ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం అందరికి తెలిసిందే. ఈయన ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలు తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. నెటిజన్ల ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ఉంటాడు.
తాజాగా ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్విటర్) ఖాతాలో మరో పోస్ట్ చేసాడు. ఇందులో మృదు స్వభావి, సౌమ్యుడు, అణుకువ కలిగిన వ్యక్తి.. అతని మాటలు దేశ చరిత్రలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని.. ఆయన్ను మేము ఎప్పటికి మరచిపోము అంటూ 'లాల్ బహుదూర్ శాస్త్రి' గురించి వెల్లడించాడు.
ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
నిజానికి అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తొస్తుంది. కానీ దేశానికి తన వంతు ఎనలేని సేవ చేసిన లాల్ బహుదూర్ శాస్త్రి గురించి మాత్రం చాలామంది మర్చిపోయి ఉంటారు. భారతదేశ రెండో ప్రధానమంత్రి, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన లాల్ బహాదుర్ శాస్త్రి 114వ జయంతి నేడు. కావున ఈ మహానుభావున్ని కూడా తప్పకుండా స్మరించుకోవాలి.
Small. Soft-spoken. Mild-mannered. Humble. Yet he was one of the Tallest men in our country’s history & his words were loud enough to be heard everywhere. We will not forget him. 🙏🏽 #ShastriJayanti pic.twitter.com/c7z2zUBYlW
— anand mahindra (@anandmahindra) October 2, 2023
Comments
Please login to add a commentAdd a comment