పథకాలతో మేం సంతోషంగా బ్రతుకుతున్నాం. మేం ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే.. మీరు ప్రతీరోజూ మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఇవాళ మా జీవితంలో ఓ పండుగ రోజు. మా సొంతింటి కల 

► మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. పెత్తందారుల కోటలు బద్దలు కొట్టాం. రాజధానిలో పేదలు నివసించకూడదా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్‌. మా సొంతింటి కల నెరవేర్చిన జగనన్నకు రుణపడి ఉంటాం. 


► మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. పెత్తందారుల కోటలు బద్దలు కొట్టాం. రాజధానిలో పేదలు నివసించకూడదా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్‌. 

► పవన్‌ కల్యాణ్‌ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు. పెళ్లాలను మార్చినట్టు పవన్‌ పార్టీలను మార్చారు. 

► సీఎం జగన్‌ అందరికీ అన్నం పెడుతున్నారు. కుల, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారు. చంద్రబాబు గాలికొదిలేస్తే లోకేశ్‌ ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నాడు. సీఎం జగన్‌తో పోటీపడే స్థాయి లోకేశ్‌కు లేదు. ఢిల్లీ కోటను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్‌. 50వేల మందికి ఇళ్లు ఇస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌. 

► ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి సీఎం జగన్‌. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేదలందరికీ ధైర్యం, భరోసా సీఎం జగన్‌. పేదలను కోటీశ్వరులుగా చేయగలిగే దమ్మున్న వ్యక్తీ సీఎం జగన్‌. పేదల పక్షాన నిలబడిన వ్యక్తీ ముఖ్యమంత్రి జగన్‌. పెత్తందారుల కుట్రలను భగ్నం చేశారు. గతంలో 600 హామీలిచ్చి ఏదీ నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. 


లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం జగన్‌

► మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం జగన్‌ నివాళులు.. జ్యోతి ప్రజ్వలన

వెంకటపాలెం చేరుకున్న సీఎం జగన్‌..

వెంకటపాలెం బహిరంగ సభలో లబ్దిదారులకు మంజూరు పట్టాలు అందజేయనున్న సీఎం జగన్‌

వెంకటపాలెం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

కృష్ణాయపాలెం నుంచి వెంకటపాలెం బయల్దేరిన సీఎం జగన్‌

► మోడల్‌ హౌజ్‌ను పరిశీలించిన సీఎం జగన్‌. 

► లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన సీఎం జగన్‌.

కృష్ణాయపాలెం: పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం జగన్‌.. శంకుస్థాపన

► వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన సీఎం జగన్‌. 

► కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌

కృష్ణాయపాలెం చేరుకున్న సీఎం జగన్‌

గుంటూరు జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌

► శంకుస్థాపన పండుగకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలివచ్చారు. 

ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ఇవాళ ఏపీలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదన్నదే చంద్రబాబు కుట్ర.రైతుల ముసుగులో చంద్రబాబు కోర్టుకెళ్లాడు. సీఎం జగన్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.పేదలకు మేలు చేయాలన్న సీఎం సంకల్పం గొప్పది. ప్రజల మేలు కోసం సీఎం జగన్‌ ఎంతదూరమైనా వెళ్తారు.

ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. పేదల సొంతిటి కల నెరవేరింది. ఇది పేదవాడి విజయం. పెత్తందార్ల ఓటమికి నిదర్శనం.రాజధానిలో పేదలు ఉండకూడదన్నదే చంద్రబాబు కుట్ర.

► ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం ఓ చారిత్రక నిర్ణయం. చంద్రబాబు హయాంలో అమరావతి పేరిట డిజైన్లు మాత్రమే చూశాం. 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సీఎం జగన్‌కే సాధ్యమైంది. 

► ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. రాజధానిలో పేదల కల నెరవేరే రోజు వచ్చింది. సీఆర్డీఏ పరిధిలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణం ఒక చరిత్ర.

సాక్షి, అమరావతి: అమరావతిలో నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. 

► ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది.

► విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. 

► లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.

► ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. 

► ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్‌డీఏలోని ఈడబ్ల్యూఎస్‌ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement