సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇదో మంచి ఆలోచన అంటూ ట్వీట్ చేశారు.
దేశంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పెద్ద నగరాల్లో వర్షం పడితే ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తానికి ముంబైలో రుతుపవనాలు కొంత తగ్గుముఖం పట్టాయి, అంటూ ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి గొడుగును.. బ్యాగ్ మాదిరిగా తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. గొడుగుకు రెండువైపులా ఇనుప తీగల వంటి పరికరాలను అమర్చుకున్నారు. దాన్ని ఒక బ్యాగ్ మాదిరిగా తగిలించుకున్నారు. ఇలా చేయడం వల్ల గొడుగును పట్టుకోవడానికి ప్రత్యేకంగా చేతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీడియోలో గొడుగును తగిలించుకుని చేతులతో వస్తువులను తీసుకెళ్లడం కూడా చూడవచ్చు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు మహీంద్రా గొడుగులు కావాలని కామెంట్ చేస్తే.. మరొకరు హ్యుయెన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో ఇలాంటిది కలిగి ఉన్నారని అన్నారు.
Finally, we’re seeing some consistent rain in Mumbai this monsoon.
Not heavy enough for our liking, but it’s probably time to plan our ‘wardrobe for wetness.’
May be a good idea to think about a ‘wearable’ umbrella
Clever…pic.twitter.com/7pjyFAMJ6O— anand mahindra (@anandmahindra) June 22, 2024
Comments
Please login to add a commentAdd a comment