Beneficiary
-
రతన్ టాటా వీలునామా: ఇప్పటి వరకు ఎవరికి ఎంత ఆస్తి రాసిచ్చారంటే?
ఢిల్లీ : దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా. ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.గొప్ప మహోన్నత వ్యక్తి.మానవతా మూర్తి.సమాజ సేవకుడు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. తన లక్షల కోట్ల ఆస్తుల్లో ఎవరికి ఎంత చేరాలో మరణానికి ముందే ఆయన వీలునామా రూపంలో సూచించారు. తాజాగా ఓ రహస్య వ్యక్తికి రూ.500 కోట్లు ఇచ్చేలా వీలునామా రాసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. రతన్ టాటా తన వీలునామాలో ఇప్పటివరకు ఎవరికి ఎంత రాసిచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.గతేడాది అక్టోబర్ 9న రతన్ టాటా మరణించారు. మరణానికి ముందే తన ఆస్తిలో ఎవరికి ఎంత చెందాలనేది వివరంగా తన వీలునామాలో రాశారు.రతన్ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి అపరిమిత సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.తాజాగా,తన ఆస్తిలో మరో రూ.500కోట్లు టాటా కుటుంబానికి, సన్నిహితులకు ఏమాత్రం పరిచయం లేని మోహిని మోహన్ దత్తాకు రూ.500కోట్లు రాసిచ్చారు. మోహిని మోహన్ దత్తా ఎవరా? అని ఆరా తీస్తే.. వ్యాపార వ్యవహారాల్లో రతన్ టాటాకు చేదోడు వాదోడుగా ఉన్నట్లు సమాచారం.మోహినీ మోహన్ దత్తా ఎవరు?జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్తే మోహిని మోహన్ దత్తా. స్టాలియన్ అనే సంస్థ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. స్టాలియన్‌లో మోహినీ మోహన్ దత్తాకు 80శాతం, టాటా సర్వీసెస్‌కు 20 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్టాలియన్ సంస్థను టాటాలో విలీనం చేశారు మోహన్ దత్తా. మోహన్ దత్త రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను 24 ఏళ్ల వయస్సులో ఉండగా.. జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్లో తొలిసారి రతన్ టాటాను కలిశాను. అప్పటి నుంచి ఆయనతో పరిచయం కొనసాగుతూ వచ్చింది. నన్ను తన ఇంటి కుటుంబ సభ్యుడిలానే చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఫార్చ్యూన్లో ఒక నివేదిక ప్రకారం.. దత్తా కుమార్తె సైతం టాటాగ్రూప్‌తో కలిసి పనిచేశారు. మొదట 2015 వరకు తాజ్ హోటల్స్‌లో, 2024 వరకు టాటా ట్రస్ట్స్‌లో పనిచేసినట్లు పేర్కొంది. కాగా, రతన్ టాటా తన వీలునామా ప్రకారం.. మోహినీ మోహన్ దత్తాకు రూ.500కోట్లు చెందాలంటే న్యాయ స్థానం ధృవీకరించాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ భారీ మొత్తం దత్తాకు అందనుంది. ఇందుకోసం సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. -
సారూ.. మా పేర్లు ఎందుకు లేవు?
సాక్షి నెట్వర్క్: లబ్ధిదారుల జాబితాలో మా పేరు లేదంటూ ఆయా జిల్లాల్లో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతుభ రోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్‌కార్డుల పథకాల అమలుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించింది. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు మూడు రోజులపాటు నిర్వహించే గ్రామసభలు మంగళవారం మొదలుకాగా మొదటి రోజు అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అర్హులను కాదని అనర్హులను ప్రకటించారంటూ జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు క్యూ కట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా: హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చారని ఖమ్మం జిల్లా వెంకట్యాతండాలో ఎంపీడీఓను నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం తండాలో అనర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ప్రత్యేకాధికారి దేవరాజు తదితరులను స్థానికులు నిర్బంధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా : అర్హుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, తమకు గ్రామసభ వద్దని గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు సభను అడ్డుకున్నారు. ఆత్మకూర్ (ఎం) మండలంలోని రహీంఖాన్‌పేటలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : చాలా చోట్ల తమ పేర్లు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ ఒకటో వార్డులో రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఆర్డీవో హరికృష్ణను నిలదీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా : ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామసభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామంలో కేవలం 52మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూమలున్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోటు కల్పించలేదంటూ పలువురు గ్రామసభను బహిష్కరించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ కాలేదని బోయినపల్లి మండలం రత్నంపేట ప్రజాపాలన గ్రామసభలో పలువురు రైతులు అధికారులను నిలదీశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో మహిళలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేను అడిగారు. డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్‌పల్లి, సిరికొండ తదితర మండలాల్లో రసాభాసగా సభలు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు మండలం కోనాపూర్ కార్యదర్శి గ్రామసభ నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తులు తీసుకోకుండా, ఓ పార్టీకి చెందిన నాయకులతో దాబాకు వెళ్లి విందు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో నిర్వహించిన వార్డు సభలు రసాభాసగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా: నవాబుపేట మండలం కొల్లూరు గ్రామసభలో జాబితాలో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు.మరికల్ మండలం రాకొండలో గ్రామసభ రసాభాసగా మారింది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పహారా మధ్య గ్రామసభను కొనసాగించాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామసభ జరుగుతుండగా, అర్షం మనోజ్ వచ్చి... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీంలో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని, ఆ స్కీం తనకు వద్దంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.జనగామ మండలం శామీర్‌పేటలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చినోళ్లకే వస్తున్నాయి... మా సంగతేంటని ఓ వ్యక్తి కలెక్టర్‌ను నిలదీయగా, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
పక్షం రోజుల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో ప్రారంభించి పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందని, ఎంపికలో రాజకీయ జోక్యం ఏమాత్రం ఉండదని చెప్పారు. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించడం లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తాం. 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇళ్లకు ప్రత్యేక డిజైన్ అంటూ ఉండదు. లబ్ధిదారులకు ఉన్న జాగా ఆధారంగా వారే కావాల్సిన ఆకృతిలో నిర్మించుకోవచ్చు. అయితే వంటగది, మరుగుదొడ్డి కచ్చితంగా ఉండేలా చూడాలి.దశలవారీగా సొమ్ము విడుదలఇందిరమ్మ ఇళ్లకు పునాదులు నిర్మించుకున్నాక రూ.లక్ష, గోడల నిర్మాణం తర్వాత రూ.లక్షన్నర, పైకప్పునకు రూ.లక్షన్నర చొప్పున చెల్లిస్తాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మిగతా మొత్తం అందజేస్తాం. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా జమ చేస్తాం. తొలిదశలో కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇళ్లను మంజూరు చేస్తాం. తదుపరి విడతలో భూమిలేని నిరుపేదలకు స్థలం ఇచ్చి నిధులు అందజేస్తాం. నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేస్తున్నాం. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించేలా చూస్తాం. ఈ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసం 16 శాఖల నుంచి సిబ్బందిని సమీకరిస్తున్నాం.నిధులను సమీకరించుకుంటాం..తొలిదశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతాయి. బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,740 కోట్లను కేటాయించింది. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టి వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. అవసరమైన నిధులను వివిధ మార్గాల్లో సమీకరించుకుంటాం. కొత్తగా ఏర్పడే ఇందిరమ్మ కాలనీల్లో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పిస్తుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెడతాం..గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తేవటంలో విఫలమైంది. మేం ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర నిబంధనలు అనుసరించటంతోపాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెట్టాలంటే కూడా పెడతాం. మాకు భేషజాలు లేవు. సర్పంచుల పదవీకాలం పూర్తయినందున ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీల్లో వారి ప్రాతినిధ్యం లేదు. తదుపరి దశ నాటికి వారు ఉండేలా అవసరమైతే జనవరి నాటికే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం..’’అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈ టర్మ్ అంతా రేవంతే సీఎంసీఎం రేవంత్‌రెడ్డిని మారుస్తారంటూ కొందరు పనిగట్టు కుని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టర్మ్ పూర్తయ్యేందుకు ఇంకా నాలుగేళ్ల ఒక నెల సమయం ఉందని, అప్పటి వరకు రేవంతే సీఎంగా ఉంటారని చెప్పారు. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో విపక్షాలు లేనిపోని ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. ఒకట్రెండు రోజులు అటూఇటూ అయినా.. తాను చెప్పినట్టు రాజకీ య బాంబులు పేలటం తథ్యమని పేర్కొన్నారు. -
బీవోపై ఎఫ్‌పీఐల వెనకడుగు
న్యూఢిల్లీ: అంతిమ లబ్దిదారుల(బీవో) వెల్లడి నిబంధనలను వ్యతిరేకిస్తూ సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్(ఎఫ్‌పీఐ) సంస్థలు తాజాగా వెనక్కి తగ్గాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన బీవో నిబంధనల వెల్లడి గడువు ముగియనుండటంతో అత్యవసర ఉపశమనాన్ని కోరుతూ తొలుత శాట్‌కు ఫిర్యాదు చేశాయి. మారిషస్ ఎఫ్‌పీఐ సంస్థలు ఎల్టీఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, లోటస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెబీ కొత్తగా విడుదల చేసిన నిబంధనల అమలు వాయిదాను కోరుతూ దరఖాస్తు చేశాయి. అయితే ఎఫ్‌పీఐల తరఫు న్యాయవాదులు ఫిర్యాదులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే కోర్టుకు విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిచాయి. గత ఐదు రోజులుగా ఎఫ్‌పీఐలు తమ పోర్ట్‌ఫోలియోలను విజయవంతంగా రీబ్యాలన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పరిధిలోకి రాని హోల్డింగ్స్‌ను లిక్విడేట్ చేసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్‌పై 2023 జనవరిలో యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెలువరించిన నివేదికలో ఈ రెండు ఎఫ్‌పీఐల పేర్లను ప్రస్తావించడం గమనార్హం! ఏం జరిగిందంటే? సెబీ బీవో నిబంధనల అమలులో మరింత గడువు కోసం ఎఫ్‌పీఐలు శాట్‌ను ఆశ్రయించాయి. హోల్డింగ్స్ విషయంలో యాజమాన్య హక్కుల పూర్తి వివరాలను వెల్లడించని ఎఫ్‌పీఐలకు సెబీ సెపె్టంబర్ 9 డెడ్‌లైన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025 మార్చివరకూ గడువు పెంపును కోరుతూ రెండు ఎఫ్‌పీఐ సంస్థలు శాట్‌కు దరఖాస్తు చేశాయి. 2023 ఆగస్ట్‌లో సెబీ బీవో నిబంధనలను జారీ చేసింది. -
నాకు కనిపించిన వెలుగు మీరే అన్న..
-
CM Jagan: పేద అక్కచెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆరి్థక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్మెంట్ చేయనున్నారు. పేదలకు పావలా వడ్డీ.. ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. -
చంద్రబాబు మోసం చేశాడన్న... లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా
-
అన్ని విధాల ఆదుకుంటున్నది జగన్ ఒక్కడే
-
జగనన్న మా అద్దెల భారం తొలగించి సొంతింటి కలను నెరవేర్చి అక్క చెల్లెమ్మలను యజమానురాలుగా చేశారు..!
-
మీ వల్లే ఇదంతా జగనన్నా.. లబ్ధిదారుడి భావోద్వేగం
సాక్షి, కర్నూలు జిల్లా: వరసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు స్వామి చంద్రుడు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే’’ అంటూ సీఎం జగన్‌ను కొనియాడారు. లబ్ధిదారుడి మాటల్లోనే.. అన్నా, నేను నాయీ బ్రాహ్మణ కులంలో పుట్టాను, మా కుమారుడు పుట్టుకతో చెవిటి, మూగవాడు, నేను ఈ పథకం ద్వారా మూడు సార్లు లబ్ధిపొందాను, మా కుమారుడితో కూడా షాప్ పెట్టించాను, మా అబ్బాయి కూడా ఈ పథకం పొందాడు. తనకు మాటలు రావు కాబట్టి తన ఆనందం కూడా మీతో పంచుకుంటున్నాను. గతంలో నాకు పాతకాలం కుర్చీలు, సామాన్లు ఉండేవి కానీ ఈ పథకం ద్వారా వచ్చిన లబ్ధితో మోడ్రన్ సెలూన్ ఏర్పాటు చేసుకున్నా. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే.. మమ్మల్ని గుళ్ళలో పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారు. గతంలో మమ్మల్ని కులంతో దూషించేవారు కానీ ఇప్పుడు నాయీ బ్రాహ్మణులని పిలుస్తున్నారు. గతంలో మా తోకలు కత్తిరించాలని చంద్రబాబు అన్నారు. కానీ మీరు ప్రేమతో ఆదరించారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మాకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. నా ఇద్దరు పిల్లల్లో ఒకరిని బాగా చదివించి డాక్టర్‌ను చేయగలిగాను. మీ వల్లే ఇదంతా నా చిన్నకుమారుడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ రూ. 8 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేయించారు. నాకు టిడ్కో ఇల్లు వచ్చింది, మేమే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు గౌరవం కల్పించారు, మీరు మా వెన్నంటి ఉండి మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, మేమంతా మీ వెంటే ఉంటాం. ధన్యవాదాలు. మనమంతా జగనన్న కుటుంబం: మంత్రి వేణు అందరికీ నమస్కారం, అన్నా రక్తాన్ని స్వేదంగా మార్చి, శ్రమ తప్ప సేద తీరాలన్న ఆలోచన లేని, కష్టం తప్ప కల్మషం లేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్ళని చెప్పుకున్న నాయకుడు గతంలో లేరు, వీరంతా జగనన్న బంధువులు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా జగనన్న బంధువులే, వీరంతా గతంలో మోసపోయారు, మన జీవితాలు మారాలంటే కులవృత్తులకే పరిమితం కాదని.. విద్య మాత్రమే మార్గమని నాడు వైఎస్ఆర్ గారు ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ కోతలు పెట్టారు. నేడు సీఎంగారు ప్రతి బీసీ గర్వపడేలా, మిగిలినవారంతా బాగుపడేలా కులగణన చేయబోతున్నారు. ఇది మన జీవితాలను మార్చబోతుంది, మనమంతా జగనన్న కుటుంబం, కులవివక్షకు గురైన రజకలు, నాయీ బ్రహ్మణులుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. జగనన్నా... చేదోడు పథకం బీసీ కుటుంబాలలో దివ్వెను వెలిగిస్తుంది, ఇది అందరికీ భరోసా, భాగ్యం, భద్రత కల్పిస్తుంది. ధ్యాంక్యూ. చదవండి: విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు -
ఒంటరి మహిళనైన నాకు జగనన్న వల్ల నా సొంతింటి కల నెరవేరింది
-
పేదల పాలిట దేవుడు మా జగనన్న
-
జగన్ గారు వరుసగా ఐదేళ్లు వాహన మిత్ర పథకం ద్వారా మా డ్రైవర్లకు అండగా నిలబడ్డారు
-
మా కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టే మాకు ఇంత మేలు జరుగుతుంది
-
గృహలక్ష్మి పథకం.. ఆరు రోజులే
సాక్షి, హైదరాబాద్: ఆరు రోజుల్లోనే గృహలక్ష్మి పథకానికి సంబంధించి రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల ఐదో తేదీ నాటికి మొత్తం మూడున్నర లక్షల మంది లబ్దిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలన్నది ఉద్దేశం. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ కసరత్తు పూర్తి చేయాలనే అక్టోబర్ 5 డెడ్‌లైన్‌గా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దరఖాస్తులు 15 లక్షలు..అర్హత ఉన్నవి 11లక్షలు సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించి.. వారే ఇళ్లు నిర్మించుకునేలా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లు, సీఎం కోటాలో మరో 43 వేల ఇళ్లు మొత్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహా్వనించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు. వాటి నుంచి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఏ ఊరు.. ఎవరు లబ్ధిదారులు నియోజకవర్గంలో ఏఏ ఊళ్ల నుంచి ఎవరెవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని గతంలోనే మౌఖికంగా ఆదేశాలందాయి. ఇప్పుడు అధికారులకు ఎమ్మెల్యేలు అందించే వివరాల ఆధారంగా జాబితాలు రూపొందుతున్నాయి. ఏఏ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వేగంగా వివరాలు అందిస్తున్నారో, ఆయా ప్రాంతాల్లో జాబితాలు అంత వేగంగా సిద్ధమవుతున్నాయి. శుక్రవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందితో జాబితా సిద్ధమైంది. మిగతా లబ్దిదారుల జాబితా వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం లోపు ఖరారు చేయాలని తాజాగా సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖికంగా అదేశాలందినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆ పనిలో వేగం పెంచారు. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ గతంలో అందిన దరఖాస్తులే కాకుండా ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిసింది. అందిన దరఖాస్తులు కాకుండా, కొత్త ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ‘అవసరం’అని భావిస్తే, ఆయా ప్రాంతాల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకొని జాబితాలో పేరు చేరుస్తున్నట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేది నిరంతర ప్రక్రియే అన్న మాటతో ఈ తంతు కానిస్తున్నట్టు సమాచారం. -
‘వైయస్ఆర్ చేయూత’తో మారుతున్న అక్కచెల్లెమ్మల భవిత.. సాకారమవుతున్న మహిళా సాధికారత
-
మహిళ స్పీచ్ కు సీఎం వైఎస్ జగన్ ఫిదా
-
అమలాపురం బహిరంగ సభలో మహిళ సూపర్ స్పీచ్
-
సీఎం జగన్ సంక్షలో పవన్ కు వార్నింగ్
-
అన్నదమ్ముళ్లులేని లోటు నాకు తీర్చారన్నా..మళ్ళీ మీరే సీఎం
-
పేదవారి సొంతింటి కల నెరవేర్చారన్న..
-
కనకదుర్గను ఆదుకున్న వైఎస్సార్ ఆసరా
-
ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు.. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో..
-
మీలాంటి నాయకుడ్ని ఇంతకముందు చూడలేదు
-
ఓసీలకు కూడా పథకాల్ని వర్తింపచేసిన ఏకైక సీఎం మీరే అన్నా
-
ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు
-
పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు : లబ్దిదారుడు హరియారామ్
-
కొత్త లబ్ధిదారులకు రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: కొత్త లబ్ధిదారులకు రైతుబంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదు వరకు కటాఫ్ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయిన, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)కి అందజేయాలి. ఆదివారం ఉదయం నుంచి ఏఈవో లాగిన్‌ను ఓపెన్ చేశారు. సీసీఎల్ఎ డేటా ఆధారంగా రైతుల వివరాలను అధికారులు అప్లోడ్ చేస్తారు. ముందుగా కటాఫ్ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త లబ్ధిదారుల నమోదుకు రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పించటంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే ఒకవైపు మంగళవారం రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా, మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పదిహేను రోజుల వరకు నగదు బదిలీ చేస్తారని, ఇదే సమయంలో ఏఈవోలు రైతుబంధు పోర్టల్‌లో కొత్త లబ్ధిదారులను కూడా నమోదు చేస్తారని చెబుతు న్నారు. టైటిల్ క్లియరెన్స్ వచ్చిన భూమి విస్తీర్ణం పెరిగితే నిధులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. -
తాళాలు పగులగొట్టి.. ఇళ్లు ఆక్రమించి
సాక్షి, మంచిర్యాల: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో విసిగిపోయిన లబ్ధిదారులు తాళాలు పగులగొట్టి ఇళ్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లలో ఈ నెల 20న మొదట మూడు కుటుంబాలు ఒక్కొక్క ఇంటిని ఆక్రమించాయి. బుధవారం దాదాపు 40 కుటుంబాల వరకు ఇళ్లు ఆక్రమించగా.. కొందరు అక్కడే ఉండి వంటలు చేసుకున్నారు. రాత్రి కూడా అక్కడే ఉంటామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, వానాకాలంలో నిలువ నీడ లేని నిరుపేదలమైన తాము ఇక్కడే తలదాచుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సంఘటనపై స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. -
ఆ సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది
-
ఎటువంటి షూరిటీ లేకుండా రూ.10వేలు రావడం చాలా సంతోషంగా ఉందన్నా
-
కరోనా వచ్చిన తర్వాత ఇళ్లు గడవడం కూడా కష్టమయ్యేది
-
ఇది బలవంతపు పథకం కాదు: బొత్స సత్యనారాయణ
2000 సంవత్సరం నుంచి ఉన్న ఈ పథకంలో గతంలో వడ్డీ మాత్రమే మాఫీ అయ్యేది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు వడ్డీ మాఫీ కూడా అమలు జరగలేదు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ప్రజలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఉన్న ఒక్క ఒన్‌టైం సెటిల్మెంట్ స్కీంను కూడా నిలిపివేశారంటూ వారి కష్టాలను ఏకరవు పెట్టారు. వడ్డీల వల్ల చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోయిందని తెలిపారు. పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప.. విక్రయ హక్కు, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం లేదని తెలిసిన జగన్ చలించిపోయారు. ఓటీఎస్‌కంటే మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టారు. – మంత్రి బొత్స సాక్షి, అమరావతి: పేదల పక్కా ఇళ్లను వారి సొంతం చేయడానికి, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆస్తి ఉపయోగపడటానికే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని (వన్ టైమ్ సెటిల్మెంట్, ఓటిఎస్) ప్రభుత్వం తీసుకొచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. నిర్ణీత రుసుము చెల్లించి, ముందుకొచ్చిన వారికే ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారని, ఎవరిపైనా ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు ఆపదలో ఉన్నప్పుడు ఆ ఇంటి పట్టా శాశ్వత హక్కుదారుడిగా బ్యాంకుల్లో రుణం పొందడానికి, అవసరమైతే అమ్ముకోవడానికి, చట్టపరమైన ఆస్తిగా తమ పిల్లలకు రాసి ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెచ్చారని చెప్పారు. లబ్ధిదారుల రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా.. వారికి పూర్తి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలుతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం కంటే వాళ్లు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఓటీఎస్ అన్నది ఎవరినీ బలవంతం చేయడానికో, లేక షరతులు విధించడానికో కాదని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్ ఇచ్చిన సర్క్యులర్‌కు, ప్రభుత్వానికి సంబంధమే లేదని చెప్పారు. ఆయన ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చాడో కూడా తెలియదన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని, అతన్ని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఓటీఎస్‌పై అధికారులు ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ పూర్తి అవగాహన వచ్చేలా ఈ పథకం గురించి వివరించాలని కార్యదర్శులకు చెప్పామన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు లాభపడాలని కోరారు. మేలు చేసే పథకంపై పనిగట్టుకొని దుష్ప్రచారం ప్రజలకు మేలు చేసే ఇటువంటి మంచి పథకంపైన ప్రతిపక్షం చిల్లర విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదవాడిపై రాజకీయాలు చేసే పార్టీలకు, వ్యక్తులకు పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు. పేదవాడిపై టీడీపీకి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లను ఫ్రీగా ఇస్తామని, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్‌ను తిరస్కరించిన బాబు.. ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తానంటే ఎవరు నమ్ముతారని అన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఏమీ చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. సోదరీమణులను ఏ విధంగా మోసం, దగా చేశారో అందరికీ తెలుసన్నారు. కాబట్టే టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలవారికీ సముచిత స్థానం ఉందని తెలిపారు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తోందని, లక్షా 50 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వడ్డీ మాఫీకి కూడా బాబు సర్కారుకు మనసే రాలేదు ‘వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం 2000 జనవరి 24న ప్రారంభమైంది. వడ్డీని మాత్రమే అప్పటి ప్రభుత్వాలు మాఫీ చేసేవి. తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించిన తర్వాతే తనఖా పెట్టుకున్న పత్రాన్ని లబ్ధిదారునికి ఇచ్చేవారు. మొత్తం 56,69,000 మంది లబ్ధిదారులున్నారు. 2014 మార్చి ఆఖరు వరకు.. అంటే 14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది ఈ స్కీంను వినియోగించుకున్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకు పథకం అమలు కాలేదు. ఈ ఐదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వం ఉంది. 2016 సెస్టెంబర్ 30న జరిగిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు మీటింగ్‌లో వన్‌టైం సెటిల్మెంట్ స్కీంను పొడిగించాలని ప్రతిపాదన పంపారు. 2016 అక్టోబర్ 27,, 2016 నవంబర్ 3న, 2018 ఏప్రిల్ 10న, 2019 ఫిబ్రవరి 13న మరో నాలుగు దఫాలు స్కీం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 5 సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రతిసారీ ఏదో ఒక నెపంతో వాటిని వెనక్కి పంపింది. ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణ మాఫీ సంగతి దేవుడెరుగు.. వడ్డీ మాఫీకి కూడా మనసు రాలేదు. 14 ఏళ్లుగా అమల్లో ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు’ అని బొత్స చెప్పారు. -
దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు
సాక్షి, ప్రకాశం జిల్లా: దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారని డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో విడత ’వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: రెండో విడత ‘వైఎస్సార్ ఆసరా’ ప్రారంభించిన సీఎం) మాట నిలబెట్టుకున్నారు... డ్వాక్రా మహిళ స్వాతి మాట్లాడుతూ, సీఎం జగనన్న ఇచ్చిన మాటనిలబెట్టుకున్నారని.. అర్హత ఉన్న ప్రతి మహిళకు సంక్షేమ పథకాన్ని అందించారన్నారు. దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తన పుట్టినిల్లుగా మారి ప్రతి కష్టాన్ని తీర్చిందన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. తండ్రికి తగ్గ తనయుడు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన మహిళ అశ్విని మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డామన్నారు. రుణమాఫి చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు. సీఎం జగన్ చెప్పినవి, చెప్పవని కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ నిరూపించుకుంటున్నారన్నారు. రెండో విడత ’వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ... బాబు హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి శూన్యం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి శూన్యమన్నారు. సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసిందన్నారు. సీఎం జగన్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నారు. సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి అని మంత్రి సురేష్ అన్నారు. ఆ ఘనత సీఎం జగన్‌దే.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దేనని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం బకాయిలను సీఎం జగన్ ప్రభుత్వం చెల్లిందన్నారు. బాబు హయాంలో డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. నాడు బాబు వస్తే జాబొస్తుందన్నారని.. కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని మంత్రి గుర్తు చేశారు. -
ఏపీ: దరఖాస్తు చేసిన మూడు గంటల్లోనే రేషన్ కార్డు!
మెరకముడిదాం: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఇజ్జిరోతు సూర్యనారాయణ రేషన్‌కార్డు కోసం గ్రామ సచివాలయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటకు దరఖాస్తు చేసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి ఎం.స్వర్ణలత లబ్ధిదారుడికి సాయంత్రం 4 గంటలకల్లా రేషన్‌కార్డు అందజేయడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. దరఖాస్తు చేసిన 3 గంటల వ్యవధిలోనే కార్డు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవీ చదవండి: సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్ -
వలంటీర్ ఆదర్శం: ఒడిశా వెళ్లి పింఛన్ అందజేసి..
