మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు | PM Modi Paid Tribute to Mahatma Gandhi | Sakshi
Sakshi News home page

మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు

Published Wed, Oct 2 2024 8:37 AM | Last Updated on Wed, Oct 2 2024 11:45 AM

PM Modi Paid Tribute to Mahatma Gandhi

న్యూఢిల్లీ:ఈరోజు (అక్టోబర్‌ 2) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా మహాత్ముని సేవలను దేశ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(మంగళవారం) ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని, మహాత్మునికి నివాళులు అర్పించారు. జాతిపితను స్మరించుకుంటూ, బాపూజీ జయంతి సందర్భంగా దేశప్రజలందరి తరపున  ఆయనకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో రాశారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆయన జీవితం, ఆదర్శాలు ఎల్లప్పుడూ దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.


బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారు. గాంధీ చేపట్టిన ఉద్యమాలు దేశ ప్రజలను స్వాతంత్య్ర పోరాటానికి పురిగొల్పాయి. జాతిపిత మహాత్మాగాంధీ నాడు చూపిన తెగువ, అంకితభావాన్ని నేడు అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా గాంధీ పుట్టినరోజున అంటే అక్టోబర్ 2వ తేదీనే జరగడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిని కూడా గుర్తు చేసుకున్నారు. దేశ సైనికులు, రైతుల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. 
 

ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement