నేడు సివిల్స్ ప్రిలిమినరీ
-
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
-
సమాచారం కోసం ఐదు సహాయక కేంద్రాలు
-
కలెక్టరేట్‌లో అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 18004252747
-
అంధుల కోసం ప్రత్యేక కేంద్రం..అదనపు సమయం
-
నగరంలో 23 కేంద్రాల ఏర్పాటు
-
హాజరుకానున్న 10,858 మంది అభ్యర్థులు
హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో తొలిసారిగా జరుగుతున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి, పరీక్షల నిర్వహణ అదనపు జిల్లా కోఆర్డినేటర్ కె.శోభ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష మొదలైన తర్వాత పది నిమిషాల్లోపు కూడా అభ్యర్థులు కేంద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నగరంలోని 23 కేంద్రాల్లో 10,858 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉదయం, మధ్యా హ్నం రెండు దఫాలుగా పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాన్ని ఐదు రూట్లుగా విభజించి ఐదుగురు లైజన్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మొదటి పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు ఉంటుందన్నారు. అంధ అభ్యర్థులకు అదనంగా 40 నిమిషాల సమయం కేటాయించినట్లు తెలిపారు. అంధ అభ్యర్థులకు హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని ఎస్‌ఆర్ నేషనల్ హైస్కూ ల్‌లో ఒకే సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు తగిన సమాచారం ఇచ్చేందుకు నగరంలో ఐదు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్ 18004252747 అందుబాటులో ఉంచామని తెలిపారు.
అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు
∙అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశం గురించి ఈ–అడ్మిషన్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
l పరీక్ష ప్రారంభానికి 20నిమిషాల ముం దు నుంచి మాత్రమే అనుమతిస్తారు.
l పరీక్ష ప్రారంభమైన తర్వాత 10 నిమిషాల్లోపుlకూడా హాల్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షలకు ఇదే నిబంధన వర్తిస్తుంది.
l పరీక్ష మొదలైన 10 నిమిషాల తర్వాత హాల్‌లోకిSఅనుమతించరు.
l ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, క్యాలిక్యులేటర్స్, బ్లూట్రూత్ వంటివి అనుమతించరు.
l అభ్యర్థులు తమ వెంట విలువైన ఆభరణాలు తీసుకుని రాకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో జరిగే పరీక్షలకు అనుమతించకుండా అనర్హులుగా ప్రకటించబడును.
l పరీక్షలో తప్పుడు జవాబుకు నెగిటివ్ మార్కులు ఉంటాయి.
l బ్లాక్ పాయింట్ పెన్‌తో మాత్రమే జవాబును మార్క్ చేయాలి. లేకుంటే అట్టి జవాబులు లెక్కించబడవు.
l ఈ–అడ్మిట్ కార్డుపై ఫొటో స్పష్టంగా లేకపోతే ఆధార్, డైవింVŠ Sలైసెన్స్, ఓటరు ఐడీని తీసుకురావాలి. అలాగే రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకువచ్చి అండర్ టేకింగ్ రాసి ఇవ్వాలి.