Jallianwala Bagh Anniversary: దేశ చరిత్రలో ఘోర అధ్యాయం: ప్రధాని మోదీ | PM Modi Pays Tribute To Jallianwala Bagh Massacre | Sakshi
Sakshi News home page

Jallianwala Bagh Anniversary: దేశ చరిత్రలో ఘోర అధ్యాయం: ప్రధాని మోదీ

Published Sun, Apr 13 2025 12:15 PM | Last Updated on Sun, Apr 13 2025 12:20 PM

PM Modi Pays Tribute To Jallianwala Bagh Massacre

న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్(Jallianwala Bagh) హత్యాకాండ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేటి(ఏప్రిల్‌ 13)తో జలియన్‌వాలా బాగ్‌ ఘటనకు 105 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ తదితరులు జలియన్‌వాలా బాగ్‌ అమరులకు నివాళులు అర్పించారు. ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ  జలియన్‌వాలా బాగ్‌ ఘటనలో వీరుల త్యాగం మనలో దేశభక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

ప్రతి ఏటా ఏప్రిల్ 13న ‘జలియన్‌వాలా బాగ్ దివస్’ జరుపుకుంటారు. 1919లో జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వలస పాలనలో భారతీయుల విషయంలో జరిగిన  అత్యంత క్రూరమైన దాడులలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. నాడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌(Amritsar)లోని జలియన్‌వాలా బాగ్ గార్డెన్‌లో బ్రిటిష్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు నిరాయుధ ప్రదర్శనకారులపై సైనికులు తూటాల వర్షం కురిపించారు. ఈ  ఘటనలో వెయ్యిమందికిపైగా జనం ‍ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ హత్యాకాండ తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా ఉద్యమం బలపడింది. జలియన్‌వాలా బాగ్‌ ఘటన బ్రిటిష్ వలస పాలకుల క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. 

ఇది కూడా చదవండి: సియాచిన్‌ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్‌ విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement