ఉద్యోగ పరీక్షలకు విధానం ఖరారు | Employment tests to dictate policy | Sakshi
Sakshi News home page

ఉద్యోగ పరీక్షలకు విధానం ఖరారు

Published Thu, Jul 30 2015 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

ఉద్యోగ పరీక్షలకు  విధానం ఖరారు

ఉద్యోగ పరీక్షలకు విధానం ఖరారు

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు, సిలబస్‌లో మార్పులు
 
పెరిగిన పేపర్లు.. మారిన సిలబస్
  నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో కొత్తగా గ్రూప్-3
  {Vూప్-1, 2 పరీక్షల్లో అదనంగా మరో పేపర్
   కొత్తగా ‘తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం’
  {Vూప్-1, 2లో పెరిగిన ఇంటర్వ్యూ మార్కులు
  సర్వీసుల వారీగా పోస్టుల విభజన
  ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 
హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే ఉద్యోగాల విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. పరీక్షల విధానంలోనూ, సిలబస్‌లోనూ పలు మార్పులు చేసింది. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్‌కు వీలుగా పోస్టుల పునర్విభజనతో పాటు పోటీ పరీక్షల విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రానికి అనుగుణంగా పరీక్షల విధానం, పోస్టులను వర్గీకరించాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో టీఎస్‌పీఎస్సీ నియమించిన నిపుణుల కమిటీ గ్రూప్స్, ఇతర సర్వీసుల వర్గీకరణతో పాటు పరీక్షల విధానం, సిలబస్‌పై అధ్యయనం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ నివేదికలన్నీ పరిశీలించిన అనంతరం తుది విధివిధానాలను విడుదల చేసింది.

 కొత్త సర్వీసు.. కొత్త పేపర్
 గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ప్రభుత్వం కొత్తగా గ్రూప్-3 కేటగిరీని చేర్చింది. ఇప్పటివరకు గ్రూప్-2లో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3లో చేర్చింది. గ్రూప్-4 సర్వీసులను యథాతథంగా ఉంచింది. ఇక సర్వీసుల వారీగా పోస్టులను వర్గీకరించింది. గ్రూప్-1లో
 20 రకాల పోస్టులు, గ్రూప్-2లో 12, గ్రూప్-3లో 17 రకాల పోస్టులను పొందుపరిచింది. ఇక ఇప్పటివరకు గ్రూప్-1లో ఐదు పేపర్లు, గ్రూప్-2లో మూడు పేపర్లు ఉండేవి. తాజాగా ప్రభుత్వం కొత్తగా గ్రూప్-1లో ఆరో పేపర్‌ను, గ్రూప్-2లో నాలుగో పేపర్‌ను చేర్చింది. ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం’ పేరుతో తెలంగాణ ఉద్యమంలోని వివిధ దశలను ఈ కొత్త పేపర్‌లో సిలబస్‌గా పొందుపరిచింది. మొత్తంగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ పద్ధతిని యథాతథంగా కొనసాగించింది. గ్రూప్-1లో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ పరీక్షతో పాటు మరో ఆరు పరీక్షలు రాయాలి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం వెయ్యి మార్కులుంటాయి. అందులో ఇంటర్వ్యూకు వంద మార్కులు కేటాయించారు. గ్రూప్-2లో నాలుగు పేపర్లు అబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున, ఇంటర్వ్యూకు 75 మార్కులు కలిపి మొత్తం 675 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ఇంటర్వ్యూకు 50 మార్కులే ఉండేవి. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూప్-3 సర్వీసులో పొందుపరిచిన 17 రకాల పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. ఈ పరీక్షలకు మూడు పేపర్లు ఉంటాయి. గ్రూప్-2లో నిర్దేశించిన నాలుగు పేపర్లలో ‘తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం’ మినహా మిగతా మూడు పేపర్లు ఇందులో ఉన్నాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులుంటాయి. ఇక గ్రూప్-4, గ్రేడ్ టూ మ్యాట్రన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గ్రూప్ సర్వీసుల పరిధిలోకి రాని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, ఫోర్ట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్స్, సీనియర్ రిపోర్టర్స్ పోస్టులకు నిర్వహించే పరీక్షల విధానాన్ని ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది.
 
గ్రూప్-1 సర్వీసులు (20)
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (కో ఆపరేటివ్ సొసైటీస్), జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, లే సెక్రెటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీవో.
 
గ్రూప్-2 సర్వీసులు (12)
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, ఏసీటీవో, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్,  అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (గ్రామీణాభివృద్ధి), ఎక్సైజ్ ఎస్‌ఐ, ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్), ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1(ఎండోమెంట్స్).
 గ్రూప్-2 పరీక్షా విధానం: (మొత్తం 675 మార్కులు) పార్ట్-ఏ (ఆబ్జెక్టివ్ పద్ధతి)
 పేపర్-1:    జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు, 150 మార్కులు
పేపర్-2:    హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు)
పేపర్-3:    ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు(ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు;         2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3.అభివృద్ధి, మార్పు అంశాలు)
పేపర్-4:    తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు  (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్         తెలంగాణ (1948-1970);             2.ఉద్యమ దశ (1971-1990); 3.తెలంగాణ ఏర్పాటు దశ,    ఆవిర్భావం (1991-2014))
పార్ట్-బి ఇంటర్వ్యూ-75 మార్కులు
 
గ్రూప్-3 సర్వీసులు (17)     
సీనియర్ అకౌంటెంట్  ఆడిటర్  సీనియర్ ఆడిటర్  అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిటర్  టైపిస్ట్ కమ్ అసిస్టెంట్  జూనియర్ అసిస్టెంట్స్  జూనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్  పే అండ్ అకౌంట్స్  ట్రెజరీస్, లోకల్ ఫండ్  సెక్రటేరియట్, ఫైనాన్స్  లా విభాగంలోని సబ్ సర్వీసు   వివిధ శాఖాధిపతుల మినిస్టీరియల్ సర్వీస్‌లోని ఈ కేడర్ పోస్టులు) గ్రూప్-3 పరీక్షా విధానం (మొత్తం మార్కులు 450) రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్).. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 150 మార్కులు. 2.30 గంటలు
 పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
 (1.తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు) పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు. (1.భారత ఆర్థిక వ్యవస్థ-అంశాలు, సవాళ్లు; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3.అభివృద్ధి, మార్పు అంశాలు)
 
గ్రూప్-4 సర్వీసులు:
జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్స్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితరాలు
గ్రూప్-4 పరీక్షా విధానం (మొత్తం మార్కులు 300) (ఆబ్జెక్టివ్ టైప్)
1.జనరల్ నాలెడ్జ్: 150 మార్కులు
2.సెక్రెటేరియల్ ఎబిలిటీస్: 150 మార్కులు
 
గ్రూప్-1 పరీక్షా విధానం: (మొత్తం 1000 మార్కులు)

ప్రిలిమినరీ టెస్ట్..
1.జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్). 150 ప్రశ్నలు, 150 మార్కులు. 2.30 గంటల వ్యవధి.
 మెయిన్ పరీక్షలు (రాత పరీక్షలు)..
1.జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) 3 గం. 150 మార్కులు
 పేపర్-1: జనరల్ ఎస్సే, 3 గంటలు. 150 మార్కులు  (1.సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; 2.ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు; 3.భారత రాజకీయ స్థితిగతులు; 4.భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; 5.సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి; 6.విద్య, మానవ వనరుల అభివృద్ధి)  పేపర్-2: హిస్టరీ, కల్చర్ - జాగ్రఫీ. 3 గం. 150 మార్కులు
 (1.భారత దేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757-1947); 2.తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; 3.భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ)
పేపర్-3:     ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన. 3 గంటలు. 150 మార్కులు
 (1.భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; 2.భారత రాజ్యాంగం; 3.పరిపాలన)
 పేపర్-4: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 3గం. 150 మార్కులు (1.భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; 3.అభివృద్ధి, పర్యావరణ సమస్యలు)
 పేపర్-5: సైన్స్-టెక్నాలజీ-డేటా ఇంటర్‌ప్రిటేషన్. 3 గం,150 మార్కులు. (1.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; 2.విజ్ఞానశాస్త్ర వినియోగం లో ఆధునిక పోకడలు;3.డేటా ఇంటర్‌ప్రిటేషన్-సమస్యా పరిష్కారం)
పేపర్-6: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. 3 గంటలు. 150 మార్కులు (1.తెలంగాణ తొలి దశ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014))
 ఇంటర్వ్యూ: 100 మార్కులు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement