సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులను తయారు చేసేందుకు ఉద్దేశించిన డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) పరిస్థితి దారుణంగా తయారైంది. నాణ్యత ప్రమాణాలు పూర్తిగా అడుగంటాయి. ప్రభుత్వ కాలేజీల్లో బోధకుల్లేరు. ప్రైవేటు కాలేజీలు అసలు తెరుచుకునే పరిస్థితే కన్పించడం లేదు. క్లాసులకు హాజరవ్వకపోయినా ఫర్వాలేదు.. పరీక్షలు రాస్తే చాలు పాస్ గ్యారెంటీ అంటూ ప్రైవేటు డైట్ కాలేజీలు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఇదేదో బాగుందని విద్యార్థులు దానికే సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని నియంత్రించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఫలితంగా డీఈడీ పూర్తి చేసినా... అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీసం సగం మంది కూడా అర్హత సాధించలేకపోతున్నారు.
పడిపోతున్న డీఎడ్
ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్న వారు ఇంటర్ తర్వాత డీఈడీ, డిగ్రీ తర్వాత బీఈడీలో చేరుతారు. డీఈడీలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీసూ్కల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) విభాగాలుంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారు ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ)లుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే, కీలకమైన డీఎడ్ స్థాయిలోనే బ్రేకులు పడుతున్నాయని నిపుణులు అంటున్నారు.
86 మందికి కేవలం 21 మందే ఉన్నారు
రాష్ట్రవ్యాప్తంగా 10 డీఎడ్ కాలేజీలుంటే, 286 మంది బోధకులు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్న బోధకుల సంఖ్య కేవలం 21 మాత్రమే. 265 ఖాళీలున్నా, వాటిని భర్తీ చేయడం లేదు. రిటైర్ అయిన ప్రభుత్వ ప్రిన్సిపాల్స్‌ను మాత్రమే తీసుకోమని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాళ్ళు ఎక్కడా లభించడం లేదని అధికారులు అంటున్నారు. డీఎడ్‌లో కీలకమైన బోధన విధానం, విద్యార్థుల సైకాలజీ, పాలనాపరమైన ప్రక్రియలు, మాతృభాషలో బోధించే తీరు, విలువలు, కళలు, కంప్యూటర్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై బోధన కాలేజీల్లో ఏమాత్రం జరగడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
క్లాసులు లేకున్నా...
రాష్ట్రంలో 2015లో 212 డైట్ కాలేజీలుంటే... ఇప్పుడివి 59కి పడిపోయాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు పది. 6,888 సీట్ల నుంచి 4600 సీట్లకు తగ్గిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో టీచర్ల కొరత ఉంటే, ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకమే జరగడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో అధ్యాపకులు ఉన్నట్టు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వాళ్ళు కని్పంచడం లేదనే ఆరోపణలున్నాయి. ఏటా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఎంబర్స్ రూ.12,500 కూడా సకాలంలో రావడం లేదని కాలేజీలు అంటున్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకున్నా రూ. 25 వేలు ఇస్తే పరీక్షలకు హాజరవ్వొచ్చని, సరి్టఫికెట్ పొందొచ్చని యాజమాన్యాలు చెబుతున్నా యి.
మంచి టీచర్లు ఎలా వస్తారు : శ్రీరాం ముండయ్య (ప్రభుత్వ డైట్ కాలేజీ లెక్చరర్, కరీంనగర్)
డీఎడ్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత కారణంగా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి సరైన ప్రమాణాలు లేకపోతే మంచి విద్య అందించడం సాధ్యం కాదు.
Comments
Please login to add a commentAdd a comment