ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మాకిక శాశ్వత చిరునామా
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మాది. నేను, మా ఆయన అవుగడ్డ శ్రీరామమూర్తి కలసి కూలి పని చేస్తే వచ్చే కొద్ది పాటి ఆదాయంపైనే కుటుంబ పోషణ సాగేది. సొంత ఇల్లు లేకపోవడంతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువ గ్రామంలోని అమ్మోళ్ల ఇంట్లో చిన్నపాటి ఇరుకు గదిలో ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవారం. పిల్లలు ఎదుగుతున్నా సొంత ఇల్లు లేదన్న మనోవేదన వెంటాడేది. గత ప్రభుత్వంలో ఇంటి కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. గ్రామ వలంటీర్, సచివాలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి «ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలం, ఇల్లు ఇస్తుందని చెప్పి, వారే దరఖాస్తు నింపి తీసుకెళ్లారు. వారి మాటలను తొలుత మేము నమ్మలేదు.
కొన్ని రోజుల తర్వాత వలంటీర్ వచ్చి తారువలోని జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరైందని చెప్పారు. ఒకటిన్నర సెంటు స్థలంతో పాటు.. ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. మరికొంత సొమ్ము కలిపి ఇల్లు నిర్మించుకున్నాం. మూడు నెలల క్రితం గృహ ప్రవేశం చేశాం. ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిరుపేద కుటుంబానికి చెందిన మేము సొంతిల్లు నిర్మించుకుంటామని కలలో కూడా అనుకోలేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హాయిగా నివసిస్తున్నాం. పెద్దబ్బాయి ఇంటర్, రెండో అబ్బాయి 9వ తరగతి చదువుతున్నారు. ఏటా 15 వేలు చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా నగదు వస్తుండడంతో వారి చదువులపై బెంగ లేదు. మాకు ఈ ప్రభుత్వం శాశ్వత చిరునామా కల్పించింది. – అవుగడ్డ సుగుణ, తారువ (పక్కుర్తి గణేష్ , విలేకరి, దేవరాపల్లి)
పేద బతుకులకు సర్కారు అండ
మాది నిరుపేద కుటుంబం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. చాలా కాలం కిందటే మా ఆయన కాలం చేశారు. పిల్లలను ఎలా పెంచాలి, ఎలా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కుమిలిపోయేదాన్ని. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ భయం పోయింది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మా గ్రామంలో మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న నాకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఒక్కోవిడతలో రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం జమ చేసింది.
దానిని సద్వినియోగం చేసుకుని, జగనన్న తోడు పథకం కింద రెండు విడతల్లో అందించిన రూ.20 వేలు, బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకుని ఆ డబ్బుతో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాం గ్రామంలో కిరాణా దుకాణం పెట్టుకున్నాను. నెలకు రూ.16 వేలు ఆదాయం వస్తోంది. ప్రతినెలా వితంతు పింఛన్ రూ.3 వేలు అందుతోంది. నా పెద్ద కూతురు టి.భవానీ ఇంజినీరింగ్, చిన్న కూతురు వరలక్ష్మి డిగ్రీ చదువు ప్రభుత్వ తోడ్పాటుతో పూర్తయింది. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి లేకుంటే మా పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యేది. – తూమాడ శాంతమ్మ, గొల్లలములగాం (ఎమ్.సతీష్ కుమార్, విలేకరి, చీపురుపల్లి)
మా పిల్లలను పనికి పంపట్లేదు
మాఆయన మహ్మద్ మాబు హోటల్లో వంట మాస్టారుగా పని చేస్తున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామంలో జీవనం సాగిస్తున్నాం. ఆరి్థక ఇబ్బందులు వెంటాడడంతో మా కుమారుడు ఖాసిం ఒకటో తరగతి చదువుతున్న సమయంలో బడి మాని్పంచి నా భర్త తనతో పాటు పనికి తీసుకెళ్లాలని భావించాడు. అయితే నాలుగేళ్ల క్రితం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించడంతో బడికి పంపుతున్నాం.
మా గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నాం. నాలుగేళ్లుగా అమ్మఒడి డబ్బులతో పాటు ప్రతి ఏడాది విద్యాకానుక కింద స్కూల్లోనే బ్యాగు, పుస్తకాలు, బట్టలు, బూట్లు, నోట్సులు అన్నీ ఇస్తున్నారు. పాఠశాలలోనే చక్కటి మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఐదో తరగతిలోకి వచ్చాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి ద్వారా రూ.15 వేలు బ్యాంకులో వేస్తున్నారు. మా అబ్బాయిని ఇలాగే ఎక్కడా ఆపకుండా పెద్ద చదువులు చదివిస్తాం. మాలాంటి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – కరీమూన్, గనికపూడి (కె.శ్రీనివాసరావు, విలేకరి, గుంటూరు ఎడ్యుకేషన్)
Comments
Please login to add a commentAdd a comment