పట్నా:పబ్లిక్ సర్వీస్‌కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేసినందుకుగాను బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ఈ విషయమై తాజాగా రాజధాని పట్నాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం విమర్శలకు తావిస్తోంది.
డిసెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే బీపీఎస్సీ ఈ పరీక్షలకు ఒక పూట-ఒక పేపర్ ఉండాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘అభ్యర్థులు ఎంత చెప్పినా వినకుండా బీపీఎస్సీ కార్యాలయం వైపునకు దూసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. అందుకే వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది’అని పోలీసు అధికారులు తెలిపారు.
కాగా, ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారని, ఈ లాఠీఛార్జ్‌లో కొందరికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. అభ్యర్థులను చెదరగొట్టేందుకు తాము స్వల్ప లాఠీఛార్జ్ చేశామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. ఇద్దరి మృతి
Comments
Please login to add a commentAdd a comment