ఉత్సాహంగా సాక్షి–మ్యాథ్స్ బీ పరీక్ష
విజయవాడ(లబ్బీపేట) : చిన్నారులు మ్యాథ్‌్సపై పట్టుసాధించేలా సాక్షి ఆధ్వర్యంలో మ్యాథ్స్ బీ పరీక్ష మంగళవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాశక్తినగర్‌లోని శిఖర స్కూల్‌తోపాటు, పీ అండ్ టీ కాలనీలోని శ్రీశాంతి స్కూల్‌లో మ్యాథ్స్ బీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారు క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. విద్యార్థులు ఇంగ్లీషులో పట్టుసాధించేందుకు నిర్వహిస్తున్న స్పెల్ బీ తరహాలోనే మ్యాథ్స్ బీ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆయా పరీక్షల పట్ల విద్యార్థులు ఉత్సాçహం చూపుతున్నారని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మేథాశక్తి పెంపొందించేలా సాక్షి నిర్వహిస్తున్న పరీక్షలు ఎంతగానో దోహదపడుతున్నాయని వారు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఆయా పరీక్షల నిర్వహణలో శిఖర స్కూల్ ప్రిన్సిపాల్ మాధవరావు, శ్రీశాంతి స్కూల్ ప్రిన్సిపాల్ హారిక తమవంతు సహకారం అందచేశారు.
గుడివాడలో..
గుడివాడ విద్యాలయ సెంటర్‌లో 178 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాఠశాల డైరెక్టర్ బొప్పన వెంకటవిజయ్‌భాస్కర్, సాక్షి యాడ్ విభాగం కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కేవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు.
పోరంకిలో..
పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ ఉషోదయ పాఠశాలలో మంగళవారం మ్యాథ్స్ బీ పరీక్ష నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ యార్లగడ్డ రాజబాబు మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో పాల్గొనటం వల్ల వారిలో పోటీతత్వం పెరుగుతుందని అన్నారు.