పాట్నా : బీహార్ (bihar) లో ఉద్రిక్తత నెలకొంది.డిసెంబర్ 13న నిర్వహించిన 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (bpsc) ప్రిలిమనరీ పరీక్ష పేపర్ లీకైందని, పరీక్ష వాయిదా వేయాలని రోజుల తరబడి అభ్యర్థుల చేస్తున్న ఆందోళన ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం నితీష్ కుమార్‌తో భేటీ అయ్యేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీ మైదాన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వాటర్ కెనాన్లను ప్రయోగించారు.
సీఎం నితీష్ కుమార్‌ను కలిసిందేకు పీబీఎస్ (Bihar Public Service Commission) అభ్యర్థులు జేపీ గోలంబార్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన రెండు బారికేడ్లను ఛేదించారు. అక్కడి నుంచి పాట్నా గాంధీ మైదాన్‌కు తరలించారు. ఆ సమయంలో పోలీసులకు, బీపీఎస్‌ఈ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులు ఫ్రేజర్ రోడ్డు మీదుగా ప్రభుత్వ అధికారులు నివాస ప్రాంతమైన డాక్ బంగ్లా వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి గుంపును చెదరగొట్టారు. నిరసనకారులను అదుపు చేసేందుకు హోటల్ మౌర్య సమీపంలో బారికేడ్లతో సహా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
#WATCH | Bihar | BPSC aspirants continue their protest in Patna's Gandhi Maidan, demanding a re-exam to be held for the 70th BPSC prelims
Jan Suraaj Chief Prashant Kishor also present at the protest pic.twitter.com/q9qUrv6wTd— ANI (@ANI) December 29, 2024
ఈ సందర్భంగా బీపీఎస్సీ పరీక్షలపై పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఎపీఎస్సీ పరీక్షలు అక్రమాలు, పేపర్ లీకేజీలు ఆనవాయితీగా మారాయి. ఇలా సాగడం కుదరదు. పరిష్కారం వెతకాలి.. అందుకే ‘ఛత్ర సంసద్’ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. .
అభ్యర్థుల చత్ర సంసద్‌పై పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ (DM) చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ, గాంధీ మైదాన్ నిషేధిత ప్రాంతం కాబట్టి జిల్లా యంత్రాంగం విద్యార్థులను గుమికూడనివ్వదు. కోచింగ్ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం నిరసనల్లో పాల్గొన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గాంధీ మైదాన్‌లో, పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా సిబ్బందిని నియమించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment