హైదరాబాద్‌లో షిప్‌రాకెట్‌ సేమ్‌ డే డెలివరీ సేవలు | Shiprocket Launched Same Day Delivery Service In Hyderabad, Know More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో షిప్‌రాకెట్‌ సేమ్‌ డే డెలివరీ సేవలు

Published Wed, Mar 26 2025 8:05 AM | Last Updated on Wed, Mar 26 2025 8:21 AM

Shiprocket launched Same Day Delivery service in Hyderabad

ఈ–కామర్స్‌ డెలివరీ సేవల సంస్థ షిప్‌రాకెట్‌ తాజాగా హైదరాబాద్‌లో చిన్న, మధ్య తరహా సంస్థల కోసం (ఎంఎస్‌ఎంఈ) సేమ్‌ డే డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఇప్పటికే ఇవి ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, కోల్‌కతా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు ఉత్పత్తులను వేగవంతంగా అందించడంలో మిగతా పెద్ద సంస్థలతో ఎంఎస్‌ఎంఈలు పోటీపడేలా తోడ్పాటు అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు షిప్‌రాకెట్‌ ఎండీ సాహిల్‌ గోయల్‌ తెలిపారు. ఇందుకోసం పిక్‌ఎన్‌డెల్, పికో, బ్లిట్జ్, షాడోఫ్యాక్స్‌ తదితర సంస్థలతో జట్టు కట్టినట్లు వివరించారు. దేశీయంగా సేమ్‌ డే డెలివరీ మార్కెట్‌ 2028 నాటికి సుమారు 24 శాతం వార్షిక వృద్ధితో 10 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.


మెన్‌ ఆఫ్‌ ప్లాటినం ధోనీ కలెక్షన్‌

ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని సిగ్నేచర్‌ ఎడిషన్‌ కింద ప్లాటినం జ్యుయలరీ ప్రవేశపెట్టినట్లు మెన్‌ ఆఫ్‌ ప్లాటినం వెల్లడించింది. వీటిలో ప్లాటినం గ్రిడ్‌ బ్రేస్‌లెట్, ముమెంటం బ్రేస్‌లెట్, క్యూబ్‌ ఫ్యూజన్‌ బ్రేస్‌లెట్, బోల్డ్‌ లింక్స్‌ బ్రేస్‌లెట్, ప్లాటినం హార్మనీ చెయిన్‌ ఉన్నట్లు తెలిపింది. వీటిని 95% ప్లాటినంతో తీర్చిదిద్దినట్లు వివరించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement