Navaratnalu Scheme
-
Gullamarsu Suresh: ఎవరెస్టుపై నవరత్న కీర్తి
సాక్షి, మచిలీపట్నం: వైఎస్ జగన్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నవరత్న పథకాల కీర్తి ఇప్పుడు ఎవరెస్టుపై రెపరెపలాడుతోంది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన గుల్లమర్సు సురేష్ బాబు ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరాన్ని అధిరోహిస్తూ.. ఒక్కో పర్వతంపై ఒక్కో పథకం ఫ్లెక్సీల్ని ఎగురవేసి సీఎం జగన్ ఖ్యాతిని చాటిచెప్పాడు. వాస్తవాన్ని ఖండాంతరాలకు తెలిజేయాలనుకున్న అతని వజ్ర సంకల్పాన్ని సీఎం జగన్ గతంలో ట్వీట్ ద్వారా అభినందించారు. My warm wishes to G Suresh Babu, the mountaineer from Kurnool who scaled peaks worldwide promoting our Navaratnalu schemes! Your dedication and love for Andhra Pradesh are truly inspiring and we're grateful for your support Suresh. pic.twitter.com/PNyUX6viKX— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2023ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మా తండ్రి హమాలీ. నేను ఇంటర్లో ఉండగా ప్రభుత్వం పర్వతారోహణకు ఆసక్తి ఉన్న వారి పేర్లను కోరింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో దరఖాస్తు చేశా. అంతకుముందు అరికెర హాస్టల్లో చదువుకునే రోజుల్లో సీతాఫలం, తేనె కోసం అక్కడున్న 200–300 మీటర్ల ఎత్తయిన కొండలు అవలీలగా ఎక్కేవాడిని. ప్రిన్సిపల్ పేర్ల జాబితా పంపాక.. ప్రభుత్వం ఎంపిక చేసి, విజయవాడలో శిక్షణ ఇచ్చింది. అందులో ప్రతిభ చూపిన 35 మందిని ఎంపిక చేసి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలపై మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 35 రోజులు శిక్షణ ఇచి్చంది. ఆ తర్వాత పర్వతారోహణను నా హాబీగా మార్చుకున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్న పథకాలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన ప్రవేశపెట్టిన వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు అద్భుతం. మా మామ అనారోగ్యంగా ఉంటే రూ.1.50 లక్షల ఖరీదైన వైద్యం ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చేశారు. అందుకే నవరత్న పథకాల కీర్తిని చాటిచెప్పాలని భావించా. ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరంపై ఒక్కో పథకం ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2023 మే 27న నన్ను ఉద్దేశించి ‘నీ అంకితభావం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. అదే సంవత్సరం జూన్ 1న కర్నూలు జిల్లా పత్తికొండకు వచి్చనప్పుడు సీఎం జగన్‌ను కలవగా అభినందించారు. మరింత ముందుకు సాగాలని వెన్నుతట్టారు. పర్వతారోహణకు సుమారు రూ.35 లక్షలు ఖర్చవుతుంది. నా ఆర్థిక పరిస్థితి తెలిసిన దాతలు, సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, మిత్రులు సహకారం అందించారు. ఐఏఎస్ అధికారి సత్యనారాయణ కూడా సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థి కావడంతో చేయూత లభించింది. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఐదేళ్లలోనే దేశంలోని 25 శిఖరాలు అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడిగా పేరుపొందడం గర్వకారణం. తెలుగు బుక్ ఆఫ్ రికా>ర్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. పర్వతాలు అధిరోహించేటప్పుడు ఐదు సార్లు చావు అంచుదాకా వెళ్లి వచ్చా. 2019 మే 23న మౌంట్ లోథ్‌సే ఎక్కుతూ చాలా ఇబ్బంది పడ్డా. -
మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టి, ఆ వర్గాలను ఉన్నత స్థితికి తెస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నవరత్నాలు ప్లస్’తో కూడిన మేనిఫెస్టోతో మరోసారి సంపూర్ణ భరోసా కల్పించారు. పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాల దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి.. రూ.2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయించారు. 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల్లో దశలవారీగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే కాకుండా, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అవి..– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలవనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత వరకు చెల్లించనున్నారు. గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ చెల్లింపుతో ఆర్థిక భరోసానిచ్చారు. – ప్రభుత్వ పాలనలో భాగస్వాములుగా ఉంటూ ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు సహా పూర్తి నవరత్న పథకాలను వర్తింజేయనున్నారు. దీనివల్ల రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఈ తరహా ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరగనుంది. వీరితో పాటు ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఆ స్థలం ఖరీదులో ప్రభుత్వం 60 శాతం ఖర్చును భరించనుంది.– వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా మధ్యతరగతికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.– వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా గతంలో మాదిరిగానే ఏటా రూ.15 వేలు అందిస్తూ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సాయం జమ చేస్తారు.ఆర్యవైశ్యులకు అండగా..ఇప్పటికే ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులను సైతం ఇస్తున్నారు తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్‌ను తీసుకొచ్చి అండగా నిలిచారు. ఆర్యవైశ్య సత్రాలను సొంతంగా వారే నిర్వహించే హక్కులను కల్పించారు. ఇంతటి సంక్షేమాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తామంటూ 2024 మేనిఫెస్టో ద్వారా మరోసారి భరోసా ఇచ్చారు.చెప్పినదానికంటే మిన్నగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం నవరత్నాలు పథకాలతో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఆర్థిక లబ్ధిని పెద్ద ఎత్తున అందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాల అక్కచెల్లెమ్మలను సంక్షేమ పథకాలతో ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా 1,66,45,078 మందికి రూ.43,132.75 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 2,00,59,280 మందికి రూ.86,969.93 కోట్లు కలిపి మొత్తం 3,67,04,358 మందికి రూ.1,30,102.68 కోట్లు లబ్ధి చేకూర్చడం విశేషం.కాపుల అభివృద్ధికి..కాపుల సంక్షేమానికి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నూరు శాతం అమలు చేశారు. మేనిఫేస్టోలో చెప్పినదానికి మించి భారీ ఆర్థిక సాయం అందించారు. ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని చెప్పగా.. ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తంగా రూ.34,005.12 కోట్లు సాయమందించడం విశేషం. ఇందులో డీబీటీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.84 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ప్రయోజనాలను కల్పించారు. వాస్తవానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ.1,340 కోట్లే. -
సర్కారు ఊతంతో పూల బాట
నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్‌కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం వెంకటేష్ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది. ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని గృహాలకు ప్లాస్టిక్ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్ పూలతో షోకేజ్ డెకరేషన్ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు. –తిరుపతి సిటీ\తలసరి ఆదాయం పెరిగింది గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం. అమ్మ ఒడి, ఫీజురియింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. –జి సవరయ్య, రిటైర్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి వైఎస్సార్ ఆసరా రూ.68,000 వైఎస్సార్ చేయూత రూ.75,000 జగనన్న విద్యాదీవెన రూ.28,000 వసతి దీవెన రూ.20,000 అమ్మ ఒడి రూ.30,000 సున్న వడ్డీ రూ.2,250 పింఛన్ కానుక రూ.96,000 మొత్తం రూ.3,19,250 -
సంక్షేమ సిరిమల్లిక
మదనపల్లె పట్టణం సుభాష్‌రోడ్డు వీధికి చెందిన రాజేంద్రప్రసాద్, నాగమల్లిక భార్యభర్తలు. చిన్నపాటి వ్యాపారం ద్వారా వచ్చే చాలీచాలనీ ఆదాయంతో కుటుంబాన్ని గడపాల్సి వచ్చేంది. వీరికి అమృత, వర్షిత ఇద్దరు కుమార్తెలు. పిల్లలను చదివించేందుకు ఆరి్థకంగా ఇబ్బందులు పడేవారు. రేషన్‌కార్డు తప్ప ఎటువంటి పథకాలు అందేవి కావు. నాగమల్లిక తెలిసిన వారి దగ్గర అప్పు చేసి సుభాష్రోడ్డులోనే చిరుతిళ్ల దుకాణం ప్రారంభించారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది. దీనికి తోడు పిల్లల్ని గొప్పగా చదివించాలన్న కోరిక తీరేనా? అన్న బెంగ వెంటాడేది. ఇదంతా 2019కి ముందు పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలలతో ఆ కుటుంబానికి భరోసా కలిగింది. వైఎస్సార్ ఆసరా, ఇద్దరు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వస్తోంది. రూ.6 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అమృత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. చిన్న కుమార్తె హర్షిత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.గతంలో కష్టాలు పడిన నాగమల్లిక కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా సుభాష్రోడ్డులోనే ఓ షాపు పెట్టి అందులో చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. నిప్పట్లు, చెక్కిలాలు, అత్తిరాసలు, మిక్చర్ వంటివి తయారు చేస్తూ హోల్‌సేల్‌గా అమ్ముతున్నారు. చిరుతిళ్ల తయారీలో 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీటిని తయారు చేసి షాపులో రిటైల్ అమ్మకాలతో పాటు పరిసర ప్రాంతాలకు హోల్‌సేల్ ధరకు సరఫరా చేస్తున్నారు. దీంతో వారి కుటుంబం ఆరి్థకంగా నిలదొక్కుకుంది. –మదనపల్లె జీవన ప్రమాణాలు పెరిగాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో చాలా మందిలో జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు అందిస్తున్న నిధులతో వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలవుతుంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇది చాలా శుభపరిణామం. – జీఆర్ రుక్మిణి, పూర్వ ప్రిన్సిపాల్, మహిళా డీగ్రీ కళాశాల, మదనపల్లెవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కలిగిన లబ్ధివైఎస్సార్ ఆసరా రూ.32,328 జగనన్న వసతి దీవెన రూ.23,350 జగనన్న విద్యాదీవెన రూ.41,201 సున్నా వడ్డీ రూ.2,850 అమ్మ ఒడి రూ.45,000 ఇంటి స్థలం రూ.6,00,000 -
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
మంచి ప్రభుత్వం అధికారం చేపడితే... మనసున్న నేత ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కుటుంబాలు దశ ఏ విధంగా తిరగనుందోననడానికి ఉదాహరణ కొవ్వూరు మండలం వేములూరుకి చెందిన మారిశెట్టి సత్యనారాయణ బతుకు చిత్రం. పూరిపాకలోనే తుదివరకూ జీవితం కొడిగట్టిపోవల్సిందేమోననే వేదనతో ఆ కుటుంబం విచారవదనంతో ఉండేది. కానీ ఆ పాకలో క్రమేపీ వెలుతుర్లు విరజిమ్మాయి. ఆ మోములో చిరునవ్వులు చిందాయి. దీనికంతటికీ కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవ వసంతాలు పూయించాయి. అదెలానో చూద్దాం. – కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లామూడు దశాబ్ధాలకు పైగా రోడ్డు మార్జిన్లో పూరిపాకలోనే సత్యనారాయణ కుటుంబ నివాసం. సొంత ఇల్లంటూ వీరికి లేదు. ఓ గూడు కల్పించాలంటూ ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సొంతింటి కల సాకారమైంది. ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్ ఇంటికి వచ్చి వివరాలు తీసుకుని వెళ్లారు. ఆ వెంటే ఇంటి స్ధలం మంజూరైంది.ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందించారు. జీవితంలో సొంతంటి కల నెరవేరుతుందా అనుకున్న వారి బతుకుల్లోకి ముప్పై ఏళ్ల తర్వాత ఓ పొదిరిల్లు పలకరించింది. గీత కార్మిక వృత్తి చేసుకున్న ఆ ఇంటి యజమానికి రూ.3 వేలు గీత కార్మిక పింఛన్ మంజూరైంది. వయస్సు మీద పడిన సమయంలో ఆ సొమ్ము వారి కుటుంబానికి ఎంతో ఊరటనిస్తోంది. ఇప్పటి వరకూ రూ.1,40,750 అందుకున్నారు.సత్యనారాయణ భార్య గన్నెమ్మకి చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.56.250 అందాయి. ఇంటి స్ధలం, ఇంటి రుణం అన్నీ కలిపి రూ.5.77 లక్షల లబ్ధి చేకూరింది. వారి మనవరాలికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. జగన్మోహన్రెడ్డి మేలు ఎప్పటికీ మరిచిపోలేమని వారు సంతోషంగా చెబుతున్నారు.చేయూత అందించారు ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన మహిళలకు అందించే చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 అందిస్తున్నారు. ఈ సొమ్ము నా కుటుంబానికి ఎంతో ఉపకరిస్తుంది. నా భర్త గీత కార్మికుడు. వయస్సు మీదపడడంతో పనులకు వెళ్లలేకపోతున్నాం. ఈ సొమ్ముతో ఏటా అందించడంతో మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదల బతుకుల్లో భరోసా కల్పించారు. – మారిశెట్టి గన్నెమ్మ, వేములూరు, జగనన్న కాలనీ, కొవ్వూరు మండలంవైఎస్సార్సీపీ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి వైఎస్సార్ పింఛన్ కానుక రూ.1,40,750. వైఎస్సార్ చేయూత రూ.56,250 ఇంటి స్థలం విలువ రూ.2,00,000 ఇంటినిర్మాణానికి ఆర్థిక సాయం రూ.1,80,000 మొత్తం లబ్ధి రూ.5,77,000 -
పేదలకు ఇళ్లు కాలనీలు కాదు ఊళ్లు
నిన్నటి కన్నా ఈ రోజు బాగుండాలి...ఈ రోజు కన్నా రేపు బాగుండాలి...ఎవరైనా కోరుకునేది ఇదే...సగటు మనిషి కాస్తంత నీడ కోసం పరితపిస్తాడు...తన సంపాదన ఓ చిన్న గూడును కట్టుకోవడానికీ చాలకపోతే ప్రభుత్వం సాయపడుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తాడు...ప్రభుత్వం ఓట్ల కోసం తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వస్తే మోసపోయానే...అని తనలో తానే మథనపడతాడు...మోసమనే ఇటుకతో గాలిలో మేడలు కట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదలను ఇలాగే వంచించింది... ఆ వంచనకు శాస్తిగా బాబును చిత్తుగా ఓడించింది జనసామాన్యం...ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు ఆచరణ రూపమిస్తే జననీరాజనం ఎలా ఉంటుందో నేడు జగన్ మేం సిద్ధం యాత్ర సాక్ష్యంగా నిరూపిస్తోంది... ఆ హామీ పేరు పేదలకు ఇళ్లు...అర్హతే ప్రాతిపదికగా దేశంలోనే రికార్డుగా...ఒక ఘనతగా చెప్పేలా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలకు గాలిలో కాదు...నేలపైనే మేడలు...ఇంకా చెప్పాలంటే ఊళ్లకు ఊళ్లను నిర్మిస్తూ...నవ్యాంధ్ర చరితను సీఎం జగన్ తిరగరాస్తున్నారు... స్థలం విలువ ఆధారంగా చూస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తిని ఉచితంగా కట్టబెట్టిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని జనసామాన్యమే ఉప్పొంగిపోతోంది...ఇది కదా మాటకు కట్టుబడి...మడమ తిప్పని ప్రభుత్వానికి సార్థకత. –వడ్డే బాలశేఖర్, సాక్షి ప్రతినిధిప్రతి పేదవాడు ఏం కోరుకుంటాడు? ‘కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవడానికి ఓ సొంత గూడు’.. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా తమకంటూ ఓ సొంత గూడు లేని పేదలు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వేళంగిణి, దుర్గ తరహాలనే రాష్ట్రంలో తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనే ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నాన్ని తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. రాష్ట్ర, దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పేదలకు పెద్ద ఎత్తున ఉచితంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణానికి సాయం, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇలా ప్రతి అడుగులోనూ చేయి పట్టి అక్కచెల్లెమ్మలను ముందుకు నడిపారు. ఇదిలా ఉండగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశానాలతో పోల్చిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒక పర్యాయం సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి ఏనాడు పేదల గూడు గోడును పట్టించుకోలేదు. అడ్డంకులను అధిగమిస్తూ... రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం రూపంలో ఏకంగా కొత్తగా ఊళ్లకు ఊళ్లనే సీఎం జగన్ గడిచిన ఐదేళ్లలో నిర్మించ తలపెట్టారు. 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తద్వారా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. పేదలకు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుంది. ఈ లెక్కన ఏకంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ప్లాట్ల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకు పైమాటే. నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల సాకారానికి చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు వేస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అడుగడుగునా పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ, తమ మద్దతుదారుల ద్వారా కోర్టుల్లో 1,000 కేసులను వేయించి, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ఈ అడ్డంకులేవీ జగన్ మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా పంపిణీ చేసిన స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులను సీఎం జగన్ ప్రభుత్వం కల్పించింది. వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించింది. 2024లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టి 15 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మిగిలిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. పేదల తరపున పెత్తందారులతో యుద్ధం అమరావతిలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన నిరుపేదలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమతుల్యత (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్) ఏర్పడుతుందని టీడీపీ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చింది. అయినా జగన్ మనోబలం సడలిపోలేదు. పేదల తరపున పెత్తందారులతో సీఎం జగన్ ప్రభుత్వం యుద్ధం చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి విజయం సాధించి గత ఏడాది 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పేదలకు అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికీ టీడీపీ మద్దతుదారులు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అడ్డంకులను సైతం అధిగమించి అనుమతులు రాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి గత ఏడాది జూలై 24న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ టీడీపీ పేదల ఇళ్లకు అడ్డుపడుతూ తన కపటబుద్ధిని ప్రదర్శించింది. మరోమారు కోర్టుకు వెళ్లి పేదల ఇళ్ల నిర్మాణంపై స్టే తెచ్చి నిర్మాణాలను అడ్డుకుంది. కోర్టులనూ మోసం చేసిన టీడీపీ... మహిళల పేరిటే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఎందుకివ్వాలనే అభ్యంతరాలతో హైకోర్టులో తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది పిటిషన్ వేశారు. దీనిపై విచారణæ జరిపిన న్యాయస్థానం 2021లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత తాము కోర్టులో పిటిషన్ వేయలేదంటూ వారు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ దళారులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ఆధార్, రేషన్ కార్డులతో పాటు, వారి సంతకాలు, రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకూ డబ్బు వసూళ్లు చేశారు. ఇలా మా నుంచి తీసుకున్న ధ్రువపత్రాలతో మాకే తెలియకుండా కోర్టుల్లో టీడీపీ నాయకులే కేసులు వేశారంటూ అప్పట్లో పేదలు బయటకు వచ్చి చెప్పారు. యర్రజర్ల కాల్వ సమస్యకు ఫిర్యాదు చేద్దామంటూ బల్లి ప్రభాకర్‌రావు, జాజుల హరికృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి తెల్ల కాగితంపై సంతకం, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకుని ఇళ్ల పట్టాల పంపిణీపైనా టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారు. తమను టీడీపీ నాయకులు మోసగించినదానిపై లిఖితపూర్వకంగా వివరించారు. రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు రికార్డు సృష్టించడమే కాకుండా, కరోనా, కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను ఎదురొడ్డి అనతికాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టి మరో సరికొత్త రికార్డును సీఎం జగన్ కైవసం చేసుకున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం వివిధ దశలుగా 21.75 లక్షల ఇళ్ల (19.13 లక్షలు సాధారణ ఇళ్లు, 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలినవి శరవేగంగా నిర్మితమవుతున్నాయి. సాధారణ ఇళ్లలో 11.61 లక్షల గృహాలు వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. 2020 డిసెంబర్ 25న కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాలను పంపిణీ చేయడంతో పాటు పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్ల నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించారు. ఉచితంగా స్థలం... ఆపై అమిత సాయం ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు, ఎస్‌హెచ్‌జీల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేల చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చింది. గేటెడ్ కమ్యూనిటీల తరహాలో... పేదలకు సొంత గూడు కల్పించడమే కాకుండా కాలనీలను ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీల తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాలమైన రోడ్లు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, పార్కులు, ఇంటర్నెట్ సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్ర మంలో మౌలిక సదుపాయా ల కల్పన కోసమే ఏకంగా రూ.32,909 కోట్లను వెచ్చిస్తోంది. చంద్రబాబు రూ.8,929.81కోట్ల అవినీతి చంద్రబాబు తన అక్రమాలకు పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించేందుకు 2016–17లో రాష్ట్రంలో అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇలా నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టింది. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1,000 మధ్య ఉండగా... కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు చాలినంత భూమి లేదని 3.15 లక్షల ఇళ్లకే శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించేందుకు అనుమతులిచ్చి రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షల భారం మోపి, 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాలని షరతు పెట్టింది. దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. ఇంకా 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. వాళ్లిప్పుడు లక్షాధికారులుఒకప్పుడు అద్దె ఇళ్లలో, పూరిగుడిసెల్లో ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు పడ్డ మహిళలు, నిరుపేద కుటుంబాలు సీఎం జగన్ చొరవతో లక్షాధికారులుగా మారారు. అది ఎలాగంటే... మహిళల పేరిట రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ విలువ చేసే స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికీ సాయం చేశారు. స్థలం, ఇంటి రూపంలో ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ప్రాంతాన్ని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ మార్కెట్ విలువ చేసే స్థిరాస్తి సమకూరినట్లయింది. ఇలా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టించింది. సమాజంలో గౌరవం పెరిగింది. నా భర్త భవన నిర్మాణ కార్మికుడు. మాకు సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటున్నాము. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు ఇంటి అద్దెలు. కుటుంబ పోషణ భారం. మా అద్దె ఇంటి కష్టాల నుంచి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఇంటిస్థలం రిజిస్ట్రేషన్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. జగనన్న దయతో సొంతింటి భాగ్యం కలిగింది. గతంలో మాకంటూ సొంతిల్లు లేదని బంధువులు, సన్నిహితుల్లో చిన్న చూపు ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. సమాజంలో మాకు గౌరవమూ పెరిగింది. – మీసాల వనజాక్షి, వైఎస్సార్ జగనన్న కాలనీ, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా మాగోడు విన్న నేత సీఎం కావాలి నా భర్త భానుప్రసాద్ పెయింటింగ్ పని చేస్తారు. మా ఇద్దరు పిల్లలతో కలిసి మా అత్తమ్మ వాళ్లింట్లో ఉండేవాళ్లం. ఒకే ఒక గది. ఆ గదిలోనే వంట చేసుకోవాలి. ఇరుకు ఇంట్లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. మా కష్టాలను సీఎం జగన్ ప్రభుత్వం ఆలకించింది. ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల రుణమూ ఇచ్చింది. ఇప్పుడు మాకు రూ.15 లక్షలకు పైగా విలువైన సొంత ఆస్తి ఉంది. మా గూడు గోడు విని, గోడు తీర్చిన నేతనే సీఎంగా మళ్లీ కావాలి. ఆయన్ని మేం సీఎం చేసుకుని తీరుతాం. – బుడితి బాలామణి, దగ్గులూరు, పశ్చిమగోదావరి జిల్లా పథకం అమలులో కీలక ఘట్టాలు► 2020 డిసెంబర్: 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 28 ఏప్రిల్ 2022: పథకంలో రెండో దశకు శ్రీకారం. 1.24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. 3.53 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 27 మే 2023: సీఆర్డీఏలో రూ.3,506 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 1,402.58 ఎకరాల భూమి 50,793 మంది అక్కచెల్లెమ్మలకు పంపిణీ. ► 24 జూలై 2023: సీఆర్డీఏలో 47,071 పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన. బాబు చేతిలో దగాపడ్డ టిడ్కో లబ్ధిదారులకు అండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో ప్రభుత్వం 2,62,212 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. పేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తోంది. 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున వాటా చెల్లించాలనే నిబంధనలో సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ఈ ప్రభుత్వమే చెల్లించింది. దీంతో రెండు, మూడు కేటగిరీల పేదలు గత ధరల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు ఈ సర్కారు తగ్గించింది. విద్యుత్, రోడ్లు వంటి అన్ని వసతుల కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ చార్జీలు భరించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్ల మేలు పొందారు. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లను నూరు శాతం నిర్మాణం పూర్తి చేసి, 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. ► ఈ ఫొటోలో సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతి స్వామి, వేళంగిణిలది బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామం. వీరు రెండేళ్ల క్రితం గ్రామంలోని కృష్ణా కెనాల్‌కు సంబంధించిన పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించేవారు. ఆ గుడిసెలోనే వేళంగిణి అమ్మ, అన్నయ్య కుటుంబాలూ ఉండేవి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ...ఈ కుటుంబం ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా...ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలం, ఇంటిని మంజూరు చేసి నిర్మించి ఇచ్చింది. 2022 సెప్టెంబర్‌లో ఈ కుటుంబం ఆ ఇంటిలోకి మారింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికాను. దీపం వెలుతురు తప్ప కరెంటు కనెక్షన్ ఉండేది కాదు. వర్షాలు కురిస్తే మా గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురుగు నీరు బయటకు వెళ్లిపోయి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ రోడ్డు పక్కనే ఉండేవాళ్లం. సాధారణ రోజుల్లోనూ మురికి నీటి కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెల్లోకి వచ్చేసేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇంటినీ నిర్మించి ఇచ్చింది. గుడిసెల్లో నివాసం దినదినగండమే. కంటి నిండా నిద్రపోయిన రోజులే లేవు. ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లుంది. గుడిసె కష్టాలన్నీ తొలగిపోయాయి..’ అని వేళంగిణి సంతోషం వ్యక్తం చేస్తోంది. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన మేడిశెట్టి దుర్గ భర్త సంచులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుర్గ కూలి పనులకు వెళుతుంటారు. వారికి ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేదు. 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. దంపతుల అరకొర సంపాదన ఇంటి అద్దె, కుటుంబ పోషణకే సరిపోతుంది. సీఎం జగన్ ప్రభుత్వంలో దుర్గకు విస్సాకోడేరు జగనన్న లే అవుట్లో స్థలంతో పాటు ఇల్లు మంజూరయింది. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలకు, కొంత సొంత నగదు జోడించి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు అద్దె బాధలు తప్పాయని ఆ కుటుంబం సంబరంగా చెబుతోంది. ఇక్కడ సెంటు స్థలం రూ.4 లక్షలు ఉంటుందని, జగనన్న దయతోనే తమ కల నెరవేరిందని ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలైనా సొంతింటిలో జీవించాలని మాకు కోరిక. సీఎం జగన్ మా కోరికను నెరవేర్చారని భావోద్వేగానికి గురయ్యారు. -
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
ఆ ఇంటి యజమాని ఓ ప్రైవేట్ డ్రైవర్. తన సంపాదనతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆ కుటుంబంలో తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అరకొర సంపాదన తిండికే సరిపోయేది కాదు. తల్లికి రూ.200 మాత్రమే వితంతు పింఛన్ వచ్చేది. భార్య ఎంఏ, బీఈడీ చదివింది. నాలుగురాళ్లు వెనకేసుకుని పిల్లలను బాగా చదివించుకోవాలనే ఆశ ఉన్నా... సర్కారు సహకారం కొరవడింది. ఇదీ గతంలో అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన వెన్నపూస ఓబిరెడ్డి కుటుంబ పరిస్థితి. ఎన్నో ఒడుదుడుకులను తట్టుకుంటూ నెట్టుకు వచ్చిన ఈ కుటుంబం నేడు వైఎస్సాసీపీ ప్రభుత్వ సహకారంతో సుఖసంతోషాలతో జీవిస్తోంది. – అనంతపురం 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి ఓట్లు వేస్తే డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా ప్రతినెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాటలతో ఓబిరెడ్డి కుటుంబం గంపెడు ఆశలు పెట్టుకుంది. తీరా ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. వారి హామీతో మూడు నెలలు అప్పు కట్టలేదు. నెలనెలా వడ్డీ పెరుగుతోందని బ్యాంకు సిబ్బంది హెచ్చరిస్తూ వచ్చేవారు. ఒకవేళ మాఫీ చేసినా..మీరు చెల్లించిన సొమ్ము వెనక్కు ఇస్తామని, మాఫీ చేయకపోతే వడ్డీ మీ నెత్తిన పడుతుందని చెప్పారు. దీంతో సభ్యులంతా మాట్లాడుకుని అప్పు కడుతూ వచ్చారు. అలాగే ఇంట్లో ఉన్న బంగారమంతా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.70 వేలు రుణం తీసుకున్నారు. అదికూడా మాఫీ కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఈ నాలున్నరేళ్లలో మొత్తం రూ.7,36,000 మేరకు ఆర్థిక సహాయాన్ని పొందారు. వైఎస్సార్ ఆసరా కింద భార్యకు రూ.44 వేలు వచ్చింది. వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. ఇంటి పెద్ద కన్నుమూయగా వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష వచ్చింది. యానిమేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తోంది. ఇప్పుడు తమ కుటుంబం ఆనందంగా గడుపుతోందని ఓబిరెడ్డి ప్రమీల చెప్పారు. ‘సంక్షేమం’ లేకుండా సుస్థిరాభివృద్ధి అసాధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడం అసాధ్యం. ఏపీ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. వీటిద్వారా సగటు మానవుని జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. – గుర్రం జయపాల్‌రెడ్డి, జెడ్పీ రిటైర్డ్ సీఈఓ ఓబిరెడ్డి కుటుంబానికి కలిగిన లబ్ధి ఇలా... పథకం టీడీపీలో వైఎస్సార్సీపీలో డ్వాక్రా రుణమాఫీ 00 రూ.44 వేలు పింఛన్ రూ.62,000 రూ.1.89 లక్షలు ఆరోగ్యశ్రీ 00 రూ.60 వేలు వైఎస్సార్బీమా 00 రూ.1 లక్ష సున్నా వడ్డీ 00 రూ.8 వేలు విద్యా దీవెన 00 రూ.25 వేలు వసతి దీవెన 00 రూ.15 వేలు అమ్మ ఒడి 00 రూ.55 వేలు నిరుద్యోగ భృతి రూ.4 వేలు 00 యానిమేటర్ 00 రూ.2.40 లక్షలు -
అప్పులు లేకుండా ఆనందంగా..
ఉన్నది 20 సెంట్ల భూమి. కౌలుకు మరో ఎకరం దేవదాయ శాఖ భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. సమయానికి విత్తుకుంటే సరేసరి... లేదంటే అంతేమరి. ప్రకృతి సహకరిస్తే నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేది. లేదంటే అప్పులకోసం తప్పని తిప్పలు. తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లు. చినుకు రాలకుంటే ఆవేదన... అతిగా వానపడితే ఆందోళన. అదనుకు విత్తనం దొరక్కున్నా... అవసరం మేరకు ఎరువులు లభించకపోయినా... ఆ ఏడాదంతా బతుకు దినదిన గండమే. ఇదీ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గోకర్ణపురానికి చెందిన కర్తల చిరంజీవులు కుటుంబ పరిస్థితి. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. తోడబుట్టిన చెల్లెలు వారితోనే. కుటుంబమంతా కష్టపడితేనే కడుపునిండేది. లేకుంటే పస్తులే గతి. అలాంటి కుటుంబానికి ప్రభుత్వాల సాయం ఎంతో అవసరం. –కంచిలి 2019లో రాష్ట్రంలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థి కంగా నిలదొక్కుకుంది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సాయం అందింది. వ్యవసాయం పండగైంది. అవసరమైన పెట్టుబడి అదనుకు ముందే అందుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. సొసైటీ గోదాముల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంటి ముంగిటకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవి వచ్చిచేరుతున్నాయి. పండించిన పంటకు ఈ క్రాప్‌లో నమోదు కావడంతో మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ప్రకృతి పగబట్టి పంటను తినేస్తే నష్టపరిహారం సొమ్ము ఆ సీజన్ ముగియక ముందే అందుతోంది. ఇంటి ఇల్లాలు రత్నానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కింద ఏటా నగదు ఖాతాలో పడుతోంది. సోదరి రుక్మిణమ్మకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. గడచిన నెలలో వివాహమైన పెద్దకొడుకు మాధవరావుకు కల్యాణ మస్తు పథకం కింద రూ. 50వేలు అందింది. చిన్నకొడుకు జోగారావు కిడ్నీలో రాళ్లు చేరితే డాక్టర్లు రూ. 50వేలు ఖర్చవుతుందన్నారు. పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని ప్రభుత్వ సాయంతో ఎదుర్కోగలమన్న నమ్మకం ఏర్పడింది. బతుకుపై భరోసా దక్కింది. ఆర్థిక సమస్యలు తీరాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మా ఆర్ధిక సమస్యలు తీరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నయాపైసా సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చులు మొదలుకొని, కుటుంబ అవసరాలకు సైతం ఇబ్బంది పడేవాళ్లం. చిన్నపాటి అవసరానికీ అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఇంచుమించు ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతంగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో నాలుగు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. – కర్తల చిరంజీవులు -
నిస్సహాయ స్థితిలో పెద్దదిక్కులా
సిఫార్సు లేకుండానే పింఛన్ మంజూరు ఆరు నెలల క్రితమే నా భర్త మృతి చెందారు. వలంటీర్ వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే పింఛన్ మంజూరైంది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వలేదు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, పింఛన్ సొమ్ములతో బతుకుతున్నాను. మా లాంటి పేదోళ్లను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. – తిగిరిపల్లి దమయంతి, వీర్రాజు తల్లి, పెద్దేవం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి వీర్రాజు కుటుంబానిది అత్యంత దయనీయ గాథ.. వీర్రాజు, అతని భార్య ఇద్దరూ దివ్యాంగులే. ఇంతలో అతనికి పక్షవాతం రావడంతో కుటుంబం ఒక్కసారిగా ఉపాధి మార్గం కోల్పోయింది. ఆ తరుణంలో వారికి ఈ ప్రభుత్వం అందించిన నవరత్నాలు ఆదుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మోపెడ్‌పై ఆకుకూరలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. దివ్యాంగుడినైన నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచి్చంది. కుటుంబ పోషణ భారమైంది. నా భార్య బధిరురాలు. ఇప్పుడు జగనన్న దయతో ఇద్దరికీ దివ్యాంగ పింఛన్ అందుతోంది. ఇంటి స్థలం కూడా మంజూరైంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తల్లికి రూ.3 వేలు వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. కుమార్తె చదువుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చాయి. అంతేగాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో వారి పెద్దమ్మాయి దివ్యకు ఉద్యోగం లభించింది. దివ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఆమెకు జీఎస్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ.18 వేలు జీతం ఇస్తున్నారు. త్వరలో ఇంటి నిర్మాణం కూడా ప్రారంభిస్తాం అని వీర్రాజు ఆనందం చేస్తున్నారు. –కొవ్వూరు -
ఉన్నత చదువులకు జగనన్న దీవెన
మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీకి చెందిన బోనాసి జాన్‌బాబు మండల పరిధిలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన భార్య బోనాసి రేచల్ గృహిణి. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అత్త వెంకటమ్మ ఆలనాపాలనా కూడా వీరిదే. చర్చికి వచ్చే దాతలు ఇచ్చే అరకొర కానుకలతో కుటుంబ పోషణ భారంగా నడిచేది. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులెలా? అన్న భయం వెంటాడేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబం దిశ తిరిగింది. సంక్షేమ పథకాలు ఆ ఇంటి ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాయి. పాస్టర్ జాన్‌బాబు పెద్ద కుమారుడు బోనాసి విలియయ్బాబు మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చేశాడు. విద్యాదీవెన కింద రూ.3,28,000, వసతి దీవెన కింద రూ.20,800 అందాయి. దీంతో విజయ్‌బాబు చదువు సాఫీగా సాగింది. బీటెక్ పూర్తవడంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం 2023లో విదేశీ విద్యాదీవెన కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.51 లక్షలు మంజూరైంది. ప్రస్తుతం అస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న మోనాస్ యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. కుమార్తె బోనాసి ఏంజెల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.75 వేలు లబ్ధి చేకూరింది. చిన్నబ్బాయి బోనాసి బిడియన్ 7వ తరగతి చదువుతున్నాడు. జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇలా చదువుకు అవసరమైనవన్నీ ప్రభుత్వం ఉచితంగా అందించింది. పైసా ఖర్చు లేకుండానే తన బిడ్డల్ని చదివించుకుంటున్నట్లు జాన్‌బాబు తెలిపారు. పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనంతో సగర్వంగా బతుకుతున్నట్లు చెప్పారు. ఆయన అత్త వెంకటమ్మకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. –మదనపల్లె సిటీ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో గణనీయ మార్పు గతంలో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే కష్టంగా ఉండేది. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వీరి జీవన ప్రమాణాలు పెరిగాయి. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెనలతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇలాంటి విద్యార్థుల ఎదుగుదల, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్చివేస్తున్నాయి. – ఎం.నాగేంద్ర, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, బీటీ కళాశాల, మదనపల్లె కుటుంబసభ్యులతో జాన్‌బాబు ► జాన్‌బాబు కుటుంబానికి కలిగిన లబ్ధి విదేశీ విద్యాదీవెన రూ.51,00,000 ►విద్యాదీవెన రూ.3,28,000 ►వసతి దీవెన రూ.20,800 ►అమ్మ ఒడిరూ.75,000 ►సున్నా వడ్డీ రూ.1,167 ►ఇంటి స్థలం రూ.6,00,000 ►పాస్టర్ల గౌరవ వేతనం రూ.1,25,000 -
AP Navaratnalu Scheme: నాడు బతుకు భయం.. నేడు కొండంత ధైర్యం..
అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. అడగకుండానే.. అన్నీ ఇచ్చిన జగనన్న ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్ ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి. అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. –బూర్జ సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక అమలు చేస్తు న్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్ ఆరో గ్యశ్రీ వల్ల నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఈ ఆర్థిక సహాయం వల్ల రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతోంది. – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూర్జ -
AP Navaratnalu Scheme: మా బతుకులు మార్చిన దేవుడు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అప్రతిహతంగా అమలవుతున్న నవరత్నాల పథకాల ద్వారా తమ బతుకులు ఎలా మెరుగుపడ్డాయో ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే... మా బతుకులు మార్చిన దేవుడు చిన్నపాటి వ్యాపారం చేసుకుని బతికే కుటుంబం మాది. ఇటీవలి కాలం వరకూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో చిన్న కిరాణా షాపు ద్వారా జీవనం సాగించాం. నా భర్త సుతాపల్లి సర్రాజుకు వయసుమీరడం, వ్యాపారం తగ్గిపోవడంతోపాటు స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో దుకాణం ఆపేశాం. దీంతో తీవ్ర ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆపద్బాంధువునిలా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా మంజూరు కాని వృద్ధాప్య పింఛను నా భర్తకు మంజూరైంది. నాకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15 వేలు, ఇంటర్ చదువుతున్న మా అబ్బాయి శ్రీదత్తసాయి నాగపుష్యంత్కు అమ్మఒడి కింద రూ.15 వేలు ఆరి్థక సాయం ఏటా అందుతోంది. సుమారు రూ.3 లక్షల విలువైన ఇంటి స్థలం దక్కింది. వివిధ పథకాల ద్వారా అందిన ఆరి్థక సాయంతో రాజమహేంద్రవరంలో హోల్‌సేల్‌గా టీ పొడి, బిర్యానీ మసాలా సరుకులు కొనుగోలు చేసి తెచ్చుకుని, ఇంటి వద్ద ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాం. మా బతుకులు మార్చిన దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – సుతావల్లి సుబ్బలక్ష్మి, కొత్తపేట (జగత శ్రీరామచంద్రమూర్తి, విలేకరి, కొత్తపేట) పస్తులు లేకుండా జీవిస్తున్నాం నేను కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడిని. నాకు వృద్దాప్యం రావడంతో ఇప్పుడు పనులు చేయలేకపోతున్నాను. నా కుమార్తె పత్తి సైలేంద్రకు భర్త లేడు, ఆమె కొడుకు రాజశేఖర్ దివ్యాంగుడు. ముగ్గురం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురం పంచాయతీ రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్నాం. నా వయస్సు 80 సంవత్సరాలు, కూలి పనులకు వెళ్ళడానికి అవకాశం లేక పోవడంతో అదాయం లేక తినడానికి ఇబ్బందులు పడ్డాం. పింఛన్‌కోసం గత ప్రభుత్వం హయాంలో ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. జగన్మోహన్రెడ్డి వచి్చన తరువాత నా మనవడికి దివ్యాంగ పింఛన్ నెలకు మూడు వేలు, నాకు వృద్దాప్య పింఛన్ వస్తోంది. ఈ మొత్తంతో జీవనోపాధి పొందుతున్నాం. జగనన్న పుణ్యమాని మా బతుకులు మారాయి. ఆయనే లేకుంటే మా కుటుంబం పస్తులుండాల్సి వచ్చేది. ఆయన సాయం ఎప్పటికీ మరువలేం. – చింతాడ అప్పారావు, రామకృష్ణాపురం (అల్లు నరసింహ రావు విలేకరి కొత్తూరు) -
AP Navaratnalu Scheme: ఆపద వేళ ఆదుకున్న సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆపద వేళ ఆదుకున్న సర్కారు నా పిల్లలు చిన్నగున్నప్పుడే మా ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి కుటుంబ పోషణ బాధ్యత నాపై పడింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉంటున్నాం. ఏదో ఒక పనికి వెళితేగాని పూట గడిచేది కాదు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. గత ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగానూ ఆదుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నా పరిస్థితి బాగుపడింది. ఏ దిక్కూ లేని మా కుటుంబానికి సంక్షేమ పథకాలు అండగా నిలిచాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.28 వేలు వచ్చిది. పెన్షన్ కానుక ప్రతి నెలా వస్తోంది. ఆ డబ్బులతో కిరాణా, కూరగాయల వ్యాపారం ప్రారంభించాను. దాంతోపాటు కుట్టు మెషిన్ కొనుగోలు చేసి ఖాళీ సమయాల్లో బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జగనన్న చేదోడు ద్వారా లబ్ధి పొందాను. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. దాంతో పిల్లల చదువుల భారం తప్పింది. మా కష్టాలన్నీ తీరాయి. దానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – జుత్తిక వెంకటలక్ష్మి, చేబ్రోలు (సూర్యనారాయణమూర్తి, విలేకరి, గొల్లప్రోలు) భర్త చనిపోతే అండగా నిలిచారు నేను ఓ ఇంట్లో పని చేసుకుంటున్నా. కూలి పనులు చేసుకుంటూ నన్ను, పిల్లల్ని పోషించిన మా ఆయన సీతా రామ్‌కుమార్ రెండేళ్ల క్రితం ఆకస్మికంగా చనిపోయారు. అప్పుడు ఈ ప్రభుత్వమే ఆదుకుని మా కుటుంబాన్ని నిలబెట్టింది. విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలోని సంతపేటలో నివసిస్తున్న మాకు నా భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద రూ.లక్ష అందించింది. దరఖాస్తు చేసిన వెంటనే వితంతు పింఛన్ మంజూరైంది. నా పెద్ద కుమారుడు కేశవ సాయి శ్రీ ఆంజనేయ సంతపేటలోని అంబేడ్కర్ జీవీఎంసీ హైసూ్కల్లో 6వ తరగతి, రెండో అబ్బాయి దిల్వర్ధన్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 3 తరగతి చదువుతున్నారు. ఏటా రూ.15 వేల వంతున అమ్మఒడి వస్తోంది. కావలసిన పుస్తకాలు, యూనిఫాం వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో పిల్లల చదువు భారం తప్పింది. ప్రతి నెలా ఉచితంగా 15 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇల్లు లేని నాకు ఆనందపురం మండలం జగన్నాథపురంలో రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉంది. మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని ఆశిస్తున్నా. – బోర గౌరి, సంతపేట (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) చేనేత వృత్తికి పునరుజ్జీవం మా తాతల కాలం నుంచి చేనేత వృత్తినే జీవనాధారంగా చేసుకుని కాలం గడుపుతున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొనుసుల కొత్తూరులో బట్టలు నేసుకుని వాటిని అమ్ముకుని జీవించేవాళ్లం. కానీ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ వృత్తిలో కొనసాగడం కష్టమైంది. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వ్రస్తాల తయారీకి అవసరమైన ముడి సరుకు ధరలపై ట్యాక్స్ ఎత్తివేయడంతో కొంత వరకు మాకు సాయ పడింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. బతుకు తెరువుకోసం వలస పోవాలని అనుకున్నాం. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి వచ్చాక మా పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేలు వంతున నేతన్న నేస్తం పథకం కింద అందించారు. దాంతో మా వృత్తికి కొంత భరోసా లభించింది. ముడి సరుకు తెచ్చుకునేందుకు అప్పు చేయాల్సిన బాధ తప్పింది. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా మొత్తం రూ.1.20 లక్షలు వచ్చిది. మా నాన్నకు వృద్దాప్య పింఛన్, అమ్మకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 వచ్చిది. మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి విద్యుత్ సబ్సిడీ వస్తోంది. ఇంత కంటే మాకింకేం కావాలి? మా సంక్షేమానికి కృషి చేసిన జగనన్న రుణం తీర్చుకుంటాం. – యర్ర సూర్యనారాయణ, కొనుసులకొత్తూరు (లింగూడు వెంకటరమణ, విలేకరి, టెక్కలి) -
AP Navaratnalu Scheme: పాపను బతికిస్తున్న పింఛన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పాపను బతికిస్తున్న పింఛన్ థలసేమియా వ్యాధితో బాధ పడుతున్న నా కుమార్తె రక్షితకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి నెలా రూ.10 వేలు పింఛన్ అందిస్తున్నారు. నా కుమార్తె రక్షిత ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఐదు నెలల వయస్సులో పాప అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళితే ఎనిమిదో నెల వయసులో థలసేమియాగా వైద్యులు నిర్ధారించారు. నా భర్త రవికుమార్ వ్యవసాయ కూలీ. ఇంతకు ముందు ఆటో ఉండేది. పాప వైద్యం కోసం అమ్మేశాం. ప్రస్తుతం పాప వయస్సు 11 ఏళ్లు. నెలకు రెండుసార్లు బీ పాజిటివ్ రక్తం ఎక్కించాలి. మందులు, రక్తమార్పిడికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. సీఎంగా జగనన్న అధికారంలోకి రాగానే పాపకు నెలకు రూ.10 వేలు పింఛన్ అందించారు. పాప బతికి ఉండడానికి కారణం సీఎం జగనన్నే. ఆయన రుణం తీర్చుకోలేం. నాకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ అయింది. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. పాపకు బోన్‌మ్యారో శస్త్ర చికిత్స చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీఎం జగన్నే నమ్ముకున్నాం. – కాంతామణి, వాలమర్రు (కె.శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) ఈ మేలును మరచిపోం మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం. నా భర్త కడాలి వెంకట రమణ 20 ఏళ్ల కిందటే మృతి చెందారు. నాకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఐదుగురికి వాహాలయ్యాయి. కుమారులు ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆడపిల్లలు ఇక్కడే ఉంటున్నారు. నా భర్త మరణానంతరం వైఎస్సార్ ప్రభుత్వంలో నాకు పింఛన్ మంజూరైంది. ప్రతి నెలా రూ.3 వేలు వస్తోంది. నా కుమార్తెలు ముగ్గురికీ అమ్మ ఒడి కింద ఏటా రూ.15,000 చొప్పున అందుతోంది. వీటితోపాటు వీరికి ఆసరా, చేయూత పథకాలు వర్తిస్తున్నాయి. ఈ ప్రభుత్వం నిర్ణయాల వల్ల మాలాంటి పేదలు హాయిగా జీవిస్తున్నారు. పిల్లల చదువులకు దిగుల్లేకుండా పోయింది. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ప్రభుత్వమే అండగా నిలిచింది. ఆసరా, చేయూత పథకాల ద్వారా వచ్చిన సొమ్ముతో ఎంతో మంది సొంత కాళ్లపై నిలబడటం ఊరూరా కనిపిస్తోంది. ఇంత మేలు చేసిన సీఎం జగన్‌ను ఎవరు మరచిపోతారు? – కడాలి రాములమ్మ, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) అప్పులబారి నుంచి బయటపడ్డాం మాది డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామం. నిరుపేద రజకుల కుటుంబం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు మాకు అందడంతో జీవనం హాయిగా సాగుతోంది. నాకు, నా కూతురికి ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలు వైఎస్సార్ ఆసరా అందింది. చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75,000 అందాయి. జగనన్న చేదోడు కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందించారు. నా భర్తకు ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్, మా అమ్మాయికి వికలాంగ పింఛన్ రూ.3 వేలు అందుతోంది. మా వలంటీర్ మాతో అన్నీ పూర్తి చేయించి ఈ సంక్షేమ పథకాలు అందేలా చేశారు. పథకాలతో వచ్చిన ఆర్థిక సాయంతో పాడి పశువులు పెంచుకుంటూ లబ్ధి పొందుతున్నాం. అప్పులు తీర్చుకున్నాం. సీఎం జగన్ చేసిన మేలు మరచిపోలేం. – నందంపూడి సత్యవతి, గొల్లవిల్లి(నల్లా విజయ్‌కుమార్, విలేకరి, ఉప్పలగుప్తం -
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
సమస్యలు తీరి సంతోషంగా జీవనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సమస్యలు తీరి సంతోషంగా జీవనం నేను వ్యవసాయ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో కాపురం ఉంటూ వచ్చిన అరకొర ఆదాయంతో పిల్లల చదువులు ఎలా అని నిత్యం తల్లడిల్లిపోయే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు చాలా మేలు జరిగింది. బడికెళ్తున్న మా అమ్మాయికి ఐదేళ్లుగా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు వంతున వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 వంతున, వైఎస్సార్ ఉచిత పంట బీమా ద్వారా రూ.6,460, ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా రూ.31,950 వచ్చాయి. ముఖ్యంగా నిరుపేదలైన మాకు విలువైన ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయంగా రూ.1.80 లక్షలు మంజూరయ్యాయి. దాంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవిస్తోందంటే దానికి కారణమైన ముఖ్యమంత్రి జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అంసూరి జయపాలకృష్ణ, కపిలేశ్వరపురం (పెద్దింశెట్టి లెనిన్ బాబు, విలేకరి, కపిలేశ్వరపురం) బిచ్చగాళ్లను కాస్తా లక్షాధికారులను చేశారు మా తల్లిదండ్రులు, తాతలు సంచార జీవనం గడుపుతూ... ఆకివీడులోని దుంపగడప రైల్వే గేటు వద్ద రైల్వే స్థలంలో 50 ఏళ్లుగా గుడారాల్లో జీవనం గడిపారు. నా తల్లిదండ్రులు రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని జీవించారు. మాకు, మా తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు చదువులు లేవు. గుంతలు, కాల్వల్లో చేపలు పట్టుకుని భిక్షాటన చేసి జీవనం సాగించాం. రైల్వే స్థలం నుంచి మమ్మల్ని ఖాళీ చేయించినప్పుడు అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పెద్ద మనస్సుతో మా తల్లిదండ్రులకు సమతానగర్ రోడ్డులోని చినకాపవరం డ్రెయిన్ వద్ద స్థలాలు ఇచ్చారు. పాకలు, రేకుల షెడ్లు వేసుకుని మా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాం. నాకు పెళ్లయిన తరువాత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 11 మంది చెంచులకు కుప్పనపూడి శివారు తాళ్లకోడు వద్ద ఒక్కొక్కరికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం చేశారు. డ్వాక్రా రుణం తీసుకుని, కొద్దిగా అప్పు చేసి ఆ మొత్తానికి జమచేసి మేము పక్కా భవనం నిర్మించుకుంటున్నాం. జగనన్న దయతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున సాయం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలో మంచిగా చదువు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు దుస్తులు, బ్యాగ్‌లు, పుస్తకాలు, టై, బూట్లు ఇవ్వడం బాగుంది. ప్రస్తుతం మేము చేపలు పట్టుకోవడంతోపాటు చిన్నచిన్న పనులు చేసుకుని జీవిస్తున్నాం. బిక్షగాళ్లుగా ఉన్న మమ్మల్ని లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌దే. ఆయనకు రుణపడి ఉంటాం. – నల్లబోతుల అప్పన్న తాళ్లకోడు (బీఆర్ కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు) ఇంతటి సాయం ఎన్నడూ ఎరుగం మాది నిరుపేద కుటుంబం. ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో చిన్న చికెన్ దుకాణాన్ని పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. గత ప్రభుత్వంలో ఏ మేలూ జరగలేదు. ఈ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరింది. స్థలం మంజూరు చేయడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. నా భార్య వరలక్ష్మి ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ నాకు అండగా నిలుస్తోంది. ఆమెకు చేదోడు కింద గత మూడేళ్లగా ఏటా రూ.10 వేలు, అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. మాకు ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణ పడి ఉంటాం. – దొమ్మా వీరబాబు, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) -
ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు నేను తాపీ పని చేస్తుంటాను. పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టానికి చెందిన మేము పొట్టకూటికోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాం. గాయత్రీకాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవాళ్లం. నా కొచ్చే అరకొర ఆదాయం సరిపోకపోవడంతో నా భార్య సంధ్య.. ఇంట్లో టైలరింగ్ పని చేస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వ హయాంలో మాకు పని సరిగ్గా ఉండేది కాదు. ఎలాంటి సాయమూ అందేది కాదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మా పరిస్థితి మెరుగు పడింది. మాకు చేతి నిండా పని దొరుకుతోంది. ఈ ప్రభుత్వంలోనే మాకు రైస్ కార్డు ఇచ్చారు. బడికెళ్తున్న మా అబ్బాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది. మరీ ముఖ్యంగా ఎవరి సిఫారసు లేకుండానే ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు ఇచ్చారు. అందరిలానే మేం కూడా కంచరాం సమీపంలో మాకు ఇచ్చిన స్థలంలో సొంత ఇంటిని నిరి్మంచుకున్నాం. నెల రోజుల క్రితం గృహ ప్రవేశం చేశాం. కేవలం అర్హతే ప్రామాణికంగా ఎలాంటి పైరవీలు లేకుండా ఇన్ని సౌకర్యాలు కల్పించిన ఈ ప్రభుత్వం రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. – గంధవరపు సురేష్, రాజాం. (వి.వి.దుర్గారావు, విలేకరి, రాజాం) పేపర్ ప్లేట్ల తయారీతో దర్జాగా జీవనం నేను సాధారణ గృహిణిని. విశాఖ జిల్లా చిట్టివలస గ్రామానికి చెందిన నేను గత ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగుతున్నాను. నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని కావడంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా జీవీఎంసీ భీమిలి జోన్ ద్వారా పట్టణ ప్రగతి యూనిట్ పేరుతో రెండు నెలల క్రితం పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ పెట్టుకున్నా. ఈ యూనిట్ విలువ రూ.2,02,500. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.39,600. యూనిట్‌కు యంత్ర పరికరాలు, మెటీరియల్ ప్రభుత్వమే ఇచ్చింది. ప్రోత్సాహకంగా నాలుగు నెలల అద్దె కింద మరో రూ.20 వేలు ఇచ్చారు. పేపర్ ప్లేట్ల తయారీలో భాగంగా పాలిథిన్ రహిత పేట్ల తయారీలో శిక్షణ తీసుకున్నా. పేపర్ అట్టలపై విస్తర్లు ఉంచి సంప్రదాయ పద్ధతిలో భోజనాలకు అనువుగా వినియోగదారుల అభిరుచి మేరకు తయారు చేయగలుగుతున్నా. వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇల్లు లేని మాకు ఇంటి స్థలం ఇవ్వడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షల ఆర్థికసాయం చేశారు. దాంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగాం. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఈ ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – వెంపాడ అరుణ, చిట్టివలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) -
త్వరలో మా గృహ ప్రవేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. త్వరలో మా గృహ ప్రవేశం రెక్కాడితేగాని డొక్కాడని మాకు గూడు కల్పించిన దేవుడు సీఎం జగన్. మాది పేద కుటుంబం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీనివాస కాలనీ తండాలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. మేము కూలి పనులకు వెళ్తేనే పూట గడిచేది. కొన్నేళ్ల క్రితం నా భర్త స్వామినాయక్‌కు ప్రమాదం వల్ల రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో నడవలేని పరిస్థితి ఏర్పడి మంచానికే పరిమితమయ్యారు. ఈ స్థితిలో నా కూలి డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఒక రోజు పని ఉంటే రెండో రోజు దొరికేది కాదు. అటువంటప్పుడు ఒక పూట పస్తులతోనే పడుకునే వాళ్లం. గత ప్రభుత్వంలో నా భర్తకు దివ్యాంగ పింఛను కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యాంగ పింఛను మంజూరు చేశారు. మా పెద్దబ్బాయి దత్తసాయి నాయక్ పిడుగురాళ్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో అబ్బాయి పవన్‌నాయక్ మన్నెం పుల్లా రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తుండడంతో వారి చదువులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కూలి డబ్బుల్లో అధిక భాగం ఇంటి అద్దెకే సరిపోయేది. ఈ ప్రభుత్వం వచ్చాక నా పేరుతోనే ఆదర్శనగర్ జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాలు ఇల్లు కూడా నిర్మించి మా సొంతింటి కల నెరవేర్చారు. త్వరలో గృహ ప్రవేశం చేయబోతున్నాం. నాకు ఆసరా, సున్నా వడ్డీ ద్వారా సాయం అందింది. మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్ కు మేమంతా రుణపడి ఉంటాం. – రామావత్ సరితాబాయి, పిడుగురాళ్ల (షేక్ మస్తాన్‌వలి, విలేకరి, పిడుగురాళ్ల) మా బతుకుల్లో ఎంతో మార్పు మాది పేద కుటుంబం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. మాది ఏలూరు జిల్లా మండవల్లి గ్రామం. నా వయసు 38 ఏళ్లు. నా కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వస్తున్నాయి. దీంతో పాటు కావలసిన పుస్తకాలు, యూనిఫాం, స్కూలు బ్యాగు, షూస్ వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో చదువు భారం పూర్తిగా తప్పింది. ఆసరా ద్వారా రూ.15 వేలు లబ్ధి చేకూరింది. నా భర్త కాలికి గాయం కావడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యానికి రూ.80 వేలు ప్రభుత్వం అందించింది. మా అత్తకు ప్రతి నెలా ఒకటో తారీఖునే రూ.3 వేల వృద్ధాప్య పింఛన్ అందుతోంది. జగనన్న పాలన స్వర్ణయుగం. మాకు ఏ చీకూ చింతా లేదు. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం అందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ ఆయనే సీఎం అయితేనే మాలాంటి పేదలు హాయిగా బతుకుతారు. – చిగురిపాటి ప్రశాంతి, మండవల్లి (భోగాది వీరాంజనేయులు, విలేకరి, మండవల్లి) పెద్దన్నలా ఆదుకున్నారు మాది పేద కుటుంబం. పశి్చమగోదావరి జిల్లాలోని పెనుగొండ మా ఊరు. చాలా ఏళ్ల కిందటే నా భర్త మృతి చెందాడు. తల్లిదండ్రులు, సోదరులపై ఆధారపడి జీవిస్తున్నా. ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్న నన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దన్నలా ఆదుకున్నారు. మాకు ఇంటి స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించారు. మా సొంతింటి కల సాకారమైంది. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ రూ.37,600 నా ఖాతాలో జమ చేశారు. నా కుమార్తెకు జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా రూ.15 వేలు లబ్ధి చేకూరుతోంది. వితంతు పింఛను సొమ్ము రూ.3 వేల వంతున ప్రతి నెలా అందుతోంది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాం. – కొమ్మోజు అనంతలక్ష్మి, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా గుర్రాల శ్రీనివాసరావు, విలేకరి, పెనుగొండ) -
మా బతుకులు మార్చిన సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులు మార్చిన సర్కారు మాది అరకొర ఆదాయంతో జీవించే కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఒడిదొడుకుల జీవనం గడపాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక పరిస్థితి ఎంతో మారిపోయింది. మేము విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలసలో ఉంటున్నాం. డ్వాక్రా గ్రూప్ సభ్యురాలినైన నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.40 వేలు వచ్చింది. నా కుమారుడు శ్యామ్ సందీప్‌కు స్కూల్లో ట్యాబ్ ఇచ్చారు. కుమార్తె జెస్సికాకు అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది. నా భర్త చంటికి సెర్ప్ ద్వారా ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం రూ.3.30 లక్షలు వచ్చింది. వాహనమిత్ర ద్వారా ఏటా రూ.10 వేలు వంతున లబ్ధి కలిగింది. మా అత్త సరస్వతికి పెన్షన్ కానుక అందుతోంది. పద్మనాభం మండలం కురపల్లిలో 78 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అందించిన ఆర్థి క సాయంతో దుస్తుల వ్యాపారం చేస్తున్నా. నెలకు రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు మేమంతా సంతోషంగా ఉన్నాం. ఇందుకు కారణమైన జగనన్న రుణం తీర్చుకుంటాం. – పందిరి లక్ష్మి, మజ్జివలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) ఒంటరి బతుక్కు అండగా నిలిచారు నేను ఒంటరి మహిళను. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో నివాసం ఉంటున్నా. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నా బతుకు చిత్రం మారింది. జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సాయంతో ఇప్పుడు నేను సంతోషంగా జీవిస్తున్నా. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థి క సహాయం అందుతోంది. రజకులకు ప్రభుత్వం అందిస్తున్న చేదోడు పథకం ద్వారా రూ.10 వేలు అందుతోంది. ఒంటరి మహిళ పింఛన్ రూ.3 వేలు ప్రతి నెలా వలంటీర్ ఇంటికి తీసుకువచ్చి ఇస్తోంది. దీంతోపాటు ఇంటి బయట బడ్డీ పెట్టుకుని ఇస్త్రీ పెట్టె కొనుక్కొని.. బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ కొంత సంపాదిస్తున్నా. మాలాంటి పేదోళ్లకు, భర్త లేని వారికి, ఒంటరి మహిళలకు జగనన్న అందిస్తున్న సాయం మరువలేనిది. ఆయన రుణం తీర్చుకోలేనిది. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పథకాలు ఏవీ అందలేదు. జగనన్న రుణం తీర్చుకోలేనిది. – ఉంగుటూరు లక్ష్మి, పోలవరం (వ్యాఘ్రేశ్వరరావు, విలేకరి, పోలవరం రూరల్) ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఈ ప్రభుతం వచ్చాక వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.10,950,డ్వాక్రా రుణం రూ.లక్ష, స్త్రీనిధి కింద రూ.50 వేలు వచ్చింది. దీంతో మా గ్రామంలో నేను, నా భర్త రామచంద్రరావు దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మాకు శివ, పవన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరికీ వివాహాలు కావడంతో వారు రోజువారీ పనులు చేసుకుంటూ వారి బతుకులు వారు బతుకుతున్నారు. మా మనవళ్లకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. డ్వాక్రా రుణంతో దుకాణం పక్కనే చిన్న ఇల్లు కట్టుకొని కాపురం ఉంటున్నాం. ఈ ప్రభుత్వంలో వచ్చిన పథకాలతో ఆర్థి క ఇబ్బందులు తీరి ఆనందంగా జీవిస్తున్నాం. – సాలారపు సత్యవతి, పెద్దిపాలెం (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) -
ఆపత్కాలంలోనూ ఆదుకున్న దేవుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆపత్కాలంలోనూ ఆదుకున్న దేవుడు మాది మధ్యతరగతి కుటుంబం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన మాకు కొద్దిపాటి భూమి ఉన్నా... పంటలు పండిన దాఖలాల్లేవు. ప్రతి ఏటా పెట్టుబడి పెట్టడం... ఆనక పరిస్థితులు అనుకూలించక నష్టపోవడం మాకు అలవాటైపోయింది. ఈ పరిస్థితుల్లో అప్పులు తప్పేవి కాదు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సాయమందించిన దాఖలాల్లేవు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత అందించిన నవరత్నాల ద్వారా మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా భార్యకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750లు, వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.600, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.6,204 అందాయి. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున, వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ. 24వేలు అందింది. అంతేగాకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ వచ్చింది. కోవిడ్ వంటి ఆపత్కాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన మహానుభావుడు జగనన్న. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – భళ్ల సాయిమల్లికార్జున, అప్పనపల్లి (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు) పైసా ఖర్చు లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఉన్న ఊళ్లో ఉపాధి లేక ప్రస్తుతం విజయనగరం జిల్లా రేగిడి మండలం మడ్డువలస రిజర్వాయర్ ముంపు గ్రామం కొట్టిశ నుంచి 2001లో పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట గ్రామానికి వలస వచ్చాం. నేను బీఏ, బీఈడీ చేసినా ప్రభుత్వ ఉద్యోగం దొరకక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్ పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించుకున్నాను. నాకు రెండెకరాల భూమి, ఇల్లు ఉంది. పిల్లలు ఇద్దరూ పదో తరగతి పాసయిన తరువాత ఉన్నత చదువులు చదివించేందుకు శక్తి చాలక డిప్లమోలు చేయించాను. అబ్బాయి మణికృష్ణ అగ్రికల్చర్ డిప్లమో, అమ్మాయి కీర్తిప్రియ ఫిషరీస్ డిప్లమో చేశారు. అదృష్టవశాత్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాలు ఏర్పాటు చేయడంతో మా పిల్లలు ఇద్దరికీ సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. అబ్బాయి నూకలవాడ సచివాలయం, అమ్మాయి వెంగాపురం సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎవరి చుట్టూ తిరగలేదు. ఎవరికీ ఒక్క పైసా అయినా ఇవ్వలేదు. పూర్తిగా మెరిట్‌తోనే తప్ప లంచాలకు, సిఫార్సులకు తావులేకుండా నియామకాలు జరిగాయి. ఇంతటి పారదర్శకంగా మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – ఎ.పోలినాయుడు, బలిజిపేట (పి.కోటేశ్వరరావు, విలేకరి, సీతానగరం) ప్రభుత్వ సాయంతో చేపల వ్యాపారం ఈ ప్రభుత్వం అందించిన సాయంతో చేపల వ్యాపారం ప్రారంభించాను. రోజూ వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాను. మాది విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం. నేను మణికంఠ డ్వాక్రా గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్నాను. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు రూ.72 వేలు లబ్ధిపొందాను. చేయూత ద్వారా ఏటా 18,750 వంతున వచ్చింది. నా భర్త కొండకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందుతోంది. మా అబ్బాయి మత్స్యకార భరోసా ద్వారా రూ.50 వేలు వచ్చాయి. మనుమడు అప్పలరాజుకు విద్యాదీవెన కింద రూ.24వేలు, మనుమరాలు పూర్ణకు అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున ప్రభుత్వం నుంచి పొందాము. ఈ ప్రభుత్వం అందించిన పథకాల వల్ల వచ్చిన డబ్బుతో చేపల వ్యాపారం చేస్తున్నాను. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలు కొని తగరపువలస ప్రైవేట్ మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తాను. రోజుకు రూ.400 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలి. – గరికిన ధనలక్ష్మి, పెదనాగమయ్యపాలెం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) -
కుటుంబానికి ఆసరా దొరికింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కుటుంబానికి ఆసరా దొరికింది నేను, నా భర్త సుధాకర్‌తో కలిసి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సునీల్‌శర్మ పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. మాది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం. కూలినాలి చేసుకుని బతుకుతున్న తరుణంలో 2018లో నా భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆస్పత్రిలో చూపిస్తే కిడ్నీ పాడైందని డాక్టర్లు చెప్పారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలని దిగులుపడిన తరుణంలో 2019లో ముఖ్యమంత్రి జగనన్న కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ప్రతి నెలా పింఛన్ రూ.5 వేలు మంజూరు చేశారు. పెద్ద కుమారుడికి దివ్యాంగ పింఛన్ రూ.3 వేలు ఇస్తున్నారు. నాకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 అందుతోంది. వైఎస్సార్ ఆసరా పథకం వర్తించింది. మా అమ్మాయికి వివాహం చేశాను. చిన్నబ్బాయి అనిల్వర్మకు ఏటా అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందింది. ఈ రోజు మా జీవితం బాగుండటానికి కారణమైన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కందుల ఎలీశమ్మ, చినమనగుండం (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల) నా గుండె చప్పుడు సీఎం జగన్ నేను గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా. మేము వెల్దుర్తి ఎస్సీకాలనీలో నివసిస్తున్నాం. ఆదాయం అంతంత మాత్రమే. వచ్చిన ఆదాయంతోనే ఎలాగోలా జీవిస్తున్న తరుణంలో అనుకోకుండా గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదిస్తే గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలన్నారు. సుమారు రూ.33 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. అంతంత మాత్రం జీతంతో జీవిస్తున్న మాకు అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాలేదు. ఇక బతుకుపై ఆశ సన్నగిల్లింది. అప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాం. ఏంచేయాలో పాలుపోలేదు. నా సమస్యను ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెప్పాను. ఆయన ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో నాకు ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.33 లక్షలు మంజూరు చేశారు. ఐదు నెలల క్రితం తిరుపతి స్విమ్స్ వైద్యశాలలో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాకు ఆపరేషన్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో అతడి గుండెను నాకు అమర్చారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. సీఎం జగన్ నాకు పునర్జన్మ ప్రసాదించారు. నా కుమారుడికి అమ్మఒడి కింద ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ప్రభుత్వం మా గ్రామంలోని జగనన్న కాలనీలో మాకు ఇంటి స్థలం కూడా మంజూరు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతోషంగా జీవిస్తున్నాం. నా గుండె చప్పుడుగా మారిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. – చాగంటి సుమతి, వెల్దుర్తి(డి.వెంకటేశ్వర్లు, విలేకరి, వెల్దుర్తి) మమ్మల్ని దేవుడిలా ఆదుకున్నారు మాది నిరుపేద కుటుంబం. మా ఆయన గోవిందరావు రోజువారీ కూలీ. ఆయన అరకొర సంపాదనతోనే మా జీవితం సాగుతోంది. నేను దివ్యాంగురాలిని కావడంతో ఏ పనీ చేయలేను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లోని రామకృష్ణాపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. మాకు వైష్ణవి అనే కూతురు ఉంది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం చేయలేదు. ఇటీవల నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చూపించుకుంటే పరీక్షలు చేసిన డాక్టర్లు క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఏం చేయాలో పాలుపోలేదు. అయితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడంతో దాని ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్నా. ఇప్పడు ఆరోగ్యంగా ఉన్నా. జగనన్న ప్రభుత్వం శస్త్రచికిత్స సమయంలో రూ.పది వేలు సాయం అందించింది. కీమో థెరపీ సమయంలోనూ రూ.ఐదు వేల చొప్పున అందిస్తున్నారు. దివ్యాంగురాలినైన నాకు పింఛను వస్తోంది. మా పాపకు మూడేళ్లుగా అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వంతున వచ్చాయి. ఇంటి పట్టా కూడా మంజూరైంది. ఎటువంటి ఆసరా లేని మమ్మల్ని జగనన్న దేవుడిలా ఆదుకున్నారు. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – కుంటిమద్ది సుజాత, రామకృష్ణాపురం, విజయవాడ (సిద్దుబల్ల రాజేంద్రప్రసాద్, విలేకరి, పూర్ణానందంపేట) -
ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు మాది నిరుపేద కుటుంబం. మాకు ఏ విధమైన ఆస్తులూ లేవు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. అటువంటి మాకు ఒకటిన్నర సెంటులో ఇంటి స్థలం ఇచ్చి మా కుటుంబాన్ని జగన్ సర్కారు ఆదుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన మా కుటుంబానికి నవరత్నాల ద్వారా ఎంతో లబ్ధి చేకూరింది. నా భర్త వెంకటేశ్వరరావు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.రెండు లక్షలు విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. మా అబ్బాయి జగదీశ్‌కు జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.23,850 అందించారు. వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.68 వేలు అందింది. మా కుటుంబం ఈ రోజు ఆర్థి కంగా నిలదొక్కుకోవడానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – యడ్ల దుర్గ, మామిడికుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు) సంతోషంగా వ్యవసాయం మాది వ్యవసాయ కుటుంబం. సొంత భూమి లేకపోయినా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన శంకరరావు సాగు చేస్తున్నారు. అందులో వరి, చెరకు పండిస్తున్నాం. ఏటా వ్యవసాయానికి పెట్టుబడి అవసరం ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా అప్పు చేయడం.. పంట చేతికొచ్చాక తీర్చేయడం అలవాటు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పు చేయాల్సిన అవసరం తప్పింది. ఇప్పుడు రైతు భరోసా వస్తోంది. మా మామగారికి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా అత్తకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పు అందింది. మా అత్త చేయి ఆపరేషన్‌కు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చేయించుకోగలిగాం. మాకు ఇద్దరు పిల్లలు. వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. పాప పేరున మూడేళ్లుగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. మా కుటుంబానికి ఇంత మేలు జరిగిందంటే కారణం ఈ ప్రభుత్వమే. సీఎం జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అలుజు రజిని, కిమ్మి (కొలిపాక సింహాచలం, విలేకరి, వీరఘట్టం) అమ్మాయి చదువు బెంగతీరింది మా ఆయన విజయనగరం జిల్లా బాడంగి మండలం గూడెపువలస గ్రామంలో చిల్లర వ్యాపారం చేసేవారు. ఆయన సంపాదనతోనే మా కుటుంబం గడిచేది. అనుకోకుండా గతేడాదే ఆయన కన్ను మూయడంతో అక్కడ వ్యాపారాన్ని మూసేసి బాడంగిలో టీ కొట్టు పెట్టుకుని ఒక్కగానొక్క కుమార్తెను చదివించుకుంటున్నా. వచ్చిన ఆదాయంతో మా పాపకు ఉన్నత చదువులు అందించగలనా.. అన్న భయం ఉండేది. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం రావడంతో ఆ భయం తీరిపోయింది. మా అమ్మాయి సాహితి ప్రస్తుతం బాడంగిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు అందుతోంది. దీనివల్ల అమ్మాయి చదువు బెంగ తీరింది. నాకు వైఎస్సార్ పింఛన్ కానుక ప్రతి నెలా ఒకటో తేదీనే అందుతోంది. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటి వరకూ రూ.30 వేలు, సున్నా వడ్డీ కింద రూ.12 వేలు అందింది. ప్రస్తుతానికి మేము ఆర్థి కంగా కుదుటపడగలిగాం. ఇందుకు కారణమైన జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – బండి సంతోష్, గూడెపువలస (గొట్టాపు కృష్ణమూర్తి, విలేకరి, బాడంగి) -
ధైర్యంగా బతకగలుగుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ధైర్యంగా బతకగలుగుతున్నా మా ఆయన తిక్కస్వామి వ్యవసాయ కూలీ. ఆయన సంపాదనతోనే కర్నూలు జిల్లా పెద్దతుంబళం గ్రామంలో ఒడుదొడుకులతో సంసారం సాగేది. పనిలేనిరోజు పస్తులుండాల్సి వచ్చేది. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. మాకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. భర్త మరణంతో కుటుంబ పోషణ చాలా భారమైంది. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబానికి ఆసరా దొరికినట్టయింది. రూ. 30 వేలు పొదుపు రుణం సున్నావడ్డీ కింద తీసుకుని కుట్టుమెషీన్ కొనుక్కున్నా. నాకు వితంతు పింఛను కూడా వస్తోంది. మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఒకరికి అమ్మ ఒడి కింద రూ.15వేలు అందుతోంది. బడిలో మంచి ఆహారం, అవసరమైన పుస్తకాలు, యూనిఫాం వంటివి అందిస్తున్నారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా మంజూరైంది. ఎలాంటి భయం లేకుండా బతుకుతున్నానంటే జగనన్న ఆశీర్వాదమే కారణం. – బయటిగేరి రాజేశ్వరి, పెద్దతుంబళం (కపటి రామచంద్ర, విలేకరి, ఆదోని రూరల్) సాయం చేసి.. ఉపాధి బాట వేసి.. నా భర్త ఏలేటి కిరణ్‌తోపాటు నేను కూడా అద్దె ఆటో నడుపుతూ రాజమహేంద్రవరం మండలం కొంతమూరులో ఇద్దరు మగ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నాం. అద్దె ఆటో కన్నా సొంత ఆటో కొనుగోలు చేయాలనుకున్నాం. ధర కనుక్కుంటే రూ.4.50 లక్షల వరకూ అవుతుందని తెలిసింది. అంత సొమ్ము భరించలేమని భయపడ్డాం. ఆ సమయంలో సీఎం జగనన్న ‘ఉన్నత మహిళా శక్తి’ పథకం ద్వారా ఉపాధికి భరోసా కల్పించారు. ఎటువంటి వడ్డీ లేకుండా రూ.2.79 లక్షల విలువైన ఆటోను ప్రభుత్వం అందించింది. దీంతో మా కుటుంబం కుదుటపడింది. అంతేగాకుండా ఇంటి స్థలాన్ని మంజూరు చేసి పట్టా అందించారు. ఇద్దరు మగ పిల్లల్లో ఏలేటి సంజయ్ సాత్విక్ ఐదో తరగతి, ఏలేటి సంజయ్ సంపత్ మూడో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరిలో చిన్నవాడికి అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. అంతేకాకుండా వైఎస్సార్ విద్యా కానుక ద్వారా పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్‌లు, షూలు, సాక్సులు సైతం అందించారు. జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం పౌష్టికాహారమైన భోజనాన్ని పెడుతున్నారు. సీఎం జగనన్న ద్వారా జరిగిన మేలు మా కుటుంబం మరచిపోదు. జీవితాంతం రుణపడి ఉంటాం. – ఏలేటి దేవీదుర్గ, ఆటో డ్రైవర్ కొంతమూరు (యెనుముల విశ్వనాథం, విలేకరి, రాజమహేంద్రవరం రూరల్) పోతాయనుకున్న ప్రాణాలు నిలిపారు దుకాణాల్లోనూ, ఇళ్లలోనూ ధూపం వేస్తూ, దిష్టి తాళ్లు కడుతూ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో జీవించే కుటుంబం మాది. జిల్లాలో కోవిడ్ బారిన పడిన మొదటి వరుసలోని వ్యక్తిని. దాంతో మేమంతా తీవ్ర భయభ్రాంతులకు గురై, తీవ్ర మానసిక వేదన అనుభవించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖర్చుకు వెరవకుండా అండగా నిలిచి ప్రాణాలు నిలిపారు. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి 16 రోజుల పాటు వైద్యం చేయించారు. రెండు పూటలా పౌష్టికాహారం అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం టిఫిన్ ఇచ్చారు. సమయానికి మందులు ఇచ్చి ప్రాణాలకు అండగా నిలిచారు. భయభ్రాంతుల నుంచి నేడు సాధారణ జీవితంలోకి వచ్చి మళ్లీ జీవనోపాధిలో ముందుకు సాగడం అంతా సీఎం జగన్ చలవే. అంతేగాకుండా మా కుటుంబానికి అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు, నా భార్యకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.36 వేలు లబ్ధి చేకూరింది. సీఎంకు మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. – షేక్ ఖాసీం, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా (గుర్రాల శ్రీనివాసరావు, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా) -
క‘న్నీటి’ కష్టాలు తీరాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. క‘న్నీటి’ కష్టాలు తీరాయి మాది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం. వజ్రపుకొత్తూరు మండలం సీతాపురంలో చిన్నపాటి కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నా. నా భర్త చనిపోయారు. కొడుకు పెళ్లయ్యాక వేరే కాపురం ఉంటున్నాడు. కుమార్తె దివ్యాంగురాలు కావడంతో ఆమెను నేనే సాకుతున్నా. మా ప్రాంతంలో దశబ్దాలుగా కిడ్నీ వ్యాధిబారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. అనేక పరిశోధన సంస్థలు మా ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధికి తాగు నీరు ఒక కారణం అని తేల్చి చెప్పారు. మా గ్రామంలో ఉన్న బావి నీటిని తాగవద్దని అధికారులు చెప్పారు. అప్పటి నుంచి మంచి నీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ప్రాంతంలో ఇంటింటికి రక్షిత మంచి నీటిని కుళాయిల ద్వారా అందించి శాశ్వత పరిష్కారం చూపారు. గతంలో ఏ నాయకుడు మా బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. మా ఇంటికి కుళాయి నీరు వస్తుందని కలలో కుడా ఊహించలేదు. నాకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వచ్చింది. సున్నా వడ్డీ కింద రూ.5,694 వచ్చింది. నాకు, నా కుమార్తె(దివ్యాంగురాలు)కు పెన్షన్ వస్తుండటంతో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఉద్దాన ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కోటి జయమ్మ, సీతాపురం (కుసుమూరి చలపతిరావు విలేకరి, వజ్రపుకొత్తూరు రూరల్) ఇంత సాయం ఎన్నడూ ఎరుగం మాది నిరుపేద కుటుంబం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో నా భర్త అల్లు నరసింహారావు ఆర్ఎంపీ వైద్యునిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాకు ఏవిధమైన ఆస్తులు లేవు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సహాయ పడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున అందింది. జగనన్న ఇళ్ల కాలనీలో ఒకటిన్నర సెంటు స్థలం కూడా మంజూరైంది. మా అమ్మాయి ప్రసవానికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.35 వేల విలువైన చికిత్సను ఉచితంగా చేశారు. మా మనుమలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున సాయం అందిస్తున్నారు. మా లాంటి ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోడుగా నిలిచారు. మేమంతా ఆయనకు ఎంతో రుణపడి ఉంటాం. – అల్లు మాధవి, మామిడి కుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడి కుదురు) ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం నేను ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్ సమీపంలో టీ కొట్టు నడుపుకునేదాన్ని. నా భర్త సామ్యూలు గేదెల మారుబేరం వ్యాపారం చేసేవారు. ఏడాది క్రితం పక్షవాతం రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ సమయంలో ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. జగనన్న ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18750, రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 వంతున వచ్చింది. ఆ మొత్తంతో టీకొట్టు మానేసి ఇంటి వద్దే చిల్లర కొట్టు పెట్టుకున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించగలుగుతున్నా. నా భర్తకు పక్షవాతం రావడంతో నెలకు రూ.3 వేల వంతున పింఛన్ వస్తోంది. రెండో కొడుకు దివ్యాంగుడు కావడంతో పింఛన్ వస్తోంది. ఇప్పుడు నా కుటుంబం గడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మా కుటుంబానికి అండగా నిలిచిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – గుంటి మార్తమ్మ, బేస్తవారిపేట (పెరుమారెడ్డి హనుమంతారెడ్డి, విలేకరి, బేస్తవారిపేట) -
కష్టాల నుంచి బయటపడ్డాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్టాల నుంచి బయటపడ్డాం మాది సామాన్య కుటుంబం. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని నంబర్–1 పాఠశాల సమీపంలో నివసిస్తున్నాం. నా భర్త 2014లో మృతి చెందిన తరువాత నేను టైలరింగ్ చేయడం మొదలుపెట్టాను. అయినా కుటుంబాన్ని పోషించుకోవడం కొంచెం కష్టంగా మారింది. జగనన్న అధికారంలోకి వచ్చాక మేం ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం. మా ఇంటికి వలంటీర్ వచ్చి నాతో పింఛనుకు దరఖాస్తు చేయించారు. పింఛన్ మంజూరైంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ మొత్తం రూ.54,400లు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750లు వంతున అందింది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున వచ్చింది. నా కుమారుడు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. నేను ప్రస్తుతం టైలరింగ్ చేసుకుంటూ జగనన్న పుణ్యంతో çఎటువంటి సమస్యలూ లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. జగనన్న అందిస్తున్న సాయానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. – షేక్ మీరా బేగం, మొగల్తూరు (వి.లక్ష్మీ గణేష్, విలేకరి, మొగల్తూరు) సమస్యలు తీరి సంతోషంగా జీవనం మాది పేద కుటుంబం. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం ఇందుకూరుపేటలో గతంలో కూలీ పనులు చేసుకుని జీవించేవాళ్లం. వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. వయసు రీత్యా కొంత అనారోగ్యంతో పనులకు వెళ్లలేకపోయాం. గత ప్రభుత్వం ఏ విధంగానూ మాకు సాయం అందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు కొండంత అండగా నిలిచాయి. వైఎస్సార్ పింఛన్ అందుతోంది. నా భార్యకు కాపు నేస్తం కింద ఏడాదికి రూ.15 వేలు వంతున అందింది. రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు ఏటా రూ. 13,500లువంతున, టైలరింగ్ చేసే నా కోడలికి జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.50 వేలు జమయ్యాయి. నా మనవరాలికి అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు అందింది. జగనన్న ప్రభుత్వంలో మా పేద కుటుంబం కష్టాలు తీరాయి. మా కుటుంబమంతా జగనన్నకు రుణపడి ఉంటుంది. – రావిపాటి చెల్లారావు, దేవీపట్నం (కె.వెంకటేశ్వరరావు, విలేకరి, దేవీపట్నం) అద్దె ఇంటి బాధ తప్పింది మాది వ్యవసాయ కుటుంబం. నా భర్త కుటుంబరావుకు నేను తోడుగా ఉండి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో వ్యవసాయం చేసేవాళ్లం. అన్ని సీజన్లూ అనుకూలంగా ఉండేవి కాదు. అప్పుడప్పుడు పంట చేతికందకపోతే నష్టాలు చవిచూసేవాళ్లం. అప్పుడు అప్పులు చేయాల్సి వచ్చేది. మమ్ములను గత ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదు. కనీసం ఇల్లయినా మంజూరు చేయలేదు. ఇక సొంతిల్లు కలగానే మిగిలిపోతుందని భయపడ్డాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ కల తీరింది. మాకు ఇంటి స్థలమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఇంటినిర్మాణం పూర్తికావచ్చింది. మా అబ్బాయి ఉన్నత చదువులు చదువుతున్నాడు. వాడికి జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.90,500లు, వసతి దీవెన ద్వారా రూ.50 వేలు వచ్చింది. నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.13,909, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.6,255, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున వచ్చింది. ఇన్ని విధాలుగా ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – వల్లూరి వాణి, మైసన్నగూడెం (అచ్యుతరామ్, విలేకరి, జంగారెడ్డిగూడెం రూరల్)