నందిగాం: సామాజిక పింఛన్ల పంపిణీలో గ్రామ వలంటీర్లు కీలకభూమిక పోషిస్తున్నా రు. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న పింఛన్ లబ్ధిదారుల వద్దకే వెళ్లి డబ్బులు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నందిగాం మండ లం సైలాడ పంచాయతీ రౌతుపురం గ్రామానికి చెందిన నొక్కు రామారావు వలస కార్మి కుడుగా ఒడిశాలోని కాశీనగర్‌లో కూలీ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల అనారోగ్యానికి గురై కాశీనగరన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతను ఆర్థిక ఇబ్బందు లు పడుతున్నట్టు తెలుసుకున్న గ్రామ వలంటీర్ టి.కృష్ణ కాశీనగర్ ఆస్పత్రికి బుధవారం వెళ్లి ప్రభుత్వం సమకూర్చిన వృద్ధాప్య పింఛన్‌ను అందజేశాడు. దీంతో రామారావు వలంటీర్ కృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశాడు. -
అమ్మ ఒడి లబ్ధిదారుల తొలి జాబితా ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు (ఆదివారం) రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్ఆర్ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబి్ధదారులుగా తేలారు. జనవరి 9న తుది జాబితా ప్రదర్శన ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబి్ధదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: ఇల్లులేని అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థల పట్టా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులై ఉండీ..లబ్ధిదారుల జాబితాలో పేరు లేదన్న మాట వినిపించరాదని స్పష్టం చేశారు. వచ్చే ఉగాది పర్వ దినం సందర్భంగా ఇల్లు లేని అర్హులందరికీ ఇంటి స్థల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై గురువారం ఆయన సమీక్షించారు. నివాస స్థల పట్టాల పంపిణీకి జిల్లాల వారీగా గుర్తించిన అర్హుల సంఖ్య, అందుబాటులో ఉన్న భూమి, ఇంకా సేకరించాల్సిన భూమి గురించి ఆరా తీశారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్థలాల గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారుల వారీగా ఇళ్ల స్థలాలు మార్కింగ్ చేసి పట్టాలను రిజి్రస్టేషన్ చేసి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నివాస స్థల పట్టాలను ఏమాత్రం ట్యాంపరింగ్‌కు అవకాశం లేనివిధంగా అత్యంత ఉన్నత భద్రతా ప్రమాణాలతో రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పలురకాల నమూనా పత్రాలను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అభయహస్తం’ కోసం ఎదురుచూపులు
సాక్షి, హుజూరాబాద్: చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఒక్కరే కాదు కరీంనగర్ జిల్లాలోని ఐదు వేలకు పైగా మంది మహిళలు అభయహస్తం పథకంలో అందే పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2016 చొప్పున పింఛన్ అంది స్తోంది. వికలాంగులకు రూ.3016 పింఛన్ అందిస్తున్నారు. అభయహస్తం పథకంలో లబ్ధిదారులుగా ఉంటూ నెలకు రూ.500 పింఛన్ పొందేవారిని ప్రభుత్వం విస్మరించడంపై ఆందోళన చెందుతున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బీమా, వృద్ధాప్యంలో పింఛన్ సౌకర్యం కల్పించేందుకు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. 65 ఏళ్లు నిండిన మహిళా సంఘంలోని సభ్యులకు నెలకు రూ.500 చెల్లించేవారు. అభయహస్తం పింఛన్‌ను 2017 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం నిలిపివేయగా, రెండేళ్ల నుంచి జిల్లాలో 5150 మంది లబ్ధిదారులు పింఛన్ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ సమగ్ర సర్వే సమయంలో కుటుంబంలో వివిధ రకాలుగా పింఛన్ పొందుతున్న వారి వివరాలను అధికారులు ఇంటింటికి వెళ్లి నమోదు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో అభయహస్తం ద్వారా పింఛన్ వస్తుందన్న విషయాన్ని తెలుసుకొని మరోమారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని లబ్ధిదారులకు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తమకు మొండి చేయి చూపారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు అందని మార్గదర్శకాలు అభయహస్తం పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారులకు మార్గదర్శకాలు అం దలేదని తెలుస్తోంది. ఆసరా పథకంలో గతంలో నే 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అం దజేయగా, అభయహస్తంలో పింఛన్ నిలిచిన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకోవా లని సూచించగా, కొంతమంది పొందుతున్నా రు. ఒకే ఇంట్లో వృద్ధాప్య పింఛన్ ఇద్దరికి ఇచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పింఛన్ అందుకోలేకపోతున్నారు. 65 ఏళ్లు నిండిన వారికి అందుతున్న వృద్ధాప్య పింఛన్ ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వారందరికీ ఇస్తామని ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల హామీలో భాగంగా 57 ఏళ్ల పింఛన్ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లుగా కూడా ఇటీవలనే ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో రూ.1000 ఉన్న పింఛన్ తాజాగా రూ.2 వేలకు పెంచారు. 57 ఏళ్ల పింఛన్ హామీ అమలుకు కూడా మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రస్తుతం పాత వారే కొత్త పింఛన్ తీసుకుంటున్నారు. జిల్లాలో సుమారుగా 14 వేల మంది 57 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఆసరా పథకంలో పింఛన్ పొందడానికి అర్హత ఉన్న అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పథకంలో పింఛన్ తీసుకుంటున్నారు. చాలామందికి అర్హత లేకపోవడంతో అభయహస్తం పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులకు కూడా ఆసరా పథకంలో లబ్ధి చేకూరే విధంగా ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారుల వివరాలు హుజూరాబాద్ మండలంలో 535 మంది, వీణ వంకలో 512, జమ్మికుంటలో 254, ఇల్లందకుంటలో 176, సైదాపూర్‌లో 296, శంకరపట్నంలో 480, చిగురుమామిడిలో 358, చొప్పదండిలో 365, గంగాధరలో 362, గన్నేరువరంలో 164, కరీంనగర్‌రూరల్‌లో 289, కరీంనగర్(మున్సిపాలిటీ)లో 24, కొత్తపల్లిలో 215, మానకొండూర్‌లో 350, రామడుగులో 473, తిమ్మాపూర్‌లో 297 మంది ఉన్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉంది అభయహస్తం పథకం అమలు విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఆసరా పథకం ప్రారంభమైన నేపథ్యంలో 2017 నుంచి అభయహస్తం పథకం నిలిచింది. ఆసరా పథకంలోనే ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇస్తున్న నేపథ్యంలో అర్హులైన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పింఛన్ మంజూరుకు ప్రతిపాదించడం జరుగుతుంది. అభయహస్తం ప£థకం విషయాన్ని ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వెంకటేశ్వర్రావు, డీఆర్డీఏ పీడీ ‘‘మూడేళ్లుగా అభయహస్తం పింఛన్ రావడం లేదు. మహిళా సంఘంలో సభ్యురాలైన నాకు గతంలో అభయహస్తం పథకంలో నెలకు రూ.500 వచ్చేవి. మూడేళ్ల సంది రావడం లేదు. పింఛన్ పైసలు వత్తలేవని ఊళ్లకు వచ్చే సార్లకు చాన సార్ల చెప్పిన ఆసరా పథకంలోనన్న పింఛన్ వచ్చేలా చూడాలె.’’ – ఇదీ హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఆవేదన -
నిరాదరణ
కర్నూలు(అర్బన్): బీసీ కార్పొరేషన్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత తదితర కారణాల వల్ల ఆదరణ పథకం జిల్లాలో అభాసుపాలైంది. బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారికి 90 శాతం సబ్సిడీపై ఆధునిక పనిముట్లు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది చేతి వృత్తిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోనే దరఖాస్తు చేసుకున్నా.. వారు కోరుకున్న పనిముట్లను సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దరఖాస్తుదారులు 70 వేలకు పైనే ... చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వడ్డెర, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ, మేదర, మత్స్యకారులు, టైలర్లు, యాదవ, కురువ తదితర కులాలకు చెందిన 70 వేల మందికి పైగా ఆదరణ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడతల వారీగా వివిధ రకాల పనిముట్లను నెలకు కొన్ని ప్రకారం జిల్లా కేంద్రాలకు పంపింది. మొట్టమొదట కుట్టు, ఎంబ్రాయిడరీ మిషన్లను ఎక్కువగా సరఫరా చేసింది. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ పనిముట్లను నియోజకవర్గ కేంద్రాల్లోని గోడౌన్లకు చేర్చే విషయంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. ఇదే తరుణంలో జిల్లా, డివిజన్ కేంద్రాల్లో భారీగా ఖర్చు చేసి మేళాలు నిర్వహించారు. వీటిలో పంపిణీ చేస్తామని లబ్ధిదారులను రప్పించుకుని కొందరికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారికి నియోజకవర్గ కేంద్రాల్లో అందజేస్తామని చెప్పి పంపారు. వచ్చింది 37,676 పనిముట్లు మాత్రమే ... 70 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. పది శాతం లబ్ధిదారుని వాటా చెల్లించిన 59,934 మందికి వివిధ రకాల పనిముట్లను అందించాలని జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయికి ఇండెంట్ పంపించారు. అయితే, ఉన్నతాధికారులు 37,676 పనిముట్లను మాత్రమే పంపించారు. ఇంకా 22,258 మందికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా అయిన వాటిలోనూ అధిక శాతం కుట్టుమిషన్లు, పాల క్యాన్లు, సైకిళ్లు, కార్పెంటరీ పనిముట్లు, చేపల వలలు, సన్నాయి వాయిద్యాలు, సెలూన్ షాపులకు కుర్చీలు ఉన్నాయి. వచ్చిన వాటిలో ఇప్పటివరకు 29,905 పనిముట్లను మాత్రమే లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 7,701 గోడౌన్లలోనే మగ్గుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా..అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం అందజేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డొస్తోంది. కోడ్ ముగిసిన అనంతరమైనా పంపిణీ చేస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోడౌన్లలో ఉన్న మాట వాస్తవమే ఆదరణ లబ్ధిదారులకు అందించాల్సిన పనిముట్లు గోడౌన్లలో ఉన్న మాట వాస్తవమే. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా అందించలేక పోతున్నాం. పాల క్యాన్లు, సైకిళ్లు, కుట్టుమిషన్లు వంటి ఏడు వేలకు పైగా పనిముట్లు గోడౌన్లలోనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తాం. ఈ నేపథ్యంలోనే పనిముట్ల వివరాలను పరిశీలించేందుకు బీసీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ మల్లికార్జున జిల్లాకు వస్తున్నారు. ఆయా గోడౌన్లలోని రికార్డులను ఆయన పరిశీలించనున్నారు. – ఐడీ శిరీష, బీసీ కార్పొరేషన్ ఈడీ -
‘పెట్టుబడి’కి మళ్లీ రూ.12వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ రైతుబంధు పథకం కింద లబ్ధిదారులకు అందించే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో లాంఛనంగా పెంచింది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వగా 2019–20 ఖరీఫ్, రబీల నుంచి ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్‌లో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున, రబీలో ఎకరాకు మరో రూ. 5 వేల చొప్పున అందించనుంది. 2018–19 బడ్జెట్లో రైతుబంధుకు రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తం కేటాయించింది. ఎందుకంటే గత ఖరీఫ్, రబీలకు కలిపి ఇప్పటివరకు కేవలం రూ. 9,554 కోట్లు అందించగా ఇంకా కొంత మేరకు ఇవ్వాల్సి ఉంది. దీంతో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకొని ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించినట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం–కిసాన్ కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6వేలు అందించనుండగా తెలంగాణలో మాత్రం కేంద్ర పథకంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందనుంది. పీఎం–కిసాన్ పథకానికి తెలంగాణ నుంచి దాదాపు 26 లక్షల మంది అర్హులుగా తేలారు. వారు కేంద్ర పథకం ద్వారానూ, రాష్ట్ర పథకం ద్వారానూ రెండు విధాలుగా లాభం పొందనున్నారు. ఉదాహరణకు ఐదెకరాలున్న రైతు కేంద్ర పథకం ద్వారా రూ. 6 వేలు పొందితే, అదే రైతు రైతుబంధు ద్వారా వచ్చే ఏడాదికి రూ. 50 వేలు పొందుతాడు. రెండింటి ద్వారా మొత్తంగా రూ. 56 వేల ఆర్థిక సాయం అందుకుంటాడు. పూర్తిస్థాయిలో అందని రబీ సొమ్ము... గతేడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతుబంధు కింద చెక్కులను పంపిణీ చేసి 51.80 లక్షల మంది రైతులకు రూ. 5,280 కోట్లు అందజేసింది. అయితే ఎన్ఆర్ఐలు, ఇతరత్రా వివాదాలుగల వారు ఉండటంతో మరికొందరికి ఇవ్వలేకపోయింది. రబీలోనూ చెక్కుల ద్వారా ఇవ్వాలనుకున్నా ఎన్నికల కారణంతో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే అందజేసింది. ఇప్పటివరకు రబీ సీజన్ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతుబంధు సొమ్ము అందజేశారు. గతేడాది డిసెంబర్ 4 వరకు సక్రమంగానే అందజేసినా ఎన్నికల తర్వాత కొన్ని రోజులు నిధుల కొరతతో సొమ్ము ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తర్వాత దాదాపు రూ. 700 కోట్లకుపైగా గత బిల్లులను పాస్ చేసి ట్రెజరీ అధికారులు ఎన్ఐసీకి సమాచారం ఇవ్వగా అందులో సగం సొమ్ము మాత్రమే బ్యాంకులకు వెళ్లింది. మిగిలిన సొమ్ము వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. -
భూ పంపిణేది.?
ఆదిలాబాద్‌అర్బన్: భూమిలేని దళిత కుటుంబాలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి పంపిణీ చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందించేలా ప్రభుత్వం 2014 ఆగస్టులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బస్తీ పథకం పేదలకు భరోసా ఇవ్వలేకపోతోంది. దళిత మహిళల పేరిట ఏటా భూ పంపిణీ చేసి వ్యవసాయానికి అనువైన భూములు కొనివ్వాలనేది పథకం ఉద్దేశం. మూడెకరాల భూమితోపాటు ఇచ్చిన మొదటి యేడాది పెట్టుబడి ఖర్చులు సైతం ప్రభుత్వం అందజేస్తోంది. పథకం అమలు ఇంతవరకు బాగానే ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అర్హులకు లబ్ధి చేకూరడం లేదు. జిల్లాలో 18 మండలాలు ఉండగా, ఇంకా మూడు మండలాల్లో ఈ పథకం ప్రారంభమే కాలేదు. వ్యవసాయానికి అనువైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకానికి నిధులు రాకపోవడంతో పథకం అమలుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భూములు అమ్మేందుకు యాజమానులు ముందుకు వస్తున్నా.. నిధులు లేక అధికారులు ముందడుగు వేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో 1101 మంది లబ్ధిదారులకు 2,924 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జిల్లాలో ప్రగతి ఇలా.. జిల్లాలో 18 మండలాల్లో పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. 15 మండలాల్లో భూ పంపిణీ జరిగింది. ఆదిలాబాద్ అర్బన్, మావల, సిరికొండ మండలాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. మైదాన ప్రాంతాలతోపాటు ఏజెన్సీ గ్రామాలున్నాయి. జిల్లాలో ఈ నాలుగేళ్లలో 1101 మంది లబ్ధిదారులకు 2,924 ఎకరాల వ్యవసాయ భూములు కొని పంపిణీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,670 ఎకరాలు పంపిణీ చేయగా, 642 మంది మహిళలకు లబ్ధి చేకూర్చారు. ఇందుకు రూ.70.12 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక బోథ్ నియోజకవర్గంలో 1,254 ఎకరాలు కొనుగోలు చేసి 459 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇందుకు రూ.51.39 కోట్లు ఖర్చు చేశారు. అత్యధికంగా జైనథ్ మండలంలో 1302 ఎకరాలు కొని 515 మంది మహిళలకు అందజేయగా, అతి తక్కువగా నేరడిగొండ మండలంలో 8.36 ఎకరాలు కొనుగోలు చేసి ముగ్గురికి పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందుబాటులో 650 ఎకరాలు.. మూడెకరాల భూమి కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు రాకనే కొనుగోలుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. దీంతో వ్యవసాయానికి అనువైన భూములు కొనుగోలు చేసేందుకు ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్పా భూమి కొనుగోలు చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనికి తోడు జిల్లాలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో పథకం అమలు మరింత వెనుకబడుతోంది. మంచి భూములను అమ్మేందుకు పట్టాదారులు ముందుకు వచ్చినా నిధులు లేక వెనుకడుగు వేయక తప్పడం లేదు. నియోజకవర్గంలో ఆర్డీవో, కింది స్థాయి అధికారులు దళిత బస్తీ కింద వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు గడిచిన వేసవిలో భూములు పరిశీలించారు. వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను గుర్తించి సిద్ధంగా ఉంచారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 650 ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, పరిశీలన చేసి కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భూముల కొనుగోలుకు సరైన సమయమిదేనని, వర్షకాలం కావడంతో ఏ రకం భూముల్లో ఎంత మేరకు పంటలు ఉన్నాయో, దిగుబడి సాధించవచ్చవచ్చో.. లేదో.. తెలుసుకునే అవకాశం ఉందని విక్రయదారులు, లబ్ధిదారులు కోరుతున్నారు. ఫలితంగా భూములు సాగుకు యోగ్యమైనవా.. కావా..? అని గుర్తించవచ్చని చెబుతున్నారు. డిసెంబర్ వరకు రైతులు వేసుకున్న పంటలు ఉంటాయని, పంపిణీకి అవకాశం లేకున్నా భూములను పరిశీలించేందుకు అనువైన సమయమని పేర్కొంటున్నారు. లబ్ధిదారుల ఎదురుచూపులు.. భూముల పంపిణీ కోసం అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూçస్తున్నారు. ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో భూములు పంపిణీ చేస్తామని చెబుతున్నా అధికారులు ఇంకా ఏ ఒక్క మండలంలో పూర్తిగా అన్ని గ్రామాల్లో భూములు పంపిణీ చేసిన దాఖాలాలు లేవు. పథకాల ప్రక్రియ అమలులో భాగంగా గ్రామాలకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సైతం భూ పంపిణీని వేగవంతం చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెబుతున్నారే తప్పా ఆచరణలోకి తేవడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్‌కు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇస్తారా..లేదా..!
సాక్షి, భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు తీయడానికి లబ్ధిదారులు వెనకాడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పైసలు కట్టినా యూనిట్లు సకాలం లో యూనిట్లు ఇస్తారా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10వేల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పటి వరకు కేవలం 500 మంది మాత్రమే డీడీలు తీశారు. జిల్లాలో తొలి విడతలో 9,687 యూనిట్లు, రెండో విడతలో 9,655 యూనిట్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. మొదటి విడత గ్రామాల్లో పంపిణీ పూర్తికాగా మునిసిపాలిటీ పరిధిలో 736 యూనిట్లకు అనుమతి రాకపోవడంతో అవి అలాగే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీఓ 74తో మునిసిపాలిటీల్లోనూ లబ్ధిదారులకు గొర్రెలు అందించేందుకు అనుమతి నిచ్చింది. వీటిని రెండో విడతలో కలిపి 10,391 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల్లో అనుమానాలు.. రెండో విడత సబ్సిడీ గొర్రెల యూనిట్లను తీసుకోవాలనుకునే వారిని అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని నాలుగు నెలలుగా గ్రామాల్లో చర్చజరుగుతుండడంతో లబ్ధిదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు డబ్బులు కడితే ఎప్పుడో యూనిట్లు ఇస్తారని చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల అనంతరం ఈ పథకం ఉంటుందా.. లేదా? అని అనుమాన పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మంది డీడీలు తీయడానికి వెనకాడుతున్నారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని సంబంధిత అధికారులు చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఎన్నికల సమయంలో నెల లేదా రెండు నెలలు మాత్రమే పథకానికి తాత్కాలికంగా విరామం ఉంటుందని ఆ తర్వాత నుంచి డీడీలు తీసిన లబ్ధిదారులకు గొర్రెలు అందిస్తామని చెబుతున్నారు. రెండో విడత గొర్రెల యూనిట్లను 2019 జూలై నాటికి పంపిణీ చేస్తామని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. పంటలకే పెట్టుబడి పెడుతున్నారు. దీంతో తీరికగా డీడీలు కట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొనుగోలులో సాంకేతికత.. సబ్సిడీ గొర్రెల విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈ సారి పటిష్ట్ట ప్రణాళికలతో అధికారులు సిద్ధమవుతున్నారు. గొర్రెల కొనుగోలు విషయంలో సాంకేతికతను ఉపయోగించనున్నారు. జీవాలను కొనుగోలు చేసిన వెంటనే ప్రత్యక్షంగా ఫొటో తీసీ అప్లోడ్ చేయాల్సి చేయనున్నారు. లబ్ధిదారుడి వివరాలు, జీవాలు కొనుగోలు చేసిన ప్రాంతం, విక్రయించిన వ్యక్తి తదితర వివరాలు అప్పటికప్పుడే అధికారిక వెబ్సైట్లో పొందుపరిచేలా ప్రణాళికలు రచించారు. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా ఉన్న చోటు నుంచి వివరాలు, ఫొటోలు పంపాల్సిందే. ఒకవేళ సిగ్నల్ లేకపోతే మరుసటి రోజువరకు ఆగాల్సిందే. గొర్రెలను తరలించే వాహనానికి జీపీఎస్ అమర్చనున్నారు. దీనివల్ల కొనుగోలు ప్రాంతం నుంచి స్వస్థలానికి వచ్చే వరకు వాహనం ఎటువెళ్తోందనే విషయం అధికారులకు తెలుస్తుంది. దీంతో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లు.. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా లబ్ధిదారులకు దూరాభారం తప్పేలా లేదు. ఇంతకు ముందు జిల్లాలోని లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో అధికారులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల వారు అనంతపురం వెళ్లి గొర్రెలను తీసుకువచ్చాక భూపాలపల్లి జిల్లా వారు వెళ్లడంతో నాణ్యమైన గొర్రెలు లభించలేదనే అపవాదు ఉంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఈ సారి మహారాష్ట్రలోని పూణే ప్రాంతం నుంచి గొర్రెలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై లోపు పంపిణీ పూర్తి చేస్తాం.. వచ్చే ఏడాది జూలై చివరి వరకు లబ్ధిదారులందరికీ గొర్రెల యూనిట్లు అందించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాకు మొదటి విడత అనంతపురం నుంచి జీవాలను తీసుకువచ్చాం. రెండో విడతలో మహారాష్ట్రలోని పూణే పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం. ఎన్నికలు ఉన్నప్పటికీ పంపిణీకి ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్నికల షెడ్యూల్ కాలంలో మాత్రమే పంపిణీ తాత్కాలికంగా జరగదు. తర్వాత కొనసాగుతుంది. – బాలకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నాణ్యమైన గొర్రెలు అందించాలి ఇప్పటికే రెండో విడత యూనిట్ల పంపిణీ అలస్యమైంది. నాణ్యమెన గొర్రెలు అందిస్తే బాగుంటుంది. గత విడతలో గ్రామాల్లో ఇచ్చారు. ఈ సారి భూపాలపల్లి మునిసిపాలిటీ ప్రాంతంలోని లబ్ధిదారులకు యూనిట్లు అందించాలి. – గుండబోయిన రాజైలు, వేశాలపల్లి, భూపాలపల్లి -
గొర్రెలు ఎప్పుడొస్తాయో?
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలసమైంది. గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. ఎన్నో ఆపసోపాలు పడి, ఆరోపణలు ఎదుర్కొని తొలి విడత గొర్రెలను పంపిణీ చేశారు. గతేడాది జూన్ 20న గొర్రెల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూ నిట్‌లో ఒక పొట్టేలు, 20 గొర్రెలను అందించారు. జిల్లాలో 133 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. ఇందులో 8,590 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో 4,323 యూనిట్లకు గాను 4,282 యూనిట్లు పంపిణీ చేశారు. ఈ యూనిట్లలో 3,880 గొర్రెలు చనిపోగా 2,100 గొర్రెలకు బీమా మంజూరైంది. తొలి విడత కోసం అధికారులు మూడు నెలల పాటు మహారాష్ట్రకు వెళ్లి నానా తిప్పలు పడి గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన గొర్రెలు వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చాలా వరకు చనిపోయాయి. కొన్ని యూనిట్లలో రోగాలతో మృత్యువాత పడ్డాయి. దీంతో కొందరు లబ్ధిదారులు గొర్రెలను అమ్ముకోవాల్సి వచ్చింది. రెండో విడతలో 4267 యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సారి లబ్ధిదారుల సమక్షంలోనే గొర్రెలు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. యూనిట్ ధర రూ.1.25లక్షలు కాగా, బ్యాంకులతో సంబంధం లేకుండా 75శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. తొలివిడతలో ఎదురైనా ఇబ్బందులను అధిగమించి రెండో విడత గొర్రెల పంపిణీ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరింత ఆలస్యం.. జూలై 2నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అనుకున్నట్లు జూలై 2న పంపిణీ అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే గొర్రెల రవాణాకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. మొదటి విడతలో రవాణా వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని చివరకు గొర్రెలు కొనుగోలు చేసే రోజు చేతులెత్తేయడంతో అధికారులు అకోలిలోనే వాహనాలు మాట్లాడుకొని తీసుకొచ్చారు. ఇప్పుడా పరిస్థితి రాకుండా ఉండేందకు ట్రాన్స్‌పోర్టు కోసం ముందుగా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ పూర్తయి, గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలంటే మరో 15 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగి వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో గొర్రెలు పంపిణీ చేస్తే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాది సైతం వ్యాధులతో చాలా గొర్రెలు మృతి చెందాయి. సమస్యలు అధిగమించేనా.. మొదటివిడత గొర్రెల పంపిణీలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. మహారాష్ట్రలోని అకోల, బుల్తానా, తులియ, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగబాద్ వంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో సమయానికి గొర్రెలు దొరక్క ఇబ్బందులు ఎదురయ్యాయి. దొరికిన గొర్రెలు సైతం కొన్ని చిన్నవిగా ఉండడం, కొన్ని ముసలి గొర్రెలు ఉండడంతో అప్పట్లో లబ్ధిదారులు అనాసక్తి చూపారు. అయినా ఏదోవిధంగా వారిని ఒప్పించిన అధికారులు యూనిట్లు పంపిణీ చేశారు. తొలి విడతలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, కొంత మంది లబ్ధిదారులు గొర్రెలు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు గొర్రెలకు వ్యాధులు సోకి మృత్యువాత పడ్డాయి. కొన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక మృతి చెందాయి. కొన్ని ప్రాంతాల్లో పశుగ్రాసం సమస్య కూడా ఏర్పడి పోషణ భారంగా మారి అమ్ముకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో విడతల ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో విడత పంపిణీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు. -
‘ఆసరా’ అస్తవ్యస్తం
చిట్యాల : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకంపై లబ్ధిదారులు విసుగెత్తి పోతున్నారు. నెలనెలకు పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో విమర్శ లకు తావిస్తోంది. ప్రతి నెల 5లోపు ఫించన్లు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో ఆమలు చేయడం లేదు. డబ్బుల కోసం ప్రతి రోజు పొస్టాపీసు చుట్టు తిరిగి లబ్ధిదారులు వేసారి పోతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. మండలంలోని 60 గ్రామాలలో 588 మంది ఆసరాపథకంలో పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. మార్చి, ఏఫ్రిల్ నెల పింఛన్లు ఇప్పుడు ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగే వేలి ముద్ర వేసేందుకు గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని వికలాం గులు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. రేగొండ : ప్రభుత్వం అసరా పథకంలో అందిస్తున్న పింఛన్ల కోసం వృద్ధులు, వికలంగాలు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. పింఛన్లను పోస్టాఫీసు ద్వారా అందించడంతో వివిధ గ్రామాల నుంచి పోస్టాఫీసుకు చేరుకోవాలంటే తంటాలు పడాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణపురం : ప్రతి నెల మొదటి వారంలో రావల్సిన పింఛన్లు నేలాఖరు కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి వారం నుంచి చివరివారం వరకు ప్రతిరోజు పోస్టాఫీసు ముందు లబ్ధిదారులు మకాం వేస్తున్నారు. సకాలంలొ పింఛన్ల డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. మూడు నాలుగు నెలలు పింఛన్ల కోసం లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్తమందికి రెండు మూడు నెల డబ్బులు అందలేదు. ప్రతినెల మొదటి వారంలో పింఛన్లు పంపిణీ జరిగేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకటో తేదీనే పింఛన్ డబ్బులివ్వాలి ప్రతినెల ఒకటో తేదీనే పింఛన్ల డబ్బులు ఇయ్యాలి. రోజుల తరబడి వృద్ధులను, వికలాంగులను తిప్పించుకోవద్దు. నాలుగు నెలల నుంచి పింఛన్ల కోసం చాలా కష్టాలు పడుతున్నాం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బంది ఉంది. - చాతరాజు రాంచంద్రయ్య, గణపురం పింఛన్‌కు ఎండలో వెళ్తున్నాం ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ సక్రమంగా అందించక పోవడంతో పింఛన్ వచ్చిందా లేదా అని తెలుసుకునేందుకు పోస్టాఫీసు అధికారుల వద్దకు ఎండను లెక్క చేయకుండా 2కి.మీ వెళుతున్నాం. పింఛన్ వస్తే తెచ్చుకుంటున్నాం. లేకుంటే వెనుతిరుగుతున్నాం. -పున్నం కొమురమ్మ, రావులపల్లి (రేగొండ) ఐదో తారీఖు లోపే ఇవ్వాలి ఫించన్ డబ్బుల కోసం చాల ఇబ్బందులు పడుతున్నాం. నెల తప్పినెల డబ్బులు వస్తున్నాయి. వచ్చె డబ్బులు కూడ నెల చివరి వారంలో వస్తున్నాయి. డబ్బుల కోసం పొస్టాఫీసు కు ప్రతి రోజు పోయి వస్తున్నాం. మాకు ఫించన్ డబ్బులు ప్రతి నెల 5న ఇవ్వాలి. - భీమారం ఓదెలు, అంధుడు, చిట్యాల -
కొలతల సాకుతో కోత
యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించాలని చెబుతున్న అధికారులు బిల్లుల చెల్లింపుల్లో కొలతల సాకుతో తగ్గించేస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రేషన్‌కు లింకుపెట్టడంతో అప్పోసప్పో చేసి ఏదోరకంగా పనులు చేపట్టిన లబ్ధిదారులు కోతతోపాటు సకాలంలో బిల్లులందక నష్టపోతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు చెల్లించడం లేదని వారు వాపోతున్నారు. - రూ.15 వేలకు రూ.12 వేలు మంజూరు - కుంటిసాకులతో తగ్గిస్తున్న అధికారులు - అయోమయంలో మరుగుదొడ్ల లబ్ధిదారులు - ముందుకు సాగని నిర్మాణాలు నర్సీపట్నం: నర్సీపట్నం సబ్ డివిజన్లో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకను తలపిస్తోంది. నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని అధికారులు చెబుతున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలను చైతన్యవంతులను చేసి మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని సమీక్ష సమావేశాల్లో దిగువస్థాయి సిబ్బందిని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. వీరిబాధ పడలేక ఏదోరకంగా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేపట్టేలా సిబ్బంది తమ వంతు ప్రయత్నంచ చేస్తున్నారు. ఏదోరకంగా నిర్మాణం పూర్తిచేసినప్పటికీ బిల్లుల చెల్లింపుల్లో కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు నరకం చూపిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. నర్సీపట్నం సబ్‌డివిజన్‌లో... నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాల్లో ఎటువంటి పురోగతి కనిపించటం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 వేలు ప్రకటించింది. ఆచరణలోకి వచ్చే సరికి లబ్ధిదారుడికి రూ.12 వేలు మాత్రమే అధికాారులు చెల్లిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే నిర్మాణంలో కొలతలు పాటించడం లేదని రూ. 3 వేలు తగ్గించాల్సి వచ్చిందని అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. లక్ష్యంపై ప్రభావం చూపిస్తున్నా.. ప్రభుత్వం విధించిన లక్ష్యంపై ప్రభావం చూపిస్తున్నా అధికారుల తీరు మారడం లేదన్న విమర్శలున్నాయి. నర్సీపట్నం మండలానికి 3,999 మరుగుదొడ్లు మంజూరు కాగా 110 పూర్తయ్యాయి. 350 వివిధ దశల్లో ఉన్నాయి. మాకవరపాలెం మండలంలో 6,882 గాను 81 మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. గొలుగొండ 8092 మరుగుదొడ్లుకు 429 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నాతవరం మండలంలో 9217 మరుగుదొడ్లుకు 460 మాత్రమే ప్రారంభించారు. ఇప్పటివరకు 330 మంది మరుగుదొడ్లు పూర్తి చేసినా వీరిలో చాలామందికి బిల్లులు చెల్లించలేదు. దీంతో నిరుత్సాహం చెందిన చాలా మంది లబ్ధిదారులు నిర్మాణాలను మధ్యస్తంగా నిలిపివేశారు. బిల్లు అందలేదు మరుగుదొడ్డు నిర్మాణం పూర్తి చేసినా బిల్లు మంజూరు కాలేదు. అధికారులను అడుగుతుంటే అదిగో..ఇదిగో అంటూ తిప్పుతున్నారు. నిర్మాణం పూర్తిచేస్తే వెంటనే బిల్లులు చెల్లిస్తామని అధికారుల చెప్పడంలో వాస్తవం లేదు. - రావాడ మణి, లబ్ధిదారు, చెట్టుపల్లి బిల్లులు వెంటనే చెల్లిస్తాం నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు వెంటనే ఇవ్వాలని ఏఈలకు ఆదేశాలు ఇచ్చాం. బిల్లుల్లో జాప్యం జరుగుతున్నట్టు నా దృష్టికి రాలేదు. ఇకనుంచి బిల్లులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటాం. -చంద్రశేఖరరావు, డీఈ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం -
గ్రామస్థాయిలోనే లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ఇక నుంచి గ్రామస్థాయిలోనే జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త పథకం ‘గ్రామజ్యోతి’ ద్వారా ప్రస్తుత విధానాల్లో ముఖ్యమైన మార్పులను తీసుకురానుంది. ఈ నెలాఖరుకల్లా ఈ పథకాల అమలుకు సంబంధించి అనుసరించాల్సిన విధానం, కిందిస్థాయిలో విధుల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టత రావొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా వర్తింపజేసే ఆయా పథకాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా సంక్షేమ శాఖల ధోరణిలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కిందిస్థాయి నుంచి ప్రభుత్వపరంగా చేపట్టే ఆయా పథకాలను అమలుచేయడం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చనే అభిప్రాయంతో ఉంది. గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అనేది కచ్చితంగా జరిగేందుకు, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవకాశముంటుందని అధికారులు అంచనావేశారు. దీంతో లబ్ధిదారులను గుర్తించేందుకు అవసరమైన సమాచారాన్ని, వివరాలను గ్రామస్థాయిలో సేకరించేందుకు సులువు అవ్వడంతో పాటు ఎంపిక పారదర్శకతకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానంతో ఆయా సంక్షేమశాఖలు నిర్దేశించుకున్న లక్ష్యాలను సంపూర్ణంగా సాధించవచ్చున ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అన్నీ గ్రామస్థాయిల్లోనే: ఈ విధానంతో వివిధ శాఖల ద్వారా అమలుచేసే పథకాలను పకడ్బందీగా అమలు చేయోచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి దాకా ఆయా సంక్షేమశాఖలు జిల్లాల వారీగా పథకాలకు నిధుల కేటాయించి చేతులు దులుపుకున్న పరిస్థితికి భిన్నంగా జవాబుదారీతనం, పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విధానం ద్వారా పట్టణ, గ్రామీణ అనే తేడాలు లేకుండా ఆయా నిష్పత్తులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపులకు అవకాశం ఉంటుందనే అంచనాకు వచ్చింది. -
దిద్దుబాట
- ఆహార భద్రత కార్డుల్లో అన్నీ తప్పులే.. - ఐదు లక్షలకు పైగా కార్డుల దిద్దుబాటు - ఆగని ఫిర్యాదుల పరంపర - సర్కిల్ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు సాక్షి, సిటీ బ్యూరో: పాతబస్తీ రాజన్న బావికి చెందిన లక్ష్మణ్‌కు ఆహార భద్రత కార్డు మంజూర య్యింది. కార్డులో పేర్లు, పుట్టిన తేదీ తప్పుగా ఉండటంతో పలుమార్లు జిరాక్స్‌లను సర్కిల్ ఆఫీస్‌లో అందజేశాడు. అయితే ఎన్నిరోజులు గడిచినా తప్పులు మాత్రం సరిదిద్దలేదు. ఆధార్ కార్డు జిరాక్స్‌లను తీసుకుని సైతం తప్పుగా నమోదు చేశారు. ఫలితంగా అతని కుటుంబానికి రెండు నెలలుగా రేషన్ అందడంలేదు. ఇలా రాజన్న ఒక్కరే కాదు..గ్రేటర్లో వేలాదిమంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేసిన ఆహార భద్రత (రేషన్) కార్డులు తప్పులు తడకలుగా మారాయి. తాజా గా జారీ చేసిన కొత్త (తాత్కాలిక) కార్డుల్లో భారీగా తప్పులు దొర్లడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల యంత్రాంగం దాదాపు ఐదు లక్షలకు పైగా కార్డుల్లో పొరపాట్లను సరిదిద్దినా ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. అంతేగాకుండా గత నెలరోజులుగా లబ్ధిదారులు పౌరసరఫరాల శాఖ సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కార్డుల్లో ఇంటి పేర్లు. అక్షర దోషాలు, లింగ భేదం. వయస్సు, చిరునామాల్లో తప్పులు దొర్లడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని సరిదిద్దుకునేందుకు అవసరమైన ఆధారాలను అందజేసినా ప్రయోజనం కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఫలితంగా పలువురు రేషన్ అందక పస్థులుండాల్సిన పరిస్థితి నెలకొంది. అవగాహన రాహిత్యమే... పౌర సరఫరాల శాఖ సిబ్బంది అవగాహన రాహిత్యం కారణంగా తప్పులు దొర్లినట్లు సమాచారం. నూతన ప్రభుత్వం తెల్లరేషన్ కార్డులన్నీ రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకుగాను జంట జిల్లాల్లో దాదాపు 22.39 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు సుమారు 19.95 లక్షలు కార్డులు మంజూరు చేశారు. అయితే ఇందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించడంతో పెద్ద ఎత్తున తప్పులు దొర్లాయి. ఫలితంగా వాటిని సవరించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. -
రోల్‌బ్యాక్ పింఛన్లలో కోత
- ఏడు నెలల బకాయిలు - ఒక నెలతో సరిపెట్టేసిన అధికారులు - ఉసూరుమంటున్న 2వేలమంది లబ్ధిదారులు విజయవాడ సెంట్రల్ : రోల్‌బ్యాక్ (వివిధ కారణాల వల్ల ఆపేసిన పెన్షన్‌దారులకు తిరిగి పింఛన్ ఇవ్వడం) పింఛన్లలో ప్రభుత్వం కోతపెట్టింది. ఏడు నెలలుగా పింఛన్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్ధిదారులకు ఒకనెల పింఛన్ చేతిలో పెట్టి పొమ్మంది. దీంతో పెన్షన్‌పైనే ఆశలు పెట్టుకున్నవారు లబోదిబోమంటున్నారు. 2,081 మందికి రోల్‌బ్యాక్ పింఛన్లు రావాల్సి ఉండగా 1,999 మందికి శనివారం మంజూరు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో గత ఏడాది అక్టోబర్ వరకు 35,550 మంది సామాజిక పింఛన్లు అందుకునేవారు. ఐదు రెట్లు భరోసా పేరుతో పింఛన్లను పెంచుతూ సర్కార్ సవాలక్ష ఆంక్షలు విధించింది. పరిశీలన పేరుతో డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. పింఛన్లు అందుకునేందుకు ని‘బంధన ’ల పేరుతో సుమారు ఏడువేల పింఛన్లను ఏరిపారేసింది. దీనిపై విపక్షాల ఆందోళనతో పాటు స్వపక్ష కార్పొరేటర్ల నుంచి ఒత్తిడి రావడంతో ఐదువేల మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపింది. కమిటీ ముందు హాజరై తమ అర్హతను నిరూపించుకోలేదనే సాకుతో 2,081 మంది పింఛన్లను నిలుపుదల చేశారు. చేతులెత్తేశారు..! అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు అందకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. మొదట్లో రోజూ తెల్లవారేసరికి సంబంధిత కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాలిపోయేవారు. పింఛన్లు ఇప్పించమంటూ వేడుకోలు మొదలుపెట్టేవారు. ఈ నేపథ్యంలో పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఫిబ్రవరి 9న జరిగిన కౌన్సిల్ సమావేశంలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులను గట్టిగా నిలదీశారు. ప్రభుత్వం వద్దే పెండింగ్ ఉందని చెప్పిన అధికారులు బకాయిలతో సహా పింఛన్లు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కార్పొరేటర్లు లబ్ధిదారులకు వివరించారు. తాజాగా ప్రభుత్వం ఒక నెల మాత్రమే రోల్‌బ్యాక్ పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకొంది. రాష్ట్రవ్యాప్తంగా 83వేల రోల్‌బ్యాక్ పింఛన్లు చెల్లించాల్సి ఉండటంతో పాత బకాయిల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా గందరగోళమే.. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఆది నుంచి గందరగోళం సృష్టిస్తోంది. సామాజిక పింఛన్లు రూ.200 ఇచ్చే సమయంలో 35,550 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.1000, రూ.1,500 చేసిన సందర్భంలోనూ అంతమందే ఉన్నారు. అంటే లబ్ధిదారులందరూ అర్హులేనని లెక్కతేలింది. నిబంధనల సాకుతో ఐదువేల మందికి మూడు నెలలు, రెండువేల మందికి ఏడు నెలల చొప్పున కొర్రీ పెట్టారు. ప్రభుత్వం చేసిన తప్పుకు లబ్ధిదారులు పింఛన్లు కోల్పోయారన్న విషయం నిర్ధారణ అయింది. పంపిణీకి సంబంధించి పోస్టాఫీసులు, బ్యాంక్‌ల చుట్టూ తిప్పిన ప్రభుత్వం తాజాగా మాన్యువల్ పద్ధతిలో ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇంతటి దానికి ఇంత హంగామా అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
నగదు బదిలీలో గోల్మాల్..!
చిత్తూరులో కొంగారెడ్డిపల్లెకు చెందిన సంజీవరెడ్డి(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 28 6509) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. అదే రోజున ఒక నెల రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.568 బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం వచ్చింది. చిత్తూరులో బీవీ రెడ్డి కాలనీ కి చెందిన రామ్మోహన్‌రాజు (గ్యాస్ కనెక్షన్ నెంబర్ 35 09) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నా రు. ఆ తర్వాత కొద్ది నిముషాలకే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.468 జమా చేస్తున్నట్లు సెల్‌ఫోన్‌కు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. చిత్తూరులో మార్కెట్ వీధికి చెందిన ధనశేఖర్(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 16292) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.343 జమ అయినట్లు ఎస్ఎంఎస్ రూపంలో సెల్‌ఫోన్‌కు సమాచారం వచ్చింది. గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో గోల్‌మాల్‌కు ఇదో తార్కాణం. అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తామన్న సర్కారు.. అధికశాతం మందికి రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారని మండిపడుతున్నారు. * నగదు బదిలీ పేరుతో గ్యాస్ రాయితీలో కోత వేస్తున్న ప్రభుత్వం * తొలి నెల అడ్వాన్సుగా రూ.568 జమ చేస్తామంటూ ప్రకటనలు * కానీ అధికశాతం లబ్ధిదారులకు రాయితీలో రూ.200కు పైగా కోత * రాయితీలో భారీగా కోత వేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన! సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాత కథే పునరావృత్తమవుతోంది..! గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో లోపాలు బహిర్గతమవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తుండ డంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ప్రజల పొట్టకొట్టి గ్యాస్ రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారన్న విమర్శలకు ఇది బలం చేకూర్చుతోంది. విపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని అమలుచేయడం రద్దు చేయాలంటూ ఉద్యమించిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే ‘యూ’టర్న్ తీసుకున్నాయి. నగదు బదిలీ పథకమే ముద్దంటున్నాయి. పనిలో పనిగా నవంబర్, 2014 నుంచే గ్యాస్ రాయితీకి నగదు బదిలీని వర్తింపజేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా పథకాన్ని అమలుచేశారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేసుకున్న ఏ ఒక్క లబ్ధిదారునికి రాయితీని ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. జనవరి 1 నుంచి గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్(14.2 కిలోల) పూర్తి ధర రూ.768.50 కేంద్రం ఇచ్చే రాయితీ రూ.450. నవంబర్ ముందు వరకూ లబ్ధిదారుడు సిలిండర్ డెలివరీ చేసేటపుడు రూ.318.50 చెల్లించేవారు. జూన్ 1 నుంచి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తున్న నేపథ్యంలో రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారులకు తొలి నెల అడ్వాన్సు రాయితీ కింద రూ.568 జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. నాలుగు రోజులుగా రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారుల్లో 90 శాతం మందికిపైగా సగటున రూ.343 మాత్రమే అడ్వాన్సు రాయితీ రూపంలో జమ కావడం గమనార్హం. ప్రభుత్వం చేసిన ప్రకటనకూ.. క్షేత్ర స్థాయిలో అమలు తీరుకూ భారీ వ్యత్యాసం ఉండటంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఆందోళనలో లబ్ధిదారులు.. నిరుపేద లబ్ధిదారులు ముందే పూర్తి ధర వెచ్చించి సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేయించుకోలేరనే భావనతో ప్రభుత్వం తొలి అడ్వాన్సుగా రాయితీ కింద రూ.568 జమ చేస్తామని పేర్కొంది. కానీ.. అడ్వాన్సును జమ చేయడంలోనే గోల్మాల్ చోటుచేసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికీ కొంత మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు లేకపోవడంతో గ్యాస్ రాయితీ వారికి దక్కకుండా పోతోంది. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ.. ఇప్పటిదాకా 6.79 లక్షల మంది లబ్ధిదారుల గ్యాస్ సర్వీసు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం(సీడింగ్‌ను) పూర్తిచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అంటే.. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. దీన్నెప్పుడు పూర్తిచేస్తారన్న అంశంపై అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడంలేదు. ఇక ఆధార్ సీడింగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల అధికశాతం మంది లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కావడం లేదు. లబ్ధిదారుడి గ్యాస్ కనెక్షన్ నంబర్.. ఆధార్ నంబర్.. బ్యాంకు ఖాతా నంబరును అనుసంధానం చేయడంలో తప్పులు దొర్లడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోగానే.. ముంబయిలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఆ వెంటనే ఆన్లైన్లో సంబంధిత లబ్ధిదారుని ఖాతాలో రాయితీని జమ చేస్తారు. సీడింగ్‌లో తప్పులు దొర్లడం వల్ల లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ జమ కావడం లేదు. ఈ తప్పులను సరిదిద్దడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. నాటి ఉద్యమాలు దేనికో.. యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2013 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు రాయితీని నగదు బదిలీ రూపంలో జమ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అప్పట్లోనే లబ్ధిదారుల గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలను సీడింగ్ చేశారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ నగదు బదిలీ రూపంలోనే గ్యాస్ రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. సీడింగ్‌లో లోపాలు ఉండడం వల్ల అధికశాతం మందికి రాయితీ జమ కాకపోవడం.. ఆధార్ లేకపోవడం వల్ల గ్యాస్ రాయితీ దక్కకుండా పోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఇదే అదునుగా తీసుకున్న టీడీపీ, బీజేపీలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజాగ్రహానికి దిగివచ్చిన యూపీఏ సర్కారు డిసెంబర్, 2013 నుంచి నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసిన విషయం విదితమే. అప్పట్లో నగదు బదిలీకి వ్యతిరేకంగా ఉద్యమించిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడు అదే అమలుచేస్తోండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బంగారుతల్లికి భరోసా ఏదీ?
►ఖాతాల్లో జమ కాని డ బ్బులు ►దరఖాస్తు చేసుకున్నా కొందరికే బాండ్లు ►ఆందోళనలో లబ్ధిదారులు.. మంచిర్యాల టౌన్ : ‘బంగారుతల్లి’కి భరోసా కరువైంది. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం సక్రమంగా అమలు కావడం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. లబ్ధిదారులను మున్సిపాల్టీల వారీగా ఎంపిక చేయడంతోపాటు జిల్లాలోని మండలాలను ఆదిలాబాద్, ఉట్నూర్ డివిజన్లుగా విభజించారు. ఆదిలాబాద్ రూరల్ పరిధిలో 32 మండలాలు, ఉట్నూర్ పరిధిలో 20 మండలాలు చేర్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్ మున్సిపాల్టీల పరిధిలో బంగారుతల్లి పథకం కోసం 2,355 మంది ఐకేపీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ అర్హులుగా గుర్తించారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు అర్హుల్లో 761 మందికి మాత్రమే బాండ్లు అందాయి. వీరిలో సుమారు 400 మంది ఖాతాల్లోనే మొదటి దఫా నగదు జమ అయింది. మిగితా వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. అయినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకుని ఏడాది గడుస్తున్నా 1,594 మందికి బాండ్లు అందకపోవడం గమనార్హం. 361మంది ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పథకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని మండలాల్లో 7,082 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,858 మంది లబ్ధిపొందారు. మిగితా వారు లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఉట్నూర్ రూరల్ పరిధిలో 5,193 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,427 మందికి బాండ్లు అందాయి. 2,766 మందికి ఎదురుచూపులే మిగిలాయి. మంచిర్యాల పట్టణంలో 184 మంది దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని కోరుతున్నారు. పథకం అమలు తీరు ఇలా.. జననీ సురక్ష యోజన, సుఖీభవ, రాజీవ్ విద్యాదీవెన వంటి పథకాలతో ఎలాంటి సంబంధం లేకుండా బంగారుతల్లి పథకాన్ని రూపొందించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి నెల రోజుల వ్యవధిలో రూ.2,500 అందించాలి. బాలిక మొదటి పుట్టిన రోజు తర్వాత టీకాల ఖర్చుల కోసం రూ.వెయ్యి అందజేయాలి. మూడు నుంచి ఐదేళ్ల వరకు అంగన్వాడీ కేంద్రంలో చేరే వారికి ఏటా రూ.1,500 చొప్పున, ఆరు నుంచి పదేళ్ల వరకు ఏటా రూ.2,500, 14ఏళ్ల నుంచి 17ఏళ్ల వరకు ఏటా రూ.3,500, 18ఏళ్ల నుంచి 21ఏళ్ల వరకు ఏటా రూ.4వేలు అందిస్తారు. ఇలా 21ఏళ్లు నిండేసరికి ఒక్కొక్కరికి రూ.1.55లక్షలు ఆర్థికసాయం అందుతుంది.