ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సొంతింటి కల నెరవేరింది
కూలి పని చేసుకొని బతుకు బండి లాగుతున్నాం. తద్వారా వచ్చిన డబ్బుల్లో సగం అద్దెలు కట్టేందుకే సరిపోయేది. ఇక సొంతిల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నాం. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. బతుకుతెరువు కోసం 20 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లా జె.పంగులూరుకు వలస వచ్చాం. నా భర్త సుబానీ ఆటో అద్దెకు తీసుకుని నడుపుతుంటారు. నేను టైలరింగ్ చేస్తాను. మాకు ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేకపోవడంతో 15 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లోనే ఉన్నాం. ఇద్దరం సంపాదించిన డబ్బుతో కుటుంబం గడవడమే కష్టంగా ఉండేది. ఇంటి అద్దె కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చేది.
పస్తులుండి అద్దెలు కట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వం మా కష్టాలను పట్టించుకోలేదు. ప్రజా ప్రతినిధులూ కన్నెత్తి చూడలేదు. కష్టాలతో సహవాసం చేస్తున్న సమయంలో వైఎస్సార్ïÜపీ ప్రభుత్వం వచ్చింది. నవరత్నాల్లో భాగంగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగానే వలంటీరు వచ్చి స్థలం వచ్చిందని చెప్పాడు. మా సంతోషానికి ఎల్లలు లేవు. ఇల్లు కూడా మంజూరు కావడంతో ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందించింది. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం. కాలనీలో మొట్టమొదటి ఇల్లు మాదే.
ఇప్పుడు అందులోనే పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నాం. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరింది. మా అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. మూడేళ్లు అమ్మ ఒడి కింద రూ.45 వేలు రావడంతో అమ్మాయి చదువు కోసం ఎటువంటి ఇబ్బంది పడలేదు. మాకు ఇప్పుడు ఏ చీకుచింతా లేదు. – షేక్ నన్నేబీ, జె.పంగులూరు (అడుసుమల్లి సోమ శ్రీనివాసరావు, విలేకరి, అద్దంకి)
ఉపాధికి ఆసరా తోడైంది
మాది చాలా పేద కుటుంబం. నా భర్త షేక్ అబ్దుల్లా కార్ డ్రైవర్. నేను గుంటూరు జిల్లా తెనాలిలో ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటా. ఇద్దరి కష్టంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబం గడిచేది. మాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సానియా రుక్సానా అయిదో తరగతి, చిన్న కూతురు ముస్కాన్ నాలుగో తరగతి చదువుతున్నారు. మా అమ్మ కూడా మాతోనే కలిసి ఉంటోంది. అయిదుగురు సభ్యుల కుటుంబం. మా సంపాదనతో రోజూ జీవనం గడవటమే కష్టంగా ఉండేది. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించగలమా? అన్న ఆందోళనతో ఉండేవాళ్లం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా జీవితం మారిపోయింది.
వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగు విడతలుగా రూ.48 వేలు వచ్చాయి. ఇదే పథకం కింద మా అమ్మకు కూడా రూ.48 వేలు వచ్చింది. ఇద్దరికీ కలిపి ప్రభుత్వం రూ.96 వేలు మా ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున అందుతోంది. ఆ డబ్బుతో నాకున్న సాధారణ కుట్టుమెషీన్ అమ్మేసి, అధునాతన మెషీన్ కొనుక్కున్నా. నూతన మోడల్స్‌తో విభిన్నంగా మహిళల వస్త్రాలు కుడుతుండడంతో పనులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనికితోడు టైలరింగ్ మెటీరియల్ కూడా విక్రయిస్తున్నా. ఇప్పుడు నా ఆదాయం పెరిగింది.
త్వరలోనే మెయిన్‌బజార్‌లో టైలరింగ్ దుకాణం ప్రారంభించాలని సన్నాహాలు చేసుకుంటున్నా. పెద్దమ్మాయికి అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. దానివల్ల పిల్లల్ని ఇబ్బంది లేకుండా చదివించుకోగలుగుతున్నాం. గతంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా పరిస్థితి మెరుగు పడింది. ఇందుకు కారకులైన జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – షేక్ ఫాతిమున్నీసా, తెనాలి(బి.ఎల్.నారాయణ, విలేకరి, తెనాలి)
ఆరోగ్యశ్రీతో పునర్జన్మ
నేను వెల్డింగ్ పని చేస్తూంటా. రోజూ పనికెళ్తేనే మాకు పూట గడిచేది. ఏలూరు జిల్లా మండవల్లి గ్రామంలో భార్య నాంచారమ్మ, ఇద్దరు పిల్లలనూ అరకొర ఆదాయంతోనే పోషించుకుంటున్నా. గత ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. అతి కష్టంగా జీవనం సాగించాల్సి వచ్చింది. అంతలో ఓ రోజు నాకు అనారోగ్యం చేసింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే నా గుండెకు స్టంట్లు వేయాలని డాక్టర్లు చెప్పారు. రోజంతా కష్టపడితే వచ్చిన మొత్తం కుటుంబ పోషణకే సరిపోతుంది. స్టంట్లు వేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. ఇంతలో మా ఏఎన్‌ఎం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని చెప్పింది.
వెంటనే విజయవాడలోని సెంటిని ఆస్పత్రిలో చేరగా 2022 ఆగస్టు 23న గుండెకు రెండు స్టంట్‌లు వేశారు. దీనికైన ఖర్చు రూ.3 లక్షలు మొత్తం ప్రభుత్వమే భరించింది. ప్రభుత్వం నాకు పునర్జన్మ ప్రసాదించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నా భార్యకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18 వేలు వంతున అందింది. నాకు వైఎస్సార్ పింఛను కానుక కింద నెలకు రూ.3 వేలు ఒకటో తేదీనే వలంటీరు ఇంటికొచ్చి ఇస్తోంది. నా మనుమరాలు 8వ తరగతి చదువుతోంది. తనకు అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.13 వేలు వస్తోంది. మా కోడలికి ఆసరా ద్వారా ఏటా రూ.14 వేలు వచ్చింది. మా కుటుంబానికి ఇంత మేలు చేస్తున్న జగన్ మేలు ఎన్నటికీ మరువలేము. – బోయిన నారాయణరావు, మండవల్లి (బోగాది వెంకట వీరాంజనేయులు, మండవల్లి)
Comments
Please login to add a commentAdd a comment