కోటలు కూలుతాయనే కాకమ్మ కథలు  | FactCheck: Eenadu Wrong Writings On Navaratnalu Scheme, Facts Inside - Sakshi

FactCheck: కోటలు కూలుతాయనే కాకమ్మ కథలు 

Published Fri, Mar 1 2024 5:22 AM | Last Updated on Fri, Mar 1 2024 9:05 AM

Eenadu wrong writings on Navratna scheme  - Sakshi

రాష్ట్రంలో పేదల గూటికి ఏ ఢోకాలేదు

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లపై నిస్సిగ్గుగా ఈనాడు తప్పుడు రాతలు

సాక్షి, అమరావతి: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్ని­కల్లో టీడీపీ ఓటమి పాలైతే తాను భూములను కబ్జా­చేసి, చట్టాలను ఉల్లంఘించి కట్టుకున్న ఫిలిం సిటీ, సహా తన కోటలకు బీటలు వారుతాయన్న ఆందోళ­నతో రామోజీరావు కల్లు తాగిన కోతిలా చెలరేగిపో­తు­న్నారు. ఏదో ఒకటి చేసి తన పార్ట్‌నర్‌ చంద్ర­బాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపనతో సీఎం జగన్‌ ప్రభుత్వంపై తన అక్కసును నిత్యం వెళ్లగ­క్కుతున్నారు. తాజాగా.. పేదలకు ‘సొంతిళ్లు నమ్మక ద్రోహం’.. ‘ఏ నిమిషానికి ఏమి కూలునో!’ అంటూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై విషం చిమ్ముతూ గురువారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో వాస్తవాలకు దూరంగా అవా­స్తవ కథనాలను వండి వార్చడం ఇందులో భాగమే.

జగనన్న ఇళ్లు ఏ నిమిషంలో కూలు­తాయో.. తద్వారా పేదల ప్రాణాలకు ముప్పు అంటూ ఓ సరికొత్త డ్రామాకు ఈ కథనం ద్వారా రామో­జీ­రావు తెరతీశారు. నిజానికి.. పేదలందరికీ ఇళ్ల పథ­కం కింద రాష్ట్రంలో 31.19 లక్షల మంది నిరు­పేద­లకు ఉచితంగా ఖరీదైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వాటిల్లో సొంతిళ్లు సమకూరుస్తుంటే సిగ్గూశరం లేకుండా ఈ రాతలు ఏమిటి రామోజీ అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ పాల­నలో పేదల గూటికి, పేదోడికి ఏ ఢోకాలేదు.. అసలు ఈ రాష్ట్రంలో పేదలకు పట్టిన ఏలినాటి శని నువ్వు, మీ బాబే రామోజీ అని పేదలు చెబుతు­న్నారు. దీంతో పేదలు ఈ జన్మలో బాబుకు ఓటు వేయరని.. అదే జరిగితే తన కోటలు కూలుతాయని రామోజీ బెంబే­లెత్తి కట్టుకథలు, కాకమ్మ కబుర్లతో ఈనాడులో చేతి­కొచ్చింది నిస్సిగ్గుగా రాసిపారేస్తు­న్నారు. ఈ నేప­థ్యంలో.. పేదల గూడుపై ఈనాడు­లో ప్రచురించిన దుర్మార్గపు రాతల వెనుక వాస్తవాలు ఏమిటంటే.. 

ఈనాడు ఆరోపణ: అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్‌లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు నెలైనా కాకముందే కూలింది. కాంట్రాక్టర్‌ శ్లాబ్‌ వేస్తున్న సమయంలో సిమెంట్‌ తక్కువ వాడాడు..
వాస్తవం: రాయదుర్గం మున్సిపాలిటీలో ఉండే హేమ­జ్యోతి, ఆనందు దంపతులకు మల్లాపురం లేఅవుట్‌లో ఇల్లు మంజూరైంది. వీరు తమ ఇంటిని తామే నిర్మించుకునే ఆప్షన్‌ 1, 2 ఎంచుకున్నారు. ఇంటి నిర్మాణానికి బిల్లులు మంజూరుచేయడంతో పాటు, 15 టన్నుల ఇసుకను ఉచితంగా, 55 బస్తాల సిమెంట్, 270 కిలోల స్టీల్‌ సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేసింది. లబ్ధిదారులే ఒక తాపీ మేస్త్రీని గుర్తించి ఇంటి నిర్మాణం చేసుకున్నారు.

గత ఏడాది ఆగస్టులోనే ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ ఇల్లు ఆప్షన్‌–3 (ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లు) కింద నిర్మించినది కాదు. పైగా..  కూలింది శ్లాబ్‌ కాదు. ఇంటి ముందు భాగంలో ఉండే మూడు అడుగుల సన్‌షేడ్‌ భాగం. ఎక్కడ ఏం జరిగినా దానిని ప్రభుత్వానికి ఆపాదించి దుమ్మెత్తిపోయ­డమే పనిగా పెట్టు­కున్న రామోజీరావు.. ఈ వ్యవహారంలోనూ తన దగుల్భాజితనాన్ని ప్రదర్శించారు.

ఆరోపణ: పట్టణ ప్రాంతాల్లో పేదల ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 వేలు మాత్రమే ఖర్చుచేస్తోంది.
వాస్తవం: ఇల్లులేని నిరుపేదలందరికీ రూ.15 లక్షల వరకూ మార్కెట్‌ విలువైన ఇంటి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. ఈ లేఅవుట్‌లలో లెవెలింగ్, తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.రెండు వేల కోట్లు వెచ్చించారు. శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తున్నారు. దీనికి­తోడు.. ఒక్కో యూనిట్‌కు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు.

ఇందులో పట్టణాల పరిధిలో రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.78 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి అదనంగా పావలా వడ్డీకి రూ.35వేలు బ్యాంకు లోన్‌ సమకూరుస్తున్నారు. రూ.15 వేలు విలువైన 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతోపాటు, రూ.40వేల వరకూ మేలుచేస్తూ స్టీల్, సిమెంట్‌ ఇతర నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ప్రభుత్వం పేదలకు ఇంత పెద్దఎత్తున మేలు చేస్తుంటే కేవలం రూ.30 వేలు ఖర్చుచేస్తున్నారని రామోజీరావు రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. 

ఆరోపణ: ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణం కేవలం ఒక శాతం మాత్రమే పూర్తయింది. ఇళ్ల నిర్మాణాల కేటాయింపులో కేవలం ఒక ఏజెన్సీకే మేలు చేశారు..
వాస్తవం: ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేమని, ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌–3ని 3,55,256 మంది  ఎంచుకున్నారు. వీరందరినీ స్థానికంగా గుర్తించిన లేబర్‌ ఏజెన్సీలకు అనుసంధా­నం చేసి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకూ 72,906 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం ఆప్షన్‌–3 ఇళ్లలో 20 శాతం నిర్మా­ణం పూర్తయ్యాయి.

కానీ, ఈనాడు మాత్రం ఒక శాతం మాత్రమే పూర్తయ్యా­యని ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే రాతలు రాశారు. లబ్ధిదారుల అంగీకా­రం మేరకు లేబర్‌ ఏజెన్సీలతో ఇళ్ల నిర్మా­ణాలు చేపడుతున్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 897 ఏజెన్సీలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇందులో 57 ఏజెన్సీలు వివిధ జిల్లాల్లో పనులు చేస్తున్నాయి. గరిష్టంగా ఒక్కో ఏజెన్సీకి 40,590 ఇళ్లను కేటాయించారు. దీన్ని­బట్టి చూస్తే ఒక ఏజెన్సీకే మేలు చేసినట్లు ఎక్కడాలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement