Public Service Commission
-
దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తూ, సన్నద్ధమవుతున్నవారు కూడా ఇందులో ఉంటున్నారు. కనీసం హాల్‌టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోనివారూ ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరమవుతుండగా.. నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతుండటం.. కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం.. ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం. సాగదీతలు.. వాయిదాలతో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 11 వేల గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకాగా.. రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాక ఆ నోటిఫికేషన్ రద్దయింది. దాని స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగిస్తూనే... కొత్త అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చివరిదశకు చేరింది. ఇక గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2022 డిసెంబర్లో వెలువడ్డాయి. గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. గ్రూప్–2, 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో గ్రూప్–2 అర్హత పరీక్షలు మూడుసార్లు వాయిదా పడగా.. గ్రూప్–3 పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని.. వాటికోసం వేచి చూసే బదులుగా ప్రత్నామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హాజరుశాతం.. క్రమంగా పతనం.. గత ఏడాది జూలైలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. హాజరైనవారు సుమారు ఏడున్నర లక్షల మంది మాత్రమే. అంటే 80 శాతం మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైనవారు 74 శాతమే. ప్రిలిమినరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిలో నుంచి.. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు 31,403 మందిని కమిషన్ ఎంపిక చేసింది. బాగా ప్రిపేరైన వారే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్‌కు కూడా 67.17శాతం మందే హాజరవడం గమనార్హం. గ్రూప్–3 పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది, గ్రూప్–2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57 శాతమే హాజరయ్యారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరాశలో కూరుకుపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు జారీ చేశాక పరీక్షల నిర్వహణ, వాయిదాలతో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. దరఖాస్తు చేసినవారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా.. హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. – అబ్దుల్ కరీం, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేటు సెక్టార్లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరుగెత్తాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే.. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి. – భవాని శంకర్ కోడాలి, నిపుణులు, కెరీర్ గైడ్ -
పోటీ పరీక్షలపై ఆందోళన.. అభ్యర్థులపై లాఠీఛార్జ్
పట్నా:పబ్లిక్ సర్వీస్కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేసినందుకుగాను బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ఈ విషయమై తాజాగా రాజధాని పట్నాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం విమర్శలకు తావిస్తోంది.డిసెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే బీపీఎస్సీ ఈ పరీక్షలకు ఒక పూట-ఒక పేపర్ ఉండాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘అభ్యర్థులు ఎంత చెప్పినా వినకుండా బీపీఎస్సీ కార్యాలయం వైపునకు దూసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. అందుకే వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది’అని పోలీసు అధికారులు తెలిపారు.కాగా, ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారని, ఈ లాఠీఛార్జ్‌లో కొందరికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. అభ్యర్థులను చెదరగొట్టేందుకు తాము స్వల్ప లాఠీఛార్జ్ చేశామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. ఇద్దరి మృతి -
Uttar Pradesh: విద్యార్థి ఆందోళనలు ఉధృతం.. బారికేడ్లను దాటుకుని..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్ ప్రిలిమ్స్ 2024, ఆర్/ఏఆర్ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
తెలంగాణలో నూతన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు లైన్ క్లియర్.. చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌తో అప్రమత్తం.. ఎంసెట్‌కు బ్లాక్‌చైన్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి జరిగే ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పటిష్టమైన సాంకేతిక భద్రత అవసరమని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఈ తరహా అభిప్రాయానికొచ్చారు. దీనికోసం అత్యంత పటిష్టమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రత వ్యవస్థను కల్పించే యోచనలో ఉన్నారు. దీనితోపాటే ఎంసెట్ పేపర్ రూపకల్పన, వాటిని కంప్యూటర్లు, సర్వర్లలో నిక్షిప్తం చేసిన విధానాలపై నిపుణులతో కలిసి అధికారులు లోతైన సమీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ పేపర్ తయారీలో ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తులు, సాంకేతిక నిపుణుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఇదే కోణంలో పేపర్లను భద్రత పరిచిన తర్వాత సంబంధిత సర్వర్లు, కంప్యూటర్లను ఎవరైనా వినియోగించారా? అనే కోణంలో సమాచార సేకరణకు సిద్ధమవుతున్నారు. ఎంసెట్‌కు ప్రశ్నపత్రాల సర్వర్లకు సంబంధించిన ప్రతీ ఐపీ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు ఇతర రాష్ట్రాలతో సహా రాష్ట్రానికి చెందిన మొత్తం 2.50 లక్షల మంది ఎంసెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉన్నత విద్యా మండలికి స్పష్టం చేసినట్టు తెలిసింది. మేఘాలయాలో జరుగుతున్న అఖిల భారత విశ్వవిద్యాలయాల సమావేశంలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఎంసెట్ నిర్వహిస్తున్న జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్ భద్రతపై సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిసింది. ముట్టుకున్నా ‘బ్లాక్’అలారం.. ఎంసెట్ పేపర్ల భద్రతకు వాడబోతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ అత్యంత శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి దీన్ని సర్వర్లకు, కీలకమైన కంప్యూటర్ డివైస్‌కు అనుసంధానం చేస్తే ఏ ఇతర వ్యక్తి ముట్టుకున్నా తక్షణమే కీలకమైన వ్యక్తులకు సంకేతాలిస్తుంది. ఇప్పటి వరకూ డివైజ్‌లోకి ఎవరెవరు? ఏ ఐపీ అడ్రస్‌తో వెళ్ళారనే రహస్య సమాచారం అందిస్తుంది. కంప్యూటర్ సైన్స్‌లో క్రిప్టోగ్రఫీ విధానంలో పనిచేసే బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఇప్పటికే అనేక దేశాలు వాడుతున్నట్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంసెట్ పేపర్లకు బాధ్యులెవరు? ఏయే సమయాల్లో వాళ్ళు డివైజ్‌లోకి వెళ్ళాలి? అనేదానిపై ముందే స్పష్టత ఉంటుంది. ఇది బ్లాక్‌చైన్ టెక్నాలజీ మెమోరీలో నిక్షిప్తమై ఉంటుంది. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు ప్రవేశించినా, అందుకు భిన్నంగా వెళ్ళినా తేలికగా ముందే గుర్తించడం ఈ సాంకేతికత ప్రత్యేకగా చెబుతున్నారు. అత్యంత రహస్యమైన వ్యవస్థను అంతకంటే రహస్యంగా భద్రతపర్చడమే కాకుండా, హ్యాక్ చేసే ప్రయత్నాలను అడ్డుకునే విధానం ఇందులో ఉందని చెబుతున్నారు. దీన్ని పక్కాగా నిర్వహించగల నమ్మకమైన వ్యక్తుల గురించి అధికారులు జల్లెడ పడుతున్నారు. అంతే కాకుండా పాస్వర్డ్స్, సమాచార ప్రవేశం ఎవరెవరికి ఏ మేర ఇవ్వాలనే విషయాలపై స్పష్టతకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. దీనివల్లే ఏం జరిగినా వారినే బాధ్యులను చేయవచ్చని చెబుతున్నారు. ప్రత్యేక భద్రతపై పరిశీలిస్తున్నాం ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పూర్తి భద్రత కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఉన్నత విద్యా మండలితో కలిసి ఈ విషయంలో చర్చలు జరుపుతాం. మేఘాలయ వీసీల సమావేశంలో ఉన్నప్పటికీ కీలకమైన ఈ అంశంపై దృష్టి పెట్టాం. ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నదీ త్వరలో వివరిస్తాం. - ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ జేఎన్టీయూహెచ్) ఎన్క్రిప్షన్ కూడా అవసరమే ఎంసెట్ వంటి కీలకమైన ప్రశ్నపత్రాలకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రత మంచిదే. దీంతోపాటే, ఎన్క్రిప్షన్ విధానం అత్యంత ముఖ్యం. దీనివల్ల ప్రశ్నపత్రం ఎవరికైనా చిక్కినా ఏమీ అర్ధంకాని భాషలో ఉంటుంది. దీన్ని కేవలం వ్యాల్యూడ్ యూజర్ మాత్రమే డీకోడ్ చేయడం సాధ్యం. క్రిప్టోగ్రఫీ భాషా విధానంతో దీన్ని రూపొందించారు. విశ్వసనీయమైన వ్యక్తులకు అధికారం ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకుంటే పేపర్ లీక్ వంటి ఘటనలకు ఆస్కారమే ఉండదు. - ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ (వీసీ, అనురాగ్ యూనివర్సిటీ, సైబర్‌క్రైం ఫ్యాకల్టీ నిపుణులు) -
అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!
కేరళలో తల్లి, కొడుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చింది. ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చింది’ అన్నాడు తల్లి దగ్గరకు వెళ్లి. ‘నాక్కూడా బాబూ’ అని జవాబు చెప్పిందా తల్లి. ఇద్దరూ ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యారు. వారిని ఉత్సాహపరిచిన తండ్రి ఆనందంతో కళ్లు తుడుచుకున్నాడు. ఇంత మంచి కుటుంబ కథా చిత్రం ఈ మధ్య చూళ్లేదు మనం. కొబ్బరిచెట్లు సంతోషంతో తలలు ఊపాయి. వీధి అరుగులు చప్పట్లు కొట్టాయి. ఒక సామాన్యమైన ఇంటిలో హటాత్తుగా రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి ఈ సంబరం మనదే అన్నట్టుగా ఊరు ఉంది. దానికి కారణం మొన్న ఆగస్టు 3న కేరళలో ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మలప్పురంలో అరిక్కోడ్ అనే ఉళ్లోని తల్లీకొడుకులు న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. తల్లి బిందు ‘లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్’ (ఎల్.జి.ఎస్.) విభాగంలో 92వ ర్యాంక్ సాధిస్తే కొడుకు వివేక్ ‘లోయర్ డివిజినల్ క్లర్క్’ (ఎల్.డి.సి.) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు. తల్లి వయసు 42. కొడుకు వయసు 24. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు 40 ఏళ్లు పరిమితిగా ఉన్నా కొన్ని వర్గాలకు 42 ఏళ్లు మరికొన్ని వర్గాలకు 46 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంది. తన సామాజికవర్గాన్ని బట్టి పరీక్ష రాయడానికి అర్హత ఉన్న బిందు 42 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం సాధించింది. ఈసారి కాకపోతే ఇంకేముంది... జాతీయస్థాయిలో ఇది విశేష వార్తగా మారింది. లాస్ట్ చాన్స్ బిందు చాలా కాలంగా అంగన్వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంది. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంతో ఆమెకు సంతృప్తి లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకునేది. కొడుకు వివేక్ పదో క్లాసుకు వచ్చినప్పటి నుంచి ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతూ ఉంది. అంతే కాదు కొడుకుతో కూడా నువ్వు గవర్మెంట్ ఉద్యోగం సాధించాలిరా అని తరచూ చెప్పేది. చిన్నప్పటి నుంచి అతని చేత పత్రికలు చదివించేది. కొడుకు డిగ్రీ అయ్యాక అతనూ ఉద్యోగానికి ప్రిపేర్ అవడం మొదలెట్టాడు. బిందు పట్టుదల చూసి ఆమె భర్త పూర్తిగా మద్దతు పలికాడు. కోచింగ్ లో చేరండి అని చేర్పించాడు. ఇంతకు మునుపు చేసిన అటెంప్ట్స్ ఫలించలేదు. ఈసారి బిందుకు లాస్ట్ చాన్స్. ఈసారి మిస్సయితే ఇక ఎగ్జామ్ రాసే వయసు ఆమె వర్గానికి సంబంధించి దాటేస్తుంది. ఎలాగైనా సాధించాలి అనుకుందామె. కోచింగ్ చేరి బిందు, వివేక్ ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో చేరారు. కలిసి వెళ్లి కోచింగ్ తీసుకుని వచ్చేవారు. ఆ తర్వాత ఎవరికి వారు ప్రిపేర్ అయ్యేవారు. ‘మేము మా గదుల్లోకి వెళ్లి చదువుకునేవాళ్లం. మధ్యలో మాత్రం డౌట్స్ వస్తే ఒకరినొకరం అడిగేవాళ్లం. నోట్సులు ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్లం’ అన్నాడు వివేక్. సంకల్పం వృధా కాలేదు. ‘ఉద్యోగం వచ్చిందమ్మా’ అని కొడుకు పరిగెత్తుకుని వెళితే ‘నాక్కూడారా’ అని నవ్విందామె. భలే ఉంది కదా... ఈ కుటుంబ కథా చిత్రం. -
అరుదైన కుటుంబం; ఇంట్లో అందరూ కలెక్టర్లే
జైపూర్: తండ్రి శ్రీ సహదేవ్ సహరన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక రైతు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు. కొడుకులు లేరని కుంగిపోకుండా తన కూతుళ్లనే కొడుకులుగా భావించాడు. '' ఐఏఎస్ కావాలన్న తన కల నెరవేర్చుకోలేకపోయానని.. మీరు నా కోరికను నెరవేర్చాలంటూ'' కూతుళ్లకు వివరించాడు. అలాగే వారందరిని కష్టపడి చదివించాడు. ఈరోజు అతని కష్టం ఊరికే పోలేదు.. ఆ ఐదుగురు సరస్వతి బిడ్డలయ్యారు. ఒక ఇంట్లోనుంచి ఒకరు కలెక్టర్‌గా ఎంపికవడయే గొప్ప అనుకుంటే సహరన్ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు అక్కాచెల్లెళ్లు కలెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు తండ్రి సహరన్‌తో పాటు అతని ఐదుగురు బిడ్డలు యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ అరుదైన ఘటన రాజస్తాన్‌లోని హనుమాఘర్‌లో చోటుచేసుకుంది.. 2018లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించారు. హనుమఘర్‌కు చెందిన అన్షు, రీతు, సుమన్‌లు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు(ఆర్ఏఎస్) ఏకకాలంలో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే ఆ ఇంట్లో నుంచి రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఏఎస్కు ఎంపికవడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ ఆర్ఏఎస్కు ఎంపికైన ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోను షేర్ చేస్తూ ట్విటర్లో స్పందించారు. ఇది నిజంగా గర్వించదగిన విషయం. అన్షు, రీతు, సుమన్‌లు ఏకకాలంలో అడ్మినిస్టేటివ్ సర్వీస్‌కు ఎంపికవడం గొప్ప విషయం. ఈ విజయంతో వారి తండ్రికి , కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Such a good news. Anshu, Reetu and Suman are three sisters from Hanumangarh, Rajasthan. Today all three got selected in RAS together. Making father & family proud. pic.twitter.com/n9XldKizy9 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 14, 2021 -
పాపం అవినాష్.. కరోనాతో మరణించాక డీఎస్పీ కొలువొచ్చింది
పాట్నా: ప్రస్తుత కాలంలో సర్కారీ కొలువు సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఆ కలను నెరవేర్చుకునేందుకు అహర్నిశలు కష్టపడుతుంటారు. ఇలా చాలా మంది నిరుద్యోగుల్లాగే బిహార్‌కు చెందిన అవినాష్ కూడా సర్కారీ కొలువు సాధించాలని కలలు కన్నాడు. అయితే, కరోనా మహమ్మారి ఆ యువకుడి కలలపై నీళ్లు చల్లింది. ఉద్యోగాని ఎంపికయ్యాడన్న వార్త తెలీనీకుండానే అతన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన 30 ఏళ్ల అవినాష్‌కు చిన్నప్పటి నుంచి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లో(బీపీఎస్సీ) ఉద్యోగం సాధించాలని కల ఉండేది. దాని కోసం రేయి పగలనకుండా కష్టపడి చదివాడు. బిటెక్ పూర్తి చేసి భారీ మొత్తంలో ప్యాకేజీ ఉన్న ఇంజనీర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి కోచింగ్ తీసుకొని మరీ పరీక్షలు రాశాడు. అయితే పరీక్షలు రాసిన అనంతరం అవినాశ్ కరోనా బారిన పడ్డాడు. కొన్నిరోజుల పాటు డాక్టర్ల సలహాలతో ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే, డిశ్చార్జ్ అనంతరం అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో తిరిగి ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో గత నెల(జూన్) 24న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృత్యువాత పడ్డాడు. అయితే, జూన్ 30 వ తేదీన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెల్లడించిన ఫలితాల్లో అవినాశ్.. డిప్యూటీ కలెక్టర్(డీసీ) లేదా డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) స్థాయి ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిసింది. అయితే అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. తన కల సాకారమైందని సంతోషించడానికి అవినాశ్ లేడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్యోగ ఫలాలు అనుభవించేందుకు తమ బిడ్డ లేడని గుండెలు పగిలేలా ఎడుస్తున్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో స్టేట్ సెకెండ్ ర్యాంకర్ అయిన అవినాష్.. క్యాంపస్ సెలక్షన్‌లోనే భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు బంధువులు వెల్లడించారు. -
ఏపీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)పై కొంతమంది రాజకీయ, నిరాధార విమర్శలు, ఆరోపణలు చేయడం తగదని కమిషన్ సభ్యుడు ఎస్.సలాంబాబు పేర్కొన్నారు. డిజిటల్ మూల్యాంకనం గురించి కనీస పరిజ్ఞానం లేకుండా లోకేశ్ మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ఏమైనా సందేహాలుంటే అపాయింట్మెంటు తీసుకుని కమిషన్ దగ్గరకు వస్తే నివృత్తి చేస్తామని చెప్పారు. ఈ రెండేళ్లలో ఒక్క ఆరోపణ కూడా లేకుండా చాలా నియామకాలు పూర్తిచేసినట్లు తెలిపారు. గతంలో ఇంటర్వ్యూలకు సింగిల్‌బోర్డు ఉండేదని, ఇప్పుడు బహుళ బోర్డులు చేశామని చెప్పారు. ఏ సభ్యుడు ఏ బోర్డులోకి వెళ్తారో కూడా తెలియదని పేర్కొన్నారు. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలిచ్చారు. అభ్యర్థుల ఎంపిక రేషియో కమిషన్ ఇష్టం గ్రూప్–1 మెయిన్స్‌లో ఒక అభ్యర్థి నెల్లూరులో 2 పేపర్లు, హైదరాబాద్‌లో 5 పేపర్లు రాశారనడం సరికాదని, ఆ అభ్యర్థి మొత్తం పేపర్లన్నీ హైదరాబాద్‌లోనే రాశారని చెప్పారు. జీవో ప్రకారం 2 శాతం పోస్టుల్ని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాలని, అందుకు అర్హులు లేకపోతే అవి ఓపెన్ కేటగిరీలో భర్తీచేయాలని నిబంధనలున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఏ రేషియోలో పిలవాలన్న అధికారం కమిషన్‌కు ఉంటుందని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలున్నందున అందరికీ సమానావకాశాలిచ్చేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా ఎంపికైనవారి జాబితా ప్రకటించే సమయానికే బుక్లెట్లు ప్రింట్ అయ్యాయని, ఈ సమయంలో కొందరు ఫలానా లాంగ్వేజ్‌లో రాసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో గ్రూప్–1లోని 5 పేపర్లను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేన్లోనైనా రాసుకోవచ్చని అందరికీ అవకాశం ఇచ్చామని వివరించారు. శ్రీకాకుళం, కాకినాడల్లో బుక్లెట్లు మారిపోయాయని ఆరోపణలు సరికాదన్నారు. మూల్యాంకన విధానం కమిషన్ నిర్ణయిస్తుంది డిజిటల్ మూల్యాంకనమంటూ రూలు మార్చారన్న విమర్శలు సరికాదని చెప్పారు. నోటిఫికేషన్‌లోని విద్యార్హతలు, వయసు వంటివి మారిస్తే రూలు మార్చడం అంటారని తెలిపారు. మూల్యాంకన విధానం అనేది ఎక్కడా నోటిఫికేషన్లో పేర్కొనరని, అది కమిషన్ పరిధిలో నిర్ణయిస్తారని చెప్పారు. అయినా.. అభ్యర్థులకు తెలియాలన్న ఉద్దేశంతో డిజిటల్ మూల్యాంకనం గురించి మెయిన్స్ పరీక్షలకు ఏడాది ముందు 2019 డిసెంబర్లోనే ప్రకటించినట్లు గుర్తు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడా లోపాల్లేకుండా 4 నెలల్లో డిజిటల్ మూల్యాంకనాన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. అభ్యర్థులెవరికీ నష్టం రాకూడదని ట్యాబ్ ఆధార ప్రశ్నపత్రాలు ఇచ్చి ఒకేసారి అవి ఓపెన్ అయ్యేలా చేశామన్నారు. థర్డ్ పార్టీ సాంకేతిక, సాఫ్ట్వేర్ సహకారం, స్కానింగ్, మ్యాపింగ్ వంటి పనులకే తప్ప మూల్యాంకనానికి కాదన్నారు. ఫూలిష్ ఆరోపణలు సహించం పెద్ద ఎత్తున డబ్బులు మారాయని లోకేశ్‌గానీ, ఎవరైనా సరే ఫూలిష్ ఆరోపణలు చేస్తే కమిషన్ సహించదని హెచ్చరించారు. ఆధారాలుంటే కోర్టుకు సమర్పించవచ్చన్నారు. ఇదే గ్రూప్–1లో 51 తప్పులు వచ్చాయని, వాటిని తాము సరిదిద్ది ఇంటర్వ్యూల వరకు తెచ్చామని చెప్పారు. అప్పుడు లోకేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. గతంలో అనేక లోపాలు జరిగినా ఆయన మాట్లాడలేదన్నారు. చదవండి: 2018 గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధుల ఆందోళన -
గ్రూప్–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. ఆట మొదలైన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల్ని మార్చిందని హైకోర్టు ఆక్షేపించింది. ఇంటర్య్వూలు జరిగితే సరైన అభ్యర్థులు ఇంటర్వ్యూలు/తదుపరి ఎంపికకు వెళ్లే హక్కును కోల్పోతారంది. ఇంటర్వ్యూలు జరిగితే వారికి తీరని నష్టం కలుగుతుందని అభిప్రాయపడింది. ఒక్క మార్కు తేడా కూడా అభ్యర్థి జీవితం మొత్తాన్ని మార్చేస్తుందని పేర్కొంది. ఈ దృష్ట్యా ఇంటర్వ్యూలు జరిగితే కలిగే నష్టాన్ని ‘తీరని నష్టం’గా చెప్పాల్సి వచ్చిందని తెలిపింది. జవాబు పత్రాలను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనలతో దాఖలైన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించడం సరికాదని, ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ఏమన్నారంటే.. ‘సివిల్ సర్వెంట్లను భర్తీ చేసుకునే గొప్ప బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు రాజ్యాంగం కట్టబెట్టింది. అందువల్ల పోస్టుల భర్తీ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై రాజ్యాంగ బాధ్యత ఉంది. ఈ బాధ్యతను రొటీన్ కార్యనిర్వాహక బాధ్యతగా భావించడానికి వీల్లేదు. జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసేందుకు థర్డ్ పార్టీని ఏర్పాటు చేయడం, ఆ థర్డ్ పార్టీని ఎంపిక చేసేందుకు వారు అనుసరించిన విధానం, మూల్యాంకనం విషయంలో వారికున్న అనుభవం ఏమిటన్నదే ఈ కేసులో ప్రధానంగా తలెత్తే విషయాలు. చ ట్టం నిర్దేశించిన విధంగా నడుచుకుని తీరాల్సిందే. డిజిటల్ మూల్యాంకనం బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించే విషయంలో ఆ థర్డ్ పార్టీని ఎలా ఎంపిక చేశారన్న దానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఓపెన్ టెండర్ ద్వారానా, మ రో చట్టబద్ధ పద్ధతి ద్వారా చేశారో స్పష్టత లేదు. థర్డ్‌పార్టీకి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసే అర్హతలు, నైపుణ్యం ఉన్నాయా అన్నదే ఇక్కడ తలెత్తే ప్రధాన ప్రశ్న. కమిషన్ దాఖలు చేసిన కౌంటర్లో ఈ విషయంలో మౌనం దాల్చింది. నోటిఫికేషన్‌లోని నిబంధనలను మార్చినా, సవరించినా ఆ విషయాన్ని సంబంధీకులందరికీ తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుత కేసులో ఎవరు మూల్యాంకనం చేశారన్న దానిపై స్పష్టత లేదు. డిజిటల్ మూల్యాంకనంలోనూ గతంలో తప్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది’ అని న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు వాయిదా గ్రూప్–1 ఇంటర్వ్యూలను 4 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలు ఈ నెల 17 నుంచి జూలై 9వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే గ్రూప్–1పై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేసిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. సవరించిన ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బిహార్ : తొలిసారి డీఎస్పీగా ముస్లిం యువతి
పట్నా: బిహార్ రాష్ట్రం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనుకబడి ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, కొన్ని ముస్లిం కుటుంబాలలో మహిళల విద్యపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ముస్లిం యువతి గ్రూప్1 సర్వీస్‌లో అత్యున్నత హోదా అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తానా అనే యువతి చరిత్రను సృష్టించింది. ఆమె తాజాగా, ప్రకటించిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికైంది. అయితే, బిహార్ రాష్ట్రంలో, ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి ఈ సర్వీస్‌ను సాధించిన తొలి యువతి కూడా రజియానే. దీంతో ఇప్పుడిమే వార్తల్లో నిలిచింది. కాగా, రజియాతో పాటు మరో 40 మంది కూడా డీఎస్పీ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె హతూవా నగరంలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. రజియా తండ్రి మహమ్మద్ అస్లామ్ అన్సారీ బొకారోలోని ఒక ఫ్యాక్టరీలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అన్సారీకి 7 గురు సంతానం. వీరిలో రజియా అందరికన్నావయసులో చిన్నది. ఆమెకు ఒక అన్నయ్య .. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ప్రాథమిక విద్యను బొకారోలో, బీటెక్‌ను జోధ్‌పూర్‌లో పూర్తి చేసుకుంది. అయితే రజియా తండ్రి 2016లోనే చనిపోయాడు. దీంతో ఆమె కష్టపడి విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించింది. తన తల్లితో కలిసి ఉంటుంది. ఎలాగైన ప్రభుత్వ సర్వీస్ సాధించాలనే తపనతో 2017 నుంచి తన ప్రిపరేషన్‌ను ప్రారంభించింది. ఉద్యోగం చేస్తునే మిగతా సమయంలో ప్రిపరేషన్ సాగించేది. ఈ క్రమంలో, మొత్తానికి తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రజియా మాట్లాడుతూ... ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. మానాన్న గారికి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉండేదని తెలిపింది. దీంతో నేను ఆయను కలను, నా ఆశయాన్ని పూర్తిచేశానని తెలిపింది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధిత మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ప్రధానంగా, కొన్ని ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఇప్పటికీ విద్యపట్ల వివక్షతకు గురౌతున్నారని బాధపడింది. అలాంటి కుటుంబాలలో విద్యపట్ల అవగాహన పెంచుతానని చెప్పింది. అయితే, ఇప్పటికే తాను, కోవిడ్ బారిన పడి కోలుకున్నానని చెప్పింది. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని దానిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించింది. చదవండి: Shocking: స్టోర్‌లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ.. -
ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో..ఇంటర్వ్యూలు రద్దు
-
ఎక్కడి నుంచైనా సరుకులు
సాక్షి సిటీబ్యూరో : ప్రజాపంపిణీ వ్యవస్ధలో అమలవుతున్న రేషన్ పోర్టబిలిటీలో భాగంగా ‘ ఒకే దేశం.. ఒకే కార్డు’ ప్రయోగం హైదరాబాద్ నగరంలో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా ‘ఒకే దేశం–ఒకే కార్డు’ పేరుతో 2020 జూన్ నుంచి అమలు తలపెట్టనున్న‘ నేషనల్ పోర్టబిలిటీ‘ విధానాన్ని శుక్రవారం పౌరసరఫరాల అధికారులు నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని పంజాగుట్ట ప్రభుత్వ చౌకధరల దుకాణం (750)లో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులైన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్ రావు ( కార్డు నెం గిఅ్క 0481025 ఆ0472), విశాఖపట్నం జిల్లా, యలమంచిలికి చెందిన అప్పారావు (కార్డు నంబర్ గిఅ్క 034109700550) లబ్ధిదారులు సరుకులను డ్రా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను ఒక క్లస్టర్, గుజరాత్, మహారాష్ట్ర మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. దీంతో పౌరసరఫరాల అధికారులు ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా...ఏ రేషన్ షా పు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానం అమలవుతుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడి జిల్లా పౌరసరఫరాల పరిధిలో లబ్ధిదారులు పోర్టబిలిటీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆహార భద్రత పరిధిలో ఉంటేనే... కేంద్ర ఆహార భద్రత పరిధిలో ఉన్న లబ్ధిదారులు మాత్రమే నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని వినియోగించుకోవచ్చు. వారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. లబ్ధిదారుడి ఆధార్ నంబర్ అతని రేషన్ కార్డుతో సీడింగ్ అయి ఉండాలి. ఈ విధానంలో బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారులకు సరఫరా చేయబడుతుంది. -
గవర్నర్ ఒక కీలుబొమ్మ.. అవునా?
పట్నా: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఓ వింత ఈ ప్రశ్న చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. ‘భారతదేశంలో, మరీ ముఖ్యంగా బిహార్ రాష్ట్రంలో గవర్నర్ కీలుబొమ్మేనా..?’ అన్న ప్రశ్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. బిహార్‌లో ఆదివారం బీపీఎస్సీ మెయిన్స్ పరీక్ష జరగ్గా సెకండ్ పేపర్లో ఈ ప్రశ్న అడిగారు. ఏం సమాధానం రాయాలో తెలీక విద్యార్థులు తల గోక్కున్నారు. ఈ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) తీవ్రంగా స్పందించింది. గవర్నర్ పదవిని అపహాస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర మాట్లాడుతూ.. ఆ ప్రశ్నను తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవేకాకుండా మరిన్ని ప్రశ్నలు కూడా విమర్శలకు తావిచ్చాయి. ‘భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న రాజకీయ పార్టీలపై మీ అభిప్రాయం తెలపండి? అలాగే వాటివల్ల లాభనష్టాలను పేర్కొండంటూ మరో ప్రశ్న కనిపిస్తుంది. దీంతో పాటు ‘భారత్‌లో న్యాయస్థానాల క్రియాశీలత’ గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృష్ణనందన్ ప్రసాద్‌వర్మ స్పందించారు. ప్రశ్నపత్రం రూపొందించడంలో తప్పిదం జరిగిందని వివరించారు. -
ఏదీ భద్రత?
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులునిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొత్త దరఖాస్తులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు విచారణ చేపట్టకపోవడంతో లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులపై కనీసం సిటిజన్ చార్టర్ కూడా అమలు కావడం లేదు. మీ సేవా ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించి ప్రతిరోజూ పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కనీసం వాటికి కాలపరిమితి కూడా లేకుండా పోయింది. వాస్తవానికి క్షేత్రస్థాయివిచారణ తప్పా.. మిగిలిన ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతోంది. అదే కీలకం... ఆహార భద్రత కార్డుల మంజూరుకు క్షేత్రస్థాయి విచారణే కీలకం. కొత్త కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తయితేనే ప్రక్రియ ముందుకు సాగుతోంది. కొత్త కార్డు కోసం మీ సేవా, ఈ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ క్షేత్రస్థాయి విచారణ జరిపి ఏఎస్‌ఓకు నివేదిక అందించడంతో పాటు ఆన్లైన్లో సిఫార్సు చేస్తారు. దరఖాస్తుదారుడి కుటుంబం ఆహార భద్రత కార్డుకు అర్హులైతే సంబంధిత ఇన్స్పెక్టర్ సిఫార్సు ఆధారంగా ఏఎస్‌ఓకు ఆ తర్వాత డీఎస్ఓకు సిఫార్సు చేస్తారు. డీఎస్ఓ పరిశీలించి ఆమోద ముద్ర వేసి కార్డు మంజూరు చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇదీ పరిస్థితి... గ్రేటర్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పౌరసరఫరాల విభాగం పరిధిలో సుమారు 15,97,333 కుటుంబాలకు మాత్రమే ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మరో మూడు లక్షల కుటుంబాలకు పైగా కార్డులు లేవు. మీ సేవా అధికార లెక్కల ప్రకారం గత ఆరు నెలల వ్యవధిలో కొత్త కార్డుల కోసం సుమారు 2,65,998 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 69,016 దరఖాస్తులను ఆమోదించి కొత్త కార్డులు మంజూరు చేశారు. మరో 31,323 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 1,65,659 దరఖాస్తులపై కనీసం క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా పెండింగ్‌లో ఉంచారు. దీంతో దరఖాస్తుదారులు సర్కిల్ ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. -
టీ–శాట్ ద్వారా ఉద్యోగాలకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు తమ తోడ్పాటునందించేందుకు టీ–శాట్ మరోసారి సిద్ధమైంది. పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. టీ–శాట్ నెట్వర్క్ చానళ్లు పోలీసు – పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ గైడ్ పేరుతో చేయనున్న అవగాహన ప్రసారాలకు సంబంధించి సీఈవో శైలేష్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. జూన్ 11న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాస్‌రావు ద్వారా ప్రత్యక్ష ప్రసారంతో ప్రారంభమవుతాయన్నారు. రెండు నెలలు, సుమారు 400 గంటలు, 15 సబ్జెక్టుల్లో ప్రసారాలను అందించనుండగా, అవగాహన ప్రసారాలు టీశాట్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు ఏడు గంటలపాటు జరిగే ప్రసారాలు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్సైన్స్తోపాటు మరో 11 సబ్జెక్టుల్లో సుమారు 60 రోజులు, 400 గంటలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అందించనున్నామని సీఈవో తెలిపారు. ప్రసారాలను పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీశాట్ టీవీకి సంబంధించి www.facebook.com/tsatnetwork, www.youtube. com, www.twitter.com/ tsatnetwork, వెబ్సైట్ www.softnet. telangana.gov.in/, టీశాట్ యాప్ www.tsat.tv లలో ప్రసారాలను వీక్షించవచ్చని తెలిపారు. -
గ్రూప్–1లో తెలుగు పేపర్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టులకు నిర్వహిస్తున్న మెయిన్స్ పరీక్షల్లో తెలుగు భాష పేపర్‌ను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) భావిస్తోంది. తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఈ పేపర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం నిపుణుల కమిటీతో అధ్యయనం చేయిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనుంది. రానున్న గ్రూప్–1 నోటిఫికేషన్లకు దీన్ని వర్తింపచేయనుంది. గ్రూప్–1 మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లిష్ పేపర్‌తోపాటు ఐదు సబ్జెక్ట్ పేపర్లు ఉన్నాయి. ఇంగ్లిష్ పేపర్లో అభ్యర్థులు ఉత్తీర్ణత మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఉంది. లేకపోతే మిగతా ఐదు సబ్జెక్టుల పేపర్లలో ఎన్ని మార్కులు సాధించినా వాటిని పరిగణనలోకి తీసుకోరు. యూపీఎస్సీ డ్రాఫ్ట్ సిలబస్ సూచనల మేరకు.. గ్రూప్–1 సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేని పంథాన అవి నడుస్తున్నాయి. అయితే అందరికీ ఒకే సిలబస్ ఉంటే మంచిదని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కామన్ సిలబస్‌ను ప్రతిపాదించింది. దీని ముసాయిదాను ఆయా రాష్ట్ర కమిషన్లకు పంపి అధ్యయనం చేయించింది. అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో కొద్దికాలం క్రితం గోవాలో సమావేశమై వాటి నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. గ్రూప్–1 మెయిన్స్‌లో నాలుగు సబ్జెక్టు పేపర్లు, వీటితోపాటు జనరల్ ఇంగ్లిష్, ఆయా ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఒక పేపర్‌ను ప్రవేశపెట్టాలని యూపీఎస్సీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో సూచించింది. సబ్జెక్టు పేపర్లతోపాటు ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల పేపర్లలో వచ్చిన మార్కులను సైతం మెరిట్‌కు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఏపీపీఏస్సీ ప్రస్తుతం ఇంగ్లిష్ కాకుండా ఐదు సబ్జెక్టు పేపర్లను అమలు చేస్తోంది. ఇందులో ఇంగ్లిష్‌ను కేవలం క్వాలిఫై పేపర్‌గా మాత్రమే పరిగణిస్తోంది. యూపీఎస్సీ సూచనల మేరకు ప్రాంతీయ భాషగా రాష్ట్రంలో తెలుగును ఏడో పేపర్‌గా ప్రవేశపెట్టాలని, దాన్ని కూడా క్వాలిఫై పేపర్‌గానే పరిగణించాలని భావిస్తున్నారు. అయితే ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపిక చేయనున్నారు. గత రెండు రోజులుగా యూపీఎస్సీ ముసాయిదా ప్రతిపాదనలపై ఏపీపీఎస్సీ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. గ్రూప్–1 సిలబస్‌లో 20 శాతం మేర మార్పులు కాగా.. యూపీఎస్సీ ప్రతిపాదనల మేరకు కామన్ సిలబస్‌కు అనుగుణంగా గ్రూప్–1 మెయిన్స్ సిలబస్‌లో మార్పులు చేయనున్నారు. యూపీఎస్సీ ప్రతిపాదిత కామన్ సిలబస్‌ను అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ప్రస్తుతమున్న ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ సిలబస్ దాదాపు 80 శాతం వరకు దానితో సమానంగా ఉందని భావించింది. మరో 20 శాతం మేర స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ‘ప్రస్తుతం ఏపీపీఎస్సీ గ్రూప్–1 సిలబస్ యూపీఎస్సీ ప్రతిపాదిత సిలబస్‌తో దాదాపు సమానంగానే ఉంది. పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేయాల్సి వచ్చినా 10 నుంచి 20 శాతం సిలబస్‌లో మార్పులు ఉండొచ్చు. ప్రస్తుతం నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేస్తోంది. ఇది పూర్తయ్యాక తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. -
అభ్యర్థులకు వరం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్
నిడమర్రు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుని ‘ఒన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్’ విధానం తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రకటనలు వెలువడిన ప్రతిసారి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారమే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్న ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్’ కాలం. ఈ వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం.. ఒక్కసారి ఈ వెబ్సైట్లో విద్యార్థి/నిరుద్యోగి తమ వివరాలు నమోదు చేస్తే చాలు. మీ అర్హతతో ఉన్న ఉద్యోగాలన్నిటికీ ఆ సమాచారం సరిపోతుంది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థి ఒక్కసారి ఒన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అభ్యర్థి అర్హతలకు తగ్గ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడగానే అభ్యర్థి సెల్‌ఫోన్‌కు, ఈ–మెయిల్‌కు ఆ ప్రకటన పూర్తి సమాచారం చేరుతుంది. టెన్త్ నుంచే నమోదుకు అవకాశం పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్న ప్రతి అభ్యర్థి తమ వివరాలను ఏపీపీఎస్ వెబ్సైట్లో పొందుపరుచుకోవచ్చు. ఏపీపీఎస్ అధికారిక వెబ్సైట్ ఠీఠీఠీ.pఛిట.్చp.జౌఠి.జీn లోకి లాగిన్ అవ్వాలి. కనిపించే ముఖ చిత్రం దిగువభాగం కుడివైపు ‘వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి. వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంట్ టెస్ట్ అనే రెండు ట్యాబ్‌లు వస్తాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లోని న్యూరిజిస్ట్రేషన్ క్లిక్ చెయ్యగానే ఓటీఆర్ దరఖాస్తు వస్తుంది. అందులో అభ్యర్థి వివరాలు పొందుపరచాలి. పూర్తిపేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, జిల్లా, కులం, మతం, మాతృభాష, అంగవైకల్యం ఉంటే వాటి వివరాలు ఉద్యోగం చేసినా, చేస్తున్నా వాటి వివరాలు, శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా వ్యక్తి గత సమాచారంలో పొందుపరచాలి. విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాల వివరాలు (ఉత్తీర్ణత సంవత్సరం, హాల్‌టికెట్ నంబర్ తదితర వివరాలు) నమోదు చెయ్యాలి. అదనపు విద్యార్హతలు ఉంటే యాడ్ క్వాలిఫికేషన్లో నమోదు చేసుకోవచ్చు. శాతం లేదా గ్రేడ్ రూపంలో.. ప్రతి స్థాయిలోను (టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లమో తదితర పరీక్షలు) వచ్చిన మార్కులను శాతంలో గానీ గ్రేడ్ రూపంలోగానీ తెలియజెయ్యాలి. ఐడెంటిఫికేషన్ గుర్తులు అంటే పుట్టుమచ్చలు/ గాయపు గుర్తులు మొదలైనవాటిని టెన్త్ సర్టిఫికెట్లో ఉన్నవాటినే పేర్కొనాలి. అభ్యర్థి ఆధార్ కార్డు వివరాలు నమోదు చెయ్యాలి. ఫొటో, సంతకం అప్లోడ్ పై సమాచారంతో పాటు 50 కేబీ పరిమాణంలో ఉన్న జేపీఈజీ ఫార్మాట్లోని 3.5 సెం.మీ అడ్డం, 4.5 సెం. మీ నిలువు ఉన్న అభ్యర్థి ఫొటోను అప్లోడ్ చెయ్యాలి. దాని కింద అభ్యర్థి పేరు, ఫొటో తీసిన తేదీని కూడా రాయాలి. చివరగా మీ పూర్తి సంతకాన్ని బ్లాక్ ఇంకుతో చేసి దాన్ని కూడా అప్లోడ్ చెయ్యాలి. నోటిఫికేషన్ అలెర్ట్ క్లిక్ చెయ్యాలి వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అలెర్ట్ కింద తప్పనిసరిగా టిక్ మార్కు చేర్చితే ఏవైనా ఉద్యోగ ప్రకటనలు వెలువడినపుడు ఆ సమాచారం మీ మొబైల్/ఈ–మెయిల్ ఐడీలకు వస్తుంది. అనంతరం డిక్లరేషన్ ఓకే చేస్తే మీరు పొందు పరిచిన వివరాలన్నా ప్రీవ్యూ లభిస్తుంది. హార్డ్ కాపీని ప్రింట్ తీసుకుని వివరాలు సరిచూసుకున్నాక సెండ్ బటన్ క్లిక్ చెయ్యాలి. ఈ హార్డ్ కాపీ భద్రపరుచుకోవాలి. ఈ వివరాలను సరిచూసుకున్నాక ఏపీపీఎస్సీ నుంచి అభ్యర్ధుల సెల్‌ఫోన్‌కు, మెయిల్‌కు పది అంకెల పాస్వర్డ్/ఐడీ పంపుతుంది. ఈ పాస్వర్డ్ సాయంతో అభ్యర్థులు సర్వీస్ కమిషన్ నుంచి వివిధ నోటిపికేషన్ల వివరాలు పొందవచ్చు. నమోదు విషయంలో అజాగ్రత్త వద్దు ఆన్లైన్లో సమాచారం పొందుపరిచేటపుడు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. దరఖాస్తు నింపేటపుడు ఏమరుపాటు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓటీఆర్ చివరన అభ్యర్థి డిక్లరేషన్‌లో ఏదైనా తప్పుడు సమాచారం పొందుపరిస్తే ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అంగీకరించినట్టు ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కచ్చితమైన, నిజమైన సమాచారం మాత్రమే పొందుపరచాలి. ఆధారాలు లేని సమాచారం నమోదు చెయ్యడం ప్రమాదకరం. ప్రయోజనాలు ఇవీ ♦ ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే ముందుగా ఇచ్చిన నమోదు సంఖ్య ఆధారంగా కేవలం నిర్ణీత రుసుం చెల్లిస్తే సరిపోతుంది. ♦ దస్త్రాలు, దరఖాస్తులతో ఎటువంటి పని ఉండదు. దీని వల్ల ప్రతిసారి నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు, డేటా బ్యాంక్‌లో విద్యార్హతలు నమోదై ఉండటం వల్ల వెలువడుతున్న నోటిఫికేషన్లకు అవసరమైతే అర్హత పరిగణనలోకి తీసుకుం టుంది. ఏ పరీక్షలకు వెళుతున్నారో ఆ పరీక్ష కోడ్ సంఖ్యను సూచించి ఫీజ్ చెల్లిస్తే సరిపోతుంది. ♦ ఏటా కొత్తగా పొందే విద్యార్హతలను అభ్యర్థి తనకిచ్చిన ప్రొఫైల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే పోటీ పరీక్షలు ♦ అభ్యర్థి ప్రొఫైల్‌ను ఆన్లైన్లో పొందు పరిచే విధానం అందుబాటులో తెచ్చిన ఏపీపీపీఎస్ ప్రతి పోటీ పరీక్షలకు విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధింన ప్రతి పరీక్షను ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నారు.. ♦ ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ విధానంలో రాసేవారు ఇబ్బందులు పడకుండా మాక్ టెస్ట్‌లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందిపరిచి ఉన్నాయి. దీనివల్ల ఆన్లైన్ పరీక్ష అంటే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అభ్యర్థులు గమనించవచ్చు. -
టీఆర్టీపై అపోహలు వద్దు
సాక్షి, సిద్దిపేట: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)పై వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపే పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 14 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. మరో నెలలో గురుకుల టీచర్లకు సంబంధించిన 6 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గురుకుల టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి నెలలో నియామక జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రూపు–2 పోస్టులకు సంబంధించిన కోర్టు కేసు త్వరలో క్లియర్ అవుతుందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల పోస్టులకు, గ్రూప్–4, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ పోస్టులకు కూడా నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చైర్మన్ వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 31 వేల పోస్టుల భర్తీ బాధ్యత తమపై పెట్టిందని, నియామకాలను పారదర్శకంగా చేపట్టడం వల్లే జాప్యం జరుగుతోం దని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం దృ ష్ట్యా పోస్టులు భర్తీ చేస్తున్నామని చక్రపాణి పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ కన్నా తెలంగాణలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎక్కువ పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. -
అన్ని రాష్ట్రాల్లో మోడల్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. గోవాలో గురు, శుక్రవారాల్లో జరిగిన కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదస్సును ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ప్రారంభించారు. గత ఏడాది కమిటీ చేపట్టిన కార్యక్రమాలను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. అనంతరం వివిధ పబ్లిక్ సర్వీసు కమిషన్లలో అమలు చేస్తున్న విధానాలు, సమస్యలు, కొత్త చర్యలపై చర్చించారు. అన్ని పీఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకే తరహా మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. రెండోసారి చక్రపాణి ఎన్నిక: యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు ఆయన కొనసాగుతారు. ఒకే పీఎస్సీ చైర్మన్‌ను రెండోసారి ఎన్నుకోవడం ఇదే ప్రథమం. చక్రపాణి మాట్లాడుతూ అందరి నమ్మకాన్ని కాపాడుతూ కమిటీ మరింత బాగా పనిచేసేలా కృషి చేస్తానని అన్నారు. యూపీఎస్సీ చైర్మన్ సహా అన్ని రాష్ట్రాల చైర్మన్లకు గురువారం రాత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ విందు ఇచ్చారు. -
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
-
కొత్త పోలీస్ బాస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ వచ్చే నెల 12వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్సీకి పంపించాల్సిన జాబితాపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సీనియర్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే డీజీపీ హోదాలో ఉన్న అధికారుల బయోడేటా, ట్రాక్ రికార్డు, కేసులు, క్లియరెన్సులు, విజిలెన్స్ సర్టిఫికెట్ తదితర వ్యవహారాలు మొత్తం పూర్తయినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద డీజీపీ అభ్యర్థుల వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్) సైతం క్లియర్ అయినట్టు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లో యూపీఎస్సీకి... డీజీపీ ఎంపిక ప్రక్రియ కోసం ప్రభుత్వం రాష్ట్ర కేడర్‌లో డీజీపీ హోదాలో పనిచేస్తున్న ఏడుగురు అధికారుల పేర్లను రెండు రోజుల్లో యూపీఎస్సీకి పంపిస్తోంది. ఇందులో 1983 బ్యాచ్‌కు చెందిన తేజ్ దీప్కౌర్, 1984 బ్యాచ్ అధికారి సుదీప్ లక్టాకియా, 1985 బ్యాచ్ అధికారి ఈష్‌కుమార్, 1986 బ్యాచ్ అధికారులు రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, అలోక్ ప్రభాకర్, కృష్ణప్రసాద్ పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలోని అధికారుల ట్రాక్ రికార్డు, ఏసీఆర్లు, తదితరాలు పరిశీలించిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్రానికి తిరిగి పంపిస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రేసు నుంచి వాళ్లు ఔట్... రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్, ప్రస్తుతం కేంద్ర సర్వీసులోని సీఆర్పీఎఫ్ అదనపు డీజీపీగా ఉన్న సుదీప్ లక్టాకియాకు అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ఆయనకు డీజీపీ హోదా పదోన్నతితో పాటు సీఆర్పీఎఫ్ ప్రత్యేక డీజీపీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. దేశంలోనే అత్యంత కీలకమైన పోలీస్ యూనిట్‌కు బాస్‌గా నియమించడంతో లక్టాకియా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు స్పష్టంచేశారు. అంత కీలక పదవి వదులుకొని రాష్ట్ర డీజీపీ రేసులోకి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపడంలేదని వారు తెలిపారు. ఇకపోతే మిగిలిన ఆరుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, మరో అధికారి అలోక్ ప్రభాకర్ 15 ఏళ్లుగా కేంద్ర సర్వీసులోనే కొనసాగుతున్నారు. ఆయన కూడా రాష్ట్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఈష్‌కుమార్ దేశ పోలీస్ శాఖ డేటా సర్వీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు డైరెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా రాకపోవచ్చని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన ముగ్గురు రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్.. వీరి ముగ్గురి పేర్లు యూపీఎస్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందే జాబితాలో ఉంటాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరు డీజీపీగా పదవి చేపడతారు. ముందుగా ఇన్చార్జి డీజీపీనే... రేసులో వినిపిస్తున్న ముగ్గురిలో ఒకరిని నవంబర్ 12వ తేదీన ఇన్చార్జి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 12న అనురాగ్‌శర్మ తన బాధ్యతలను ఇన్చార్జి డీజీపీకి అందజేయనున్నారు. ఇక మహేందర్‌రెడ్డి, రాజీవ్ త్రివేది, కృష్ణప్రసాద్.. వీరిలో ఎవరు ఇన్చార్జి డీజీపీగా నియుక్తులు అవుతారన్న దానిపై పోలీస్ శాఖలో ఉత్కంఠ నెలకొంది. యూపీఎస్సీకి రెండు రోజుల్లో జాబితా వెళితే.. ముగ్గురి పేర్ల ప్రతిపాదిత జాబితా రావడానికి కనీసం నెల నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ఇన్చార్జి డీజీపీయే డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
అర్హత లేకున్నా డీసీగా పదోన్నతి!
- వేములవాడ రాజన్న ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా ఓ అధికారికి దొడ్డిదారిలో ప్రమోషన్ - హైకోర్టును ఆశ్రయించిన కొందరు అధికారులు సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖలో మరో అడ్డగోలు వ్యవహారం బట్టబయలైంది. తప్పుడు సీనియారిటీ జాబితా ఆధారంగా తాత్కాలిక పదోన్నతిపై కొనసాగుతున్న ఓ ఉన్నతాధికారికి ఏకంగా డిప్యూటీ కమిషనర్ పోస్టు కట్టబెట్టి దేవాదాయశాఖ అభాసుపాలైంది. తదుపరి ఖాళీ అయ్యే మరిన్ని డీసీ పోస్టులనూ ఇలాంటి వారికే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు వెలుగు చూసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులై నిబంధనల ప్రకారం ప్రొబెషన్ ఖరారైన అధికారులను కాదని ఆ ఉన్నతాధికారిని డిప్యూటీ కమిషనర్ పోస్టులో కూర్చోబెడుతూ కొద్దిరోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాన్ని హైకోర్టు తాజాగా కొట్టేసింది. గత పదోన్నతే వివాదంలో ఉన్నా... వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న రాజేశ్వర్‌కు దేవాదాయశాఖ మే నెలలో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. ఆయన సహాయక కమిషనర్ హోదాలో ఆర్జేసీ స్థాయిలో ఉన్న ఈ ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. అయితే కమిషనర్ నిర్ణయంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన సహాయ కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. వారి పటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం... దేవాదాయశాఖ ఇచ్చిన పదోన్నతి ఆదేశాన్ని రద్దు చేసింది. గతంలో సహాయ కమిషనర్ల పదోన్నతుల జాబితా రూపకల్పనలో జరిగిన గందరగోళంపైనే తీవ్ర వివాదం నెలకొంది. అర్హత లేనివారిని సీనియర్లుగా చూపుతూ ఈ జాబితా రూపొందించారన్న వ్యవహారం ఇప్పటికీ కోర్డులో పెండింగ్‌లో ఉంది. ఆ జాబితా ప్రకారం రాజేశ్వర్ గత పదోన్నతే వివాదంలో చిక్కుకొని ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆయన్ను డీసీ కుర్చీపై కూర్చోబెట్టి దేవాదాయశాఖ పరువు పోగొట్టుకుంది. -
సివిల్స్ సమరానికి ప్రణాళిక
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్ తదితర 24 కేంద్ర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)నిర్వహించే ఎంపిక ప్రక్రియ. మూడంచెల సివిల్ సర్వీసెస్ ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.అంటే ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయం దాదాపు రెండు నెలలు. ఆ తర్వాత మలి దశ మెయిన్స్ అక్టోబర్ 28 నుంచి జరగనుంది.అభ్యర్థులు ప్రిలిమ్స్‌పై ఫోకస్ చేస్తూనే, మలిదశ మెయిన్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2017లో విజయానికి నిపుణుల సలహాలు, సూచనలు.. తగ్గిన పోస్టుల సంఖ్య సివిల్ సర్వీసెస్–2017 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీల సంఖ్య 980. గతేడాది కంటే వంద పోస్టులు తక్కువ. పోస్టుల సంఖ్య తగ్గినా అభ్యర్థులకు ఉపశమనం కలిగించిన అంశం ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేకపోవడం. నిజానికి సివిల్ సర్వీసెస్ పరీక్షలో మార్పులు జరుగుతాయని, అటెంప్ట్‌ల సంఖ్య, వయోపరిమితి తగ్గిస్తారని కొంత కాలంగా వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి మార్పులు లేకపోవడం గత రెండు, మూడేళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు పెద్ద ఊరటని చెప్పొచ్చు. తులనాత్మక అధ్యయనం అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమిస్తూనే మెయిన్‌లో సైతం ఉన్న ఉమ్మడి అంశాలను గుర్తించాలి. ఈ క్రమంలో తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫలితంగా ప్రిలిమినరీ తర్వాత మెయిన్ పరీక్షకు లభించే మూడు నెలల స్వల్ప వ్యవధిలో ప్రిపరేషన్ పరంగా కలిసొస్తుంది. మెయిన్ ఎగ్జామినేషన్‌లోని ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ, ఆప్షనల్ సబ్జెక్ట్ మినహా మిగతా అన్ని పేపర్లు కూడా జనరల్ స్టడీస్‌కు సంబంధించినవే! దీన్ని సానుకూలంగా మార్చుకొని ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్‌లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్‌ను కూడా పూర్తిచేసుకోవాలి. ఆబ్జెక్టివ్‌లోనూ అంతర్లీనంగా ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కొన్నేళ్లుగా ఇందులో అడుగుతున్న ప్రశ్నలను గమనిస్తే.. అభ్యర్థికి నిర్దిష్టంగా ఒక అంశంపై పలు కోణాల్లో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం కొశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతికి మాత్రమే పరిమితం కాకుండా విశ్లేషణాత్మక దృక్పథంతో ప్రిపరేషన్ సాగించడం అవసరం. ప్రిలిమినరీ విషయంలో అభ్యర్థులు వాస్తవ ఘటనలు, గణాంకాలకు ప్రాధాన్యమిస్తూనే మూల భావనలు, ప్రాథమిక సూత్రాలపైనా అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ప్రశ్నను ఏ తీరులో అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. సీశాట్.. వెరీ కేర్‌ఫుల్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో పేపర్–2 సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాస్తవానికి దీన్ని కేవలం అర్హత పరీక్షగానే నిర్దేశించినా.. 200 మార్కులకు నిర్వహించే ఈ పేపర్లో కచ్చితంగా 33 శాతం మార్కులు పొందాలనే నిబంధన విధించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు పేపర్–2లో పేర్కొన్న ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రెహెన్షన్, లాజికల్ రీజనింగ్, బేసిక్ న్యూమరసీ అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రెహెన్షన్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్‌లోని ఎడిటోరియల్స్ చదవడం, వాటి సారాంశాన్ని గుర్తించడం, వాక్య నిర్మాణ శైలి లాంటి వాటిపై దృష్టిసారించాలి. బేసిక్ న్యూమరసీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో కంప్యుటేషనల్ స్కిల్స్‌పై పట్టు సాధించాలి. లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చదివి అందులోని కీలక అంశాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. పేపర్–1 + మెయిన్స్ ఏక కాలంలో సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్–1 (జనరల్ స్టడీస్), మెయిన్ ఎగ్జామినేషన్‌లోని పేపర్లకు ఏక కాలంలో ప్రిపరేషన్ సాగించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రిలిమ్స్‌లోని అంశాలను డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదవాలి. తద్వారా మెయిన్‌లోని జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్ పేపర్లకు ఒకే సమయంలో సంసిద్ధత లభిస్తుంది. గత ఏడాది కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా, ఆర్థికంగా పలు పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో అభ్యర్థులు పాలిటీ, ఎకానమీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రీడింగ్ విత్ రైటింగ్ సివిల్స్ అభ్యర్థులు చదువుతున్న టాపిక్‌లోని ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో సొంత నోట్స్‌గా రూపొందించుకోవాలి. దీనివల్ల రైటింగ్ ప్రాక్టీస్, రైటింగ్‌లో వేగం పెరగడమే కాకుండా రివిజన్ పరంగానూ ఉపయుక్తంగా ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్టులు సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్ ఎగ్జామినేషన్‌లో రాయాల్సిన ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్‌కు కొంత సమయం కేటాయించాలి. అంతేకాకుండా అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ప్రిలిమ్స్ సిలబస్‌లోని అంశాలు, అలాగే మెయిన్స్‌లోని ఇతర పేపర్లతో అనుసంధానం చేసుకునే వీలుందో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు పాలిటీని ఆప్షనల్‌గా తీసుకున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్‌లోని ఇండియన్ పాలిటీ– గవర్నెన్స్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ అంశాలతో అనుసంధానం చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్‌లోని జనరల్ స్టడీస్–2 (గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్)తో అనుసంధానం చేసుకునే వీలుంటుంది. సివిల్స్ –2017 ప్రిపరేషన్ టైం ప్లాన్ ⇔ ఇప్పటి నుంచి జూన్ ఒకటి వరకు ప్రిలిమ్స్ + మెయిన్స్ దృక్పథంతో చదవాలి. ⇔ రోజూ ఆరు నుంచి 8 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ⇔ జూన్ ఒకటి నుంచి పూర్తిగా ప్రిలిమ్స్‌కే సమయం కేటాయించాలి. ⇔ ప్రిలిమ్స్ పూర్తయిన వెంటనే మెయిన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్రారంభించాలి. ⇔ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కోసం ప్రత్యేకంగా కనీసం నాలుగు గంటల సమయం కేటాయించాలి. ⇔ ప్రిలిమ్స్ కోణంలో ప్రతి వారం మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ⇔ ప్రిలిమ్స్‌కు ముందు నెల రోజుల వ్యవధిలో మాక్ టెస్ట్‌లు రాసి మూల్యాంకన చేయించుకోవాలి. రిఫరెన్స్ బుక్స్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ– బిపిన్ చంద్ర ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ – బిపిన్ చంద్ర ఇండియన్ కల్చర్ – స్పెక్ట్రమ్ ఇండియన్ జాగ్రఫీ – మాజిద్ హుస్సేన్ ఇండియన్ పాలిటీ – లక్ష్మీకాంత్ ఇండియన్ ఎకానమీ – రమేశ్ సింగ్ ఇండియా ఇయర్ బుక్ ఎకనామిక్ సర్వే అనలిటికల్ రీజనింగ్– ఎం.కె.పాండే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ – ఆర్.ఎస్.అగర్వాల్ సివిల్స్ ప్రిలిమ్స్–2017 సమాచారం పరీక్ష తేదీ: జూన్ 18, 2017 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్–1: జనరల్ స్టడీస్ – 200 మార్కులు పేపర్–2: ఆప్టిట్యూడ్ టెస్ట్ – 200 మార్కులు (పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో తప్పనిసరిగా 33 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి). మెయిన్ ఎగ్జామినేషన్–2017 (మెరిట్‌కు పరిగణనలోకి తీసుకునే పేపర్లు) పేపర్–1: జనరల్ ఎస్సే పేపర్–2: జనరల్ స్టడీస్–1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ) పేపర్–3: జనరల్ స్టడీస్–2 (గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్) పేపర్–4: జనరల్ స్టడీస్–3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) పేపర్–5: జనరల్ స్టడీస్–4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్) పేపర్–6: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–1 పేపర్–7: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–2 ప్రతి పేపర్‌కు 250 మార్కులు చొప్పున 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వూ్య–275 మార్కులు)కు ఎంపిక చేస్తారు.