Exam Aspirants
-
పోటీ పరీక్షలపై ఆందోళన.. అభ్యర్థులపై లాఠీఛార్జ్
పట్నా:పబ్లిక్ సర్వీస్కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేసినందుకుగాను బీహార్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ఈ విషయమై తాజాగా రాజధాని పట్నాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం విమర్శలకు తావిస్తోంది.డిసెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే బీపీఎస్సీ ఈ పరీక్షలకు ఒక పూట-ఒక పేపర్ ఉండాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘అభ్యర్థులు ఎంత చెప్పినా వినకుండా బీపీఎస్సీ కార్యాలయం వైపునకు దూసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. అందుకే వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది’అని పోలీసు అధికారులు తెలిపారు.కాగా, ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారని, ఈ లాఠీఛార్జ్‌లో కొందరికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. అభ్యర్థులను చెదరగొట్టేందుకు తాము స్వల్ప లాఠీఛార్జ్ చేశామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. ఇద్దరి మృతి -
నీట్ పేపర్ లీకేజీ.. సీబీఐ తొలి అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తొలుత పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అరెస్ట్ చేసింది. వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (యూజీ)-2024 పరీక్షలో అవకతవకలపై దూమారం చెలరేగింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. సీబీఐ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..మనీష్ కుమార్ నీట్ ప్రశ్నా పత్రాన్ని క్వశ్చన్ పేపర్‌ను 12మంది విద్యార్ధులు అంతకంటే ఎక్కువ మంది ఇచ్చాడని, అనంతరం మనీష్ కుమార్ తన కారుతో స్వయంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలుస్తోంది.మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్ పేపర్ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరుపయోగంగా ఉన్న ఓ స్కూల్‌ను ఉపయోగించినట్లు సీబీఐ గుర్తించింది. #WATCH | NEET paper leak matter | CBI team arrives at CBI office in Patna, Bihar with accused Baldev Kumar alias Chintu and Mukesh Kumar. A Special CBI Court in Patna sent both to CBI remand, yesterday. pic.twitter.com/mvQhG2aplH— ANI (@ANI) June 27, 2024 -
ప్రైవేటు డీఎడ్ కాలేజీల దందా.. క్లాసులు లేకున్నా పాస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులను తయారు చేసేందుకు ఉద్దేశించిన డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) పరిస్థితి దారుణంగా తయారైంది. నాణ్యత ప్రమాణాలు పూర్తిగా అడుగంటాయి. ప్రభుత్వ కాలేజీల్లో బోధకుల్లేరు. ప్రైవేటు కాలేజీలు అసలు తెరుచుకునే పరిస్థితే కన్పించడం లేదు. క్లాసులకు హాజరవ్వకపోయినా ఫర్వాలేదు.. పరీక్షలు రాస్తే చాలు పాస్ గ్యారెంటీ అంటూ ప్రైవేటు డైట్ కాలేజీలు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఇదేదో బాగుందని విద్యార్థులు దానికే సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని నియంత్రించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఫలితంగా డీఈడీ పూర్తి చేసినా... అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీసం సగం మంది కూడా అర్హత సాధించలేకపోతున్నారు. పడిపోతున్న డీఎడ్ ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్న వారు ఇంటర్ తర్వాత డీఈడీ, డిగ్రీ తర్వాత బీఈడీలో చేరుతారు. డీఈడీలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీసూ్కల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) విభాగాలుంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారు ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే, కీలకమైన డీఎడ్ స్థాయిలోనే బ్రేకులు పడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 86 మందికి కేవలం 21 మందే ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా 10 డీఎడ్ కాలేజీలుంటే, 286 మంది బోధకులు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్న బోధకుల సంఖ్య కేవలం 21 మాత్రమే. 265 ఖాళీలున్నా, వాటిని భర్తీ చేయడం లేదు. రిటైర్ అయిన ప్రభుత్వ ప్రిన్సిపాల్స్‌ను మాత్రమే తీసుకోమని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాళ్ళు ఎక్కడా లభించడం లేదని అధికారులు అంటున్నారు. డీఎడ్‌లో కీలకమైన బోధన విధానం, విద్యార్థుల సైకాలజీ, పాలనాపరమైన ప్రక్రియలు, మాతృభాషలో బోధించే తీరు, విలువలు, కళలు, కంప్యూటర్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై బోధన కాలేజీల్లో ఏమాత్రం జరగడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్లాసులు లేకున్నా... రాష్ట్రంలో 2015లో 212 డైట్ కాలేజీలుంటే... ఇప్పుడివి 59కి పడిపోయాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు పది. 6,888 సీట్ల నుంచి 4600 సీట్లకు తగ్గిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో టీచర్ల కొరత ఉంటే, ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకమే జరగడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో అధ్యాపకులు ఉన్నట్టు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వాళ్ళు కని్పంచడం లేదనే ఆరోపణలున్నాయి. ఏటా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఎంబర్స్ రూ.12,500 కూడా సకాలంలో రావడం లేదని కాలేజీలు అంటున్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకున్నా రూ. 25 వేలు ఇస్తే పరీక్షలకు హాజరవ్వొచ్చని, సరి్టఫికెట్ పొందొచ్చని యాజమాన్యాలు చెబుతున్నా యి. మంచి టీచర్లు ఎలా వస్తారు : శ్రీరాం ముండయ్య (ప్రభుత్వ డైట్ కాలేజీ లెక్చరర్, కరీంనగర్) డీఎడ్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత కారణంగా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి సరైన ప్రమాణాలు లేకపోతే మంచి విద్య అందించడం సాధ్యం కాదు. -
పొలిటికల్‌గా ఓకే కానీ.. సబ్జెక్టులోనే వీక్.. అడ్డంగా బుక్కైన బీజేపీ నేత
సాక్షి, చెన్నై : తన బదులు మరొకరితో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించిన తిరువారూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. తిరువారూర్ సమీపంలోని గ్రామ కొండాన్ తిరువికా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఓపెన్ వర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన పొలిటికల్ సైన్స్ రెండో సంవత్సరం పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిపై ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్ టికెట్ క్షుణ్ణంగా పరిశీలించారు. అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి విచారించారు. వ్యవహారం తొలుత రహస్యంగానే సాగినా, పోలీసులు రంగంలోకి పోలీసులు దిగి పరీక్షకు హాజరైన వ్యక్తి తిరువారూర్ సభాపతి మొదలియార్ వీధికి చెందిన దినకరన్(39)గా గుర్తించారు. ప్లస్ టూ పూర్తి చేసి, ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టిన దినకరన్ అప్పుడప్పుడు రోడ్డు సైడ్ బిర్యానీ కొట్టు నడిపేవాడని తేలింది. పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్టేషన్‌కు తరలించి తమదైన స్టైల్లో విచారించారు. బీజేపీ విద్యార్థిసంఘం నేత రమేష్ తనను పరీక్ష రాయమని పంపించాడని, ఎవరి బదులు పరీక్ష రాస్తున్నానో తెలియదని తెలిపాడు. అర్ధరాత్రి పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తిరువారూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ రాయాల్సిన పరీక్షకు దినకరన్‌ను పంపినట్లు తెలిపాడు. వెంటనే భాస్కర్‌ను కూడా పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో పట్టు లేకపోవడంతో తన బదులు మరొకరిని పరీక్షకు పంపించినట్టు అంగీకరించాడు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి, ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీకి బిగ్ షాక్.. -
గుడ్‌న్యూస్: గ్రూప్ 1, గ్రూప్ 2 కు ఇంటర్వ్యూ మార్కులూ తొలగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. చదవండి👉వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు రాతపరీక్షే ఆధారం.. గ్రూప్–1, గ్రూప్–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్, ఆపైస్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. తగ్గనున్న మార్కులు ► ఇదివరకు గ్రూప్–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది. ► ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు. ► ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. సిలబస్‌లో మార్పులు లేనట్టే! ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి👉 ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా! -
ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్
దేశ రక్షణ దళాల్లో చేరడం చాలా మంది యువత కల. సైనిక దళాల్లో సవాళ్లతో కూడిన ఉజ్వల కెరీర్‌కు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (ఎన్డీఏ). ఇందులో అర్హత సాధిస్తే.. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి హోదాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. దేశ రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి హోదాను పొందొచ్చు. సరైన ప్రణాళిక..పట్టుదలతో ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమయితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. 2021 ఏడాదికి గాను ఎన్డీఏ పరీక్షను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమ్యే అభ్యర్థులకు కోసం ఎగ్జామ్ టిప్స్... ఏటా రెండుసార్లు ► త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు, శిక్షణ ప్రక్రియను చేపట్టడానికి ఎన్డీఏను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఎన్డీఏ సువర్ణావకాశం. ► ఇంటర్/10+2 పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్డీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ 2021 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 900 మార్కులకు రాత పరీక్ష ఎన్డీఏ పరీక్ష ఏప్రిల్ 18న ఆఫ్‌లైన్‌లో జరుగనుంది. పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్– 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ–600 మార్కులు (ఇంగ్లిష్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్) పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 2.30 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. వ్యూహాత్మక ప్రిపరేషన్ ► పరీక్షకు నెల రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. ముఖ్యమైన టాపిక్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ► గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం.. మాక్ టెస్టులను రాయడం వంటివి చేయాలి. ► మ్యాథమెటిక్స్‌కు సంబంధించి షార్ట్ ట్రిక్స్‌ను ఉపయో గించి ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయాలి. ఇచ్చిన టైమ్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా మ్యాథమెటిక్స్ విభాగంపై దృష్టి పెట్టాలి. ► పేపర్–2కు సంబంధించి ఇంగ్లిష్‌లో 40శాతం వెయిటేజీని కవర్ చేసేవిధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఇందుకోసం న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్, వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు. ► పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్లపై పట్టు పెంచుకోవాలి. ► జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ► కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అవార్డులు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ► ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన రోజుల (ప్రముఖుల పుట్టిన తేదీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన రోజులు)గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ►ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ 900 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా స్టేజ్–1,2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్–2కు అనుమతిస్తారు. ►స్టేజ్–1: ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), వెర్బల్–నాన్ వెర్బల్ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు. ►స్టేజ్–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్‌లో జీడీ, జీపీఈ,పీజీటీ, హెచ్జీటీ, ఐఓటీ, కమాండ్ టాస్క్, షేక్ రేస్, ఇండివిడ్యువల్ లెక్చర్, ఎఫ్జీటీ వంటివి ఉంటాయి. ►సైకాలజీ టెస్ట్ : థిమాటిక్ అప్రెషన్ టెస్ట్(టీఏటీ), వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిచ్యూవేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్ఆర్టీ), సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్డీ) వంటి వాటితోపాటు కాన్ఫరెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ►పైన పేర్కొన్న రెండు స్టేజ్ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు జరిపి.. మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ►ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్ష. కాబట్టి అభ్యర్థులు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ► అభ్యర్థుల వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని పరీక్షించే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి. హైదరాబాద్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్ -
రూ.99కే ‘కాల్కస్ ఇండియా’ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్
ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొంత కష్టమైన పని అని చెప్పాలి. ఆన్లైన్ క్లాసులు విన్న తర్వాత వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చెయాలంటే విడిగా అనేకరకాల సీడీ మెటీరియల్స్‌ను కొనుక్కోవాలి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’ను విడుదల చేసింది. ఇందులో పాఠశాల స్థాయి నుంచి సివిల్స్ ఎంట్రెన్స్ స్థాయి వరకు పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లు, చాప్టర్‌వైస్ టెస్ట్‌లు, గత పరీక్షల పశ్న పత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యాప్‌లో మొత్తం 1324 విభాగాల్లో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లతో కూడిన 25 బండిళ్లను అందుబాటులో ఉంచామని ‘కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్’ వ్యవస్థాపకురాలు వాణీకుమారి తెలిపారు. 1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లు కాల్కస్ ఇండియా యాప్‌లో అన్ని రకాల పోటీ పరీక్షలను పొందుపరిచారు. ఇందులో సీబీఎస్సీ, ఐసీఎస్సీ, కేవీపీవై,ఎన్సీఓ,ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండా ఇంజనీరింగ్, మెడికల్, ఎంసెట్, రైల్వే, పోలీసు, డిఫెన్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, టీచింగ్, ప్రభుత్వ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, టెట్, స్కిల్స్, ఎపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సివిల్స్ ఎంట్రెన్స్ వంటి మరిన్ని1324 రకాల పోటీ పరీక్షలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు సంస్థ వ్యవస్థాసకురాలు వాణి కుమారి తెలిపారు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం.. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం తెలుగులో కూడా ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షల నోటిఫికేషన్ల ఆధారంగా పొందుపరిచారు. ఏడాదికి రూ.99 ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదవుతున్నా కేవలం రూ.99తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అన్ని రకాల పశ్న పత్రాలను కొనుక్కోవాలి. కానీ, ఈ యాప్‌లో ఒక బండిల్లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్‌స్క్రిప్షన్‌తో ఏడాదిపాటు అపరిమితంగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. యాప్ విడుదల సందర్భంగా పరిమిత టెస్ట్‌లను ఉచితంగా అందుబాటులో ఉంచారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఉచిత ప్రాకీస్టు చేసి ఇంకా కావాలనుకుంటే రూ. 99తో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అందరికీ విద్య- అందుబాటు ధరలో! ‘‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’’ అనే లక్ష్యంతో రూ.99కే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, అతి తక్కువ ధరలో అందించే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాణీకుమారి తెలిపారు. దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో ‘calcusindia’అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.calcusindia.comను సందర్శించండి లేదా 9133607607కి ఫోన్ చేయవచ్చు. -
ఇదేమి ఎంపిక..?
సాక్షి, కొత్తగూడెం: తాజాగా విడుదల చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫలితాల్లో స్పష్టత అనేది లేకుండా ఫలితాలు విడుదల చేశారని పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితాల విడుదలలో ఏమాత్రం పారదర్శకత పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విడుదల చేయాల్సిన ఫలితాలను నిలిపివేసి ఇప్పుడు హడావిడిగా వెలువరించి ఆగమేఘాల మీద ధృవీకరణ పత్రాల పరిశీలన చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల చేయడంతో పాటు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే (ఈ నెల 20న) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అని ప్రకటించారు. దీంతో అనేకమంది అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఫలితాల జాబితా చూసి అవాక్కయ్యారు. అసలు ఏ ప్రాతిపదికన తుది జాబితాను ఎంపిక చేశారని పలువురు ప్రశ్నించారు. పరీక్ష రాసిన తమకు ప్రశ్నపత్రం, ఓఎంఆర్ కార్బన్ షీట్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో అభ్యర్థులందరి మార్కుల జాబితా, మెరిట్, రిజర్వేషన్లు పాటించిన విధానం సక్రమంగా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అసలు పంచాయతీరాజ్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో రాసిన అభ్యర్థులందరి మార్కుల వివరాలను పొందుపరచలేదని అంటున్నారు. పరీక్ష రాసిన అందరి మార్కుల జాబితాను వెబ్సైట్లో పెట్టిన తర్వాతే సర్టిఫికెట్లు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. గత అక్టోబర్ 10న జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని 37 కేంద్రాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో నిలిపేశారు. జిల్లాలో మొత్తం 17,464 మంది దరఖాస్తు చేసుకోగా, 15,305 మంది పరీక్ష రాశారు. అందరి మార్కులు వెబ్సైట్లో పెట్టాలి పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసిన అభ్యర్థులందరి మార్కులను పంచాయతీరాజ్ కమిషనర్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలి. పైగా ఎలాంటి వివరాలు లేకుండా హాల్‌టికెట్ నంబర్లు మాత్రమే ఇస్తూ ఎంపిక జాబితా ప్రకటించడం సరికాదు. పరీక్ష రాసిన వారందరి మార్కులు బహిర్గతం చేస్తేనే పారదర్శకత ఉన్నట్లు. లేకుంటే అక్రమాలు జరిగినట్లే. – ధరావత్ సీతారాములు, అభ్యర్థి ఫలితాల ప్రకటనలో గందరగోళం పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రశ్నపత్రం ఇవ్వకపోవడంతో పాటు ఆన్సర్ షీట్‌కు సంబంధించిన కార్బన్ పేపర్ కూడా ఇవ్వలేదు. ఇక ఫలితాల్లో అందరి మార్కుల జాబితా, రిజర్వేషన్ల విధానం కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అభ్యర్థులందరి మార్కులు ప్రకటించే వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిలిపేయాలి. వెంటనే అందరి మార్కుల జాబితా విడుదల చేయాలి. – మూడ్ బాలాజీ, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి -
ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కు కొత్త యాప్..!
మీరు యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన జనరల్ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నారా? అటువంటి అవసరం ఉన్నవారు ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ కొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చారు కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అవసరమైన సమాచారాన్ని అందులో పొందు పరిచారు. ఒక్కసారి డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. ఈ యాప్ సహాయంతో ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎంతో సులభం అవుతుందంటున్నారు. జనరల్ నాలెడ్జ్ కోసం ఆన్ లైన్ న్యూస్ చదవడం, న్యూస్ పేపర్లు తిరగేయాల్సి రావడం మామూలే. అలా చేసినా ఒక్కోసారి పూర్తి సమాచారం దొరక్కపోవచ్చు. ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇదే సమస్య ఎదురౌతుంది. ఇటువంటి వారికోసం 27 ఏళ్ళ రోహిత్ పాండే, అతని స్నేహితుడు శిఖర్ సచన్ లు కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్తున్నారు. సివిల్స్ డైలీ పేరున రూపొందించిన కొత్త యాండ్రాయిడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ లో ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన విషయాలన్నీఅందుబాటులో ఉంటాయని ఈ స్నేహితులు చెప్తున్నారు. సులభంగా అర్థమయ్యే ఫార్మాట్ లో, ముఖ్యమైన వార్తల సమాహారాన్ని ఈ యాప్ లో అందుబాటులో ఉంచుతారు. శిఖర్, రోహిత్ లు కలిసి ఈ యాప్ ను 2015 మార్చిలో ప్రారంభించారు. ప్రతిరోజూ వచ్చే న్యూస్ పేపర్లలోని వార్తలను సంక్షిస్తంగా ఈ యాప్ లో పొందుపరచడంతో విద్యార్థులు పరీక్షకు సులభంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. యాప్ లో ఉండే న్యూస్ కార్డు ప్రతి విషయాన్ని నాలుగైదు సింపుల్ పాయింట్స్ లో వివరించేందుకు ఉపయోగ పడుతుంది. ఈ యాప్ తాజాగా సుమారు నలభై వేల సార్లు డౌన్లోడ్ చేయబడింది. ఇందులో సుమారు పదినుంచీ పధ్నాలుగు కొత్త స్టోరీలు ప్రతిరోజూ అప్ డేట్ చేస్తారు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడ రోహిత్ టీమ్.. యాప్ లో అందుబాటులో ఉంచుతారు. ఇంటిర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు, మారుమూల గ్రామాల్లోని ప్రజలకు కూడ ఈ యాప్ ను వినియోగించేందుకు వెబ్సైట్ తో అవసరం లేకుండా..ఆఫ్ లైన్లో పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో కూడ సౌకర్యం అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో రోహిత్ టీం యోచిస్తున్నారు. ఢిల్లీకి చెందిన రోహిత్ టీం కు ఆర్నెల్లుగా ఈ యాప్ వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో యాప్ ను మరింత అభివృద్ధి పరిచేందుకు ఈ స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. ఐఐటీ గౌహతి నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రోహిత్... కొన్ని కన్సల్టింగ్ సంస్థల్లో పనిచేసిన అనంతరం 2014 లో స్వతహాగా యాప్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. భారత దేశంలో సాంకేతిక విద్య పూర్తిగా అభివృద్ధి కాలేదని, ఈ విషయంలో ఎంతో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని రోహిత్ అంటున్నారు. అందులో భాగంగానే కొత్త యాప్ ను అభివృద్ధి చేసినట్లు చెప్తున్నారు.