నలంద:బీహార్‌లోని నలందలో ఘోరం చోటుచేసుకుంది. మత్తుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు క్షణికావేశంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే బీహార్‌లోని నలంద జిల్లాలో టీ దుకాణదారునిపై కాల్పులు జరిపిన ఉదంతం వెలుగుచూసింది. గుట్కా ఇవ్వడంలో ఆలస్యం చేశాడనే కారణంతో దుండగులు ఆ చాయ్‌వాలాపై కాల్పులకు పాల్పడ్డారు. బుల్లెట్ శబ్దం విని చుట్టుపక్కలవారు టీ దుకాణం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణదారుడిని గాయపడిన స్థితిలో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన నలంద జిల్లాలోని సారే పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రివేళ ముగ్గురు సాయుధ దుండగులు టీ దుకాణానికి వచ్చి, చాయ్‌వాలాను గుట్కా ప్యాకెట్లు కావాలని అడిగారు. అతను వాటిని ఇవ్వడంతో కొంత జాప్యం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ దుండగులు దుర్భాషలాడుతూ, చాయ్‌వాలాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ దుకాణదారుడి వీపు గుండా దూసుకెళ్లింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన దుకాణదారుడిని నరేష్ యాదవ్ కుమారుడు రాకేష్ యాదవ్‌గా గుర్తించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ధర్మేష్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుని దర్యాప్తు ప్రారంభించారని, బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ముగ్గురు యువకులు ఈ నేరానికి పాల్పడ్డారని, ఈ కేసును త్వరలోనే చేధిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్
Comments
Please login to add a commentAdd a comment