న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబర్ 31) జాతీయ ఐక్యతా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్‌కు నివాళులు అర్పించారు.
గుజరాత్‌లోని కేవడియాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రజలతో ఐక్యతా ప్రమాణం చేయించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
#WATCH केवड़िया, गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने सरदार वल्लभभाई पटेल की जयंती पर एकता की शपथ दिलाई।
(सोर्स: डीडी न्यूज) pic.twitter.com/7w7ESJpuuB— ANI_HindiNews (@AHindinews) October 31, 2024
దీనికి ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్‌లో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు.. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కోసం వల్లభాయ్‌పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన వ్యక్తిత్వం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ పేర్కొన్నారు.
भारत रत्न सरदार वल्लभभाई पटेल की जन्म-जयंती पर उन्हें मेरा शत-शत नमन। राष्ट्र की एकता और संप्रभुता की रक्षा उनके जीवन की सर्वोच्च प्राथमिकता थी। उनका व्यक्तित्व और कृतित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) October 31, 2024
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(అక్టోబర్ 31)ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని రాష్ట్రీయ ఏక్తా దివస్ అని కూడా పిలుస్తారు . భారతదేశపు ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.
ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment