priliminary
-
UP Fire Accident: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?
లక్నో: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.. పది మంది పసికందుల్ని బలిగొనడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. శనివారం సాయంత్రంకల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తున్న సమయంలో ఓ నర్సు నిర్లక్ష్యంగా అగ్గిపుల్ల వెలిగించినట్లు తెలిపిన ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం దర్యాప్తు తర్వాతే కారణంపై ప్రకటన చేస్తామని అంటున్నారు. ఆపద్భాందవుడిలా భగవాన్ దాస్!హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ తన కొడుకును ఇదే ఆస్పత్రిలో చేర్చాడు. ప్రమాదం నుంచి తన కొడుకుతో పాటు మరికొందరు చిన్నారులను దాస్ రక్షించాడని పక్కన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ‘‘ఆ నర్సు అగ్గిపుల్ల వెలగించగానే.. ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. అక్కడంతా మంటలు అంటుకున్నాయి’’ అని దాస్ చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే దాస్ ఓ గుడ్డలో నలుగురు పసికందుల్ని చుట్టి.. తన వీపుకి కట్టుకుని బయటకు తీసుకొచ్చాడని అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అగ్ని కీలలు ఎగసి పడ్డాక.. ఆస్పత్రిలోని సేఫ్టీ అలారంలు మోగకపోవడంతో చిన్నారుల తరలిపు ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.అయితే.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాథక్.. బాధితులకు న్యాయం జరిగి తీరుతుందని చెబుతున్నారు. సిలిండర్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని, ఒకవేళ మానవ తప్పిదం జరిగి ఉంటే ఎవరినీ వదలబోమని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారాయన. ఘటనపై మూడంచెల దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.నెట్టింట దయనీయమైన దృశ్యాలుశుక్రవారం రాత్రి 10.30గం.-10.45గం. మధ్య ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో (neonatal intensive care unit..NICU) అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వెంటనే అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. పసికందుల్ని రక్షించేందుకు ఆస్పత్రి సిబ్బందితో పాటు తల్లిదండ్రులు పరుగులు తీసిన దృశ్యాలు, ఆ పసికందుల మృతదేహాల వద్ద రోదిస్తున్న దృశ్యాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో నవజాత శిశువులు 10 మంది సజీవ దహనం కాగా, మరో 16 మంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 54 మంది ఆ వార్డులో చికిత్స పొందుతుండగా.. అందులో 44 మంది నవజాత శిశువులే కావడం గమనార్హం.ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం, గాయపడ్డవాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఘటనపై నివేదికను 12 గంటల్లో సమర్పించాలని డీజీపీ ఆదేశించారాయన. మరోవైపు.. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. -
హైకోర్టు రిజిస్ట్రార్‌కు రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు చేసిన రీ పోస్ట్‌మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ రిజిస్ట్రార్‌కు చేరుకుంది. మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం నిర్వహించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మంగళవారం ప్రిలిమినరీ రిపోర్టుతో పాటు చిత్రీకరించిన వీడియో సీడీని అందజేశారు. కాగా ఢిల్లీ వెళ్లిన తరువాత పూర్తిస్థాయి రిపోర్టును అందజేస్తామని ఈ మేరకు ఎయిమ్స్ వైద్య బృందం హైకోర్టుకు నివేదించింది. చదవండి: ‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’ -
ఉత్సాహంగా సాక్షి–మ్యాథ్స్ బీ పరీక్ష
విజయవాడ(లబ్బీపేట) : చిన్నారులు మ్యాథ్‌్సపై పట్టుసాధించేలా సాక్షి ఆధ్వర్యంలో మ్యాథ్స్ బీ పరీక్ష మంగళవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాశక్తినగర్‌లోని శిఖర స్కూల్‌తోపాటు, పీ అండ్ టీ కాలనీలోని శ్రీశాంతి స్కూల్లో మ్యాథ్స్ బీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారు క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. విద్యార్థులు ఇంగ్లీషులో పట్టుసాధించేందుకు నిర్వహిస్తున్న స్పెల్ బీ తరహాలోనే మ్యాథ్స్ బీ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆయా పరీక్షల పట్ల విద్యార్థులు ఉత్సాçహం చూపుతున్నారని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మేథాశక్తి పెంపొందించేలా సాక్షి నిర్వహిస్తున్న పరీక్షలు ఎంతగానో దోహదపడుతున్నాయని వారు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఆయా పరీక్షల నిర్వహణలో శిఖర స్కూల్ ప్రిన్సిపాల్ మాధవరావు, శ్రీశాంతి స్కూల్ ప్రిన్సిపాల్ హారిక తమవంతు సహకారం అందచేశారు. గుడివాడలో.. గుడివాడ విద్యాలయ సెంటర్లో 178 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాఠశాల డైరెక్టర్ బొప్పన వెంకటవిజయ్భాస్కర్, సాక్షి యాడ్ విభాగం కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కేవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. పోరంకిలో.. పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ ఉషోదయ పాఠశాలలో మంగళవారం మ్యాథ్స్ బీ పరీక్ష నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ యార్లగడ్డ రాజబాబు మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో పాల్గొనటం వల్ల వారిలో పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. -
నేడు సివిల్స్ ప్రిలిమినరీ
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు సమాచారం కోసం ఐదు సహాయక కేంద్రాలు కలెక్టరేట్లో అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 18004252747 అంధుల కోసం ప్రత్యేక కేంద్రం..అదనపు సమయం నగరంలో 23 కేంద్రాల ఏర్పాటు హాజరుకానున్న 10,858 మంది అభ్యర్థులు హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో తొలిసారిగా జరుగుతున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి, పరీక్షల నిర్వహణ అదనపు జిల్లా కోఆర్డినేటర్ కె.శోభ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష మొదలైన తర్వాత పది నిమిషాల్లోపు కూడా అభ్యర్థులు కేంద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నగరంలోని 23 కేంద్రాల్లో 10,858 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉదయం, మధ్యా హ్నం రెండు దఫాలుగా పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాన్ని ఐదు రూట్లుగా విభజించి ఐదుగురు లైజన్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మొదటి పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు ఉంటుందన్నారు. అంధ అభ్యర్థులకు అదనంగా 40 నిమిషాల సమయం కేటాయించినట్లు తెలిపారు. అంధ అభ్యర్థులకు హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూ ల్లో ఒకే సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు తగిన సమాచారం ఇచ్చేందుకు నగరంలో ఐదు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 18004252747 అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు ∙అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశం గురించి ఈ–అడ్మిషన్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. l పరీక్ష ప్రారంభానికి 20నిమిషాల ముం దు నుంచి మాత్రమే అనుమతిస్తారు. l పరీక్ష ప్రారంభమైన తర్వాత 10 నిమిషాల్లోపుlకూడా హాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షలకు ఇదే నిబంధన వర్తిస్తుంది. l పరీక్ష మొదలైన 10 నిమిషాల తర్వాత హాల్లోకిSఅనుమతించరు. l ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, క్యాలిక్యులేటర్స్, బ్లూట్రూత్ వంటివి అనుమతించరు. l అభ్యర్థులు తమ వెంట విలువైన ఆభరణాలు తీసుకుని రాకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో జరిగే పరీక్షలకు అనుమతించకుండా అనర్హులుగా ప్రకటించబడును. l పరీక్షలో తప్పుడు జవాబుకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. l బ్లాక్ పాయింట్ పెన్‌తో మాత్రమే జవాబును మార్క్ చేయాలి. లేకుంటే అట్టి జవాబులు లెక్కించబడవు. l ఈ–అడ్మిట్ కార్డుపై ఫొటో స్పష్టంగా లేకపోతే ఆధార్, డైవింVŠ Sలైసెన్స్, ఓటరు ఐడీని తీసుకురావాలి. అలాగే రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకువచ్చి అండర్ టేకింగ్ రాసి ఇవ్వాలి. -
ప్రిలిమినరీకి పగడ్బందీ ఏర్పాట్లు
నగరంలో 28 పరీక్షా కేంద్రాలు ఇక నుంచి విజయవాడలోనే మెయిన్స్ పరీక్ష సమీక్షించిన కలెక్టర్ విజయవాడ : యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు విజయవాడలో పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఏ చెప్పారు. శనివారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 7న జరిగే యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు నియమితులైన సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఏవిధమైన పొరపాట్లకు తావివ్వరాదని చెప్పారు. ఏవిధమైన సందేహాలున్నా, వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరీక్షను పర్యవేక్షించటానికి ఐదుగురు ఐఏఎస్‌లతో తనిఖీ ఆఫీసర్స్‌ను నియమించినట్లు చెప్పారు. విజయవాడలో 28 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 1400 మంది ఇన్విజలేటర్స్‌తోపాటు, 94 మంది అధికారులతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా సెంటర్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్వాహకులను ఆదేశించామన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి విజయవాడలో మెయిన్ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ సబ్‌సెంటర్ల సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లు అభ్యర్థులతో ఫ్రెండ్లీ నేచర్‌తో మెలగాలన్నారు. చూపులేని అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా పటమట కృష్ణవేణి ఇంగ్లీషు మీడియం స్కూలులో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వీరికి సహాయకులుగా ఉండే సబ్‌స్రై్కబర్స్‌తో జెసీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో యూపీఎస్సీ రాష్ట్ర కన్వినర్ నరేష్ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, డీఆర్వో సీహెచ్ రంగయ్య, డీఈవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.