- ఆహార భద్రత కార్డుల్లో అన్నీ తప్పులే..
- ఐదు లక్షలకు పైగా కార్డుల దిద్దుబాటు
- ఆగని ఫిర్యాదుల పరంపర
- సర్కిల్ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు
సాక్షి, సిటీ బ్యూరో: పాతబస్తీ రాజన్న బావికి చెందిన లక్ష్మణ్‌కు ఆహార భద్రత కార్డు మంజూర య్యింది. కార్డులో పేర్లు, పుట్టిన తేదీ తప్పుగా ఉండటంతో పలుమార్లు జిరాక్స్‌లను సర్కిల్ ఆఫీస్‌లో అందజేశాడు. అయితే ఎన్నిరోజులు గడిచినా తప్పులు మాత్రం సరిదిద్దలేదు. ఆధార్ కార్డు జిరాక్స్‌లను తీసుకుని సైతం తప్పుగా నమోదు చేశారు. ఫలితంగా అతని కుటుంబానికి రెండు నెలలుగా రేషన్ అందడంలేదు. ఇలా రాజన్న ఒక్కరే కాదు..గ్రేటర్‌లో వేలాదిమంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేసిన ఆహార భద్రత (రేషన్) కార్డులు తప్పులు తడకలుగా మారాయి. తాజా గా జారీ చేసిన కొత్త (తాత్కాలిక) కార్డుల్లో భారీగా తప్పులు దొర్లడంతో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల యంత్రాంగం దాదాపు ఐదు లక్షలకు పైగా కార్డుల్లో పొరపాట్లను సరిదిద్దినా ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. అంతేగాకుండా గత నెలరోజులుగా లబ్ధిదారులు పౌరసరఫరాల శాఖ సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కార్డుల్లో ఇంటి పేర్లు. అక్షర దోషాలు, లింగ భేదం. వయస్సు, చిరునామాల్లో తప్పులు దొర్లడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని సరిదిద్దుకునేందుకు అవసరమైన ఆధారాలను అందజేసినా ప్రయోజనం కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఫలితంగా పలువురు రేషన్ అందక పస్థులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
అవగాహన రాహిత్యమే...
పౌర సరఫరాల శాఖ సిబ్బంది అవగాహన రాహిత్యం కారణంగా తప్పులు దొర్లినట్లు సమాచారం. నూతన ప్రభుత్వం తెల్లరేషన్ కార్డులన్నీ రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకుగాను జంట జిల్లాల్లో దాదాపు 22.39 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు సుమారు 19.95 లక్షలు కార్డులు మంజూరు చేశారు. అయితే ఇందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించడంతో పెద్ద ఎత్తున తప్పులు దొర్లాయి. ఫలితంగా వాటిని సవరించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది.
దిద్దుబాట
Published Sun, May 24 2015 2:08 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement
Advertisement