ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
భయం పోయి ప్రశాంతంగా చదువుకుంటున్నా..
నేను కర్నూలు కృష్ణానగ ర్‌లో మా తాత, అమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ షేక్ స్వాలేహా బేగం ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్. నెలకు రూ.10 వేలు వేతనం. తాత షేక్ సర్దార్ పటేల్ రిటైర్డు ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ఆదాయంతో ఇల్లు గడవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో నా చదువుపై బెంగ పెట్టుకున్నా. ఇంటరీ్మడియట్‌లో 93 శాతం మార్కులు, ఏపీ ఈఏపీ సెట్‌లో 15వేల ర్యాంకు సాధించా. ఇంటి ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా పై చదువులు ఎలా చదవాలో అర్థం కాలేదు. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేవుడిలా ఆదుకుంది.
స్థానిక రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్‌లో బీటెక్(సీఎస్‌ఈ)లో జాయిన్ అయ్యా. ఫీజు రీయింబర్స్‌మెంట్ నాకు వర్తించింది. జగనన్న విద్యా దీవెన కింద మూడేళ్ళకు రూ.1.05 లక్షలు, వసతి దీవెన కింద రూ.30 వేలు విడుదలయ్యాయి. ఫీజుల భయం పోయింది. ప్రశాంతంగా చదువుకుంటున్నాను. ఇప్పుడు ఫైనలియర్ బీటెక్. క్యాంపస్ సెలక్షన్‌లో అసెంచర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఏడాదికి రూ.6.5లక్షల వేతనం. మా అమ్మగారికి వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ. 18,750లు వంతున వచ్చింది. ప్రభుత్వం మాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులను ఇలా ఆదుకోవడంతో చాలా మందికి మంచి ఉద్యోగావకాశాలు లభించాయి. నేను, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. సీఎం సర్‌కు ధన్యవాదాలు.
– తయ్యిభా ఫాతిమా, బీటెక్ విద్యారి్థ, క్రిష్ణానగర్ (జి.రాజశేఖర్‌నాయుడు, విలేకరి, కర్నూలు అర్బన్)
సమాజంలో మా గౌరవం పెరిగింది
నే ను టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం భాసూరు గ్రామంలో భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులతోపాటు, వృద్ధురాలైన తల్లితో కలసి జీవిస్తున్నాను. రోజురోజుకూ రెడీమేడ్ దుస్తులు మార్కెట్‌లో విరివిగా లభిస్తున్న పరిస్థితుల్లో టైలరింగ్‌కు ఆదరణ తగ్గిపోయింది. దానివల్ల మాకు వచ్చే అరకొర ఆదాయం కూడా తగ్గిపోయింది. కుటుంబ పోషణ మరీ కష్టంగా తయారైంది. గత టీడీపీ హయాంలో రేషన్ బియ్యం పథకం తప్ప ఇంకేమీ వర్తించలేదు. ఈ తరుణంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు మమ్ములను ఆదుకున్నాయి. మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. నా భార్యకు చేయూత కింద ఏటా రూ. 18,750లు వస్తోంది.
నా మనవడు చదువుకుంటుండటంతో పెద్దకోడలు రాజ్యలక్ష్మి ఖాతాకు అమ్మఒడి డబ్బులు జమవుతున్నాయి. కొడుకు ఈశ్వరరావుకు సర్వేయర్‌గా గ్రామ సచివాయంలో ఉద్యోగం వచి్చంది. ఆరి్థకంగా చేయూత లభిస్తుండడంతో కష్టాలు ఒక్కొక్కటి గెట్టెక్కాయి. సహచరులు, బంధువుల మధ్య కుటుంబానికి గౌరవం పెరిగింది. ఈశ్వరరావు సార్ ఉన్నారా... అంటూ నా కొడుకు కోసం వచ్చేవారు మాకు ఇస్తున్న మర్యాద వెలకట్టలేనిది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాకు సొంత ఇల్లు వచి్చంది. ఆయన బిడ్డ జగన్ ప్రభుత్వంలో సమాజంలో మరింత గౌరవం పెరిగింది.
– కడారు మోహనరావు, భాసూరు (మారోజు కళ్యాణ్‌కుమార్, విలేకరి, పాలకొండ)
ఖర్చు లేకుండా రెండుసార్లు శస్త్రచికిత్స
నే ను సాధారణ రైతును. నాకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకలాంలో నాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అన్నీ అనుకూలిస్తే నాలుగు వేళ్లు నోటికెళ్లేవి. లేకుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. కునికిన నక్కపై తాటిపండు పడ్డట్టు నాలుగేళ్ల క్రితం కిడ్నీలో రాళ్లు చేరాయి. తెలియక అశ్రద్ధ చేయడంతో కిడ్నీలు మరింత పాడయ్యాయి. వైద్యులకు చూపిస్తే ఇన్‌ఫెక్షన్ వల్ల కిడ్నీలు పోయే ప్రమాదం ఉందన్నారు. చికిత్సకు రెండు లక్షల వరకూ ఖర్చవుతుందన్నారు. అంత మొత్తం వెచి్చంచలేక సతమతమయ్యాను. అయితే నాకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యమిత్ర చెప్పడంతో వారి ద్వారా విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరా.
పైసా ఖర్చు లేకుండా చికిత్స చేశారు. ప్రస్తుతం నయం అయింది. ఇప్పుడు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను. గడిచిన ఏడాదిలో మళ్లీ రాళ్లు చేరితే ఆరోగ్యశ్రీ ద్వారానే ఆపరేషన్ చేయించుకున్నా. నాలాంటి వారికి ఎందరికో ఈ పథకం ప్రాణదానం చేసినట్టయింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్ పేరును నా కుడిచేయిపై పచ్చబొట్టు వేయించుకున్నా. కొడుకు, కూతురికి పెళ్లిళ్లయ్యాయి. వారు వేరేగా ఉంటున్నారు. జగనన్న అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ఠంఛన్‌గా రూ. 13,500లు చొప్పున వస్తోంది. నా భార్య రమణమ్మకు వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా రూ. 45 వేలు వచి్చంది. చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 వంతున వచి్చంది. మా ఆరి్థక పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది.
– శానాపతి సూర్యనారాయణ(రోహిణి) లుకలాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట)
Comments
Please login to add a commentAdd a comment