రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అప్రతిహతంగా అమలవుతున్న నవరత్నాల పథకాల ద్వారా తమ బతుకులు ఎలా మెరుగుపడ్డాయో ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...
మా బతుకులు మార్చిన దేవుడు
చిన్నపాటి వ్యాపారం చేసుకుని బతికే కుటుంబం మాది. ఇటీవలి కాలం వరకూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో చిన్న కిరాణా షాపు ద్వారా జీవనం సాగించాం. నా భర్త సుతాపల్లి సర్రాజుకు వయసుమీరడం, వ్యాపారం తగ్గిపోవడంతోపాటు స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో దుకాణం ఆపేశాం. దీంతో తీవ్ర ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆపద్బాంధువునిలా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా మంజూరు కాని వృద్ధాప్య పింఛను నా భర్తకు మంజూరైంది.
నాకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15 వేలు, ఇంటర్ చదువుతున్న మా అబ్బాయి శ్రీదత్తసాయి నాగపుష్యంత్‌కు అమ్మఒడి కింద రూ.15 వేలు ఆరి్థక సాయం ఏటా అందుతోంది. సుమారు రూ.3 లక్షల విలువైన ఇంటి స్థలం దక్కింది. వివిధ పథకాల ద్వారా అందిన ఆరి్థక సాయంతో రాజమహేంద్రవరంలో హోల్‌సేల్‌గా టీ పొడి, బిర్యానీ మసాలా సరుకులు కొనుగోలు చేసి తెచ్చుకుని, ఇంటి వద్ద ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాం. మా బతుకులు మార్చిన దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – సుతావల్లి సుబ్బలక్ష్మి, కొత్తపేట (జగత శ్రీరామచంద్రమూర్తి, విలేకరి, కొత్తపేట)
పస్తులు లేకుండా జీవిస్తున్నాం
నేను కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడిని. నాకు వృద్దాప్యం రావడంతో ఇప్పుడు పనులు చేయలేకపోతున్నాను. నా కుమార్తె పత్తి సైలేంద్రకు భర్త లేడు, ఆమె కొడుకు రాజశేఖర్ దివ్యాంగుడు. ముగ్గురం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురం పంచాయతీ రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్నాం. నా వయస్సు 80 సంవత్సరాలు, కూలి పనులకు వెళ్ళడానికి అవకాశం లేక పోవడంతో అదాయం లేక తినడానికి ఇబ్బందులు పడ్డాం.
పింఛన్‌కోసం గత ప్రభుత్వం హయాంలో ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. జగన్‌మోహన్‌రెడ్డి వచి్చన తరువాత నా మనవడికి దివ్యాంగ పింఛన్ నెలకు మూడు వేలు, నాకు వృద్దాప్య పింఛన్ వస్తోంది. ఈ మొత్తంతో జీవనోపాధి పొందుతున్నాం. జగనన్న పుణ్యమాని మా బతుకులు మారాయి. ఆయనే లేకుంటే మా కుటుంబం పస్తులుండాల్సి వచ్చేది. ఆయన సాయం ఎప్పటికీ మరువలేం. – చింతాడ అప్పారావు, రామకృష్ణాపురం (అల్లు నరసింహ రావు విలేకరి కొత్తూరు)
Comments
Please login to add a commentAdd a comment