CM Jagan: పేద అక్కచెల్లెమ్మలకు అండగా.. | YS Jagananna Illa Pattalu Distribution In Andhra Pradesh, More Details Inside - Sakshi
Sakshi News home page

పేద అక్కచెల్లెమ్మలకు అండగా సీఎం జగన్‌ 

Published Thu, Jan 18 2024 3:10 AM | Last Updated on Thu, Jan 18 2024 8:17 AM

ys jagananna illa pattalu distribution in andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్‌ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆరి్థక సాయం చేయడంతోపాటు రాయితీపై సా­మ­గ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్‌మెంట్‌ చే­య­నున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు.  

పేదలకు పావలా వడ్డీ.. ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం 
సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్య­తలు స్వీకరించిన త­ర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉ­చి­తంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సి­మెంట్, స్టీలు, మెటల్‌ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.­40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.­2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు.

దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ­తో రుణాలు ఇస్తున్నాయి.

అయినా అక్కచెల్లె­మ్మ­లపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement