Lal Bahadur Shastri
-
ఊరికే ఇచ్చే డబ్బు వద్దంటూ.. గంగానదిని ఈదాడు
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు. కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా? -
ప్రధానిగా ఉంటూ కుమారుని ప్రమోషన్ అడ్డుకున్న శాస్త్రి
నేడు ఇద్దరు మహనీయుల పుట్టినరోజు. మహాత్మా గాంధీతో పాటు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా అక్టోబర్ 2నే జన్మించారు. శాస్త్రి 1904 అక్టోబర్ 2న యూపీలోని మొగల్‌సరాయ్‌లో జన్మించారు. శాస్త్రి తన జీవితాంతం సామాన్యుల అభివృద్ధికి పాటుపడ్డారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో శాస్త్రి ప్రధాన పాత్ర పోషించారు. నెహ్రూ తర్వాత భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు.అవినీతికి వ్యతిరేకంగా లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న నిర్ణయాలు అతనిలోని నిజాయితీని ప్రతిబింబిస్తాయి. శాస్త్రిలోని వినయపూర్వక స్వభావం, సరళత్వం, నిజాయితీ, దేశభక్తి అందరికీ స్ఫూర్తినందిస్తాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తన కుమారుని ప్రమోషన్‌ను నిలిపివేశారు. తన కుమారుడు అక్రమంగా ఉద్యోగంలో పదోన్నతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న శాస్త్రి అందుకు అడ్డుపడ్డారు. కుమారునికి పదోన్నతి కల్పించిన అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నాటి తరం నేతలు చెబుతుంటారు.లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ప్రభుత్వ పనిమీద కలకత్తా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన కారు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. కొద్దిసేపటిలో ఆయన డిల్లికి వెళ్లాల్సిన ఫ్లైట్ ఉంది. ఈ పరిస్థితిని గమనించిన నాటి పోలీస్ కమిషనర్ ఒక ఐడియా చెప్పారు. శాస్త్రి ప్రయాణిస్తున్న కారుకు సైరన్‌తో కూడిన ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. అయితే శాస్త్రి అందుకు నిరాకరించారు. అలా చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక.. -
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ:ఈరోజు (అక్టోబర్ 2) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా మహాత్ముని సేవలను దేశ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్నారు.#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने महात्मा गांधी की जयंती के अवसर पर राजघाट पर उन्हें श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/MR16VWiugs— ANI_HindiNews (@AHindinews) October 2, 2024ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(మంగళవారం) ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని, మహాత్మునికి నివాళులు అర్పించారు. జాతిపితను స్మరించుకుంటూ, బాపూజీ జయంతి సందర్భంగా దేశప్రజలందరి తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో రాశారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆయన జీవితం, ఆదర్శాలు ఎల్లప్పుడూ దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారు. గాంధీ చేపట్టిన ఉద్యమాలు దేశ ప్రజలను స్వాతంత్య్ర పోరాటానికి పురిగొల్పాయి. జాతిపిత మహాత్మాగాంధీ నాడు చూపిన తెగువ, అంకితభావాన్ని నేడు అందరూ గుర్తుచేసుకుంటున్నారు.सभी देशवासियों की ओर से पूज्य बापू को उनकी जन्म-जयंती पर शत-शत नमन। सत्य, सद्भाव और समानता पर आधारित उनका जीवन और आदर्श देशवासियों के लिए सदैव प्रेरणापुंज बना रहेगा।— Narendra Modi (@narendramodi) October 2, 2024లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా గాంధీ పుట్టినరోజున అంటే అక్టోబర్ 2వ తేదీనే జరగడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కూడా గుర్తు చేసుకున్నారు. దేశ సైనికులు, రైతుల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. देश के जवान, किसान और स्वाभिमान के लिए अपना जीवन समर्पित करने वाले पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि।— Narendra Modi (@narendramodi) October 2, 2024ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు -
ఎయిర్పోర్ట్ విస్తరణకు రూ.2,869 కోట్లు
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం అయిన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం రూ.2,869.65 కోట్లు వెచ్చించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఆప్రాన్(విమానాలను పార్క్ చేయడానికి వీలుగా ఉండే ప్రాంత్రం), రన్‌వే విస్తరణ, ట్యాక్సీ ట్రాక్ నిర్మాణంతోపాటు ఇతర అనుబంధ పనులు చేస్తారని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదన ప్రకారంగానే రూ.2,869.65 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏటా 39 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 99 లక్షలకు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం తాజా నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఎలా వచ్చింది?
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు ‘జై జవాన్, జై కిసాన్’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ నినాదాన్ని ఎవరు తొలుత లేవనెత్తారు? ఏ సందర్భంలో ఇది జరిగింది? ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని 1965లో భారత మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వినిపించారు. శాస్త్రి చేసిన నాటి ఈ నినాదం ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, ప్రభావవంతంగానూ నిలిచింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1964, మే 27న కన్నుమూశారు. దీంతో నెహ్రూ వారసులెవరనే ప్రశ్న నాడు కాంగ్రెస్ మదిలో మెదిలింది. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రధాని అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు. అయితే దేశాయ్ ప్రధానిగా ఉండేందుకు పార్టీలోని పలువురు నేతలు అంగీకరించలేదు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ (2007)లో ఇలా రాశారు. ‘ప్రధాని అభ్యర్థిగా దేశాయ్‌ని ఎంపిక చేయడం సరికాదని కొద్దిరోజుల్లోనే పార్టీలో స్పష్టమైంది. అతని శైలి దూకుడుగా ఉంది. దేశాయ్ స్థానంలో లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా ఎంపికచేసింది. శాస్త్రి మంచి నిర్వాహకుడు. హిందీ బెల్ట్ నుండి వచ్చారు. ప్రజలకు మరింత చేరువైన వ్యక్తి’ అని రాశారు. నెహ్రూ మరణానంతరం దేశానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అదే సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో భారత్‌పై తిరుగుబాటుకు పాకిస్తాన్ ప్లాన్ చేసి, బరితెగించింది. సరిహద్దుల్లోని వంతెనలను పేల్చివేసింది. ప్రభుత్వ భవనాలపై బాంబులు వేసింది. అయితే భారత సైన్యం ఎదురుదాడికి పాక్ వెన్నుచూపింది. ఈ పరిణామం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధానికి (1965) దారితీసింది. శాస్త్రి నాయకత్వంలో భారత సైన్యం తన శక్తియుక్తులను ప్రదర్శించింది. 1965, సెప్టెంబరు 23న ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇండో-పాక్ యుద్ధ సమయంలో శాస్త్రి 1965లో యూపీలోని అలహాబాద్ జిల్లాలోని ఉరువా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని వినిపించారు. వీరిద్దరూ దేశ శ్రేయస్సు, భద్రతకు మూల స్తంభాలని శాస్త్రి భావించారు. ఆయన తన హయాంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ను మరింత పెంచారు. హరిత విప్లవానికి శాస్త్రి పునాది వేశారు. -
అసలు... ఆ రాత్రి ఏం జరిగింది?
భారత ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అది హత్యా? సహజ మరణమా? లేక ఇన్సైడర్ (లోపలి వ్యక్తి) పనా? అయిదు దశాబ్దాలు గడిచినా, ఏ ఇన్వెస్టిగేషన్, ఏ ఎంక్వైరీ కమిషన్‌కు నోచుకోకుండానే ఆయన మరణం దేశ చరిత్ర పుటల్లో మిస్టరీగానే మిగిలిపోయింది! 1965 భారత్–పాక్ యుద్ధానంతరం, 1966 జనవరి 4న రష్యాలోని తాష్కెంట్లో ప్రారంభమైన ఇరు దేశాల చర్చలు జన వరి 10 రాత్రి ‘నోవార్ ప్యాక్ట్ ’ అగ్రిమెంటుతో ముగిశాయి. ఆ తర్వాత తనకు ఏర్పాటు చేసిన ‘డాచా’ (గెస్ట్ హౌజ్ విల్లా)లోని విశాలమైన బెడ్ రూంలో కెళ్ళిపోయారు శాస్త్రి. భోజనానంతరం, కుక్ రావ్‌ునాథ్ తెచ్చిన గ్లాసులోని పాలు త్రాగి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 1.20 గంటలకు ప్రధాని పర్సనల్ సెక్రెటరీ జగన్నాథ్ సహాయ్ బెడ్ రూం తలుపును ఎవరో తడుతున్న చప్పుడు. తలుపులు తెరచిన ఆయనకు ఎదురుగా కుడి చేత్తో ఛాతీ వత్తుకుంటూ, ‘డాక్టర్ సాబ్ కహా హై’ వగరుస్తూ ప్రధాని ఆర్థింపు. సంగతి తెలిసిపోయింది పీఏ సహాయ్‌కి. అసిస్టెంట్లు ఇద్దరు కలిసి శాస్త్రిజీని ఆయన రూంలోకి తీసు కెళ్ళి గ్లాసులో ఆయనకు నీళ్లు ఇచ్చారు. బెడ్‌పై ఆయనను పడుకోబెట్టి, పక్కరూంలో ఉన్న ప్రధాని పర్సనల్ వైద్యుడు డాక్టర్ ఆర్ఎన్ చుఘ్కు కబురు చేశాడు పీఏ క్షణాల్లో మెడికల్ కిట్‌తో శాస్త్రీజీ రూంలో కొచ్చి ఆయన పల్స్ చెక్ చేశాడు. శ్వాస పీల్చుకోలేక, ‘మేరే రామ్’ అంటూ అవస్థ పడుతున్నారాయన. ప్రధాని గుండెపోటుకు గురయ్యారని నిర్ధారణకు వచ్చి వెంటనే ఒక ఇంజెక్షన్ చేసి ఛాతీ వత్తడం ప్రారంభించాడు డాక్టర్ అయినా శాస్త్రీజీ క్రమంగా స్పృహ కోల్పోయారు. ఆఖరు ప్రయత్నంగా మరో ఇంజెక్షన్‌ను నేరుగా శాస్త్రిజీ గుండె దగ్గరే ఇచ్చాడు చుఘ్. అయినా లాభం లేకపోయింది. ఆశ వదలుకుని, గద్గద స్వరంతో ‘బాబూజీ, ఆప్నే ముజె మౌకా నహీ దియా (నాకు మీరు తగిన సమయం ఇవ్వలేదు)’ అంటూ ఆశ్రునయనాలతో శాస్త్రీజీ పల్స్‌ను వదిలేశాడు డాక్టర్ చుఘ్. తాష్కెంట్లో అప్పుడు సమయం రాత్రి 1.32 గంటలు. ‘యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డైయింగ్’ అన్న ఒక రష్యన్ లేడీ విలేకరి మాటతో, నిద్రలో నుండి హుటా హుటిన లేచి చెప్పులు లేకుండానే తన గది నుండి ఆదుర్దాగా శాస్త్రిజీ బెడ్ రూవ్‌ు వైపు పరుగు తీశాడు ఆయన ప్రెస్ సెక్రెటరీ కులదీప్ నయ్యర్. అప్పటికే అంతా అయి పోయింది. ఆయన బెడ్ దగ్గర రష్యన్ ప్రధాని కోసిగిన్, పాక్ నేత ఆయూబ్ ఖాన్, ప్రధాని సహచరులు, మంత్రులూ అయిన స్వర్ణ సింగ్, యశ్వంత్ రావు చవాన్ దీన వదనాలతో శిల్పాల్లా నిలుచున్నారు. ఆ నిశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, కుల్దీప్ వైపు చూస్తూ ‘హియర్ ఈస్ ఏ మేన్ ఆఫ్ పీస్, హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ఎమిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ అంటూ వాపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గం.కు జాతీయ జెండాలో చుట్టిన ప్రధాని పార్థివ దేహంతో సోవియట్ ఎయిరోఫ్లోట్ విమానం తాష్కెంట్ నుండి ఢిల్లీ పాలవ్ు ఎయిర్ పోర్ట్ చేరు కుంది. అక్కడి నుంచి గన్ క్యారేజ్‌లో శాస్త్రీజీ డెడ్ బాడీని ఆ సాయంత్రం 4.10 గంటలకు 10, జనపథ్‌కు చేర్చారు. రోడ్డంతా శోకసంద్రంలో మునిగిన ఢిల్లీ వాసులతో నిండింది. ఏమీ తోచని ప్రధాని కుటుంబీకులు వారిస్తున్నా ఆగమేఘాల మీద ఏ పోస్టుమార్టం లేకుండానే అదే రోజు శాంతివన్లో శాస్త్రీజీ అంత్యక్రియలు జరిపారు. ఊహించని రీతిలో నిష్క్రమించిన ప్రధాని లాల్ బహదూర్ స్థానంలో నూతన నాయకుణ్ణి ఎన్నుకోవటానికి, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పలుమార్లు సమా వేశమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత మొరార్జీ దేశాయ్ ఈ పదవికి గట్టి పోటీ ఇచ్చారు. కరడు గట్టిన గాంధేయవాది అయినప్పటికీ దేశాయ్‌ది నిరంకుశ తత్వం. పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడార్కు ఇది మింగుడు పడలేదు. చాణక్య రీతితో దేశాయ్‌ని పోటీ నుండి తప్పించి, నెహ్రూ తనయ, ఇందిరా గాంధీ పేరును పార్లమెంటరీ బోర్డు నాయకురా లిగా తెరపైకి తేగలిగారు కింగ్ మేకర్ కామరాజ్. రేపో మాపో లండన్ బ్రిటిష్ హైకమిషనర్‌గా వెళ్లవలసిన అప్పటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ఇందిర చేతిలోకి 1966 జనవరి 24న నాటకీయంగా దేశ ప్రధాని పగ్గాలు వెళ్లిపోయాయి. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మొబైల్: 98190 96949 (అనూజ్ ధర్ పుస్తకం ‘యువర్ ప్రైమ్ మినిష్టర్ ఈజ్ డెడ్’, ఆధారంగా. నేడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి) -
ఆయనను ఎప్పుడూ మరచిపోలేము - ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం అందరికి తెలిసిందే. ఈయన ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలు తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. నెటిజన్ల ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ఉంటాడు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్విటర్) ఖాతాలో మరో పోస్ట్ చేసాడు. ఇందులో మృదు స్వభావి, సౌమ్యుడు, అణుకువ కలిగిన వ్యక్తి.. అతని మాటలు దేశ చరిత్రలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని.. ఆయన్ను మేము ఎప్పటికి మరచిపోము అంటూ 'లాల్ బహుదూర్ శాస్త్రి' గురించి వెల్లడించాడు. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! నిజానికి అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తొస్తుంది. కానీ దేశానికి తన వంతు ఎనలేని సేవ చేసిన లాల్ బహుదూర్ శాస్త్రి గురించి మాత్రం చాలామంది మర్చిపోయి ఉంటారు. భారతదేశ రెండో ప్రధానమంత్రి, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన లాల్ బహాదుర్ శాస్త్రి 114వ జయంతి నేడు. కావున ఈ మహానుభావున్ని కూడా తప్పకుండా స్మరించుకోవాలి. Small. Soft-spoken. Mild-mannered. Humble. Yet he was one of the Tallest men in our country’s history & his words were loud enough to be heard everywhere. We will not forget him. 🙏🏽 #ShastriJayanti pic.twitter.com/c7z2zUBYlW — anand mahindra (@anandmahindra) October 2, 2023 -
ఆ పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: భారత దేశ మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా గుర్తు చేశారాయాయన. 'జై జవాన్, జై కిసాన్' అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా నివాళులు అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బ… pic.twitter.com/VOOEccVdnM — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
ఇద్దరూ మహాత్ములే! ఆఖరికి ఆ ఇద్దరి..
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమానందకరం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు. భారతనేతగా గాంధీ, భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహుదూర్ శాస్త్రి చరిత్రకు చెప్పలేనంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆధునిక నాయకులు. ఇద్దరి ముగింపు విషాదాంతమైంది. గాంధీ తుపాకీ కాల్పులకు గురియై మరణించారు.లాల్ బహుదూర్ మరణం అనుమానాస్పదం. హత్యకు గురిఅయ్యారనే భావనే ఎక్కువమందిలో ఉంది. లాల్ బహుదూర్ శాస్త్రి చాలా గొప్పవాడైనా, గాంధీ-నెహ్రూ ప్రాభవం మధ్య చరిత్రలో, లోకంలో రావాల్సినంత పేరు రాలేదని చరిత్రకారుల అభిప్రాయం. గాంధీ భారతీయ ఆత్మ. ఆత్మాభిమానం రూపం దాల్చుకుంటే అది లాల్ బహుదూర్. ఇంత ఆదర్శవంతమైన లాల్ బహుదూర్ శాస్త్రి.. జవహర్ లాల్ నెహ్రూకు, గాంధీకి ప్రియ శిష్యుడు. మహాత్మాగాంధీ జీవితం ఒక ప్రయోగశాల. కేవలం భారతదేశానికే కాదు, ఎల్ల ప్రపంచనాయకులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహానాయకుడు గాంధీ. సత్యాగ్రహం,అహింస అనేవి గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలు. ధర్మాగ్రహంతో,న్యాయాగ్రహంతో సత్యాగ్రహంతో అహింసా మార్గంలో నడిచి,భారతదేశానికి బ్రిటిష్ శృంఖలాల నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛను ప్రసాదించాడు. భగవద్గీతను ఆశ్రయించాడు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించాడు, న్యాయపోరాటంలో గాంధీ జాతికి జయాన్ని కానుకగా ప్రసాదించాడు.భారతదేశ చరిత్రలో ఆధునిక కాలంలో,స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత్ కు తొలి విజయాన్ని అందించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి, గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి. 20వ శతాబ్దంలో ప్రపంచమానవాళిని ప్రభావితం చేసినవారిలో మహాత్మాగాంధీదే అగ్రస్థానం.సత్యాగ్రహం, సహాయనిరాకరణ గాంధీ ఎంచుకున్న శక్తిమంతమైన ఆయుధాలు.వీటి విలువను ప్రపంచదేశాలు అర్ధం చేసుకోడానికి చాలా కాలం పట్టింది.ఇప్పటికీ చాలా దేశాలకు అసలు అర్ధమే అవ్వలేదు.హిందూ-ముస్లింల మత సామరస్యానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ అంశమే అతన్ని బలితీసుకుంది. టాల్ స్టాయ్ ను గాంధీ గురువుగా భావించాడు.సామ్రాజ్యవాదం, హింసా విధానాలపై వ్యతిరేకత వీరిద్దరినీ మానసికంగా కలిపింది. గాంధీ జీవితం మొత్తం సత్యశోధనకు అంకితం చేశారు. తను చేసిన తప్పులను తెలుసుకోవడం,వాటి నుంచి నేర్చుకోవడం మార్గంగా సాగారు. అందుకే గాంధీ ఆత్మకథకు 'సత్యశోధన' అని పేరు పెట్టుకున్నారు. సత్యంతో చేసిన ప్రయోగాలే అతని జీవితం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తిగా నిలిచినవాడు మహాత్మాగాంధీ.ఇటువంటి వ్యక్తి నిజంగా మన మధ్యనే జీవించాడంటే? తర్వాత తరాలవారు నమ్మలేరని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్య అజరామరం. జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరించాడని మరో మహానేత మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు.నా జీవితమే సందేశం,అని గాంధీయే అన్నాడు. ఇంతటి గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి,నిజాయితీ, ప్రయోగాలు,పవిత్రత,సత్యం, ఆత్మాభిమానం ఉఛ్వాసనిశ్వాసలుగా జీవించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూత్న ప్రయోగాలు ఆవిష్కరించాడు. జవానులను, రైతులను సమానంగా భావించాడు. ఒకరు యుద్ధక్షేత్రంలో ఉంటారు. ఇంకొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు.జై జవాన్-జై కిసాన్ నినాదం తీసుకువచ్చినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రెవల్యూషన్) కు బాటలు వేసింది కూడా ఈయనే. పంటకు ఎంత విలువ ఇచ్చాడో, పాడికి కూడా అంతే విలువ ఇచ్చాడు.శ్వేతవిప్లవం ఈయన తెచ్చిందే.సోవియట్ యూనియన్, శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకొని బంధాలను గట్టి పరచి, విదేశీ విధానంలోనూ తన ముద్ర వేసుకున్నాడు.నెహ్రు క్యాబినెట్ లో మొట్టమొదటి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి. దేశంలో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.అన్నేళ్లు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు.కుటుంబ సభ్యుల ఒత్తిడితో అప్పుచేసి కారు కొనుక్కున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే? మహాత్మాగాంధీ , జవహర్ లాల్ నెహ్రు విధానాలకు లాల్ బహుదూర్ శాస్త్రి ఆత్మీయమైన అసలు సిసలు వారసుడు.ఆర్ధిక విధానాలలో నెహ్రును కూడా దాటి ముందుకు వెళ్లారు.మరో గాంధీ పుట్టడు, మరో లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టడు.వీరి సిద్ధాంతాలు, ఆచరించిన మార్గాలు ప్రస్తుత కాలంలో ఆచరించడానికి కష్టమైనా,ఏదో ఒక రోజు వీరిని తప్పక అనుసరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ మహానేతలు సర్వకాలీనులు. వీరి సిద్ధాంతులు ఎప్పటికీ అవసరంగానే నిలుస్తాయి. -మాశర్మ సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..) -
నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..
ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం దేశ చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచి త్రీవ విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో వందలాది మంది మృత్యువాత పడగా, వెయ్యిమందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం హ్యాష్ ట్యాగ్‌లో ట్రెండింగ్ చేస్తూ.. రాజీనామా చేయాల్సిందే అంటూ పోస్టులు వస్తున్నాయి. అదీగాక అశ్విని వైష్ణవ్ సొంత రాష్టంలోనే ఈ ఘోర రైలు ప్రమాదం జరగడంతో మరింత తీవ్ర స్థాయిలో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన నాటి మంత్రులను గుర్తు చేసుకుంటున్నారు. నాటి మంత్రులలో ఉన్న నిబద్ధత, నైతికత ఇప్పుడూ కానరావడం లేదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే గతంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామాలు చేసిన నాటి ముఖ్యమంత్రులు ఎవరంటే... గతంలో రాజీనామ చేసిన రైల్వే మంత్రులు 👉1956లో లాల్ బహదూర్ శాస్త్రీ హయాంలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. ఆగస్టులో ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రమాదంలో 112 మంది మరణించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. దీన్ని నెహ్రూ అంగీకరించలేదు. రెండోసారి అదే ఏడాది నవంబర్‌లో తమిళనాడులో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దీంతో శాస్త్రీ వెంటనే నెహ్రూకి రాజీనామా సమర్పించడమే గాక వెంటనే ఆమెదించాలని విజ్ఞప్తి చేశారు. ఆ నాడు శాస్త్రీ చేసిన రెండో రాజీనామా ప్రజల దృష్టిని ఆకర్షించింది కూడా. ఇది సాంకేతిక లోపమని రైల్వే బోర్డు బాధ్యత వహించాలని పలువురు నచ్చచెప్పేందుకు చెబుతున్న శాస్త్రీగారు వెనక్కి తగ్గలేదు. ఇక అప్పడు నెహ్రు ఇది తనకు క్లిష్టమైన నిర్ణయం అంటూ ఆయన రాజీనామాను ఆమోదించారు. 1956 :: Resignation Letter of Railway Minister Shri Lal Bahadur Shastri After Ariyalur Train Accident ( Photo - PM Museum ) pic.twitter.com/LuNGxDa88G — indianhistorypics (@IndiaHistorypic) June 2, 2023 👉1999 ఆగస్టులో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన అసోం రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిష్క్రమణ తర్వాత సరిగ్గా 43 ఏళ్ల తర్వాత రైల్వే మంత్రి నుంచి వచ్చిన రెండవ రాజీనామా ఇది. 👉ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ఎన్డీయే ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరగడంతో ఆమె నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి ఆమో రాజీనామాను తిరస్కరించారు. 👉2016లో నాలుగు రోజుల వ్యవధిలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్, పూరీ-ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లు పట్టాలు తప్పినందుకు నైతిక బాధ్యత వహిస్తూ 2017 ఆగస్టు 23న రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సురేష్ ప్రభు ప్రతిపాదించారు. కొంత సమయం వేచిచూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరగా.. ఆ తరువాత కొద్ది నెలల్లోనే ప్రభుత్వానికి రాజీనామా చేశారు. కాన్పూర్ సమీపంలో పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు. 1999 తర్వాత ఇది అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
బాధ్యత తీసుకోవడమూ ఆదర్శమే!
గుజరాత్‌లోని మోర్బీ వద్ద జరిగిన తీగల వంతెన ప్రమాదం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. పదుల మంది ఉత్తి పుణ్యానికి ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే ప్రజల్ని సరాసరి మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నెపం ఇంకెవరి మీదకో నెట్టేసి నాయకులు చేతులు దులిపేసుకుంటారా? ఒకప్పుడు లాల్‌బహదూర్ శాస్త్రి లాంటివారు రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగతంగా వారి దోషం లేకపోయినా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని నెలకొల్పారు. అలాంటి స్పందనను గుజరాత్ నాయకుల నుంచి మనం ఇప్పుడు చూడగలమా? ‘‘గుజరాత్‌లోని ‘మోర్బీ’ వద్ద 143 ఏళ్ల నాడు నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రసిద్ధ టూరిస్టు కేంద్రంగా ఉన్న ఆ పట్టణం గుండా ప్రవహించే మచ్ఛు నదిలో అకస్మాత్తుగా కూలిపోయిన ఫలితంగా వందలాదిమంది సందర్శకులు పిల్లాజెల్లాతో ఘోరమైన విషాదానికి గురయ్యారు. పైగా ఇటీవలనే మరమ్మత్తులు పూర్తయి పునఃప్రారం భమైన వంతెన కాస్తా కూలిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వంతెనల నిర్మాణంలో సరైన అనుభవం, నైపుణ్యం లేని ఒక ప్రయివేట్ కంపెనీకి వంతెన నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఒకే సమయంలో 150 మందికి మించి భరించగల బ్రిడ్జి కాదని మాత్రం నివేదికలు తెల్పుతున్నాయి. వివిధ స్థాయుల్లో ప్రభుత్వ పాలనా సామర్థ్య లోపం ఫలితంగానే సరాసరి ప్రజల్ని మృత్యువు నోట్లోకి నెట్టేసినట్లయిందని నివేదికలు తెల్పుతున్నాయి. ఈ విషయమై పూర్తి విచారణ జరిపి, బాధ్యత ఎవరిదో తేల్చాలి. ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.’’ – ‘ది హిందూ’ సంపాదకీయం (1 నవంబర్ 2022) ప్రజలు విషాద ఘటనల బారిన పడినప్పుడు పాలకులు కనీస నైతిక బాధ్యత వహించవలసిన అవసరం ఉందని లాల్ బహదూర్ శాస్త్రి గుర్తించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలోని సీనియర్ సభ్యు నిగా లాల్ బహదూర్ శాస్త్రి నెలకొల్పిన ‘సువర్ణ ప్రమాణాల్ని’ మరో సారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది 1956 ఆగస్టు. మహబూబ్‌నగర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘట నలో 112 మంది చనిపోయారు. లాల్ బహదూర్ ఆ ఘటనకు కలత చెంది, తన పదవికి రాజీనామా చేస్తూ, ఆ లేఖను నెహ్రూకు పంపారు. ‘వద్దు, వద్దు’ అని నెహ్రూ నివారించడంవల్ల, లాల్‌బహదూర్ తాత్కా లికంగా ఆగారే గానీ అరియలూర్ (తమిళనాడు)లో అదే సంవత్సరం మరో రైలు ప్రమాదం జరిగి 144 మంది మరణించారు. ఈ రెండు వరుస విషాదకర ఘటనలతో లాల్‌బహదూర్ ఆవేదన నిలుపుకోలేక వెంటనే నెహ్రూకు రాజీనామా లేఖ సమర్పిస్తూ... ‘ఇక నన్ను ఒత్తిడి చేయవద్దు, వెంటనే ఆమోదించవలసింది’ అని కోరారు. ఆ విషయమై నెహ్రూ లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ లాల్ బహదూర్ నిర్ణయం పట్ల అత్యంత గౌరవాన్ని వ్యక్తం చేశారు. ‘‘విశాల మైన మనస్సుతో ఆలోచిస్తే, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనం ఆదర్శంగా నిలబడటం రాజ్యాంగ విలువల దృష్ట్యా గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏది ఏమైనా సరే మనం పట్టించుకోకుండా తలొంచుకుని పోదామనే ధోరణి సరై నది కాదు’’ అని నెహ్రూ చెబుతూ రాజ్యాంగ మర్యాదను పాటిం చడం ధర్మమని ప్రకటించాల్సి వచ్చింది. అయితే నెహ్రూ ప్రకటనను పత్రికలు తప్పుబట్టాయి. 30 మంది పార్లమెంట్ సభ్యులు కూడా లాల్‌బహదూర్ రాజీనామాను అంగీకరించ‘వద్దు్ద’ అని నెహ్రూకు విజ్ఞప్తి చేశారు. శాస్త్రి వ్యక్తిగతంగా రైలు ప్రమాదాలకు కారకుడు కారు గనుక రాజీనామాను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా లాల్ బహదూర్ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి – రాజకీయాలు ఆపైన’ (పాలిటిక్స్ అండ్ బియాండ్) అన్న గ్రంథంలో ప్రసిద్ధ వ్యాఖ్యాత సందీప్ శాస్త్రి ఈ విషయం గురించి చెబుతూ – ‘‘లాల్‌బహదూర్ నెలకొల్పిన ఉత్తమ సంప్రదాయం దేశ చరిత్రలో, నాయకుల చరిత్రలో ఒక ఉన్నత ప్రమా ణాన్ని నెలకొల్పింది. ఇతరులు ఆ ప్రమాణాన్ని పాటించక పోవచ్చు. కానీ, రాజకీయ ప్రమాణాలకు, వైశిష్ట్యానికి లాల్‌బహదూర్ నెల కొల్పిన ఆదర్శాలు ఉన్నతమైనవి’’ అన్నారు. రెండు రైలు ప్రమాద దుర్ఘటనల తర్వాత ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఇప్ప టికీ లాల్‌బహదూర్ శాస్త్రి ఆదర్శం, నెలకొల్పిన నైతిక విలువల వైశి ష్ట్యాన్ని గురించి అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ ‘మోర్బీ’ బ్రిడ్జి కంటే ముందే, సుమారు 150 ఏళ్లనాడు గోదావరి నదిపై ఆనకట్ట తలపెట్టారు సర్ ఆర్థర్ కాటన్. కాలం ముగియకముందే జాగ్రత్తలు తీసుకుంటే వంతెన ఆయుష్షును పెంచు కోవచ్చునని చెప్పిన మహనీయుడు కూడా ఆయన. కరువు కాటకాల వాతబడి కోట్లాదిమంది గోదావరి జిల్లాల ప్రజలు అల్లల్లాడిపోతున్న సమయంలో ఆనకట్ట నిర్మాణం కోసం తన బ్రిటన్ సామ్రాజ్య పాల కులపైనే ఒత్తిడి తెచ్చిన ధీశాలి కాటన్. ‘మన (బ్రిటన్) డబ్బంతా తీసుకుపోయి అక్కడ పోస్తే, మనకేం లాభం?’ అని బ్రిటిష్ పాలకులు కాటన్‌కు పాఠం చెప్పబోతే, వారి బుర్రల్ని తెలివిగా ‘చిత్రిక పట్టి’ గోదావరి జిల్లాలను కరువు కాటకాల నుంచి రక్షించారు కాటన్. ‘నీకు ఆదాయం రావాలన్నా ముందుగా ప్రజలు బతికి బట్టకట్టాలి కదా. తద్వారా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మన బ్రిటన్‌కే వస్తుంది కదా’ అని పాఠం చెప్పారు. అలా ఉభయతారకంగా వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు కాటన్. అందుకే ఈ రోజుకీ గోదావరి జిల్లాల ప్రజలు చిన్నాపెద్దా ఏ శుభముహూర్తాలు తమ ఇళ్లలో జరిగినా ‘కాటనాయ నమః’ అని కీర్తించుకుంటూ ఉంటారు. నదుల మధ్య అనుసంధానం నెలకొల్పి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నాడు మగ్గుతున్న ఆంధ్ర ప్రాంతాలలో జలవనరుల అవసరం తీర్చడానికి శ్రద్ధతో స్కీములు వేసిన మహనీయుడు కాటన్. ఆంధ్ర రాజకీయ, సామాజిక, వివిధ నిర్మాణ రంగాలలో ఉద్దండులైన ముక్త్యాల రాజా, ఇంజనీర్ కె.ఎల్. రావు, మోటూరు సత్యనారాయణ, ఆచార్య రంగా ఇత్యాది ప్రభృతులు కాటన్ కృషిని మరింతగా ముందుకు తీసుకువెళ్లారు. నెహ్రూ ఆశీస్సులతో బహూళార్ధ సాధక నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి నిర్మాణాన్ని సుసాధ్యం చేసు కోగలిగారు. అంతేగాదు, కాటన్ మహాశయుడు దక్షిణాది రాష్ట్రాల సౌభాగ్య గరిమకు చేదోడువాదోడు కావడమేగాక, ఉత్తరాది సరిహద్దు లలో తిష్ఠ వేసిన బ్రహ్మపుత్రతో వియ్యమందుకుని, ఆంధ్ర మున్నగు దక్షిణ భారత రాష్ట్రాలకు జల విద్యుత్ సౌభాగ్యాన్ని అందించాలని కూడా పథకాలు వేశాడు. అసలు బ్రహ్మపుత్ర ఆధారంగా మధ్య భారతం దన్నుగా యావద్భారతం నలుమూలలకూ ఆరుగాలమూ జల, విద్యుత్ సంపద పంపిణీ అయ్యేందుకూ బృహత్ పథకం రచిం చాడు. ఆ స్ఫూర్తితోనే మన కె.ఎల్. రావు, శొంఠి రామ్మూర్తి ప్రభృతులు మరికొన్ని పథకాలు రూపొందిస్తూ వచ్చారని మరవరాదు. కానీ, ఎందుకని ఈ మహనీయుల కృషిని మరింత ముందుకు తీసుకుపోవడంలో దేశీయ పాలకులు విఫలమవుతున్నారు? ఎందుకు వారిలా శ్రద్ధ చూపడం లేదు? రాజ్యాంగం గుర్తించిన ఫెడరల్ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని నాశనం చేస్తూ ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’... ఒకడే నాయకుడు, ఒకటే పార్టీ అని మాత్రం యాగీ చేస్తున్నారు. ప్రణాళికా వ్యవస్థ రద్దయింది. ప్రభుత్వ రంగాన్ని చాపచుట్టి, కార్పొరేట్ గుజరాత్ రాజ్యం యావద్భారతాన్ని చుట్టబెడుతోంది. ‘భారత ప్రజలమైన మేము మాకుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని అంకిత మిచ్చుకుంటున్న మౌలిక పత్రం ఇది’ అని రాజ్యాంగం ముందు మాటలోనే స్పష్టం చేసినా – పాలకుల చేతుల్లో దాని ముఖ వర్చస్సు అంతా చెదిరిపోయింది. కనుకనే నేటి దుర్బుద్ధులూ, పెడబుద్ధులూ! రోజుకో తీరు చొప్పున చెదిరిపోతున్న మౌలిక రాజ్యాంగ స్ఫూర్తి. ఇది నిలవాంటే, పౌర బాధ్యతల అధ్యాయపు కనీస విలువను కాపాడు కోవడానికైనా ఉద్యమించవలసిన అవసరం ఉంది. 2024 వచ్చేలోగానే పౌర సమాజం తన గాఢ నిద్రను వదిలించుకోగలగాలి! అవును మరి – ‘‘ఏది పలికినా శాసనమైతే ఎందుకు వేరే జనవాక్యం ఏది ముట్టినా కాంచనమైతే ఏది శ్రమశక్తికి మూల్యం?’’ – సినారె ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
-
మహాత్మా గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసంలో వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ప్రముఖుల సేవలను స్మరించుకున్నారు. వారి ఆదర్శాలు, ఆలోచనలు సమాజ ఉన్నతి కోసం, దేశ పురోగతి కోసం మనం వేసే ప్రతి అడుగులో ప్రతిధ్వనిస్తాయని సీఎం జగన్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. Fondly remembering two noble personalities of India, father of the nation Mahatma Gandhi and former Prime Minister Lal Bahadur Shastri on their Jayanti. Their ideals and thoughts for the greater good of society will eternally resonate in every stride our nation makes to progress. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2022 -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ జిల్లా యువతికి అరుదైన అవకాశం.. పార్లమెంట్లో ప్రసంగించే చాన్స్
వైవీయూ: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది కడపకు చెందిన యువతి మిద్దె రూప. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా.. అధ్యాపకుల తోడ్పాటుతో అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్న ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే అరుదైన చాన్స్ పొందింది. దేశవ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కడప జిల్లాకు చెందిన మిద్దె రూప ఒక్కరే ఉండటం విశేషం. వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన మిద్దె సత్యనారాయణ (లారీ డ్రైవర్), రమాదేవి (గృహిణి) దంపతుల కుమార్తె మిద్దె రూప కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ టూరిజం కోర్సును ఇటీవల పూర్తి చేసింది. అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తోడ్పాటుతో రూప చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ పోటీ ఏదైనా విజేతగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె దాతల సహకారంతో హైదరాబాద్‌లోని ఓ స్టడీ సర్కిల్లో సివిల్స్‌కు సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వరకు... అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్లో ప్రసంగించే విద్యార్థులు, యువతీ యువకులను ఎంపిక చేసేందుకు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న తొలుత జిల్లాస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా, వీరిలో రూప అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన నలుగురిలో ఒకరిగా నిలిచింది. అనంతరం జాతీయ స్థాయిలో 35 మంది పోటీపడ్డారు. చివరగా టాప్–15 అభ్యర్థులను పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఎంపిక చేశారు. ఈ 15 మంది జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని మిద్దె రూప కావడం విశేషం. రూప పార్లమెంట్లో అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ గురించి ఇంగ్లిష్‌లో ప్రసంగించనుంది. కడప విద్యార్థినికి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడంపై నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త మణికంఠ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ, చరిత్ర అధ్యాపకుడు బాలగొండ గంగాధర్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) -
Lal Bahadur Shastri: కారు కోసం బ్యాంకు లోను తీసుకున్న ప్రధాని !
లాల్ బహదూర్ శాస్త్రీ భారత రెండో ప్రధాని. మంచితనానికి, సింప్లిసిటీకి, నిజాయితీకి మారు పేరుగా ఆయన నిలిచారు. ప్రపంచలోనే రెండో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉంటూ ఆయన కనీసం కారు కూడా కొనుక్కోలేకపోయారు. చివరకు బ్యాంకు నుంచి రూ. 5000 అప్పు తీసుకుని ఫియట్ కారుని కొనుగోలు చేశారు. పెన్షన్‌తో ఈఎంఐలు భారత ప్రధానిగా ఉంటూనే లోను తీసుకుని కారు కొనుక్కున్న లాల్ బహదూర్‌శాస్త్రీ ఆ తర్వాత రష్యా పర్యటనకు వెళ్లారు. అనూహ్యంగా తాష్కెంట్లో ఉండగా ఆయన చనిపోయారు. దీంతో కారు కొనేందుకు ఆయన తీసుకున్న బ్యాంకు లోనుని ఆయన భార్య కట్టేశారు. ప్రధాని భార్యగా ఆమెకు నెలనెల వచ్చే ఫించను నుంచి లోనుని ఈఎంఐలుగా తీర్చేశారు. అవినీతి మచ్చలేని నేత సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినా లాల్‌బహదూర్ శాస్త్రికి ఎక్కడా అవినీతి మరకలు అంటుకోలేదు. ప్రధాని పదవిని చేపట్టే ముందు ఆయన కేంద్ర మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. జనగామ దగ్గర రైలు ప్రమాదం జరిగితే రైల్వేశాఖ మంత్రి హోదాలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన గొప్ప నైతికత ఆయన సొంతం. మహత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రీలు ఇద్దరు కూడా అక్టోబరు 2నే జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి కారు కొనుగోలుకు సంబంధించిన వివరాలను రచయిత, స్పోర్ట్స్ టీమ్ మేనేజ్మెంట్లో కీలకంగా వ్యవహరించే జాయ్ భట్టాచార్య ట్విట్టర్ ద్వారా తెలిపారు. It's a tale of two cars, the first a Fiat purchased by Lal Bahadur Shastri in 1965 when he was Prime Minister. He had to take a loan of Rs 5,000 which was paid by his wife with the pension she received after he passed away in Tashkent. The second, a broken down Ford car. pic.twitter.com/HRTeuMNBjX — Joy Bhattacharjya (@joybhattacharj) October 2, 2021 చదవండి : బాపు చూపిన బాటలో జెఫ్‌బేజోస్, బిల్‌గేట్స్.... -
AP: రాజ్‌భవన్‌లో ఘనంగా గాంధీజీ, శాస్త్రిజీ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు గాంధీజీ అని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. మహత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్‌భవన్ ఆవరణలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని అన్నారు. కేవలం భారతీయులే కాక ప్రపంచవ్యాప్తంగా జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతి, భారతదేశ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని జరుపుకుంటున్నారన్నారని తెలిపారు. గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకోవటం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు. మహాత్మా గాంధీ సత్యం, న్యాయం పట్ల విశ్వాసంతో యావత్త్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పటానికి గాంధీజీ చేసిన కృషి చిరస్ధాయిగా నిలిచి పోతుందన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప నాయకుడిని స్మరించుకోవటానికి, ఆయన కలలు కన్న భారతదేశ నిర్మాణంలో పునరంకితం కావటానికి జయంతి వేడుకలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి సామాన్యులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ప్రజా జీవితం దేశ ప్రజలలో చిరస్ధాయిగా నిలిచిపోయిందన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి బలమైన నాయకునిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పటికీ వినయంతో, మృదువుగా మాట్లాడేవారని గవర్నర్ అన్నారు. గాంధీజీ జయంతి వేడుకలలోభాగంగా గవర్నర్.. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారంచుట్టారు. రాజ్‌భవన్ ఆవరణలో తొలిమొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్పీ సిసోడియా, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీడా తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: నేడు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు. ‘భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి’ అంటూ ట్విటర్లో పోస్టు చేశారు. భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.#LalBahadurSastry — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2021 -
ఎల్బీ శాస్త్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్బీ శాస్త్రి ట్రస్టు హైదరాబాద్‌లో నైపుణ్యాభివృద్ది సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రస్టు చైర్మన్, ఎల్బీ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో మంగళవారం బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) భాగస్వామ్యంతో ఈ సంస్థను నిర్వహిస్తామని అనిల్ శాస్త్రి ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ.. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం వివిధ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందిస్తామని, తమ కార్యకలాపాలకు హైదరాబాద్ అనువైనదిగా గుర్తించామని అనిల్ శాస్త్రి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సాయం అందిస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటంపట్ల సీఎస్ హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ట్రస్టు బాధ్యులు శ్రీవాస్తవ, పాండురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు ఆర్పించారు. దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యానారాయణ, బాలీనేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘గాంధీ ఆశయాలను నిజం చేసిన సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ(అక్టోబర్ 2) మహత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగాం సురేష్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గాంధీ ఆశయ సాధన కోసం అందరం పునరంకితం కావాలన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. గాంధీజీని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. గ్రామ స్వరాజ్యం ఆచరణలో చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్) ఇక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశ్వం ఉన్నంత వరకు తలుచుకోవాల్సిన మహ మనిషి గాంధీజీ అని చెప్పారు. ఆయనను స్మరించుకోవడమే కాకుండా గాంధీ ఆశయాలను నిజం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజల ముంగిటకే తీసుకేళ్లిందని, సచివాలయ వ్యవస్థ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా అయిందని తెలిపారు. ప్రతి ఇంటికి వాలంటిర్లు వెళ్లి పెన్షన్‌లుఇవ్వడమే ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం వదిలిపోయిన భయంకరమైన ఆర్థిక పరిస్థితిలో కూడా సీఎం వైఎస్ జగన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గాంధీజీ కలలు కన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టుల ద్వారా ప్రతిపక్షం అడ్డుపడుతోందని వచ్చే మూడేళ్లలో సమస్యలు లేని గ్రామాలు ఉండేలా చేస్తామన్నారు. పట్టణాలకు ధీటుగా గ్రమాలను తయారు చేస్తామని సజ్జల వ్యాఖ్యానించారు. -
కుట్ర కోణం
రాజకీయాల్లో తరచుగా వినపడే కోణం.. కాన్స్పిరసీ థియరీ! దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణం వెనక ఉన్న కోణాన్ని చూపించడానికి తీసిన సినిమా ‘‘ది తాష్కెంట్ ఫైల్స్!’’అన్ని కోణాలూ ఆవిష్కరించిన పాత్రికేయురాలురాగిణి ఫూలే వెనక కూడా ఒక కాన్స్పిరసీ ఉన్న విషయాన్నీనాటకీయంగా బహిర్గతం చేస్తుందీసినిమా... ‘‘కౌన్ కహెతాహై కి మరే హుయే పీఎం సే కిసీకో ఫాయిదా నహీ హోతా (ఎవరన్నారు.. చనిపోయిన ప్రధాని వల్ల ఎవరికీ లాభం ఉండదని)’’.. అనే లైన్ ఆధారంగా అల్లుకున్న సినిమానే ‘‘ది తాష్కెంట్ ఫైల్స్!’’ జీ5లో స్ట్రీమ్ అవుతోంది.తాష్కెంట్ అనగానే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి దివగంత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత 1966లో పాకిస్తాన్‌తో మైత్రి ఒడంబడిక మీద తాష్కెంట్లో చర్చలు జరిగాయి. ఆ ఒడంబడిక మీద సంతకం చేశాక కొన్ని గంటలకే.. అంటే 1966, జనవరి 11న (తాష్కెంట్‌లోనే) చనిపోయారు. గుండెపోటుతో కన్నుమూసినట్టు ప్రకటించారు. అయితే ఈ మరణం మిస్టరీ అంటూ ‘‘తాష్కెంట్ కాన్స్పిరసీ థియరీలు’’ చాలా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘‘ఆయన మీద విషప్రయోగం జరగడం వల్లే ప్రాణాలు పోయాయని.. అది బయటపడకుండా ఆయన శరీరంలోంచి ఆ విషాన్ని తీశారని.. దీనికి గుర్తుగా ఆయన శరీరం మీద గాట్లు, రక్తం మరకలూ ఉన్నాయ’’నే థియరీ. దీన్ని పట్టుకునే ‘‘ది తాష్కెంట్ ఫైల్స్’’ సినిమా నడుస్తుంది. ఈ థియరీని బలపరిచే ఆధారాలతో ఉన్న డాక్యుమెంట్స్, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, కేజీబీ అండ్ ది వరల్డ్ అనే పుస్తకం, లాల్‌బహదూర్ శాస్త్రి కుటుంబ సభ్యుల రిఫెరెన్సెస్ను ఈ సినిమాలో పొందుపరిచారు. అలాగే ఆయన ప్రెస్ సెక్రటరీ కుల్దీప్ నయ్యర్, జర్నలిస్ట్ అంజు ధార్ల కామెంట్స్‌నూ ఇందులో చూపించారు. అసలు కథలోకి... లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడ్తున్న తరుణం.. రాగిణి ఫూలె (శ్వేత బసు ప్రసాద్).. అనే జర్నలిస్ట్ మీద పొలిటికల్ స్కూప్కి సంబంధించి విపరీతమైన ఒత్తిడి పెడ్తూంటాడు ఆమె బాస్. ఫలానా తేదీ నాటికి సంచలన వార్త తేవాలని డెడ్‌లైన్ కూడా నిర్ణయిస్తాడు. ఆ వేటలో పడ్తుంది రాగిణి. సరిగ్గా ఆ సమయంలోనే ఒక అపరిచిత ఫోన్‌కాల్ వస్తుంది ఆమెకు. లాల్‌బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన మిస్టరీని సంచలన వార్తగా మలచుకొమ్మని.. క్లూస్ ఇస్తామంటూ! అన్నట్టుగానే ఆ ఆధారాలన్నిటినీ పంపిస్తారు. వాటిని ఆమె చదివి.. చూసి.. ఆ మిస్టరీ డెత్‌కు సంబంధించిన వార్తా కథనాన్ని పేపర్లో రాస్తుంది. ఆ వార్త నిజంగానే సంచలనం అవుతుంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఢిల్లీ కేంద్ర రాజకీయాల్లోనూ రచ్చ జరుగుతుంది. లాల్‌బహదూర్ శాస్త్రిది హత్య అని చెప్తున్న ఆ వార్తలోని విషయాల నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా హోం మినిస్టర్ (నసిరుద్దీన్ షా) ఒక కమిటీని ఏర్పాటు చేస్తాడు. తొమ్మది మంది సభ్యులతో కూడిన ఆ కమిటీకి శ్యామ్ సుందర్ త్రిపాఠీ (మిథున్ చక్రవర్తి) అనే రాజకీయ నాయకుడు అధ్యక్షుడు. చరిత్రకారిణి ప్లస్ జర్నలిస్ట్ అయేషా అలీ షా (పల్లవి జోషి), ఎన్జీవో నిర్వాహకురాలు ఇందిరా జోసెఫ్ రాయ్ (మందిరా బేడీ), వార్త రాసిన రాగిణి ఫూలేతోపాటు జ్యుడీషియరీ, పోలీస్, ఇంటెలిజెన్స్ మొదలైన రంగాలకు చెందిన నలుగురు పురుషులూ ఉంటారు. విచారణ మొదలవుతుంది. ఇంకోవైపు.. దేశ రెండో ప్రధాని సహజ మరణాన్ని హత్యగా ప్రచారం చేస్తోందని రాగిణిని యాంటీ నేషనలిస్ట్, దేశ ద్రోహిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఆమెమీద బహిరంగ దాడులకూ దిగుతారు. బయట ప్రచారంలో ఉన్న అర్ధ సత్యాలను, ఇంటర్నెట్ ఫేక్ సమాచారంతో వార్తా కథనాన్ని రాసిందని చివరకు ఆమెను కమిటీలోంచి కూడా బహిష్కరిస్తారు. తాను రాసినవి అబద్ధాలు కావని రుజువు చేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని కమిటీకి అర్జీ పెట్టుకుంటుంది రాగిణి. అసలు ఈ హత్యోదంతం ఇప్పుడెందుకు తెరమీదికి? రానున్న ఎన్నికల్లో తమ గెలుపుకోసం లాల్‌బహదూర్ శాస్త్రి మరణాన్ని ఒక ఎజెండాగా పెట్టుకోవడానికి. ఆ కాన్స్పిరసీ థియరీ వార్త పత్రికలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేలా.. వచ్చాక సెన్సేషన్ అయ్యేలా అధికార పార్టీయే చేయిస్తుంది. అపరిచితుడి ద్వారా రాగిణికి ఫోన్, అందిన లీడ్, విచారణ కమిటీ.. అన్నిటికీ అధికార పార్టీయే కర్త. కమిటీ ఏర్పాటుకు ముందు రాగిణీని పిలిచి.. కమిటీలో సభ్యురాలిగా ఉండి.. తాను చెప్పినట్టు చేస్తే కొత్త వార్తా చానల్‌కు ఓనర్‌ను చేస్తానని అంటాడు నేత శ్యామ్‌సుందర్ త్రిపాఠీ. ఆ క్రమంలోనే ఆమె మీద దాడులు.. కమిటీ నుంచి బహిష్కరణ.. తిరిగి అర్జీ ఎట్సెట్రా. ఫైనల్ డే.. కమిటీ మెజారిటీ అభిప్రాయం ప్రకారం.. రాగిణి అర్జీని స్వీకరించి విచారణ ముగింపు రోజు ఆమెను కమిటీకి పిలుస్తారు. మీడియాకూ ఆహ్వానం ఉంటుంది. ఆ సమావేశంలోనే రాగిణి.. లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన ఒక నివేదికను బయటపెడుతుంది. అందులో ఆయన మీద విషప్రయోగం జరిగి ఉండొచ్చని, కాని పోస్ట్‌మార్టమ్ చేస్తేకాని దాన్ని నిర్ధారించలేమని రాసి ఉన్న వాక్యం ఆధారంగా తన వాదనను వినిపిస్తుంది. పోస్ట్‌మార్టమ్ ఎందుకు చేయించలేదు అప్పటి ప్రభుత్వం అని నిలదీస్తుంది. దానికి అనుబంధంగా వచ్చిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానమిస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత పదేళ్లకు.. ఎమర్జెన్సీ టైమ్‌లో అప్పటి అధికార పార్టీ .. మన రాజ్యాంగంలో సోషలిస్ట్ పదాన్ని చేర్చిన విషయాన్ని.. అలా ఎందుకు చేర్చారు అన్న వివరణనూ ఇస్తుంది రాగిణి. ఇండియాను రష్యాకు కాలనీగా మార్చుకోవడానికి కేజీబీ ప్రయత్నించిందని దానికి అప్పటి ప్రభుత్వం సహకరించిందని.. అందులో భాగమే సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చడమని, లాల్‌బహదూర్ బతికి ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవి కావని.. అందుకే అతని హత్యకు కుట్రపన్నారని చెప్తూ.. వాటికి సంబంధించిన ఆధారాలను, నివేదికలను, పుస్తకాలను, కుల్దీప్ నయ్యర్, అంజు ధార్ వంటి వాళ్ల వీడియో ఇంటర్వ్యూలను చూపిస్తుంది. మొత్తానికి భారతదేశ రెండో ప్రధానిది కచ్చితంగా హత్యేనని.. కాబట్టే పోస్ట్‌మార్టమ్ చేయకుండా నిర్లక్ష్యం చేశారనే ముగింపునిస్తుంది రాగిణి. ఈ తీరునంతా మీడియా రికార్డ్ చేస్తుంది. ఎట్ ది ఎండ్.. ‘‘మీరు చెప్పినట్టు.. చేశానా? పాస్ అయ్యానా?’’ అని అడుగుతుంది రాగిణి.. కమిటీ చైర్మన్ త్రిపాఠీని. నవ్వుతూ ‘‘వెల్కమ్ టు పాలిటిక్స్’’ అని చెప్పి వెళ్లిపోతాడు త్రిపాఠి. ఆ మాటకు నిశ్చేష్టురాలవుతుంది రాగిణి.పాలిటిక్స్, జర్నలిజం వేరు వేరు కావు అని ఆ సినిమాలోనే ఒక చోట అంటాడు త్రిపాఠి. అలా ఓ సంచలన వార్త కోసం ఆకలిగా ఉన్న ఒక జర్నలిస్ట్‌ను అన్వేషించి.. సెన్సేషన్‌ను ఎర వేసి.. ఆ జర్నలిస్ట్‌కు తెలియకుండానే ఆమెతో రాజకీయం చేయిస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి చుట్టుకున్న అనేక కాన్స్పిరసీ థియరీల్లో ఒకదాన్ని వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుకి ఎజెండాగా సెట్ చేసుకుంటారు. కనుకే హోమ్ మినిస్టర్ అంటాడు.. ‘కౌన్ కహెతాహై కి మరే హుయే పీఎం సే కిసీకో ఫాయిదా నహీ హోతా’’ అని. ఈ సినిమాకు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకుడు.– సరస్వతి రమ