
న్యూఢిల్లీ: ‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్ వాళ్లేమీ రారు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పీఎంఎంవై లబ్ధిదారునితో సరదాగా అన్న మాటలు వైరల్‌గా మారాయి. ఈరోజు (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సంభాషించారు. ఈ కార్యక్రమాన్ని ముద్రా యోజన పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించారు. చిరు వ్యాపారులకు రుణ సహాయం అందించే లక్ష్యంతో 2015లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
Tension mat lo Income Tax wale nahi aayenge 😂
PM Modi interacting with Mudra beneficiaries on #10YearsofMUDRA pic.twitter.com/nM8k8OdXTd— Hardik (@Humor_Silly) April 8, 2025
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎం మోదీ దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక లబ్ధిదారు తన వ్యాపార విజయ గాథను ప్రధాని మోదీతో పంచుకున్నాడు. తాను ముద్రా యోజన(Mudra Yojana)లో రూ. 10 లక్షల రుణం తీసుకుని, వ్యాపారాన్ని విస్తరించినట్లు తెలిపాడు. ఇదే సమయంలో అతను తన ఆదాయం గురించి చెప్పడానికి కొంత ఆలస్యం చేయడంతో.. ప్రధాని మోదీ సరదాగా ‘భయపడకు, ఆదాయపు పన్నుశాఖ అధికారులు రారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్య లబ్ధిదారులలో నవ్వులు పూయించింది. తరువాత ఆ లబ్ధిదారు కూడా నవ్వుతూ తన ఆదాయ వివరాలు తెలియజేశాడు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ముద్రా యోజన పథకం చిరు వ్యాపారుల కలలను సాకారం చేసిందని, దేశంలోని పేదలు, యువత, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించిందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ లబ్ధిదారుని విజయాన్ని ప్రధాని ప్రశంసిస్తూ రూ. 10 లక్షల రుణంతో ఎంత పెద్ద వ్యాపారాన్ని నడిపారనేది చూస్తే గర్వంగా ఉందని, ఇది దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఈ పథకం కింద ఇచ్చే రుణ పరిమితిని మరింత పెంచే యోచనలో ఉన్నట్లు ప్రధాని మోదీ సూచన ప్రాయంగా తెలిపారు. ముద్రా యోజన పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 46 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు(beneficiaries) రూ. 27 లక్షల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశారు. ఈ పథకం ద్వారా రుణాలు పొందిన వారిలో 68శాతం మంది మహిళలు ఉన్నారు. ఇది మహిళా సాధికారతకు ఉదాహరణగా పలువురు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీకి దుబాయ్ రాజు.. ప్రధాని మోదీతో చర్చించే అంశాలివే..